శాప మహిమ - Shapa Mahima

0
శాప మహిమ - Shapa Mahima
సీతాదేవి - చిలుక
ధర్మదేవుడు శాపము నొందుట :
  ఒకప్పుడు అత్రి పుత్రుడైన దూర్వాసుడు ధర్మస్వరూపమును దర్శింపగోరి ధర్మదేవతను గూర్చి తపము చేసెను. పదివేలయేండ్లు గడచినవి. ధర్మదేవత (యముడు కాడు) ప్రత్యక్షము కాలేదు. దూర్వాసునికి కోపము వచ్చి ధర్మదేవుని శపించుటకు సిద్ధపడెను. 
    అప్పుడాయన ప్రత్యక్షమై " నీవంటి కోపిష్టి వానికి తపస్సు ఫలించునా? అనగా దూర్వాసుడు "నీ వెవ్వడ" వాణి యడిగెను. ధర్ముడు "నేను ధర్మమూర్తి" ననెను. దూర్వాసుడు మహాక్రోధముతో "నా కోపమును నీ వర్పగాలవా? పదివేలేండ్లు గడచిన తరువాత ఇప్పుడు మేము కనబదితిమా? ఇన్నాళ్ళు మాకు ప్రత్యక్షము కాకుండా ఏమి చేయుచున్నావు? ఇప్పుడైననూ నా కోపమునకు జడిసి ప్రత్యక్షమైనట్లు కనబడుచున్నది.నీవు ఇంత దుర్మదాందుడవై బ్రహ్మణాపచారము ఒక రాజువై, ఒక చండాలుడవై పుట్టుము. " అని శపించి లేచిపోయెను. ఆ శాపమువలన విదురుడుగాను, పాండుకుమారులలో జ్యేష్టుడైన ధర్మరాజుగాను, కాటికాపరి తనము చేసిన హరిశ్చంద్రుడుగాను ధర్మమూర్తి జన్మించెను.........పద్మ పురాణము

సీతాదేవికి చిలుక శాపము :
   అది మిథిలా నగరములోని అంతః పురస్త్రీల ఉద్యానవనము. సేతాదేవి చెలికత్తెలతో విహారమునకు వచ్చెను. ఒక చెట్టుమీద చిలుకల జంట ముచ్చట లాడుకొనుచుండెను. అవి వాల్మీకి ఆశ్రమమునుండి వచ్చినవి. మగచిలుక, " ఈ దేశపు రాజుగారి కే సీత నాగటిచాలులో దొరికినదట. ఆమెను శ్రీరాముడు శివ ధనుర్భంగము చేసి పెండ్లాడునట" అని భార్యకు చెప్పుచుండెను. అది విన్న సీత, ఆ రెండు చిలుకలను బట్టి తెప్పించెను. వానితో సీత, "మీరెవరిని గురించి మాట్లాడుతున్నారు ? సీతను నేనే. నన్ను గురించియేనా? ఆ రాముడెవడో చెప్పుడు. ఈ సంగతులు మీ కెట్లు తెలిసినవి. "అని అడుగగా "మేము వాల్మీకి ఆశ్రమములోని వారము. విహారమునకై వచ్చినాము. వాల్మీకి ముని రామాయణము అని ఒక గ్రంథము వ్రాయుచున్నాడు. అందులోని కథ చెప్పుచున్నాను. రాముడు అయోధ్యకు యువరాజు" అని శుకములు చెప్పి, తమ్ము వదలమని ప్రార్ధించెను. " ఆ శుభకార్యము జరిగిన తరువాత్ అమిమ్ము విడిచెద" నని సీత యనెను. అవి "మేము స్వేచ్చగా తిరిగేది వారము. 
    పంజరములలో ఉండలేము అదియునుగాక  నాభార్య చూలాలు. శ్రమకు ఓర్వలేదు. దయతో విడిచిపెట్టు" మని కోరెను. సీత, "అయినచో ప్రసవ మగునంతవరకు ఆడచిలుక నాయొద్దనే యుండును. నీవు పొమ్మని" మగ చిలుకను విడిచెను. అది, "తల్లీ, దీనిని విడిచి నేను బ్రతుకలేను. కరుణించి మమ్మిద్దరిని విడిచిపెట్టు" మని దీనముగా ప్రార్ధించెను. కాని సీత వినలేదు. ఆడచిలుక, సీతతో నాభర్త నన్ను విడిచి బ్రతుకలే ననుచున్నాడు. నేనునూ అతనిని విడిచి బ్రతుకలేను. కావున మమ్ము దయజూడు మనెను. సీత వినలేదు. మగచిలుక ఏడుపు ఆడచిలుక గుండెలు పగులగొట్టగా అది సీతను జూచి "యింత కటినురాలవై గర్భవతియైన నన్ను నాభర్తనుండి విడదీసినావు కావున, నీవు కూడా గర్భవతివై భర్తను ఎడబాసి దుఃఖపడెదవు". అని శపించి ప్రాణము విడిచెను. మగచిలుక " నాభార్యను అన్యాయముగా చంపినావు. కావున నిన్ను నీ భర్త విడచుటకు మూలకారణుడైన చాకలివాడనై జన్మించి పగ తీర్చుకొందు" ననుచూ వెళ్ళి గంగానదిలో పడి మరణించెను. సీతను రాముడు అడవిలో విడుచుటకు ఇదియే కారణము..................పద్మ పురాణము...

రచన: శ్రీ భాస్కరానంద నాథ గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top