'భగవద్గీత' యధాతథము - మొదటి అధ్యాయము : 'Bhagavad Gita' Yadhatathamu - Chapter One, Page-5

'భగవద్గీత' యధాతథము - మొదటి అధ్యాయము : 'Bhagavad Gita' Yadhatathamu - Chapter One, Page-5

శ్లోకము - 14
తతః శ్వేతైర్ణయైర్యుక్తే మహతి స్యన్థనే స్థితా |
మాధవః పాణ్డవాశ్చైవ  దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ||

తతః - పిమ్మట; శ్వేతైః - తెల్లని; హయైః - గుఱ్ఱములు; యుక్తే - పూన్చబడిన; మహతి - మహా: స్యస్థనే - రథములో; స్థితా - ఉన్నవారైక; మాధవః - శ్రీకృష్ణుడు (లక్ష్మీ పతి); పాణ్ణవః - అర్జునుడు (పాండు తనయుడు); - కూడ; ఏవ - నిశ్చయంగా; దివ్యౌ - దివ్యములైన; శంఖౌ - శంఖాలను; ప్రదధ్మతం - పూరించారు.
 ఎదుటి పక్షములో శ్రీకృష్ణభగవానుడు, అర్జునుడు ఇద్దరు తెల్లని గుజ్జాలు పూన్నబడిన మహారథంలో ఉన్నవార్డె తమ దివ్యశంఖములను పూరించారు.

భాష్యము : భీష్మదేవుడు పూరించిన శంఖానికి భిన్నంగా శ్రీకృష్ణార్జునుల హస్తాలలోని శంఖాలు దివ్యములని వర్ణించబడింది. శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్న కారణంగా ప్రతిపక్షమువారికి జయమనే ఆశే లేదని ఆ దివ్యశంఖాల ధ్వని సూచించింది. "జయోసు పాణ్ణుపుత్రాణాం యేషాం పక్షే జనార్ధనః"- శ్రీకృష్ణుని సాంగత్యము కారణంగా విజయము సర్వదా పాండుపుత్రులకే లభిస్తుంది. భగవానుడు ఎప్పుడు, ఎక్కడ నిలిచి ఉంటే అక్కడే లక్ష్మీ దేవి కూడ నిలిచి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీ దేవి తన భర్తను విడిచి ఏనాడు ఒంటరిగా వసించదు. అందుకే విష్ణువు లేదా శ్రీకృష్ణుని శంఖముచే కలిగిన దివ్యధ్వని సూచించినట్లుగా విజయము, ఐశ్వర్యము అర్జునుని కొరకే ఎదురు చూస్తున్నాయి. అంతే కాకుండ, మిత్రులిద్దరు ఆసీనులై ఉన్నట్టి రథము అగ్నిదేవుని ద్వారా అర్జునునికి ఇవ్వబడినట్టిది. ముల్లోకాలలో ఎక్కడకు వెళ్ళినా ఆ రథము సకల దిక్కులను జయించే సామర్థ్యము కలదని ఇది సూచిస్తున్నది.

శ్లోకము -15
పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః |
పౌణ్ం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ||

పాంచజన్యం - పాంచజన్యమనే పేరు కలిగిన శంఖమును; హృషీకేశః - హృషీకేశుడు (భక్తుల ఇంద్రియాలను నిర్దేశించే శ్రీకృష్ణుడు); దేవదత్తం - దేవదత్తమనే పేరు కలిగిన శంఖమును; ధనంజయః - ధనంజయుడు (ధనమును జయించిన అర్జునుడు); పౌండ్రం - పౌండ్రమనే పేరు కలిగిన శంఖమును; దధ్మౌ - ఊదారు; మహాశంఖం - యంకరమైన శంఖమును, భీమకర్మా - ఘనమైన కార్యాలు చేసేవాడు; వృకోదరః - భోజనప్రియుడు (భీముడు).
 శ్రీకృష్ణభగవానుడు పాంచజన్యమనే తన శంఖమును పూరించాడు, అర్జునుడు దేవదత్తమనే తన శంఖమును పూరించాడు; భోజనప్రియుడు, ఘనమైన కార్యాలు చేసేవాడు అయిన భీముడు పౌండ్రమనే తన మహాశంఖమును పూరించాడు.

