'భగవద్గీత' యధాతథము: రెండవ అధ్యాయము - " గీతాసారము " - Bhagavad Gita' Yadhatathamu - Chapter Two, Page-9

'భగవద్గీత' యధాతథము: రెండవ అధ్యాయము - " గీతాసారము " - Bhagavad Gita' Yadhatathamu - Chapter Two, Page-9
కృష్ణార్జునులు

శ్లోకము - 22
వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోకపరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణాన్య
అన్యాని సంయాతి నవాని దేహీ ||

వాసాంసి - వస్త్రాలు; జీర్ణాని - పాతవి, చిరిగినవి; యథా - వలె; విహాయ - విడిచి; నవాని - క్రొత్త వస్త్రాలు; గృహ్ణాతి -  స్వీకరిస్తాడు; నరః - మనిషి; అపరాణి - వేరేవి; తథా - అదేవిధంగా; శరీరాణి - దేహాలను; విహాయ - విడిచి; జీర్ణాని - ముసలివి, పనికిరానివి; అన్యాని - వేరే; సంయాతి - నిజంగా స్వీకరిస్తాడు; నవాని - క్రొత్తవాటిని; దేహీ- దేహధారి.

మనిషి పాతవస్త్రాలను విడిచి క్రొత్త వస్త్రాలను ధరించినట్లుగా ఆత్మ ముదుసలిని, పనికిరానివియైన దేహాలను విడిచి క్రొత్త భౌతికదేహాలన స్వీకరిస్తుంది.

బాష్యము : వ్యక్తిగత అణు ఆత్మ దేహం మార్చడమనేది అంగీకరించబడిన యథార్థము. ఆత్మ ఉనికిని విశ్వసించకుండ, అదే సమయంలో హృదయము నుండి శక్తి ఎలా వస్తున్నదో వివరింపలేనట్టి నవీన శాస్త్రజ్ఞులైనా దేహంలో కలిగే నిరంతర మార్పులను అంగీకరించవలసి ఉంటుంది. ఆ మార్పులు పసితనము నుండి బాల్యము వరకు బాల్యము నుండి యౌవనము వరకు, తిరిగి యౌవనము నుండి ముసలితనము వరకు కలుగుతూ ఉంటాయి. ముసలితనము నుండి మార్పు వేరొక దేహములోకి కలుగుతుంది. ఇది కడచిన శ్లోకంలో (2.13) ఇదివరకే వివరించబడింది. 
  వ్యక్తిగత అణు ఆత్మ వేరొక దేహంలోకి వెళ్ళడము పరమాత్ముని కరుణచే సాధ్యపడుతుంది. ఒక మిత్రుడు వేరొక మిత్రుని కోరికను తీర్చే విధంగా పరమాత్ముడు ఆణు ఆత్మ కోరికను తీరుస్తాడు. ముండకోపనిషత్, అలాగే శ్వేతాశ్వతరోపనిషత్ వంటి వేదాలు ఆత్మను, పరమాత్మను ఒకే చెట్టుపై కూర్చున్న రెండు మిత్రపక్షులతో పోల్చాయి. ఆ పక్షులలో ఒకటి (వ్యక్తిగత అణు ఆత్మ) చెట్టు ఫలాలను తింటున్నది. కాగా ఇంకొక పక్షి (శ్రీకృష్ణుడు) కేవలము తన మిత్రుని చూస్తున్నది. ఈ రెండు పక్షులు గుణరీత్యా సమానమేయైనా వాటిలో ఒకటి భౌతికవృక్ష ఫలాలచే ఆకర్షితమైంది, కాగా ఇంకొకటి కేవలము తన మిత్రుని కలాపాలను చూస్తున్నది. శ్రీకృష్ణుడు సాక్షియైన వక్షి, కాగా అర్జునుడు ఆరగించే పక్షి. ఇద్దరు మిత్రులేయైనా అందులో ఒకడు ప్రభువు, ఇంకొకడు సేవకుడు.
   అణుఆత్మ ఈ సంబంధాన్ని మరచిపోవడమే అది ఒక చెట్టు నుండి వేరొక మీదకు లేదా ఒక దేహము నుండి వేరొక దేహానికి తన స్థానాన్ని మార్చడానికి కారణం. భౌతికదేహమనే చెట్టు మీద జీవాత్మ తీవ్రంగా ప్రయాసపడుతోంది. కాని ఉపదేశాన్ని పొందడం కొరకు అర్జునుడు స్వచ్ఛందంగా శ్రీకృష్ణునికి శరణాగతుడైనట్లుగా అది వేరొక పక్షిని పరమగురువుగా అంగీకరించగానే సమస్త దుఃఖాల నుండి బయటపడుతుంది. ముండకోపనిషద్ (3.1.2), శ్వేతాశ్వతరోపనిషద్ (4.7) రెండు కూడ ఈ క్రింది విషయాన్ని ధ్రువపరిచాయి.

