సప్త చిరంజీవులు - Sapta Chiranjivulu

సప్త చిరంజీవులు - Sapta Chiranjivulu

సప్త చిరంజీవులు

చిరంజీవులు అంటే ఎప్పటికీ చావు లేనివారు అని అర్థం. పురాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవులు ఉన్నారు.

1. అశ్వత్థాముడు
2. బలి చక్రవర్తి
3. వ్యాసుడు
4. హనుమంతుడు
5. విభీషణుడు
6. కృపుడు
7. పరశురాముడు

వారిని స్మరిస్తూ చేప్పేదే సప్తచిరంజీవి శ్లోకం:
  • అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంతశ్చ విభీషణః
  • కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవిన
  • సప్టైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమధాష్టమం
  • జీవేద్వర్షత్వతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత
శ్రీకృష్ణ పరమాత్మ శాపం వలన అశ్వత్థాముడు, వామనుని అనుగ్రహం వల్ల బలిచక్రవర్తి, లోకహితం కొరకు వ్యాసుడు, శ్రీరాముని భక్తితో హనుమంతుడు, రాముని అనుగ్రహం వల్ల విభీషణుడు, విచిత్రమైన జన్మం వలన కృపుడు, ఉత్ర్రుష్టమైన తపోశక్తి చేత పరశురాముడు సప్తచిరంజీవులు అయ్యారు. ఈ ఏడుగురితో పాటుగా, శివానుగ్రహంచే కల్పంజయుడైన మార్కండేయుడిని ప్రతినిత్యం స్మరిస్తే సర్వవ్యాధుల నుంచి ఉపశమనం పొంది శతాయుష్యు కలుగుతోందని శాస్త్రవచనం. 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top