రంజనీ - Ranjanee


రంజనీ - Ranjanee
రంజనీ
మూడు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు "రంజన్యై నమః' అని చెప్పాలి.

రంజనీ = రంజింప చేయునది లేదా రంజనము చేయునది.

జగతంతటిని తన కృపతో, కరుణతో, క్షమతో, రక్షణతో వివిధరకాలుగా రాంజింప చేయగలిగినది అమ్మవారు. అస్తిత్వం అంటే పరిమితితో కూడిన ఉనికి అశ్విత్వము అంటే అపరిమితమైన ఉనికి. అంతటను నిండిన పరాశక్తి యొక్క ఉనికి అన్నింటిలో రంజింప జేసే లక్షణాన్ని నిరంతరం నింపుతుంది. అమ్మవారి రంజనత్వం స్పిటికవలె జీవునిలో ఈశ్వరునిలో జీవుని ప్రతిబింబింపచేసి అయ్యవారికి దగ్గరచేస్తుంది.
రంజనీ యంత్రము
రంజనీ యంత్రము 
మనిషి యొక్క రంజనమునకు స్థానము. వ్యక్తుల మధ్యగాని, ప్రదేశాలు మధ్యగాని, సన్నివేశాలు మధ్య గాని, ఆహ్లాదకరంగా , ప్రయోజకత్వంగా ఉండే స్థితి ఉండాలి అంటే అక్కడ దృశ్యము, ధ్వని, సాన్నిధ్యము కోరుకునే అనుభూతి ని కలిగించే శక్తి రంజనముగా ఉండాలి. అటువంటి తత్వాన్ని సాధకునిలో ప్రేరేపించే శక్తి రంజని . అందరూ ఆ హృదయానికి దగ్గర కావాలని ప్రయత్నిస్తారు. ఈ రంజనత్వం వల్ల ఎంతటి కఠినమైన బాద్యతనిర్వహించవల్సి వచ్చిన, కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న వాళ్ళైన కొంతసేపు ప్రశాంతతను పొంది నిదానంగా వివేకముతో ఆలోచించి ముందడుగు వైయ్యగలుగుతారు.

వ్యక్తులు, సన్నివేశాలు రంజింపబడాలంటే, వ్యక్తుల ద్వారా జరిగే సంభాషణ,  ఒకరి సాన్నిధ్యం వలన ఒకరికి కలిగే అనుభూతి బాగుండే విధంగా వుండాలి. ఇలా చేయగల సామర్థ్యాన్ని 'రంజనం' అంటారు. చోటులో ' అస్తిత్వం' మాత్రమే వుంటే ఇది సాధ్యం కాదు. 'అస్మిత్వం' వుంటే ఇది సాధ్యమౌతుంది. అంటే - చోటంతా తానే అయి వుండటం అన్నమాట. ఇది అమ్మవారికే చెల్లుతుంది. మిగిలిన ఎవరికైనా చోటులో కొంతమేరకు - ( అస్తిత్వమే' వుంటుంది గాని, అంతటా - 'అస్మిత్వం' వుండదు.  రంజింప చేయునది - అని ఈ నామానికి అర్థం.

ఫలస్తుతి:
మనసుకు ప్రశాంతత ఆహ్లాదాన్ని కలిగించే నామ మంత్రం ఇది, ఎప్పుడూ ఏదో ఒక అలజడితో ఆందోళనతో కారణం చిన్నదైనా పెద్దగా భయపడటం, కారణం లేకున్నా కంగారు పడటం, ప్రతి చిన్న దానికి అతిగా స్పందించడం , ఇటువంటి లక్షణాలు తగ్గి ప్రవర్తన, క్రియ, మాట, లో మంచి మార్పు వస్తుంది. అధిక రక్తపోటు , మధుమేహ వ్యాధితో బాధపడే వారికి ఈ నామ మంత్రం గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది.  నిత్యం ఈ నామ ధ్యానం చేసే వారిలో కోపం తగ్గి క్షమగుణం కలుగుతుంది.. కుటుంబ లో ఎక్కువగా కలహాలి జరుగుతుంటే కొద్దిరోజులు ఈ నామ మంత్రాన్ని "ఓం ఐం హ్రీం శ్రీo రంజని ఆహ్లాదజనని" ఇలా జపించ వచ్చు అలాగే ఈ నామ మంత్రం తో సహస్త్ర నామం సంపుటికరణ చేయవచ్చు.

ఓం ఐం హ్రీం శ్రీo రంజన్యై నమః - ఓం శ్రీ మాత్రే నమః.

సంకలనం: భానుమతి అంకిశెట్టి

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top