'భగవద్గీత' యధాతథము - మొదటి అధ్యాయము : 'Bhagavad Gita' Yadhatathamu - Chapter One, Page-11

0
'భగవద్గీత' యధాతథము - మొదటి అధ్యాయము : 'Bhagavad Gita' Yadhatathamu - Chapter One, Page-11

శ్లోకము - 39
కులక్షయే ప్రణశ్యన్తి కులధర్మాః సనాతనాః |
ధర్మే నష్టీ కులం కృత్స్నమధర్మోకభిభవత్యుత ||

కులక్షయే - కులక్షయముతో; ప్రణశ్యన్తి - నశించిపోతాయి; కులధర్మాః - వంశ ఆచారములు; సనాతనాః - శాశ్వతమైన; ధర్మే:- ధర్మములు; నిష్టీ - చెడిపోయి; కులం - వంశము; కృత్స్నం - మొత్తము; అధర్మః - అధర్మపరులు; అభిభవతి - అవుతారు; ఉత - అని చెప్పబడింది.

కులక్షయము వలన శాశ్వతమైన వంశావారము నశించిపోతుంది. ఆ విధంగా వంశంలో మిగిలినవారు అధర్మపరులౌతారు.

భాష్యము : వంశములోవారు సక్రమంగా వృద్ధి చెంది, ఆధ్యాత్మిక విలువలను పొందే విధంగా సహాయపడడానికి అనేకమైన ధార్మిక ఆచారాలు వర్ణాశ్రమ పద్ధతిలో ఉన్నాయి. పుట్టుక మొదలుగా మృత్యువు వరకు ఉన్నట్టి వంశంలోని అట్టి సంస్కారాలకు పెద్దలే బాధ్యత వహించాలి. కాని పెద్దల మరణంతో వంశంలోని అటువంటి సంస్కారకర్మలు ఆగిపోతాయి. అప్పుడు వంశంలో మిగిలిన పిన్నలు అధర్మయుత అలవాట్లను తయారు చేసికొని తద్ద్వారా ఆధ్యాత్మిక ముక్తికి అవకాశాన్ని కోల్పోతారు. అందుకే ఏ ఉద్దేశంతోనైనా వంశపెద్దలను వధించకూడదు.

శ్లోకము - 40
అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యన్తి కులకస్రియః |
స్త్రీషు దుష్టాసు వార్ ష్ణేయ జాయతే వర్ణనంకరః ||

అధర్మ - అధర్మము; అభిభవాత్ - ప్రబలినప్పుడు; కృష్ణ - ఓ కృష్ణా: ప్రదుష్యన్తి - చిడిపోతారు; కులస్త్రియ - కులస్త్రీలు; స్త్రీషు - కులస్తీలు; దుప్టాసు - పతనము వలన; వార్ ష్ణేయ - ఓ కృష్ణ వంశీయుడా; జాయతే - కలుగుతుంది; వర్ధనంకరః - అవాంఛనీయమైన సంతానము.

ఓ కృష్ణా! వంశంలో అధర్మము ప్రబలినప్పుడు కులస్త్రీలు చెడిపోతారు. ఓ వృష్ణి వంశ  సంజాతుడా! అటువంటి కులస్త్రీ పతనము వలన అవాంఛనీయమైన సంతానము కలుగుతుంది.

భాష్యము : జీవితంలో శాంతికి, సమృద్ధికి, ఆధ్యాత్మిక ప్రగతికి మానవసంఘంలోని సత్ప్రవర్తన కలిగిన జనులే మూలసూత్రము. దేశము, జాతి యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కొరకు సంఘంలో సత్ప్రవర్తన కలిగిన జనులు నెలకొనేరీతిలో వర్గాశ్రమధర్మాలు ఏర్పాటు చేయబడినాయి.
   అటువంటి జనసముదాయము స్త్రీల పాతివ్రత్యము, ధర్మవర్తనము పైననే ఆధారపడి ఉంటుంది. పిల్లలు సులభంగా తప్పుద్రోవ త్రొక్కేటట్లు, స్త్రీలు కూడ పతనము చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే పిల్లలు, స్త్రీలు ఇద్దరికి కుటుంబపెద్దల రక్షణము అవసరమౌతుంది. నానారకాలైన ధర్మాచారాలలోనెలకొల్పడం ద్వారా స్త్రీలు పెడదారి పట్టకుండ ఉంటారు.
   చాణక్యపండితుని అభిప్రాయాన్ని బట్టి స్త్రీలు సాధారణంగా తెలివికలవారు కానందున నమ్మకము ఉంచదగినవారు కారు. అందుకే నానారకాల ధార్మిక వంశాచారాలు వారికి సర్వదా వ్యాపకము కలిగించాలి. ఆ విధంగా వారి పాతివ్రత్యము, భక్తి వర్ణాశ్రమపద్ధతిని పాటించగలిగే యోగ్యత కలిగిన సత్ప్రజలకు జన్మనిస్తుంది. అటువంటి వర్ణాశ్రమధర్మము విఫలమైనప్పుడు సహజంగానే స్త్రీలు కట్టుబాటు విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలుస్తారు. ఆ విధంగా అవాంఛిత జనబాహుళ్యము కలుగజేస్తూ జారత్వము ప్రబలమౌతుంది. బాధ్యతారహితులైన పురుషులు కూడ సంఘంలో జారత్వమునే ప్రీరేపిస్తూ ఉంటారు. ఆ విధంగా అవాంఛిత సంతానము మానవజాతిని ముంచెత్తి యుద్ధానికి, పీడలకు దారితీస్తుంది. 

