వాలెంటైన్స్ డే, మీకు తెలియని దారుణమైన నిజాలు - ప్రేమ పేరుతో మోస పోవద్దు - The hidden Truth of valentines day

వాలెంటైన్స్ డే, మీకు తెలియని దారుణమైన నిజాలు - ప్రేమ పేరుతో మోస పోవద్దు - The hidden Truth of valentines day
మీకు తెలుసా ? వాలెంటైన్ అనే అతను గ్రీసు దేశంలోని ఒక క్రైస్తవ మత ప్రవక్త. దేశ ద్రోహ నేరము క్రింద ఆయనను ఉరి తీసారు, ఆ తేదీ ఫిబ్రవరి 14 .

గ్రీసు దేశం పై శత్రు దేశాల వారు దాడులు చేస్తున్న సమయములో వాలెంటైన్ యువతీ యువకులకు ప్రేమ పాఠాలు చెబుతూ రహస్యంగా తన చర్చిలో పెళ్ళిళ్ళు చేస్తుండేవాడట ఆ సందర్భములో ఆ దేశపు రాజు క్లాడియస్ దేశ పరిస్థితిని వాలెంటైన్ కు వివరించి యుద్ద తరుణంలో ప్రేమ, పెళ్ళిళ్ళు మొదలైనవాటికంటే సైన్యములో చేరి దేశాన్ని కాపాడుకోవడం ముఖ్యం, సహకరించండి అంటే వినకుండా ప్రేమే సర్వస్వం అని రాజుతో మొండిగా వాదించి ఉరిశిక్షకు పాత్రుడయ్యాడు.

సుమారుగా క్రీ శ. 270 సంవత్సరములో ఈ ఘటన జరిగింది, ఆ తరువాత క్రీ.శ. 498 లో వచ్చిన పోప్ గెలీలియాస్ అనే ఆయన ఫిబ్రవరి 14 తేదీని ప్రేమికుల 'దినము' గా ప్రకటించాడు.

ఒక క్రైస్తవ మత ప్రవక్త, ఒక దేశ ద్రోహి యొక్క 'తద్దినాన్ని' మనము వేడుకగా జరుపుకుంటున్నాము, కోట్ల రూపాయలను తగలేస్తున్నాము, ఈ పండుగ పేరుతో ఎంతోమంది యువతీ యువకులు తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

ఆలోచించండి, భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్న ఇలాంటి వాటిని వ్యతిరేకించండి.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top