మా వూరు మాది పల్లెటూరు మంచి కదే పేరు చల్లని పిల్ల గాలులు చెంగు నెగిరే మేకలు నల్లనల్లని మబ్బులు తెల్ల కొంగల బారులు ...
మా వూరు
మాది పల్లెటూరు
మంచి కదే పేరు
చల్లని పిల్ల గాలులు
చెంగు నెగిరే మేకలు
నల్లనల్లని మబ్బులు
తెల్ల కొంగల బారులు
ఆ చెట్లూ ఆ చేమలు
ఆ పశువులా పచ్చికలు
ఆ చెరువులా తామరులు
ఆ ఫలాలు ఆ వనాలూ
ఆ డొంకలు ఆ దారులు
ఆ పొలాలు ఆ హలాలు
ఆ జలాలు ఆ జనాలు
ఆ కేకలు ఆ పిలుపులు
అవే అవే ఇష్టం
అవే ఎంతో ఇష్టం
No comments
ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !