![]()  | 
| Sri Lalita Devi ! | 
: శ్రీలలితాసహస్రనామ పారాయణ విశిష్టత :
శ్రీలలితాసహస్రనామము బ్రహ్మాండపురాణములోని లలితోపాఖ్యానమునందు వివరింపబడియున్నది. శ్రీమాత ప్రాదుర్భావమునూ, ప్రభావమునూ వినిన తరువాత, అగస్త్యుడు ఆ తల్లి లాలిత్యమును స్మరించేందుకు నామతారకము అనుగ్రహింపవలయునదిగా హయగ్రీవుని కోరెను. ఏ పేరుతో పిలిచినచో ఆ తల్లి పలుకునో, ఆ నామములన్నియు హయగ్రీవుని అశ్వకంఠము నుండి ఆశువుగా వెలువడినవి. ఈ నామ సంగ్రహమే లలితాసహస్రనామము. 
   దీనినే హయగ్రీవుడు “రహస్యనామ సాహస్రం'గా సంబోధించెను. ఈ వేయినామములు శ్రీమాత యొక్క చిద్విలాసమును తెలియజేయును. ప్రతి నామము శ్రీలలితాదేవియొక్క 'పతికృతియే'.
శ్రీలలితాసహస్రనామము  _ మాతృమూర్తిని స్మరిస్తూ “శ్రీమాతా'' నామముతో ఆరంభమవుతుంది. మాతృభావముతో దేవిని ధ్యానించుట వలన సామాన్యముగా ఇటువంటి ఉపాసనలో సంభవించెడి ప్రమాదములు, ఇక్కట్లు రాకుండా. శ్రీరామరక్ష లభిస్తుంది. త్రికరణశుద్ధిగా శ్రీమాతను నమ్మి
ఆరాధించినవారికి ఆమె కారుణ్యము, వాత్సల్యము, అనుగ్రహము తప్పక లభించును. ఈ సహ(స్రనామమును చదివితే జీవితము తరించునని పరిపరివిధాల హయగీవుడు వివరించెను. అపమృత్యువు పోతుందట- ఆయుష్యం పెరుగుతుందట-ఆరోగ్యం చేకూరుతుందట-ఒక్క నామము జపించిననూ పాపములు తొలగిపోవునట! ఆత్మసాక్షాత్కారము పొందుటకు లలితా సహస్రనామ పారాయణమే ఉత్తమమైన మార్గమని ఫలశ్రుతి ఇట్లు చెప్పుచున్నది -
రహస్యానాం రహస్యం చ లలితా ప్రీతిదాయకమ్ | 
అనేన సదృశం స్తోత్రం న భూతం న భవిష్యతి ||
(ఈ _ లలితాసహ(స్రనామములు లలితాదేవికి ప్రీతిదాయకములు. ఈ స్తోతమునకు సమానమైనది ఇంత వరకూ 'లేదు-ఇక మీద ఉండబోదు.)
సమస్త వ్యాధులను పోగొట్టునది,. సకల మృత్యునివారణి శ్రీలలితాదేవి. కలియుగమున కల్మషమును అపహరించునది ఆ జనని. ఆమె అగ్రగణ్య. అచింత్యమగు గొప్ప రూపముతో విరాజిల్లునది “శ్రీమాతా” యనునది లలితాసహస్రనామవచనము. సమస్త భోగములను, వరములను ఇచ్చే శ్రీమాత కోరికలకు, వరములకు అధీశ్వరి. నిత్య పూజాపారాయణమునకు యోగ్యమయిన అంశములన్నియును సమగ్రముగా పొందుపరచిన ఈ గ్రంథయజము భక్తుల హృదయదీపికగా వలుగొందునని భావించుచుంటిని. సాధకలోకము, భక్తగణములు ఈ స్నోతరాజమును భక్తి శ్రద్దలతో పఠించి శ్రీలలితాపరమేశ్వరి యొక్క అనుగ్రహముచే, ఆయురారోగ్య ఐశ్వర్యములను. సుఖశాంతి అభ్యుదయములను, సర్వాభీష్టములను పొంది తరించుదురని ఆశించుచుంటిని.
