'భగవద్గీత' యధాతథము: రెండవ అధ్యాయము - " గీతాసారము " - Bhagavad Gita' Yadhatathamu - Chapter Two, Page-4

'భగవద్గీత' యధాతథము: రెండవ అధ్యాయము - " గీతాసారము " - Bhagavad Gita' Yadhatathamu - Chapter Two, Page-4

శ్లోకము - 9 
సంజయ ఉవాచ
ఏపముక్త్వా హృషీకేశం గుడాకేశః పరస్తపః |
నయోత్స్య ఇతి గోవిన్దముక్త్వా తూష్ణిం బభూవ హ ॥

సంజయః ఉవాచ - సంజయుడు వలికాడు; ఏవం - ఈ విధంగా; ఉక్త్వా - చెప్పి; హృషీకేశం - ఇంద్రియాలకు అధిపతియైన శ్రీకృష్ణునితో; గుడాకేశః - అజ్ఞానాన్నిఅణచడంలో ప్రవీణుడైన అర్జునుడు; పరస్తపః - శత్రువులను తపింపజేసేవాడు; న యోత్స్యె -  నేను యుద్ధం చేయను; ఇతి - అని; గోవిన్దం - ఇంద్రియాలకు ఆనందము నిచ్చే శ్రీకృష్ణునితో; ఉక్త్వా - పలికి; తూష్ణిం - మౌనము; బభూవ - వహించాడు; - నిశ్చయముగా.

సంజయుడు పలికాడు : శత్రువులను తపింపజేసే అర్హునుడు ఈ విధంగా చెప్పిన తరువాత శ్రీకృష్ణునితో "గోవిందా! నేను యుద్ధం చేయను" అని పలికి మౌనం వహించాడు.

భాష్యము : అర్జునుడు యుద్దం చేయబోవడం లేదని, ప్రత్యామ్నాయంగా అతడు యుద్ధరంగాన్ని వీడి భిక్షాటన వృత్తిని చేపట్టబోతున్నాడని తెలిసికొని ధృతరాష్ట్రుడు ఎంతో ఆనందించి ఉండవచ్చును. కాని అర్హునుడు తన శత్రువులను సంహరించడానికి సమర్థుడని (పరంతపుడు) చెబుతూ సంజయుడు తిరిగి అతనిని నిరుత్సాహపరిచాడు. కుటుంబానురాగం కారణంగా అర్జునుడు కొంత తడవు మిథ్యాశోకతప్టుడైనా శిష్యునిగా పరమగురువైన శ్రీకృష్ణునికి శరణాగతుడయ్యాడు. వంశానురాగం వలన కలిగినట్టి మిథ్యాశోకం నుండి అతడు శీఘ్రమే బయటపడతాడని, పరిపూర్ణ ఆత్మానుభవ జ్ఞానంతో (కృష్ణభక్తిభావనతో) జ్ఞానవంతుడై పిదప తప్పకుండ యుద్ధం చేస్తాడని ఇది సూచించింది. శ్రీకృష్ణునిచే అర్జునుడు జ్ఞానవికాసాన్ని పొంది తుదివరకు పోరాడతాడు కనుక ధృతరాష్ట్రుని ఆనందము భగ్నము కానున్నది.

శ్లోకము - 10
తమునాచ హృషీకేశః ప్రహసన్నివ భారత |
సీనయోరుభయోర్మధ్యే విషీదన్తమిదం వచః ||

తం - అతనితో; ఉవాచ - పలికాడు; హృషీకేశః - ఇంద్రియాలకు ప్రభువైన శ్రీకృష్ణుడు; ప్రహసన్ - నవ్వుతూ; ఇవ - వలె; భారత - ఓ భరతవంశీయుడా, ధృతరాష్ట్రా; సేనయోః - సేనలు; ఉభయోః - రెండింటి; మధ్యే - మధ్యలో; విషీదన్తం  - దుఃఖిస్తున్నవానితో; ఇదం - ఈ క్రింది; వచః - మాటలు.

ఓ భరతవంశీయుడా! ఇరుసేనల మధ్య శ్రీకృష్ణుడు నవ్వుతూ అప్పుడు దుఃఖితుడైన అర్జునునితో ఈ విధంగా పలికాడు

