నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Friday, July 31, 2020

శ్రావణ వరలక్ష్మీ వ్రత పూజలో - గణపతి పూజ - Varalakshmi Vratam - Ganapathi Pooja

గణపతి పూజ:
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే .. 
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥ ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥ అని స్తుతిస్తూ గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.
 • ఓం సుముఖాయ నమః,
 • ఓం ఏకదంతాయ నమః,
 • ఓం కపిలాయ నమః,
 • ఓం గజకర్ణికాయ నమః,
 • ఓంలంబోదరాయ నమః,
 • ఓం వికటాయ నమః,
 • ఓం విఘ్నరాజాయ నమః,
 • ఓం గణాధిపాయ నమః,
 • ఓంధూమకేతవే నమః,
 • ఓం వక్రతుండాయ నమః,
 • ఓం గణాధ్యక్షాయ నమః,
 • ఓం ఫాలచంద్రాయ నమః,
 • ఓం గజాననాయ నమః
 • ఓం శూర్పకర్ణాయ నమః,
 • ఓం హేరంబాయ నమః,
 • ఓం స్కందపూర్వజాయనమః,
 • ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.
 • ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి,
 • ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
 • స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.
 • ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
'భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్' గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ నీటిని నివేదనచేసి చుట్టూ జల్లుతూ … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహా గుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటినివదలాలి).

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి) ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి.. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!

వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.


« PREV
NEXT »