వేదములు ఉపయోగములు - Vedalu Upayogalu

వేదములు ఉపయోగములు - Vedalu Upayogalu

వేదాలు – ఉపయోగాలు

ఈ లోకంలో ప్రతి ప్రాణి, ప్రతి జీవి యొక్క యదార్థ స్వరూపం పరమాత్మయే. అయితే తను పరమాత్మా స్వరూపాన్ని మరచి జీవుడుగా వ్యవహరిస్తున్నాడు మానవుడు. అది ఎలాగు అంటే తను తన స్వస్వరుపాన్ని మరచి అజ్ఞానంతో మరియు అవిద్యతో ఏర్పరచుకున్న కర్మలతో తనకు తాను వచ్చిన దారిని మరచి బద్దుడవుతున్నాడు.

అలా దారితప్పిన మనం ఇప్పుడు తిరిగి మాధవుడుగా (మానవుడే మాధవుడు), నరుడు నారాయనుడుగా, జీవుడు దేవుడుగా తన స్వస్తితిలో నిలిచి పోవాలంటే అందుకు మార్గం చుపేవే వేదాలు.

వేద అంటే తెలుసుకొనుట అని అర్థం . ఏమి తెలుసుకోవాలి? దేనిని తెలుసుకున్న తరువాత ఇక తెలిసికోవాల్సింది ఏమి ఉండదో, దేనిని తెలుసుకుంటే సర్వము తెలిసినట్లో అట్టి జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. కనుక మానవుడు తరించాలంటే, తన జన్మను సార్ధకం చేసుకోవాలంటే, జీవిత పరమార్ధమైన మోక్షాన్ని పొందాలంటే తప్పక తెలిసికోవలసింది వేదవిజ్ఞాన్నే.

ఈ వేదవిజ్ఞానాన్ని మొదట బ్రహ్మ దేవుడు దివ్యవాణిగా విన్నాడు. అందుకే దీనిని శృతి అన్నారు. శృతి అంటే విన్నది అని అర్థం. బ్రహ్మదేవుడు మొదటగా విని ఇతరులకు బోదించటం వలన దీనిని "బ్రహ్మవిద్య" అన్నారు.

మొదట వేదం అంతా ఒకటిగానే వుండేది. కానీ కలియుగంలో మనుషులు అల్పాయుష్కులు మరియు అల్పజ్ఞానులు అని గ్రహించి ఈ వేదమంత్రాలను కలియుగానికి ముందే ద్వాపరయుగంలో జన్మించిన వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న ఈ వేదమంత్రాలను నాలుగుగా విభజించి వేదవ్యాసుడయ్యాడు.
అవే:
 • 1. ఋగ్వేదం, 
 • 2. యజుర్వేదం, 
 • 3. సామవేదం
 • 4. అధర్వణవేదం.
ఇలా విభజించబడిన ప్రతివేదం తిరిగి ఒక్కొక్కటి నాలుగు భాగాలుగా విభజించబడినవి.
అవే:
 • 1. సంహిత (మంత్రం భాగము) 
 • 2. బ్రాహ్మణులూ (పూజలు. యజ్ఞయాగాదులు మో||న కర్మకాండ), 
 • ౩.ఆరణ్యకాలు (ఉపాసనలు) 
 • 4.ఉపనిషత్తులు (పరమాత్మా తత్త్వం).
మానవులకు మోక్ష మార్గాన్ని చుపేవే ఉపనిషత్తులు . ఇవి వేదాలకు అంతంలో వుండడం వలన వేదాంతం అంటారు. మన మానవ జీవితాన్ని తరింప జేసుకోనుటకు, మోక్షాన్ని అందుకొనుటకు కావలసిన అద్భుత జ్ఞానాన్ని ప్రసదించేవే ఉపనిషత్తులు. ఇవి నాలుగు వేదాలలోను మొత్తం 1180 వున్నవి. అయితే 108 ఉపనిషత్తులు మాత్రమే మంత్రాలతో సహా ఇప్పుడు మనకు లభిస్తున్నాయి. ఇందులో కూడా 10 ఉపనిషత్తులు అత్యంత ముక్యమైనవని మహాత్ములందరూ అంగీకరిస్తున్నారు.
అవే: 
 • ఈసా, 
 • కేన, 
 • కఠో, 
 • ప్రశ్న, 
 • ముండక, 
 • మాండుక్య, 
 • తైత్తిరీయ, 
 • ఐతరేయ, 
 • ఛాందోగ్య, 
 • బృహదారణ్యక అనే దశోపనిషత్తులు.
ఉపనిషత్తులు అంటే ఆత్మవిద్య అదే బ్రహ్మవిద్య . ఈ విద్య మానవునిలోని అజ్ఞాన్ని పోగొట్టి, సమస్త దుఃఖాలను నివృత్తి చేసి, పరబ్రహ్మాన్ని ఎరుకపరిచి, ముక్తిని ప్రసాదిస్తుంది.

సంకలనం: కోటేశ్వర్
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top