||  లోకా సృమస్తా స్సుఖినో భవంతు ||
||  ఓం తత్ సత్ ||
---------------------------------------
పూజకు కావలసిన వస్తు సంచయము :
పసుపు, కుంకుమ, అక్షతలు, గంధము, కర్చూరము, బియ్యపుపిండి. పూవులు, పత్తి వస్త్రములు, పత్తి యజ్ఞోపవీతములు, నైవేద్యమునకు:- బెల్లపుముక్క, నెయ్యి, పెరుగు, పంచదార, తేనె ఆవుపాలు, వత్తులు, అగ్గిపెట్టె, మామిడి మండలు, తమలవాకులు, వక్కలు, కొబ్బరికాయలు (కొబ్బరికాయ కొట్టుటకు రాయి, ఫలోదకమునకు పాత్ర), పళ్లు, అగరువత్తులు, సాంబ్రాణి,  పటమీదికి తుండు, తుడుచుకొనుటకు శుభ వస్త్రము, అమ్మవారి చిత్రపటము, గంట జలపాత్ర, ఉద్దరిణి, అరివాణము, ఎకహారతి, పంచహారతి, కలశము, అర్ఘ్యపాద్యాదులకు పాత్రలు, నైవేద్యముంచుటకు పాత్ర, కుందులు (వాని అడుగునకు ప్లేట్లు), జలము. 
అమ్మవారి తాంబూలమునకు కావలసిన వస్తువులు - ఏలకులు, లవంగములు, పచ్చకర్పూరము, కస్తూరి, కుంకుమపువ్వు, జాజికాయ, జాపత్రి, వక్కలు, చలవ మిరియాలు, తమలవాకులు, కాచు (ఖదిరనారలి).
సూచనలు :
సంకల్పమునందు ఉదాహరించవలసిన అయనములు, బుతువులు, మాసములు, పక్షములు మరియు తెలుగు తిథులు, వారములు వాటికి సప్తమీవిభక్తిలో చెప్పవలసిన సరియగు పదములు ఈ _ దిగువున పొందుపరచబడినవి.
అయనములు :
1. ఉత్తరాయణము - మకర సంక్రమణము నుండి కర్కాటక సంక్రమణము వరకు (ఉత్తరాయణ).
2. దక్షణాయణము - కర్కాటక సంక్రమణము నుండి మరల మకర సంక్రమణము వరకు (దక్షిణాయనే).
| మాసములు | బుతువులు | 
|---|---|
| 1. వైత్రము (చైత్ర మాసే) | వసంత బుతువు (వసంత బుతౌ) | 
| 2. వైశాఖము (వైశాఖ మాసే) | ----- | 
| 3. జ్యీష్టము (జ్యేష్ట మాసే) | (గీష్మ బుతువు (గ్రీష్మ బుతౌ) | 
| 4. ఆషాఢము (ఆషాఢ మాసే) | ----- | 
| 5. శ్రావణము (శ్రావణ మాసే) | వర్ష బుతువు (వర్ష బుతౌ) | 
| 6. భాద్రపదమ (భాద్రపద మాసే) | ----- | 
| 7. ఆశ్వయుజము (ఆశ్వయుజ మాసే) | శరద్ బుతువు (శరదృతా) | 
| 8. కార్తీకము (కార్తిక మాసే) | ---- | 
| 9. మార్గశిరము (మార్గశిర మాసే) | హేమంత బుతువు (హేమంత బుతెౌ) | 
| 10. పుష్యము (పుష్య మాసే) | ---- | 
| 11. మాఘము (మాఘ మాసే) | శిశిర బుతువు (శిశిర బుతౌ) | 
| 12. ఫాలుణము (ఫాల్గున మాసే) | ----- | 
| తెలుగు | సప్తమీవిభక్తిరూపం | 
|---|---|
| పాడ్యమి | ప్రతిపత్తిధౌ | 
| విదియ | ద్వితీయాయామ్ | 
| తదియ | తృతీయాయామ్ | 
| చవితి | చతుర్ధ్యామ్ | 
| పంచమి | పంచమ్యామ్ | 
| చవితి | చతుర్ధ్యామ్ | 
| షష్ఠి | షష్ట్యామ్ | 
| సప్తమి | సప్తమ్యామ్ | 
| అష్టమి | అష్టమ్యామ్ | 
| తెలుగు | సప్తమీవిభక్తిరూపం | 
|---|---|
| నవమి | నవమ్యామ్ | 
| దశమి | దశమ్యామ్ | 
| ఏకాదశి | ఎకాదశ్యామ్ | 
| ద్వాదశి | ద్వాదశ్యామ్ | 
| త్రయోదశి | త్రయోదశ్యామ్ | 
