'భగవద్గీత' యధాతథము: రెండవ అధ్యాయము - " గీతాసారము " - Bhagavad Gita' Yadhatathamu - Chapter Two, Page-23

'భగవద్గీత' యధాతథము: రెండవ అధ్యాయము - " గీతాసారము " - Bhagavad Gita' Yadhatathamu - Chapter Two, Page-23

శ్లోకము - 63
క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః |
స్మృతి భ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్రణశ్యతి ||

క్రోధాత్ - కోపము నుండి; భవతి - ఉత్పన్నమౌతుంది; సమ్మోహః - పూర్తి మోహము; సమ్మోహాత్ - మోహము నుండి; స్మృతి - జ్ఞాపకశక్తి; విభ్రమః - దిగ్భమము; స్మృతి భ్రంశాశ్ - జ్ఞాపకశక్తి దిగ్రమకు లోనైన తరువాత; బుద్ధినాశః - బుద్ధి నశింపు; బుద్ధి నాశాత్ - బుద్ధి నాశము వలన; ప్రణశ్యతి - మనిషి పతనము చెందుతాడు.

క్రోధము నుండి పూర్తి మోహము ఉత్పన్నమౌతుంది, మోహము నుండి స్మృతి భ్రమ కలుగుతుంది. స్మృతి భ్రమించినప్పుడు బుద్ధి నశిస్తుంది. ఇక బుద్ధి నశించినప్పుడు మనిషి తిరిగి సంసార గరములో పడిపోతాడు.

భాష్యము : శ్రీల రూపగోస్వామి మనకు ఈ నిర్దేశము ఇచ్చారు :
ప్రాపంచికత, బుద్ధ్యా హరిసంబంధివస్తునః |
ముముక్షుభి: పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే ||
                              (భక్తిరసామృతసింధువు 1.2.258)

ప్రతీదీ భగవత్సేవలో తన ఉపయోగాన్ని కలిగి ఉంటుందనే విషయాన్ని మనిషి కృష్ణ భక్తి భావనను పెంచుకోవడం ద్వారా తెలిసికోగలుగుతాడు. కృష్ణభక్తిభావన జ్ఞానం లేనట్టివారు భౌతికవస్తువులను కృత్రిమంగా త్యజించే యత్నం చేస్తారు. తత్ఫలితంగా వారు భవబంధ విముక్తిని వాంఛించినా వైరాగ్యములో పరిపూర్ణస్థితిని పొందలేరు. వారి నామమాత్ర వైరాగ్యము ఫల్గు లేదా అప్రధానమైనదిగా పిలువబడుతుంది. ఇంకొక ప్రక్క కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి ప్రతీదానిని భగవత్సేవలో వాడే పద్ధతిని ఎరిగి ఉంటాడు. అందుకే అతడు భౌతికభావనకు బలి కాడు. ఉదాహరణకు నిరాకారవాది భావనలో భగవంతుడు (పరతత్త్వము) రూపరహితుడు కనుక భోజనం చేయడు. అందుకే నిరాకారవాది రుచికరమైన ఆహారపదార్థాలను త్యజించడానికి యత్నిస్తాడు; కాగా భక్తుడు శ్రీకృష్ణ భగవానుడు పరమభక్త యని, భక్తితో నైవేద్యము పెట్టినదంతా తింటాడని ఎరిగి ఉంటాడు. కనుక భగవానునికి మంచి ఆహారపదార్థాలు నైవేద్యం పెట్టిన తరువాత అతడు భుక్తశేషాన్ని, అంటే ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. ఆ విధంగా ప్రతీదీ ఆధ్యాత్మికము కావించబడుతుంది, ఇక అప్పుడు పతనమనే ప్రమాదం ఉండదు. భక్తుడు కృష్ణ భక్తి భావనలో ప్రసాదం తీసికొంటాడు; కాగా అభక్తుడు దానిని భౌతికమైనదిగా త్యజిస్తాడు. అందుకే నిరాకారవాది తన కృత్రిమ వైరాగ్యము వలన జీవితాన్ని అనుభవించలేడు. ఈ కారణంగానే మనస్సు కొద్దిగా చలించినా అది అతనిని తిరిగి సంసారగరంలోకి లాగివేస్తుంది. అటువంటి జీవుడు ముక్తిస్థితి వరకు ఎదిగినా భక్తియుతసేన ఆధారము లేని కారణంగా తిరిగి పతనము చెందుతాడని చెప్పబడింది.

శ్లోకము - 64
రాగద్వేషవిముకైస్తు విషయానిన్షియైశ్చరన్ |
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి ||

రాగ - అనురాగము; ద్వేష - విరక్తి; విముక్యైః - వాటి నుండి విడివడినవానికి; తు - కాని; విషయాన్ - ఇంద్రియార్థాలు; ఇన్ద్రియైః - ఇంద్రియాలచే; చరన్ - పనిచేస్తూ; ఆత్మవశ్వైః - ఆధీనములో ఉండి; విధేయాత్మా - నియమిత స్వేచ్ఛను పాటించేవాడు; ప్రసాదం - భగవత్కరుణను; అధిగచ్ఛతి - పొందుతాడు.

కాని సమస్త రాగద్వేషాల నుండి విడివడినవాడు, స్వేచ్చా నియమాల ద్వారా తన ఇంద్రియాలను నిగ్రహించగలిగినవాడు అయిన వ్యక్తి భగవానుని పూర్తి కరుణను ఆదాయం.