శ్లోకము - 41
సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ |
పతన్తి పితరో హ్యేషాం లుప్తపిండోదక్రియాః ||

సంకరః = అటువంటి అవాంఛిత సంతానము; నరకాయ - నరకవాసము కలిగిస్తాయి; ఏవ - నిక్కముగా; కులఘ్నానాం - వంశాన్ని నశింపజేసినవారికి; కులస్య - వంశానికి; - కూడా; పతన్తి - పతనము చెందుతారు; పితరః - పితరులు; హి - నిక్కముగా; ఏషాం - వారికి, లుప్త - లోపించగా; పిండ - ఆహారము; ఉదక - నీళ్ళు; క్రియాః - కర్మలు.

అవాంఛిత జనాభివృద్ధి నిక్కముగా వంశానికి, వంశాచారమును నష్టన నష్టపరచినవారికి నరకమును కలిగిస్తుంది. పిండోదక క్రియలు పూర్తిగా ఆపివేయబడిన కారణంగా అట్టి అధర్మ వంశాలకు చెందిన పితరులు పతనము చెందుతారు.

భాష్యము : కర్మకాండ విధినియమాలను బట్టి వంశపితరులకు సమయానుసార పిండోదకాలు సమర్పించవలసిన అవసరము ఉన్నది. ఈ నివేదన విష్ణు ఆర్చన ద్వారా ఒనగూడుతుంది. ఎందుకంటే విష్ణుప్రసాదాన్ని తినడము మనిషిని అన్ని రకాల పాపాల నుండి ముక్తుని చేస్తుంది.
  ఒక్కొక్కప్పుడు వంశపితరులు నానారకాల పాపాల వలన క్లేశాలు అనుభవిస్తూ ఉంటారు. మరొక్కప్పుడు వారిలో కొందరు స్థూలదేహమైనా పొందక పిశాచాలుగా సూక్ష్మ దేహాలలోనే బలవంతముగా ఉండవలసి వస్తుంది. అందుకే ప్రసాద అన్నము వంశీయులచే సమర్పించబడినపుడు పితరులు పిశావజీవనము నుండి, ఇతర దుర్భరమైన జీవితాల నుండి ముక్తులౌతారు. పితరులకు చేసే అటువంటి సహాయము ఒక వంశాచారము, భక్తియుతసేవలో లేనివారు అటువంటి అచారాలను తప్పకుండ పాటించాలి. అయితే భక్తియుతసేవలో నెలకొనినవాడు అటువంటి కర్మలను చేయవలసిన అవసరము లేదు. కేవలము భక్తిరియుతసేవను చేయడం ద్వారా మనిషి లక్షలాది పితృదేవతలనైనా అన్నిరకాల దుఃఖాల నుండి విముక్తుని చేయగలడు. ఈ విషయము శ్రీమద్భాగవతములో (11.5.41) ఈ విధంగా చెప్పబడింది.

దేవర్థి భూతాప్తనృణాం పితృయణాం న కింకరో నాయమృణి చరాజన్ |
సర్వాత్మనా యః శరణం శరణ్యం గలో ముకుందం పరిహృత్య కర్తమ్ ||

అన్నిరకాలైన నియమాలను త్యజించి ముక్తినిచ్చే ముకుందుని పాదపద్మాశ్రయాన్ని స్వీకరించి, ఆ మార్గంలో పూర్ణశ్రద్ధతో కొనసాగేవాడు దేవతలు, బషులు, సామాన్యజీవులు, కుటుంబసభ్యులు, మానవులు లేదా పితృదేవతల పట్ల ఎలువంటి బాధ్యతలు గాని, ఋణము గాని కలిగి ఉండడు. భగవంతుని భక్తియుతపేవ ద్వారా అటువంటి బాధ్యతలన్నీ అప్రయత్నంగా తీరిపోతాయి.


'భగవద్గీత' యధాతథము
'భగవద్గీత' యధాతథము - పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి »

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top