తులసి: ఆయుర్వేద మహర్షులు సూచించినది సమస్తరోగాలను హరిస్తుంది, వ్యాధినిరోధకశక్తి పెంచుతుంది - Tulasi Mokka

తులసి: ఆయుర్వేద మహర్షులు సూచించినది సమస్తరోగాలను హరిస్తుంది, వ్యాధినిరోధకశక్తి పెంచుతుంది - Tulasi Mokka

తులసి మొక్క భారతీయులకు అత్యంత పూజనీయమైనది. తులసిగాలి తగిలితేనే సమస్తరోగాలు సమసిపోతాయని ఏ రోగాలనైనా ఎదిరించగల వ్యాధినిరోధకశక్తి పెరుగుతుందని తెలుసుకున్న ఆయుర్వేద మహర్షులు ఇంటింటా తులసిమొక్కలను నాటించి వాటి ఉపయోగాలను ప్రజలకు వివరించి, నిత్యజీవితంలో తులసిని ఒకప్రధాన భాగస్వామిగా మార్చారు. తులసి గుణగణాలు వర్ణించడానికి మానవజీవితం సరిపోదు.

1. తులసికి అనేకపేర్లు:

సంస్కృతంలో తులసి, వైష్ణవి, బృందా, సుగంధా, పవిత్ర, పావని, విష్ణుప్రియ, లక్ష్మీప్రియ, కృష్ణవల్లభ, మాధవి, దేవదుందుభి అని, హిందీలో రామతులసి, కృష్ణతులనే అని, తెలుగులో లక్ష్మీతులనసీ, కృష్ణతులసి, భూతులని, అరణ్యతులని, గగ్గెర అని. లాటిన్లో Ocinum Sancturn అని, ఇంగ్లీషులో Basil అని అంటారు.

2. తులసి గుణ ప్రభావాలు:

లక్ష్తీతులసి ఆకుపచ్చని స్వభావంతో వుంటుంది. దీని ఆకులరసం లేక కాషాయం లేక వేరుకషాయం కొంచెం కారం చేదు కలిసి వుంటుంది. వేడిచేసే స్వభావంతో జ్వరాలను కఫాన్ని, దగ్గుసు, క్రిమిరోగాలను, కఫవాతములను హూరింపచేసి రుచిని పుట్టిస్తుంది. బుద్ధిని, జఠఠాగ్నిని పెంచుతుంది. ఇది వాత పిత్త కఫములనే త్రిదోషములను హరిస్తుంది.  కృష్ణతులసి లక్ష్మీతులసికన్నా అధిక శక్తివంతమైనది. ముఖ్యంగ అంటువ్యాధులను కఫ రోగములను ఉదరరోగములను చర్మరోగములను గుండెరోగములను పొగొట్టడంలో ఇది గొప్పది.

3. ముక్కులోపుండ్లు, గాలిఆడకపోవడం:

తులసిదళాలను నీడలో ఆరబెట్టి దంచి వస్త్ర ఘాలితం చేసి రెండుపూటలా చిటికెడుపొడిని ముక్కులతో నశ్యంలాగా పీలుస్తూవుంటే ముక్కులో పుండ్లు, జలుబు, గాలిఆడకపోవడం, కనుబొమ్మలు, నొసలు శిరస్సులలో నొప్పిరావటం హరించిపోతయ్.
➣ నిషేదములు: జలుబుచేసేవదార్దాలు నిషేధం

4. గజ్జి,తామర, చిడుములకు:

కృష్ణతులసి ఆకులు, నిమ్మకాయ రసంతో కలిపి మెత్తగా నూరి రెండు పూటలా పైన లేపనం చేస్వుంటే అతిత్వరగా ఆ చర్మరోగాలు హరించిపోతయ్.
➣ నిషేదములు: గోంగూర, పంకాయ, మాంసం, చేపలు నిషేధం.

5. మలేరియా మొ॥ విషజ్వరాలకు:

కృష్ణతులసి ఆకురసం 10నుండి 20 గ్రా|| తీసుకొని దానిలో 2గ్రా మిరియాలపొడి కలిపి రెండుపూటలా సేవిస్తూవుంటే మలేరియా హరించిపోతుంది. అంతే గాకుండా, విపరీతమైన జలుబు, అజీర్ణము, మండాగ్ని దగ్గు, ఒగర్పు, గొంతుపుండు కూడా తగ్గిపోతయ్.
➣ నిషేదములు:  అజీర్ణపదార్థాలు, మాంసాహారం నిషేధం

6. సంధివాతమునకు (కీళ్ళనొప్పులు):

కృష్ణతులసిఆకులు, వావిలాకులు, ఉత్తరేడి అకులు సమంగా నీడలో గాలికి ఆరబెట్టి పొడిచేసి వస్త్ర ఘాళితం పట్టి రెండుపూటలా 5గ్రా మోతాదుగా గోరువేచ్చని నీటితో సేవిస్తూవుంటే కీళ్ళనొప్పులు తగ్గిపోతయ్.
తులసితైలం : అలాగే, పైమూడుచెట్ల ఆకుల సమానరసం ఎంతవుంటే అంత నువ్వులనూనె కలిపి నూనెమిగిలేవరకు చిన్నమంటపైన మరిగించి వడపోసి, రెండుపూటలా గోరువెచ్చగా నొప్పులపైన మర్దన చేస్తుంటే అతిత్వరగా సంధివాతం సమసిపోతుంది.
➣ నిషేదములు: వాతకరపడార్థాలు మాంసాహారం నిషేధం

7. కుష్ఠు వ్యాధులకు:

