'భగవద్గీత' యధాతథము - మొదటి అధ్యాయము : 'Bhagavad Gita' Yadhatathamu - Chapter One, Page-12

0

శ్లోకము - 42
దోషై రేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః |
ఉత్సాద్యన్తే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ||

దొషైః - అట్టి దోషాల వలన; ఏత్తః- ఈ; కులఘ్పానాం - కులమును నశింపజేసేవారి; వర్ణసంకరః - అవాంఛిత సంతానముకు; కారకైః - కారణమౌతూ; ఉత్సాద్యస్తే - నాశనమౌతాయి; జాతిధర్మాః - జాతిధర్మాలు; కులధర్మాః - వంశాచారాలు; - కూడా; శాశ్వతాః - నిత్యములైన.

వంశాదారమును నశింపజేసి ఆ విధంగా అవాంఛిత సంతానమునకు కారణమయ్యేవారి పాపకర్మల వలన అన్ని రకాల కులధర్మాలు, జాతిధర్మాలు నాశనమౌతాయి.

భాష్యము : మానవుడు చరమమోక్షాన్ని పొందగలిగేటట్లు సనాతనధర్మము లేదా వర్ణాశ్రమధర్మముచే నిర్దేశించబడిన రీతిగా మానవసంఘములోని నాలుగు వర్గాలవారికి జాతిధర్మాలతో పాటుగా కులధర్మాలు నిర్ణయించబడ్డాయి. అందుకే బాధ్యతారహితులైన సంఘనాయకులచే సనాతనధర్మ పద్ధతి విచ్చిన్నము కావడము సంఘంలో అయోమయ పరిస్థితిని కలుగజేస్తుంది. దాని ఫలితంగా జనులు తమ జీవితలక్ష్యమైన విష్ణువును మరచిపోతారు.
అటువంటి నాయకులు అంధులుగా పిలువబడతారు. అటువంటివారిని అనుసరించే జనులు నిశ్చయంగా అయోమయస్థితిలో పడిపోతారు.

శ్లోకము - 43
ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్ధన | 
నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ||

ఉత్సన్న- నశింపబడిన; కులధర్మాణాం - కులధర్మాలు కలిగినవారు; మనుష్యాణాం - అట్టి మానవులు; జనార్దన - ఓ కృష్ణా; నరకే - నరకలోకంలో; నియతం - శాశ్వతంగా;  వాసః - నివాసము; భవతి - కలుగుతుంది; ఇతి - అని; అనుశుశ్రుమ - గురుశిష్యపరంపర ద్వారా నేను విన్నాను.

ఓ కృష్ణా! జనార్దనా! కులధర్మాలు నశించినవారు శాశ్వతంగా సరకవాసం చేస్తారని గురుశిష్య పరంపర ద్వారా నేను విన్నాను.

భాష్యము : అర్జునుడు తన వాదానికి స్వానుభవాన్ని గాక ప్రామాణికుల నుండి వినినదానిని ఆధారము చేసికొన్నాడు. ఇదే నిజమైన జ్ఞానాన్ని స్వీకరించే పద్ధతి. యథార్థమైన జ్ఞానంలో అదివరకే స్థితుడైన వ్యక్తి సహాయము లేకుండ మనిషి యథార్థ జ్ఞానస్థితికి చేరుకోలేడు. మరణానికి ముందే తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము చేసికొనే పద్దతి వర్ణాశ్రమపద్ధతిలో ఉన్నది. సర్వదా పాపాలలోనే నెలకొనేవాడు ఈ ప్రాయశ్చిత్తమనే పద్ధతిని తప్పక ఉపయోగించుకోవాలి. ఆ విధంగా చేయకపోతే మనిషి పాపఫలితంగా తప్పక నరకలోకాలకు పోయి దౌర్చాగ్యజీవితాన్ని గడపవలసి వస్తుంది.

శ్లోకము - 44
అహో బత మహత్తాపం కర్తుం వ్యవసితా వయం |
యద్ రాజ్యసుఖలోభేన హన్తుం స్వజనముద్యతాః ||

అహో - అయ్యో; బత - ఎంత విచిత్రము; మహత్ - గొప్ప; పాపం - పాపమును; కుర్తుమ్ - చేయడానికి; వ్యవసితాః - నిశ్చయించాము; వయం - మేము; యత్ - కారణమున; రాజ్యసుఖలోభేన - రాజ్యసుఖ లోభముచే ప్రేరేపించబడి; హన్తుం - చంపడానికి; స్వజనం - స్వజనులను; ఉద్యతాః - యత్నిస్తున్నాము.

అయ్యో! ఘోరమైన పాపకర్మలను చేయడానికి మేము సిద్దపడడము ఎంత విచిత్రము రాజ్యసుఖమును అనుభవించాలనే కోరికతో మేము స్వజనమును వధించాలని అనుకుంటున్నాము.

భాష్యము : స్వార్థపూరిత భావాలచే ప్రేరేపితుడై మనిషి స్వంత సోదరుడు, తండ్రి లేదా తల్లిని చంపడం వంటి పాపకార్యాలకు ఒడిగడతాడు. ప్రపంచచరిత్రలో అటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కాని సాధువు, భగవద్భక్తుడు అయిన అర్జునుడు నైతిక సూత్రాల గురించి సర్వదా ఎరుకగలిగినవాడై అటువంటి కార్యాలు జరుగకుండ జాగ్రత్తపడతాడు.


'భగవద్గీత' యధాతథము
'భగవద్గీత' యధాతథము - పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి »

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top