నమానే వృక్షే పురుషో నిమగ్నో నీశయా శోచతి ముహ్యమానః |
జుష్టం యదా పశ్య త్యన్యమీశం అస్య మహిమానమితి వీతశోకః ||

రెండు పక్షులు ఒకే చెట్టు పై ఉన్నప్పటికిని చెట్టు ఫలాలను తింటున్న పక్షి వృక్షఫలభోక్తగా పూర్తి చింతలో, దు:ఖంలో ఉంది. కాని ఆ దుఃఖిత పక్షి ఏదో విధంగా భగవంతుడైన తన మిత్రుని వైపుకు ముఖం త్రిప్పి ఆతని మహిమలను తెలిసికొంటే వెంటనే సమస్త క్లేశాల నుండి విడివడుతుంది. అర్జునుడు ఇప్పుడు తన నిత్యమిత్రుడైన శ్రీకృష్ణుని వైపుకు తిరిగి ఆతని నుండి భగవద్గీతను అర్థం చేసికొంటున్నాడు, ఆ విధంగా అతడు విని భగవంతుని పరమ వైభవాన్ని తెలిసికొని శోకముక్తుడౌతాడు.
   పితామహునికి, గురువుకు కలిగే దేహమార్పు గురించి శోకించవద్దని ఇక్కడ అర్జునుడు భగవానునిచే ఉపదేశించబడ్డాడు. పైగా ధర్మయుద్ధంలో వారి దేహాలను సంహరించడానికి అతడు ఆనందించాలి. ఆ ప్రకారంగా వారు నానారకాలైన దేహ కలాపాల వలన కలిగిన సమస్త ఫలాల నుండి వెంటనే ముక్తులౌతారు. బలిపీఠం మీద లేదా యుద్ధరంగంలో దేహాన్ని త్యజించేవాడు శీఘ్రమే అన్ని శారీరిక ప్రతిచర్యల నుండి శుద్ధిపడి ఉన్నత జీవనస్థితిని పొందుతాడు. కనుక అర్జునుని శోకానికి ఎటువంటి కారణము లేదు.

శ్లోకము - 23
నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం ధహతి పావకః | 
న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః || 

నైనం - ఈ ఆత్మను; న ఛిన్దన్తి - ముక్కలు చేయలేవు; శస్తాణి - ఆయుధాలు; ఏనం - ఈ ఆత్మను; న దహతి - కాల్చదు; పావకః - అగ్ని; ఏనం - ఈ ఆత్మను; - కూడ; - క్లేదయన్తి - తడుపలేదు; ఆపః - నీరు; న శోషయతి - ఎండింపదు; మారుతః - గాలి.

ఆత్మ ఎట్టి ఆయుధము చేతను ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే ఎండిపోదు.

భాష్యము : ఖడ్గములు, ఆగ్నేయాస్త్రాలు, వారుణాస్త్రాలు, వాయవ్యాస్త్రాలు వంటి ఎన్ని రకాల ఆయుధాలైనా ఆత్మను చంపలేవు. నవీన అగ్ని ఆయుధాలతో పాటుగా భూమి, జలము, వాయువు, ఆకాశముతో తయార్డెన నానారకాలైన అస్త్రాలు ఉన్నట్లు కనిపిస్తున్నది. నవీనకాలానికి చెందిన అణ్వస్త్రాలు అగ్ని ఆయుధాల కోవకు చెందినవే కాని పూర్వము నానారకాల భౌతిక తత్త్వాలతో తయారైన ఇతర ఆయుధాలు కూడ ఉండేవి. అగ్ని ఆయుధాలు నీటి ఆయుధాలచే భంగపరచబడతాయి. అవి ఇప్పుడు నవీన విజ్ఞానశాస్త్రానికి తెలియవు. అంతేగాక వాయవ్యాస్త్రాల జ్ఞానం కూడ నవీన శాస్త్రజ్ఞులకు | లేదు, ఏది ఏమైనా ఎన్ని ఆయుధాలతోనైనా, అవి ఎంతటి వైజ్ఞానిక పరికరాలైనప్పటికిని ఆత్మ ముక్కలు చేయబడదు, నశింపజేయబడదు. 
   వ్యక్తిగతఆత్మ కేవలము అజ్ఞానము వలన ఏ విధంగా ఉనికిలోకి వచ్చి తత్ఫలితంగా మాయచే కప్పబడుతుందో మాయావాది వివరించలేడు. అలాగే వ్యక్తిగత అత్మలను మూల భగవంతుని నుండి ఖండించడము కూడ సాధ్యమయ్యేది కాదు. పైగా వారు శాశ్వతంగా భగవంతుని నుండి వేరు చేయబడిన అంశలే. వారు శాశ్వతంగా (సనాతనము) వ్యక్తిగత అణుఆత్మలైన కారణంగా మాయచే కప్పబడతారు. అగ్నికణాలు, అగ్ని గుణమునే కలిగి ఉన్నప్పటికిని అగ్ని నుండి వేరు కాగానే ఆరిపోయినట్లు వారు ఆ విధంగా భగవంతుని సాంగత్యం నుండి విడిపోతారు.
   వరాహపురాణంలో జీవులు విడివడిన భగవదంశలుగా వర్ణించబడ్డారు. భగవద్గీత ప్రకారము కూడ వారు నిత్యము అదేవిధంగా ఉన్నారు. కనుక మాయ నుండి ముక్తిని పొందిన తరువాత కూడ జీవుడు వేరుగా నిలిచి ఉంటాడు. అర్జునునికి భగవంతుడు చేసిన ఉపదేశాల ద్వారా ఇది నిరూపితమౌతున్నది. కృష్ణుని నుండి పొందిన జ్ఞానంతో అర్జునుడు ముక్తుడయ్యాడే గాని శ్రీకృష్ణునితో ఏనాడూ ఏకము కాలేదు.'భగవద్గీత' యధాతథము
'భగవద్గీత' యధాతథము - పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి »

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top