భాష్యము : సర్వేంద్రియాలకు ప్రభువైన కారణంగానే శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో హృషీకేశునిగా తెలుపబడినాడు. జీవులందరు ఆతని అంశలే కనుక జీవుల ఇంద్రియాలు కూడ ఆతని ఇంద్రియాల అంశలే. నిరాకారవాదులు జీవుల ఇంద్రియాల గురించి పట్టించుకోరు. కనుకనే సర్వదా వారిని ఇంద్రియరహితులుగా లేదా నిరాకారులుగా వర్ణించాలని కోరుకుంటారు. భగవాసుడు సకల జీవుల హృదయాలలో నిలిచి వారి ఇంద్రియాలను నిర్దేశిస్తాడు. కాని జీవుని శరణాగతిని బట్టి ఆతడు నిర్దేశము చేస్తాడు. ఇక శుద్ధభక్తుని విషయంలో ఆతడు ప్రత్యక్షంగా ఇంద్రియాలను నియంత్రిస్తాడు. ఇక్కడ కురుక్షేత్ర రణరంగములో అర్జునుని దివ్యేంద్రియాలను ఆతడు ప్రత్యక్షంగా నియంత్రించబోతున్నాడు, ఆ విధింగా హృషీకేశుడనే ప్రత్యేక నామము వాడబడింది. విధిధ కార్యాలను బట్టి భగవంతంనికి వివిధ నామాలు ఉంటాయి. 
ఉదాహరణకు :- 
  • మరువనే రాక్షసుని సంహరించడం వలన ఆతనికి మధుసూడనుడనే పీరు వచ్చింది; 
  • గోపులకు, ఇంద్రియాలకు ఆనందాన్ని ఇస్తాడు కనుక ఆతని పీరు గోవిందుడు అయింది;
  • వసుదేవుని తనయుడై ఆవిర్భవించిన కారణంగా ఆతని పేరు వాసుదేవుడు అయింది; 
  • దేవకీదేవిని తల్లిగా స్వీకరించిన కారణంగా ఆతని పేరు దేవకీ నందనుడు అయింది;
  • బృందావనంలో యశోదకు బాల్యలీలలను చూపిన కారణంగా ఆతని పేరు యశోదా నందనుడు అయింది; 
  • తన స్పీహితుడైన అర్జునునికి రథసారధిగా పనిచేసిన కారణంగా ఆతని పేరు పార్థసారథి అయింది; అదేవిధంగా కురుక్షేత్ర రణరంగములో అర్జునునికి నిర్దేశము ఇచ్చిన కారణంగా ఆతని పేరు హృషీకేశుడు ఆయింది;
  వివిధ యజ్ఞాల నిర్వహణకు ధనము అవసరమైనపుడు దానిని సంపాదించడం తన అన్నగారికి సహాయపడిన కారణంగా ఈ శ్లోకంలో అర్జునుడు ధనంజయున తెలుపబడినాడు. అదేవిధంగా విపరీతంగా తినడంతో సమానంగా హిడింబాసురుని వధించడం వంటి ఘనకార్యాలను చేయగలిగిన కారణంగా భీముడు వృకోదరునిగా తెలియబడ్డాడు. కనుక భగవంతునితో మొదలుకొని పాండవపక్షంలో ఉన్న యోధులందరు పూరించినట్టి ప్రత్యేకమైన శంఖాలు యుద్ధవీరులకు ఉత్సాహము కలిగించాయి. ప్రతిపక్షములో అట్టి ఘనతలు గాని, పరమ నిర్ణేశకుడైన శ్రీకృష్ణుని సన్నిధి గాని, లక్ష్మీ దేవి సన్నిధి గాని లేవు. అంటే వారు యుద్ధంలో ఓడిపోవడము నిర్ణయించబడింది. ఈ సందేశమే శంఖధ్వనుల ద్వారా ప్రకటించబడింది.