భాష్యము : హృషీకేశుడు, గుడాకేశుడు అనే ఇద్దరు సన్నిహిత మిత్రుల మధ్య సంభాషణ జరుగుతోంది. స్నేహితులుగా వారిద్దరు ఒకే స్థాయిలో ఉన్నవారైనా వారిలో ఒకడు ఇంకొకనికి స్వచ్చందంగా శిష్యుడయ్యాడు. స్నేహితుడు శిష్యునిగా కావడానికి ఎంచుకొనిన కారణంగా శ్రీకృష్ణుడు నవ్వుతున్నాడు. సర్వులకు ప్రభువుగా, ఎల్లరి యజమానిగా ఆతడు సర్వదా ఉన్నతస్థితిలోనే ఉంటాడు. అయినా భక్తుడు ఏ పాత్రలో తనసను కోరుకుంటాడో దానిని అనుసరించి ఆతడు భక్తునికి మిత్రునిగా, పుత్రునిగా లేదా ప్రియునిగా అవడానికి అంగీకరిస్తాడు. కాని తనను గురువుగా అంగీకరించగానే ఆతడు వెంటనే గురువులాగా గంభీరంగా శిష్యునితో కోరిన రీతిగా మాట్లాడాడు. అందరికీ లాభం కలిగే రీతిగా ఆ గురుశిష్యసంవాదము రెండు సేనల సమక్షంలో బాహాటంగా జరిగినట్లు కనిపిస్తున్నది. అంటే భగవద్గీతా వాక్కులు ఒకానొక వ్యక్తికి, సంఘానికి లేదా జాతికి చెందినవి గాక అందరి కొరకై ఉన్నాయి. శత్రుమిత్రులు ఇరువురు కూడ వాటిని వినడానికి సమానంగా ఆర్హులు.

శ్లోకము - 11
శ్రీభగవానువాచ
అశోచ్యానస్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసీ | 
గతాసూనగతాసూంశ్చ నానుశోచన్తి పణ్ణితాః || 

శ్రీభగవాన్ ఉవాచ - శ్రీభగవానుడు పలికాడు; అశోచ్యాన్ - దుఃఖింపదగని విషయము; అన్వశోదః - నీవు దుఃఖిస్తున్నావు; త్వం - నీవు; ప్రజ్ఞావాదాన్ - పాండిత్యముతో కూడిన మాటలు; - కూడ; భాషసీ - పలుకుతున్నావు; గత - పోయిన; అసూన్ - ప్రాణము; అగతా - పోనట్టి; అసూన్ - ప్రాణము; - కూడ; న అనుశోచన్తి  - దు:ఖించరు; పణ్ణితాః - పండితులు.

శ్రీభగవానుడు పలికాడు : పాండిత్యముతో కూడిన మాటలు పలుకుతూనే నీవు దుఃఖించదగని విషయము గురించి దుఃఖిస్తున్నావు, వివేకవంతులు జీవించి ఉన్నవారి గురించి గాని, మరణించినవారి గురించి గాని దుఃఖించరు. 

భాష్యము : భగవానుడు వెంటనే గురుస్థానాన్ని స్వీకరించి పరోక్షంగా మూర్ఖుడని పిలుస్తూ శిష్యుడిని మందలిస్తున్నాడు. “నీవు పండితునిలాగా మాట్లాడుతున్నావు కాని పండితుడైనవాడు అంటే దేహమంటే ఏమిటో, ఆత్మ అంటే ఏమిటో తెలిసిన వాడు దేహము ప్రాణంతో ఉన్న స్థితికి గాని, మరణించిన స్థితికి గాని ఏ స్టితి కొరకు దుఃఖించడని తెలిసికోవడం లేదు" అని భగవానుడు పలికాడు.
   తరువాతి అధ్యాయాలలో వివరించబడినట్లు జ్ఞానమంటే భౌతికపదార్థము, ఆత్మ, ఈ రెండింటిని నియంత్రించేవాడిని తెలిసికోవడమని అర్థం. రాజకీయాలు లేదా సామాజిక పరిస్థితుల కంటే ధర్మానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలని అర్జునుడు వాదించినా భౌతికపదార్థము, ఆత్మ, భగవంతుని గురించిన జ్ఞానము ధర్మసూత్ర సముదాయము కంటే ఇంకా ఎక్కువ ముఖ్యమైనదని తెలిసికోలేదు. అటువంటి జ్ఞానము లోపించిన కారణంగా తనను గొప్ప పండితునిగా అతడు చెప్పుకోకుండ ఉండవలసింది. గొప్ప పండితుడు కాకపోవడం వలననే అతడు దుఃఖింపదగని విషయము గురించి దుఃఖిస్తున్నాడు. దేహము పుట్టి ఇవాళ, రేపో నశించిపోతుంది. కనుక అది ఆత్మ యంతగా ముఖ్యమైనది కాదు. ఇది తెలిసినవాడే నిజంగా పండితుడు. భౌతికదేహ స్థితి ఎట్లా ఉన్నప్పటికిని అది అతనికి దుఃఖకారణము కాదు.'భగవద్గీత' యధాతథము
'భగవద్గీత' యధాతథము - పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి »

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top