భగవంతుని అన్వేషికి రమణుని దివ్యభోధ - Ramana Maharshi Divyabhoda

భగవంతుని అన్వేషికి రమణుని దివ్యభోధ - Ramana Maharshi Divyabhoda
దివ్యభోధ
భగవంతుని కోసం అన్వేషిస్తున్నాను .... అనుకునే సాధకుని కోసం రమణుని సమాధానం.
 • ⭄ ఎక్కడ భగవంతుని అన్వేషిస్తున్నావు ?,
 • ⭄ బయట  వున్నాడా భగవంతుడు ?
 • ⭄ లేక లోపల వున్నాడా భగవంతుడు .?
 • ⭄ ఎక్కడవున్నాడు అని వెతుకుతున్నావు ?
ఉన్నది అంతా ఒక శక్తి మాత్రమే .ఈ సృష్టిని నడిపిస్తున్నది ఒక శక్తి మాత్రమే. దానిని కను గొనడము , అన్వేషించడము ఎవ్వరితరము కాదు . సాక్షాత్ ఆ పరమేశ్వరుని తరము కూడా కాదు.

ఎందుకంటే:- ఆది, అంతమూ, చావు , పుట్టుక, అందము, వికారము, స్వార్ధము, నిస్వార్ధము కోరిక, కోరిక లేకపోవడము, సుఖము, దుఃఖము, ఆనందం, విచారం - ఇలా చెప్పుకుంటూ పోతే చాలావున్నాయి గుణాలు.
 • ⭄ ఈ గుణాలులో ఎదో ఒక గుణము ఆ భగవంతునికి వున్నా ఆ భగవంతుని కోసం సాధకుడు అన్వేషించవచ్చును. 
 • ⭄ కాని ఏగుణాలు లేని , ఏ ఆకారము లేని ఆ భగవంతుని కోసం ఎక్కడ ఉన్నాడని వెతుకుతావు ?
 • ⭄ ఉన్నదంతా ఒక శక్తి మాత్రమే అదే నీవనుకునే భగవంతుడు .
 • ⭄ ఆ శక్తి నీవు ఈ భౌతిక కనులతో చూడలేవు .
 • ⭄ నీయొక్క దివ్య చక్షువుతో మాత్రమే అనుభూతిని పొందగలవు .
 • ⭄ భగవంతుడు కాంతి స్వరూపుడూ ఆ కాంతి ఇలావుంటుంది అని చెప్పడానికి ఈ శరీరాన్ని పొందిన మానవునికి , ఆ భగవంతుని అనుభూతి పొందిన సాధకుడు చెప్పలేడు .
 • ⭄ ఎందుకంటే చెపితే అర్థం చేసుకునే స్థితిలో నీవు లేవు .
ఎందుకంటే నీవు భగవంతుడిని నీ ఇంటిలో ఉన్న ఫోటోలోనో , లేక నీ ఇంటిలో ఉన్న దేవుని మందిరంలోనో, లేక బయట ఉన్న గుడిలోనో, లేక కొండల్లోనో, లేక కోనల్లోనో వున్నాడని వెతుకుతున్నవు ?

ఎక్కడ వున్నాడని వెతుకుతావు ? - ఎక్కడా నీకు కనబడడు నీ సమయం వృదా ! వెతక వలసినది నీలోపల ! వేసుకోవాల్సినది ప్రశ్న నీ లోపల .
 • 1. నేనెవరు ?
 • 2. భగవంతుడెవరు ?
 • 3. ఎలా వుంటాడు ?
 • 4. ఎక్కడ వుంటాడు ?
 • 5. అసలు ఉంటే ఎలావుంటాడు ?
 • 6. అసలు నేను ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాను ?
 • 7. ఏ పని నిమిత్తమై వచ్చాను ఈ సంసారం చెయ్యడానికి వచ్చానా ?
 • 8. ధనము సంపాదించడానికి , పేరుప్రతిష్టలు , ఆస్తి , అంతస్తలు, హోదా , సంపాదించడానికి వచ్చానా ?అసలు దేనికోసం వచ్చాను ?
ఇవేమి నిర్దారించు కోకుండా , నీకు నీవు ప్రశ్నించుకోకుండా , నీప్రశ్నకు సమాధానం తెలుసుకోకుండా ,
 • ⭄ భగవంతుని కోసం అన్వేషణ చేస్తున్నాను.... అంటావేమిటి ?
 • ⭄ అసలు నిన్ను నీవు ప్రశ్నించుకున్నవా?
 • ⭄ నేను ఎవరు ?
 • ⭄ నేను ఎక్కడనుండి వచ్చాను ?
 • ⭄ ఏపని నిమిత్తమై వచ్చాను ?
 • ⭄ అసలు నా నిజమయిన లక్ష్యం ఏమిటి ?
 • ⭄ నా లక్ష్యానికి నేను పొందుతున్న దానికీ గల సంబందం ఏమిటి ?
 • ⭄ ప్రశ్నించుకో ?
సమాధానాలు పొందు . అప్పుడు అన్వేషించు భగవంతునికోసం.... నీ ప్రశ్నలకు సమాధానాలు దొరికేంతవరకు భగవంతుని జోలికి వెళ్ళమాకు, నీకు తెలియదు భగవంతుని గురించి.

మరల, నీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం గురించి పురోహితుల వద్దకు, జోతిష్య సిద్ధాంతుల వద్దకు, గుడిలో ఉన్న భగవంతుని ఆకారంలో ఉన్న విగ్రహంవద్దకు వెళ్ళకు అక్కడ సమాధానం దొరకదు.

అక్కడ దొరికేది నీ యెక్క భౌతికంగా వచ్చిన సమస్యకు పరిష్కారము ,లేక మనసు ప్రశాంతత దొరుకుతుంది . అంతే కానీ నీ ప్రశ్నకు సమాధానము దొరికేది నీలోపలే , నీ అంతరంలోనే , అన్వేషించు, శోధించు , ప్రశ్నించు , నిరంతరం కనుల మూసినా , తెరచిన , కూర్చున్న , నిలబడిన , పడుకున్నా , నడుస్తున్నా , ఏమిచేస్తున్న ఇదే ఆలోచన - నేను ఎవరు ?

అని ప్రశ్నించుకో అదే సాధన.... ముందు నీకోసం అన్వేషించు , తరువాత భగవంతుని కోసం నీకే అర్థమవుతుంది . సమయము వృధా పోనియకు, సమయము చాలా తక్కువ ఉంది సమయము మించి పోనియ్యకు... ప్రశ్నించు , శోధించు.....

సంకలనం: భానుమతి అక్కిశెట్టి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top