తెలుగు శతక సాహిత్యము
శతకం అంటే సూరు అని అర్ధం. అంటే శతకములో వంద పద్యాలు ఉంటాయి.క్రీ. శ. 13వ శతాబ్దంలో అమృతా నంద యోగి తన అలంకార సంగ్రహం అనే గ్రంథంలో 'శతేన శతకం ప్రోక్తమష్తోత్తర శతంపరమ్' అని చెప్పాడు. అంటే నూరు పద్యాలు గలది శతకము. వాటిల్లో అష్టోత్తర శత (108) పద్యాలు కలవి కూడా ఉన్నాయని దాని అర్థం, తెలుగు భాషలో శతకము మహాకావ్య ప్రక్రియతో పాటు ఎంతో గొప్పగా ఆదరింపబడింది.
- ➣ సంస్కృత వాఙ్మయం నుంచి తెలుగుకు తెచ్చుకున్న సాహిత్య ప్రక్రియలలో శతక రచన ఒకటి. సంస్కృత పాకృత వాఙ్మయ శతక ప్రక్రియకు తెలుగు శతక ప్రక్రియ ప్రతిరూపమే అయినా, తెలుగులో ఎన్నో విశిష్టపోకడలు పోయి ఒక ప్రత్యేకతను సంతరించుకొన్నది. నన్నయనాటి నుంచి నేటి వరకు ఎంతో ఆదరింపబడుతున్న ప్రక్రియ ఈ శతకం.
- ➣ ఈ శతకాలు పురాణాల లాగా కథ ప్రధానాలు కావు ప్రబంధాల లాగా వర్ణనాలు ప్రధానమైనవి కావు. గేయ కృతులు లాగా సంగీత ప్రధానాలు కావు. ద్విపదల వలె దీర్ఘ పరిమితి ఉన్నవి కావు. ఇవి ముక్తకాలు, అంటే ఏ పద్యానికి ఆ పద్యమే ప్రత్యేకంగా విడి విడిగా ఉంటాయి. కానీ మొత్తం శతకంలో ఏక సూత్రత ఉంటుంది. కవి యొక్క స్వీయాను భవము ప్రతి పద్యంలోనూ ప్రస్సుటం అవుతుంది. చాలా శతకాలు సులభ గ్రాహ్యాలుగా ఉంటాయి. అందువలననే తెలు గులో శతక రచనకే కాదు పఠనానికి కూడా గొప్ప ప్రచారం వచ్చింది.
- ➣ తెలుగులో పాల్కురికి సోమన నుంచి అంటే క్రీ. శ. 12వ శతాబ్ది నుంచి శతక రచన సాగినది. ఎందరో ఆధునిక కవులు శతక రచనను చేపట్టినవారు చేపడుతున్న వారు ఉన్నారు.
- ➣ తెలుగు వాఙ్మయంలో సంఖ్యను ప్రధానంగా తీసుకొంటే ఇప్పటి వరకు దాదాపు నాలుగువేలకు పైగా శతకాలు ఉన్నాయని చెప్పవచ్చు, వీటిల్లో ముద్రితాలు, అముద్రితాలు, లభ్యాలు, అలభ్యాలు కూడా ఉంటాయి.
- ➣ తెలుగుకు సజాతీయ భాషలైన కన్నడంలో శతక రచన తెలుగుకంటే ముందే జరిగినా ఆ భాషలో దీనికి అంతగా ఆదరణ లేదు. మళయాళ భాషలో శతక రచనే చాలా తక్కువ. తమిళంలో కూడా చాలా తక్కువే అని చెప్పాలి.
- ➣ తెలుగులో వెలసిన శతకాలలో సంస్కృతానువాదాలు కేవలం ఒక వందలో పే ఉంటాయి. మిగిలనవన్నీ స్వతంత్రాలే. అందుకే తెలుగు భాషలో శతకాన్ని స్వతంత్ర శాసాఖ అని చెప్ప వచ్చు. వీటిపై తెలుగు ప్రభావమే ఎక్కువగా ఉన్నది.
శతకాల ముఖ్య లక్షణలు:
- 1. సంఖ్యానియమం
- 2. మకుట నియమం,
- 3. ఛందో నియమం,
- 4. రస నియమం.
1. సంఖ్యానియమం:
- ➣ శతకం అంటేనే పంద సంఖ్య గలది. అనీ ఆ విధంగా చూస్తే శతకాలు వంద పద్యాలకు షరిమితం కానీ సంస్కృతంలో అష్టోత్తర శత నామపూజ, సహస్రనామ పూజ వంటి 108, 1008 మనకు వాడుక అయినాయి.
- ➣ ఈ ఆచారమే మన కవులు స్వీకరించి శతకాలలో నూఱు, లేక 108. లేక 116 పద్యాలను వ్రాయటం ఆచారంగా తీసుకున్నారు. శతకం అంటే నూరు కనుక వందకు తక్కువ పద్యాలు గలది. శతకము అని చెప్పటానికి వీలులేదు.
- ➣ శతక రచనలో సంఖ్యకు ప్రాధాన్యం ఉండటం వలన అంతకుపై బడిన సంఖ్య గల పద్యాలున్న రచనలు ద్విశతి (200), త్రిశతి (300), పంచశతి (సప్తశతి (700) అనే సంప్రదాయం ఏర్పడింది. సంఖ్యలో వెయ్యి పద్యాలకు పైన ఒకే మకుటంతో ఉన్న ఎడల ఆరచన కూడా శతకంలోనే చేర్చబడింది. వేమన పద్యాలు మూడు | వేలకు పైగా ఉన్నా కాని మకుటం ఒకటే ఉడటం చేత వేమన | శతకం అనే పిలవడం జరుగుతున్నది.
- ➣ శతకాలు అన్నీ మకుట నియమంతో రచింపబడినవే. అంటే చివరి పాదం గానీ, పాదాంతంలో గానీ ఒకపేరును సంభోదిస్తూ ఉంటుంది. దీనినే మకుటం అంటారు.
- ➣ శతకాలలో సంభోధనా విభక్తి తప్ప మరే విధమైన విభక్తులు ప్రయోగించబడవు. సంబోధనలో నామ ఉచ్చారణ ప్రధానం. నామోచ్చారణం శతకంలోని అన్ని పద్యాలలోను సమానంగా ఉంటుంది. 'దాశరథీ కరుణాప యోనిధీ' అని అంటే శతకంలోని అన్ని పద్యాలలోను అలాగే ఉంటుంది. దీనికి పర్యాయ పదాలను ఉపయోగించకూడదు.
- ➣ తెలుగు శతకాలలో మకుటాలు ఆ శతకంలో ఉపయోగించిన వృత్తాలను బట్టి నిర్ణయింపబడతాయి. బాగా ప్రచారంలో ఉన్న దాశరథీ శతకంలో 'దాశరథీ కరుణాపయోనిధీ అనే మకుటం చంపకమాల, ఉత్పలమాల పద్యాలకు మాత్రమే కుదురు తుంది. అందువలన ఆ శతకంలోని అన్నీ పద్యాలు చంపక మాల, ఉత్పలమాల పద్యాలే ఉంటాయి. అలాగే 'శ్రీ కాళహస్తీశ్వరా' అనే మకుటం గల ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో కేవలం మత్తేభ శార్దూల వృత్తాలే ఉపయోగించబడ్డాయి.
- ➣ ఇతర వృత్తాలు ఈ మకుటానికి కుదరవు. వేమన శతకంలో చివరి పాదం అంతా 'విశ్వదాభిరామ వినుర వేమ' అనే మకుటం ఉన్నది. ఇది ఆటవెలది పద్యానికి తప్ప ఇతర పద్యాలకు సరిపోదు.
మకుటం ఒకటే ఉండడం చేత, ఒకటో లేక రెండు రకాల వృత్తాలతోనో ఎన్నుకొనే వీలుంటుంది. అందువలననే వృత్త నియమం ఏర్పడుతున్నది. సంస్కృత శతకాలలో మకుట నియమం లేదు. భర్తృహరి సుభాషిత త్రిశతిలో వివిధ వృత్తాల ఉపయోగం ఉన్నది.
4. రస నియమం:
శతకాలలో మొత్తం అన్ని పద్యాలు లోను ఒకేరసం ప్రతిపాదించబడాలి. వేరొక రసానికి సాధారణంగా ప్రవేశం ఉండదు. భక్తి రసం ప్రకటించేటప్పుడు వీర, రౌద్ర రసం వంటి వానికి ఇక్కడ స్థానం ఉండదు
రచన: గాజుల సత్యనారాయణ గారు