భారతదేశం వైశిష్ట్యత - Bharataha Desa Vaisityata

0
భారతదేశం వైశిష్ట్యత - Bharataha Desa Vaisityata
భారతదేశం వైశిష్ట్యత
విష్ణువు వరాహావతారములో భూదేవిని యథాస్ధానంలో నిలబెట్టి స్వాయంభువు మనవుకి భూగోళాన్ని ప్రజాసృష్టి నిమిత్తం ఉపయోగించుకోవలసిందని, ధర్మమార్గాన నిలబెట్టేలా యజ్ఞకార్యాలు ఆచరించవలసిందని, ఆ సంతతిని క్రమానుగతంగా సత్కర్మలతో వర్ధిల్లజేయవలసిందని చెప్పాడు.తండ్రి ఆనతిని తలదాల్చి మనువు మొట్టమొదట ప్రియవ్రతుడు,ఉత్తానపాదుడు అనేవారిని సృష్టించాడు. ప్రియవ్రతుడు సాటిలేని తేజోపరాక్రమ దక్షుడు. సూర్యుడితో సమానమైన తేజస్సుని యోగబలం చేత పొంది, భూగోళానికి ఆవలివైపున ప్రకాశించాడు. అతడి రధం భూమిని ఏడుచోట్ల చీల్చివేయగా,అవి విడి విడిగా సప్త సముద్రాల్లా ప్రకాశించాయి. కనుకనే భూమిని 'సప్త ద్వీపా వసుంధరా' అన్నారు. 
ఈ ఏడూ వరుసగా:
 • 1. జంబూద్వీపం
 • 2. ప్లక్షద్వీపం
 • 3. శాల్మలీద్వీపం
 • 4. కుశద్వీపం
 • 5. క్రౌంచద్వీపం
 • 6. శాకద్వీపం
 • 7. పుష్కరద్వీపం
ఏడూ సముద్రాలు వరుసగా:
 • 1. క్షారసముద్రం
 • 2. ఇక్షుసముద్రం
 • 3. సురాసముద్రం
 • 4. ఘృతసముద్రం
 • 5. క్షీరసముద్రం
 • 6. వెన్నసముద్రం
 • 7. శుద్ధ ఉదక సముద్రం
యజ్ఞయగాలకి, వైదికక్రియలకి, భరతఖండం ఒకటే అనువైన ప్రదేశం ఎందుకంటే భారతదేశం కర్మభూమి. ద్వాపరయుగం అంతరిస్తూ కలియుగం ప్రారంభసమయంలో కలిప్రవేశంతో చెలరేగిపోతున్న దైత్య సంతతిని అదుపు చేయడానికి, కళ తప్పుతున్న ధార్మిక రీతులను పునః ప్రతిష్టి౦చడానికిగాను సంకల్పించిన మునీశ్వరులు సత్యలోకంలో బ్రహ్మగారిని ప్రార్థించి తమకు యజ్ఞయగాలకు,తపోదీక్షకు భంగం కలగని ప్రదేశము చూపించవలసినదిగా వేడుకున్నారు.

అంతట ఆవిధాత ఒక దివ్యచక్రాన్ని సృష్టించి,"తాపసొత్తములారా ఇది తిరుగుచు నిర౦తరభ్రమణం తో మీకు అనువైన ప్రదేశాన్ని అన్వేషించి, అక్కడ స్థిరంగా ఆగుతుంది. ఆ ప్రదేశం మీకు అన్నివిధాల అనువైనది కాగలదు. కాబట్టి దీనిని అనుసరించి వెళ్ళండి" అని చేప్పారు. దేవ, మునిగణం చక్రాన్నిఅనుసరిస్తూ సాగింది. సమస్త లోకాల్లోను భ్రమణం చేసిన చక్రం క్రమంగా భూలోకాన్ని చేరుకుని ఒక గొప్ప అరణ్యప్రా౦త౦లో దాని నేమి(ఇరుసు) స్ధిరంగా నిలిచిపోయింది.

నేమి నిలిచిన ఆస్థలమే నైమిశారణ్యం అని వాసికెక్కి౦ది. ఆ నైమిశారణ్యంలో 88 వేలమంది ఋషులు తపోవాటికలు ఏర్పరచుకుని తమ తపస్సుని, యజ్ఞయాగాలని నిరంతరాయంగా కొనసాగించారు. వారి తపోదీక్షతో ఈ భరతభూమి ఎంతో పవిత్రతని సంతరించుకుంది. ఇక్కడచేసిన ఎంతచిన్న దైవకార్యమైన ఎన్నోవేల రెట్లు ఫలితాన్ని మనకి అనుగ్రహించ గలిగిన పవిత్రభూమిగా వాసికెక్కి౦ది.
      ఈ జంబూద్వీపంలోనే మనదేశం, భరతవర్షంవుంది. జంబూద్వీపంలోని దేశాలన్నిటా కర్మక్షేత్రం భరతభూమి ఒకటే. మిగిలినవన్నీ భోగభూములు.స్వర్గలోకవాసులు తమ పుణ్యంలో మిగిలినఫలాన్ని అక్కడఅనుభవిస్తారు. ఇక్కడ(భరతవర్షంలో) కాలంఎప్పుడూ త్రేతాయుగంతో సమానమైన రీతిలో నడుస్తూంటుంది.శ్రీమన్నారాయణుడు ఈ భరతవర్షవాసులకు కఠోరతపస్సులు,యజ్ఞాలు,వ్రతాల ప్రసక్తి లేకుండా కేవలం భక్తితోనామజపాన్ని చేసినా,అంటే పిలిస్తే చాలు పలుకుతాడన్న మాట. వందల,వేల ఏళ్లు తరబడి ఆయుష్షున్న చోటపుట్టి ఏంలాభం? ఓ క్షణకాలం ఆయుష్షుతోనైనా సరే భరతభూమిఫై జన్మించడం గొప్పవరం. శ్రీహరి స్వయంగా ప్రసన్నుడై తనపట్ల భక్తిని,స్పృహనీ కల్గించే ఈ చోట ఆయన అభయప్రదానం అందరికీ అందుతూంటుంది.
        
శ్రీమన్నారాయణ కథాగానం జరగనిచోటు, సాధుసత్పురుషులెవరూ వసించనిచోటు, యజ్ఞయాగాదులు జరగనిప్రదేశం ఇంద్రలోకమే కావచ్చు! దానికి తుల్యమైనదే కావచ్చు! అది నివశించదగినది కాదు. భరతవర్షంలో యజ్ఞగుండాలలో సభక్తి,సమంత్రయుతంగా సమర్పించే హవిస్సులను దేవతలు సంతోషంగాస్వీకరిస్తారు.

సంకలనం: కోటేశ్వర్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top