నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

25, జూన్ 2020, గురువారం

శ్రీమన్నారాయణ స్తుతిః - Srimannarayana Stutiశ్రీమన్నారాయణ స్తుతిః - Srimannarayana Stuti

మహర్షికృత శ్రీమన్నారాయణ స్తుతిః 

నమః కృష్ణాయ హరయే పరస్మై బ్రహ్మ రూపిణే
నమో భగవతే తస్మై విష్ణవే పరమాత్మనే!!

సర్వభూత శరణ్యాయ సర్వ జ్ఞాయ నమోనమః
వాసుదేవాయ భక్తానాం సర్వకామ ప్రదాయినే !!

నమః పంకజ నేత్రాయ జగద్ధాత్రే చ్యుతాయచ
హృషీకేశాయ సర్వాయ నమః కమలమాలినే !!

అనంత నాగ పర్యంకే సహస్త ఫణ శోభితే
దీప్యామానే మేల్ దివ్యే సహస్రార్క సమప్రభే !!

యోగ నిద్రాముపేతాయ తస్మై భగవతే నమః
యద్రూపం నచ పశ్యంతి సూరయో నచ యోగినః !!

సందర్భము: వేంకటాద్రిపై అవతరించిన శ్రీమన్నారాయణుని బ్రహ్మరుద్రులు  స్తుతించిన పిమ్మట మహర్షులు ఇట్లు స్తుతించారు.

శ్రీకృష్ణా!శ్రీహరీ!నమస్కారము. పరబ్రహ్మ స్వరూపా! షడ్గుణపూర్ణుడా!పరమాత్మా!విశ్నుదేవా!విశ్వవ్యాపీ!నీకు నమస్కారము. సర్వ ప్రాణులను రక్షించువాడా! శరణు పొంద దగిన వాడా! సమస్తము తెలిసిన వాడా! వసుదేవుని పుత్రములు గలవాడా! అభీష్టములు నొసంగువాడా! నమస్కారము. పద్మ పత్రముల వంటి నేత్రములు గలవాడా! జగదాధారా! అచ్యుతా! నాశరహితా! ఇంద్రియములను నియమించువాడా! విశ్వమంతటా వ్యాపించు వాడా!

పద్మముల మాలలను ధరించిన దేవా! నీకు నమస్కారము.

వేయి పడగలచే ప్రకాశించుచు, స్వచ్ఛముగా ప్రకాశించుచు, వేయిమంది సూర్యుల కాతితో సమానమగు కాంతి శేషపాన్పుపై యోగ నిద్రను జెండియున్న జ్ఞాన శక్త్యాది కళ్యాణ గుణముల గలవానికి నమస్కారము.

యోగనిద్రలో నున్న నీ రూపమును పండితులు యోగులు కూడా చూడజాలరు.

సంకలనం: నాగవరపు రవీంద్ర
« PREV
NEXT »