రామాయణ కాలంలో కుల, వర్ణవ్యవస్థ - Ramayanam, Kulamu, Varnamu - Caste system during the Ramayana period

రామాయణ కాలంలో కుల, వర్ణవ్యవస్థ - Ramayanam, Kulamu, Varnamu - Caste system during the Ramayana period
రామాయణ కాలంలో "వర్ణవ్యవస్థ"ఉంది..కానీ.. కుల వ్యవస్థ లేదు. దానికి తార్కాణమే రామరాజ్యం....

ప్రభు శ్రీరాముడు క్షత్రియుడు,  రామాయణాన్ని రచించింది, వేదవేదాంగాలు అధ్యయనం చేసిన పండితోత్తముడు కాదు, వేటాడి పొట్టపోసుకునే మాములు బోయవాడైన "రత్నాకరుడు" తరువాతే మహర్షిగా మారి రామాయణాన్ని రచించి "వాల్మీకిమహర్షి" గా ఖ్యాతిగడించాడు. మనందరికి పావనచరితమైన "సీతారాముల"కథను అందించాడు "రామాయణ" రూపములో రాముని చరిత్రను మనకందించింది ఒక బోయవాడు.

అజరామరభక్తుడు, భవిష్యత్ బ్రహ్మ "హనుమంతులవారు" శబరి తెగకు చెందినవాడు, ఒక కోతి(క్షమించు ప్రభు)...లంకపై దాడి చేసింది కూడా కోతులతోనేగా.....ఈ కోతులు అడువులలో సంచరిస్తూ ఉంటాయి. వీటిని వనచరులు అంటారు. మనభాషలో చెప్పాలనంటే "Scheduled Tribes"...ఈ Scheduled Tribes సహకారంతోనే ధర్మపరిరక్షణ చేశాడు రామచంద్రుడు....కోతులు ఒక్క దగ్గర కుదరుగా ఉంటాయా..? అటు-ఇటు గెంతుతూ,ఉరుకుతూ.....
 • ፨ నాయకుడు బలమైన వాడైతే కోతులు కూడా చెప్పినట్లు వింటాయి. రామచంద్రప్రభు జీవితమే పెద్ద నాయకత్వ పాఠం. జీవన పర్యంతం ప్రభు శ్రీరాముడిని చూడాలని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురుచూస్తూ ఎంగిలిపళ్ళు తినిపించిన శబరిది ఏ కులం.....!!కోయజాతి...కోయజాతికి చెందిన శబరిని "అమ్మ" అన్నాడు కదండీ నా రామచంద్రుడు.
 • ፨ తల్లిసీతమ్మను రావణుడు అపహరించిన సమయంలో ప్రాణాలకు తెగించి సీతమ్మని కాపాడడానికి ప్రయత్నించిన జటాయువు ఒక పక్షి...రామయ్యకి సీతమ్మ సమాచారాన్ని అందించటానికి తోడ్పడ్డ సంపాతి కూడా ఒక పక్షి, జటాయువుని సోదరుడిగా భావించి మోక్షాన్నిచ్చాడు రామచంద్రుడు.
 • ፨ సీతమ్మ రావణ లంకలో ఉన్నప్పుడు రామయ్య క్షేమసమాచారాలు అందించిన "నేస్తమా" కూడా ఒక పక్షే......"నేస్తమా"ను రావణుడు సీతమ్మ ముందే సంహరించినప్పుడు అమ్మ ఎంత రోధించిందో రామాయణం చదవండి తెలుస్తుంది.
 • ፨ సీతారాములను నది దాటించిన నావికుడైన గుహుడు ఏ కులం వాడు...ఆయనేమన్న బ్రాహ్మణుడా లేక క్షత్రియుడా...! నిషాదుడు...జాలరి కులానికి చెందినవాడు...శ్రీరాముడు మిత్రుడు అని సంభోదించి గుహుని జీవితాన్ని పావనం చేశాడు...
 • ፨ రావణబ్రహ్మపై యుద్ధతంత్రం రచించింది, రాములవారు గురుతుల్యులుగా భావించిన "ఆదిజాంబవంతుడు"...ఆయనేది కులము "మాదిగజాతి".
 • ፨ రామసేతునిర్మాణ Engineers నలుడు, నీలుడు వడ్డెరకులస్థులు.
 • ፨ లంకా యుద్ధంలో లక్ష్మణుడికి ప్రాణదానం చేసింది గిరిజనుడైన సుషేనుడు.
 • ፨ రావణ సంహరానికి సహకరించింది బ్రహ్మణుడైన విభీషణుడు.
 • ፨ అశ్వమేధ యాగానికి స్వర్ణసీతను తయారుచేసింది విశ్వకర్మలు.....
 • ፨ తల్లి సీతమ్మని అడువులకి పంపించాడు కదండీ కేవలం చాకలి వాడైన భద్రుడి మాటకు విలువిచ్చి.
 • ፨ నాతిని రాతిగా చేసినా, కోతిని భక్తునిగా మార్చినా గద్దకి, ఉడతకి మోక్షమిచ్చిన, కుమ్మరి వనిత ఐనా దేవీ మొల్ల చే రామయాణాన్ని రచింపజేసిన.
అందరిని ఒకే రీతి గా ఆదరించి ఆనాటి సామాజిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చి వర్ణ రహిత వ్యవస్థను స్థాపించి ఆఖండ భారతనికి 'రామ రాజ్యము' అందించిన ప్రభుశ్రీరాముడి గురించి ఏం చెప్పగలము. కేవలము ఆయన పాదాల దగ్గర వాలిపోవడం తప్ప.

"జై శ్రీరామ్"
సంకలనం: కోటేశ్వర్

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top