వింశోత్తరీ చరదశాప్రస్తారం సంపూర్ణావర్తన కాలం - Vinśōttarī Charadaśāprastāraṁ


వింశోత్తరీ చరదశాప్రస్తారం యొక్క సంపూర్ణావర్తన కాలం యెంత?

వింశోత్తరీ చరదశాప్రస్తారం యొక్క సంపూర్ణావర్తన కాలం యెంత అనే విషయం తెలుసుకోవటం చాలా ఆసక్తికరమైన విషయం.

ఒక సారి మనం ప్రతి గ్రహం యొక్క వింశోత్తరీ దశా ప్రమాణ కాలం యెంతో పరిశీలిద్దాం.  ఈ‌ పట్టిక ముందు చూసినదే నని గురు తెచ్చుకోగలరు సులభంగా

గ్రహందశా సంవత్సరాలు
రవి6
చంద్రుడు10
కుజుడు7
రాహువు18
గురుడు16
శని19
బుధుడు17
కేతువు7
శుక్రుడు20

ఒకగ్రహం యొక్క వింశోత్తరీ చరదశా పూర్ణావర్తనం అంటే అది పీఠిక మీది స్థిరగ్రంహంతో సంయోగం చెందటం.

ఉదాహరణకు: 
  • ➣ ఇది రవికైతే 6 సంవత్సరాలు, శుక్రుడికి 20 సంవత్సరాలు.
  • ➣ అంటే 120  సంవత్సరాలలో రవి 120 / 6 = 20 పూర్ణావర్తనాలు చేస్తాడన్నమాట.
  • ➣ ఇలా అన్నిగ్రహాలు ఒకేసారి పూర్ణావర్తనాలు పూర్తిచేసిన సంఘటన జరగటానికి పట్టే కాలం 6, 10, 7, 18, 16, 19, 17, 20.
  • ➣ సంఖ్యల  కనిష్ట సామాన్య గుణిజం (క.సా.గు) అవుతుంది. ఈ సంఖ్య 16,27,920.
  • ➣ అంటే 16,27,920 సంవత్సరాలు గడిస్తే కాని సంపూర్ణ వింశోత్తరీ చర దశా వర్తనం కాదన్న మాట,
  • ➣ ఇది త్రేతాయుగం కంటే హెచ్చు సంవత్సరాలు!  ఎందుకంటే త్రేతాయుగప్రమాణం 12,96,000 సంవత్సరాలే కదా.
  • ➣ అన్నట్లు మన కలియుగం పాపం 4,32,000 సంవత్సరాలే సుమండీ.
అందుచేత ప్రజలారా,  ఏ జాతకంలోనైనా సరే వింశోత్తరీ చరదశా పూర్ణావర్తనం జరిగి అది చరగ్రహాలన్నీ వాటివాటి పీఠికాస్థితస్థిరగ్రహాలతో సమైక్యం కావటం ఆ జాతకుడి జీవితకాలంలో కలలో కూడా జరుగనే జరుగదు.  కాబట్టి ఈ విషయంలో నిశ్చింతగా ఉండవచ్చును.

ఈ వింశోత్తరీ నూతనవిధానాన్ని పరిశీలించి ఫలితాలు సంపుటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

సంకలనం: శ్యామలీయం

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top