భాష్యము : మనిషి ఏదో కృత్రిమ పద్ధతి ద్వారా బాహ్యానికి ఇంద్రియాలను నిగ్రహించినా వాటిని దివ్యమైన భగవత్సేవలో నెలకొల్పకపోతే పతనానికి అవకాశం ఉన్నదని ఇదివరకే వివరించబడింది. పూర్తిగా కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి బాహ్యానికి ఇంద్రియస్థాయిలో ఉన్నట్లు కనిపించినా కృష్ణ భక్తుడైన కారణంగా ఇంద్రియ కలాపాల పట్ల అనురక్తిని కలిగి ఉండడు. కృష్ణభక్తి భావనలో ఉన్నవాడు కేవలము కృష్ణ సంతృప్తితోనే అక్కరను కలిగి ఉంటాడు గాని ఇంక దేనితోను కాదు. అందుకే అతడు సమస్త రాగద్వేషాలకు అతీతుడై ఉంటాడు. శ్రీకృష్ణుడు కోరితే భక్తుడు సామాన్యంగా అవాంఛితమైనట్టి దేనినైనా చేస్తాడు; ఒకవేళ శ్రీకృష్ణుడు కోరకపోతే సామాన్యంగా తన ప్రీత్యర్ధము చేసే దానినైనా చేయడు. అంటే అతడు శ్రీకృష్ణుని నిర్దేశంలోనే పనిచేస్తాడు కనుక చేయడం లేదా చేయకపోవడం అనేది అతని ఆధీనములోనే ఉంటుంది. ఈ చైతన్య స్థితి భగవంతుని నిర్ణేతుక కరుణ. భక్తుడు ఇంద్రియ స్థితికి అనురక్తుడై ఉన్నప్పటికిని దీనిని పొందగలుగుతాడు.

శ్లోకము - 65
ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే |
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్టతే ||

ప్రసాదే - భగవానుని నిర్ణేతుక కరుణను పొందగా; సర్వ - అన్ని; దుఃఖానాం - భౌతికక్లేశాల; హానిః - నశింపు; అస్య - అతనికి; ఉపజాయతే - కలుగుతుంది; ప్రసన్న చేతసః - ప్రసన్నమైన మనస్సుతో; హి - నిక్కముగా; ఆశు - శీఘ్రమే; బుద్ధిః - బుద్ధి; పరి - తగినంతగా; అపతిష్ఠతే - సుస్థిరమౌతుంది.

ఈ విధంగా (కృష్ణ భక్తి భావనలో) సంతుష్టుడైనవానికి భౌతిక అస్తిత్వపు త్రివిధ తాపాలు ఏమాత్రము కలుగవు. అటువంటి సంతుష్ట చైతన్యంలో మనిషి బుద్ధి శీఘ్రమే సుస్థిరమౌతుంది.

శ్లోకము - 66
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా |
న చాభావయతః శాస్త్రశాస్తస్య కుతః సుఖం ||

న అస్తి - ఉండదు; బుద్ధిః - దివ్యమైన బుద్ధి; అయుక్తస్య - (కృష్ణ భక్తిభావనతో) సంబంధము లేనివానికి; - ఉండదు; - మరియు; అయుక్తస్య - కృష్ణ భక్తి భావన లేనివానికి; భావనా - (ఆనందముతో) స్థిరమైన మనస్సు; - ఉండదు; - మరియు; అభావయతః - స్థిరుడు కానివానికి; శాన్తిః - శాంతి; అశాన్తస్య - శాంతి లేనివానికి; కుతః - ఎక్కడ; సుఖం - సుఖము.

(కృష్ణ భక్తి భావనలో) భగవానునితో సంబంధము లేనివానికి దివ్యమైన బుద్ధి గాని, స్థిరమైన మనస్సు గాని ఉండదు. అవి లేనిదే శాంతికి అవకాశమే లేదు. ఇక శాంతి లేకుండ సుఖమెట్ల కలుగుతుంది?

భాష్యము : మనిషి కృష్ణ భక్తి భావనలో లేకపోతే శాంతికి అవకాశమే లేదు. శ్రీకృష్ణుడే యజ్ఞ తపస్సుల సమస్త ఫలభక్త యని, ఆతడే సకల విశ్వసృష్టులకు అధిపతి యని, సకల జీవులకు ఆతడే నిజమైన మిత్రుడని మనిషి అర్థం చేసికొన్నప్పుడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగుతాడని ఐదవ అధ్యాయంలో (5.29) ధ్రువపరుపబడింది.
   కనుక మనిషి కృష్ణభక్తి భావనలో లేకపోతే మనస్సుకు ఒక చరమలక్ష్యమే ఉండదు. చరమలక్ష్యము లేకపోవడమే కలతకు కారణము. శ్రీకృష్ణుడే ఎల్లరకు, ప్రతీదానికీ భోక్తయని, అధిపతి యని, మిత్రుడని మనిషి నిశ్చయించుకొన్నప్పుడు స్థిరమైన మనస్సుతో శాంతిని పొందగలుగుతాడు. కనుక శ్రీకృష్ణునితో సంబంధము లేకుండ ఉండేవాడు జీవితంలో శాంతి, ఆధ్యాత్మికప్రగతి ఉన్నట్లు ఎంతగా ప్రదర్శించినా నిక్కముగా సర్వదా దుఃఖంలోనే, శాంతిరహితంగానే ఉంటాడు. కృష్ణ భక్తి భావన అనేది స్వయంగా ప్రకటమయ్యే శాంతిమయ స్థితి. అది కేవలము శ్రీకృష్ణునితో సంబంధములోనే లభిస్తుంది.

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top