శ్లోకము - 16-18
అనన్త విజయం రాజా కున్తీపుత్రో యుధిష్ఠిరః |
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ||
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖ చ మహారథః |
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ||
ద్రుపదో డ్రౌపదేయాశ్చ సర్వశః పృథిపీపతే |
సౌభద్రశ్న మహాబాహుః శంఖాన్ దద్ముమః వృథక్ పృథక్ ||

అనస్తవిజయం - అనంతవిజయమునే పేరు కలిగిన శంఖమును; రాజా - రాజైన; కుంతీపుత్రః - కుంఠీపుత్రుడు; యుధిష్ఠిరః - యుధిష్ఠిరుడు, నకులః - నకులుడు; సహదేవః - సహదేవుడ; చ - మరియు; సుఘోష మణి పుష్పకౌ- సుఘోషము, మణి పుష్పకమనే పేర్లు కలిగిన శంఖాలను; కాశ్యః - కాశీ (వారణాసి) రాజు; - మరియు; పరమేష్వాసః - గొప్ప విలుకాడైన; శిఖణ్ది - శిఖండి; చ - కూడ; మహారథః - ఒంటరిగా వేలాదిమందితో పోరాడగల వీరుడు; ధృష్టద్యుమ్నుః: - ధృష్టద్యుమ్నుడు (ద్రుపద మహారాజు కొడుకు); విరాట - విరాటుడు (అజ్ఞాతవాసములో పాండవులకు ఆశ్రయమిచ్చిన రాజు); - కూడ; సాత్యకిః - సాత్యకి (శ్రీకృష్ణుని రథసారథియైన యుయుధానుడు); - మరియు; అపరాజితః - ఏనాడును ఓడిపోనివాడు; ద్రుపదః - పాంచాల రాజైన ద్రుపదుడు; ద్రౌపదేయాః - ద్రౌపది కుమారులు; - కూడ; సర్వశః - అందరు; వృథివీపతేః - ఓ రాజా; సౌభద్రః - సుభద్రా తనయుడైన అభిమన్యుడు; - కూడ; మహాబాహుః - గొప్ప బాహువులు కలిగినవాడు; శంఖాన్ - శంఖాలను; దద్ముః - ఊదారు; పృథక్ పృథక్ - విడివిడిగా.
   కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంతవిజయమనే తన శంఖమును పూరించగా, నకులుడు సుఘోషమనే శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనే శంఖమును పూరించారు. ఓ రాజా! గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, జయింపరానట్టి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది తనయులు, గొప్ప బాహువులు కలిగిన సుభద్రా తనయుడు మొదలగు వీరులందరు తమ తమ శంఖాలను పూరించారు.

భాష్యము : పాండు కుమారులను మోసం చేయడం, రాజ్యసింహాసనాన్ని తన పుత్రులకు కట్టబెట్టే యత్నం చేయడమనే అధర్మయోచన ఏమాత్రం మెచ్చదగినదికాదని ధృతరాష్ట్నినికి సంజయుడు అతి చతురతతో తెలియజేసాడు. కురువంశమంతా ఆ మహారణంలో సంహరింపబడుతుందని అప్పటికే సూచనలు స్పష్టంగా చూపాయి. పితామహుడైన భీష్ముడు మొదలుకొని ఆభిమన్యుడు మున్నగు మనుమల వరకు ప్రపంచంలోని పలు దేశాల రాజులతో సహా అక్కడ ఉన్న వారందరు నశింపబోతున్నారు. తన కుమారులు అనుసరించినట్టి యుక్తివిధానాన్ని ప్రోత్సహించిన కారణంగా ఆ సమస్త ఘోరవిపత్తుకు ధృతరాష్ట్రుడే కారణమైనాడు.

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top