పూర్వజన్మ పాపవశమున శరీరమంతా కుష్ణు వ్యాపించినప్పటికీ ఆరోగి నిర్బయంగా రోజు రెండుపూటలా కృష్ణతులసి మొక్కకు పూజచేసి దాని ఆకులరసం 10 నుండి 20 గ్రా॥| మోతాదుగా ఒక సంవత్సరంపాటు సేవిస్తే ఎంతవికృతంగా మారిన కుష్టురోగి అయినా తిరిగి తనస్వరూపాన్ని పొందగలుగుతాడని మహర్షులఆజ్ఞ, వయస్సును బట్టి మోతాదు నిర్ణయించుకోవాలి.
 ➣ నిషేదములు: మాంసం, చేపలు, గుడ్లు, వంకాయ, గోంగూర, చింతపండు మొ|| నిషేధం

8. పాముకాటుకు తులసి చికిత్స:

చరక, సుశ్రుత, వాగృటాది ఆయుర్వేద మహర్షులంతా ముక్తకంఠంతో తులసిరసం ద్వారా సర్పవిషాన్ని విరిచివేయవచ్చని ఎలుగెత్తి చాటారు. పాము కరిచిన వెంటనే గుప్పెడు కృష్ణతులసి ఆకులను నమిలించాలి. ఆవెంటనే ఆకులు, వెన్న కలిపినూరి ఆముద్దను అప్పుడు లోపలినుండి విషం బయటకులాగబడి తెల్లగావున్న వెన్న నల్లగా మారుతుంది. అదితీసివేసి మరలా కొత్తలేపనం చేయాలి. ఈవిధంగా వరుసగా లేపనం నల్లగా మారనంతవరకు మారుస్తూవుంటే, నర్సవిషం విరిగిపోతుందని నమస్త ఆయుర్వేద గ్రంథాలలో అనుభవపూర్వకంగా చెప్పబడింది.
 ➣ నిషేదములు:  పొగ, మద్యమాంసాలు నిషేధం

9. నపుంసకత్వమునకు మంగళం:

తులసివేర్లు, విత్తనాలు రెండింటిని సమంగా పొడిచేసుకొని ఆమొతానికి సమంగా మంచిబెల్లం కలిపిదంచి ముద్దచేసి నిలువచేయాలి. రోజూ రెండు పూటలా 5గ్రా॥నుండి 10గ్రా॥|మోతాదుగాతిని ఒక కప్పుపాలు సేవిస్తూ బ్రహ్మచర్యం పాటిస్తూవుంటే పురుషాంగం గట్టిపడి తిరిగి యౌవనం సిద్ధిస్తుంది.
➣ నిషేదములు: పులుపు, వేడిపదార్థాలు నిషేధం

10. పిల్లల లివర్ సమస్యలకు:

కప్పునీటిలో పదితులసిదళాలువేసి అరకప్పుకు మరిగించి వడపోసి గోరువెచ్చగా తాగిస్తూవుంటే లివర్ఆ రోగ్యవంతమౌతుంది.
➣ నిషేదములు: అతివేడిపదార్థాలు, మాంసాహారం నిషేధం

11. పిచ్చిచేష్టలు చేసేవారికి:

తులసిదళాలు 8, మిరియాలు 8, సహదేవిచెట్టు వేరు 5 గ్రా॥ వీటిని ఆదివారంనాడు విధిపూర్వకంగా స్వీకరించి ఒకతాయెత్తులో పెట్టి రోగులమెడలో కట్టివుంచితే క్రమంగా పిచ్చిచేష్టలు తగ్గిపోతయ్.
➣ నిషేదములు: పొగ, మద్యమాంసాలు నిషేధం

12. సృహతప్పి పడిపోతే:

తులశాకురసంలో చిటికెడు సైంధవలవణం కలిపి కరిగించి పడపోసి రెండుముక్కుల్లో మూడుచుక్కలు వేస్తే ఏవిధమైన స్పృహతప్పినా వెంటనే తెలివిలోకి వస్తారు.
➣ నిషేదములు: అజీర్ణకరపదార్థాలు నిషేధం

13. కడుపునొప్పి, కడుపుబ్బరం:

కడుపునొప్పి, కడుపుబ్బరం తులసిగింజలపొడి 3గ్రా, పటికబెల్లంపొడి 3గ్రా| ఒకమోతాదుగా గోరువెచ్చనినీటితో సేవిస్తూ వుంటే కడుపునొప్పి, ఉబ్బరం తగ్గిపోతయ్.
➣ నిషేదములు: అజీరకర్తపదార్థాలు నిషేధం

14. నీళ్ళ, జిగట విరేచనములకు:

తులశాకులరసం 20గ్రా|, చిటికెడు జాజికాయ పొడికలిపిసేవిస్తుంటే నీళ్ళవిరేచనాలు, జిగట విరేచనాలు కట్టుకుంటయ్.

15. ఉబ్బసానికి - ఉధృతమైనయోగం:

తులశాకులు 100గ్రా|, తానికాయబెరడు 200గ్రా|| కలిపి ఒకలీటరునీటిలో ఒకరోజంతా నాన బెట్టి పొయ్యి మీద పెట్టి పావులీటరు కషాయం మిగిలే వరకు మరిగించి వడపోసి రెండు ముూడు చెంచాల మోతాదుగా రెండుపూటలా ఆహారానికి ముందు సేవిస్తుంటే క్రమంగా ఉబ్బసం హరించి పోతుంది. ➤ పదార్థానికి బూజుపట్టకుండా జాగ్రత్తపడాలి.
➣ నిషేదములు: కఫంపెంచే చల్లనిపదార్ధాలు నిషేధం.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top