| చతుర్దశి | చతుర్దశ్యామ్ | 
| పూర్ణిమ | పౌర్దిమాస్యాయామ్ | 
| అమావాస్య | అమావాస్యాయామ్ | 
| తెలుగు | సప్తమీవిభక్తిరూపము | 
|---|---|
| ఆదివారము | భాను వాసరే | 
| సోమవారము | ఇందు వాసరే | 
| మంగళవారము | భామ వాసరే | 
| బుధవారము | సౌమ్య వాసరే | 
| గురువారము | బృహస్పతి వాసరే | 
| శుక్రవారమ | భృగువాసరే | 
| శనివారము | స్టిరవాసరే | 
|| ఓ౦||
శుచిమర్జనం :-  (కుడిచేయివైపున పంచపాత్ర. అందులో జలం పోసి, తులసి ఆకుల గుత్తి కాని,  మామిడి ఆకు మజియు ఉద్ధరిణి ఉండాలి)
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతో౭పి వా,
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః
(దీనిని పఠించుచు అర్హ్యపాత్రలోని జలమును మూడు మారులు “పుండరీకాక్ష' అనుచు శిరసుపై చల్లుకొనవలెను)
జ్యోతిషాంపతయే తుభ్యం నమో రామాయ వెధసే।
గృహాణ దీపకం వైవ కైైలోక్య తిమిరాపహ (అని చెప్పుచూ దీపారాధన చేయవలెను)
|| ధ్యానమ్ || 
శుక్లాంబరధరం విష్టుం శశివర్ణం చతుర్చుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || 
దేవీం వాచ మజనయంత దేవా స్తాం విశ్వరూపాః పశవో వదంతి
సా నో మంద్రేష మూర్జం దుహానా ధేనుః వా గస్మా నుపసుష్టు కైతు
య శ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్పుంసాం సర్వతో జయమంగళమ్ |
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం, దైవబలం తదేవ, లక్ష్మీపతే తేం౭ఘియుగం స్మరామి || 
సర్వదా సర్వ కార్వేషు నాస్తి తేషా మమజలమ్ |
యేషాం హృదిస్థో - భగవాన్, మాజ్ఞభాయతనం హరిః ||
లాభ స్తేషాం, జయస్తేషాం, కుతస్తేషాం పరాభవః |
యేషా మిస్టీవరశ్యామో, హృదయస్టో జనార్దనః || 
ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ || 
సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే |
శరణ్యే త్ర్యంబకే దేవి! నారాయణి! నమోస్తు తే ||
దేహో దేవాలయః ప్రోక్షో జీవో దేవ సనాతనః |
త్యబే దజ్ఞాన నిర్మాల్యం సో౭౬హం భావెన పూజయేత్ ||
సుముఖ శ్రైకదంత శృ కపిలో గజకర్ణికః
లంబోదర శృ వికటో విఘ్నరాజో గణాధిపః |
ధూమకేతు ర్లణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః |
వక్రతుండః శూర్చుకర్ణో హరమృః స్కన్ద పూర్వజః ||
షోడశైతాని నామాని యః పలేచ్చుణుయా దపి |
విద్యారంభే వివాహే చ ప్రవెశే నిర్గమె తథా ||
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే
అభిప్సితార్థ సిద్ధ్యర్ధం పూజితో యస్సురైరపి |
సర్వవిఘ్నచ్చిదే తస్మై శ్రీ గణాధిపతయే నమః ||
హే ఘంటే! సుస్వరే! రమ్యే! ఘంటా ధ్వని విభూషితే! |
నాదయన్తం పరానందం ఘంటా దేవీం ప్రపూజయే || (అని ఘంటను పూజించవలెను)
శ్రీలలితాసహస్రనామ పారాయణ విశిష్టత - 2డవ భాగము »》








