'భగవద్గీత' యధాతథము: రెండవ అధ్యాయము - " గీతాసారము " - Bhagavad Gita' Yadhatathamu - Chapter Two, Page-24

0
'భగవద్గీత' యధాతథము: రెండవ అధ్యాయము - " గీతాసారము " - Bhagavad Gita' Yadhatathamu - Chapter Two, Page-24

శ్లోకము - 70

ఆపూర్యమాణమచలప్రతిష్ఠం 
సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్ |
తద్వత్ కామా యం ప్రవిశన్తి సర్వే
స శాన్తిమాప్నోతి న కామకామీ ||

ఆపూర్యమాణం - ఎల్లప్పుడు నింపబడుతూ; అచలప్రతిష్ఠం - స్థిరంగా ఉండే; సముద్రం - సముద్రము; ఆపః - జలాలు; ప్రవిశన్తి - ప్రవేశించడం; యద్వత్ - వలె; తద్వత్ - ఆ రీతిగా; కామాః - కోరికలు; యం - ఎవ్వనిలో; ప్రవిశని - ప్రవేశించి; సర్వే - అన్ని; సః - ఆ వ్యక్తి; శాన్తి - శాంతిని; ఆప్నోతి - పొందుతాడు; - కాదు; కామకామీ - కోరికలను తీర్చుకోవాలనుకునేవాడు.

సర్వదా నింపబడుతున్నా ఎప్పటికీ నిశ్చలంగా ఉండే సముద్రంలోకి నదులు ప్రవేశించినట్లుగా కోరికల నిరంతర ప్రవాహముచే కలత చెందనివాడే శాంతిని పొందగలడు గాని అట్టి కోరికలను తీర్చుకోవడానికి యత్నించేవాడు కాదు.

భాష్యము : విశాలమైన సముద్రము సర్వదా నీటితో నిండి ఉన్నప్పటికిని ఎల్లప్పుడు, ముఖ్యంగా వర్షాకాలంలో ఇంకా ఎక్కువ నీటితో నింపబడుతూ ఉంటుంది. అయినా అది ఎప్పటిలాగే స్థిరంగా ఉంటుంది. అది చలింపకుండ ఉంటుంది, చెలియలికట్టనైనా దాటదు. ఇది కృష్ణ భక్తిభావనలో స్థిరుడైన వ్యక్తి విషయంలో కూడ సత్యమై ఉంటుంది.
   మనిషికి దేహము ఉన్నంతవరకు ఇంద్రియభోగ దేహావసరాలు కొనసాగుతాయి. అయినా భక్తుడు తన పూర్ణత్వం కారణంగా అటువంటి కోరికలచే కలతచెందడు. భగవంతుడే సమస్త భౌతికావసరాలను తీర్చే కారణంగా కృష్ణ భక్తి భావనలో ఉన్నవానికి ఏదీ అవసరము ఉండదు. అందుకే అతడు సముద్రము వంటివాడు, అంటే సర్వదా తనలో పూర్ణుడై ఉంటాడు. సముద్రంలో ప్రవేశించే నదీజలాలలాగా కోరికలు చెంతకు చేరినా తన కలాపాలలో అతడు స్థిరునిగా ఉంటాడు. ఇంద్రియభోగ కోరికలచే అతడు కించిత్తైనా కలత చెందడు. కృష్ణభక్తి భావనలో ఉన్నవానికి, అంటే కోరికలు ఉన్నప్పటికిని ఇంద్రియభోగ అపేక్ష తొలగినవానికి ఇదే నిదర్శనము. భగవంతుని దివ్యమైన ప్రేమయుతసేవలో సంతుష్టుడై ఉండే కారణంగా అతడు సముద్రములాగా స్థిరుడై ఉంటాడు. కనుక అతడు పూర్ణశాంతిని అనుభవిస్తాడు. కాని లౌకిక విజయము మాట అటుంచి, ముక్తి పర్యంతము కోరికలను తీర్చుకోవాలనుకునే ఇతరులు ఏనాడూ శాంతిని పొందరు. కామ్యకర్మరతులు, మోక్షకాములు, సిద్ధులను పొందగోరే యోగులు కూడ తీరని కోరికల కారణంగా అశాంతులే అయి ఉంటారు. కాని కృష్ణ భక్తి భావనలోని వ్యక్తి భగవత్సేవలో సుఖియై ఉంటాడు. అతనికి కోరికలు ఉండవు. నిజానికి అతడు నామమాత్ర భవబంధము నుండి ముక్తినైనా కోరడు. కృష్ణ భక్తులకు భౌతికవాంఛలు ఉండవు. అందుకే వారు పరిపూర్ణశాంతితో ఉంటారు.

శ్లోకము - 71

విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః |
నిర్మమో నిరహంకారః స శాన్తిమధిగచ్ఛతి ||

విహాయ - విడిచిపెట్టి; కామాన్ - ఇంద్రియ భోగ కోరికలను; యః - ఎవ్వడు; సర్వాన్ - అన్ని; పుమాన్ - మనిషి; చరతి - జీవిస్తాడో; నిస్పృహః - కోరికలు లేకుండ; నిర్మము - స్వామ్యభావన లేకుండ; నిరహంకారః - అహంకార రహితునిగా; సః - అతడు; శాస్త్రం - పూర్ణశాంతిని; అధిగచ్ఛతి - పొందుతాడు.

సమస్త ఇంద్రియభోగ కోరికలను విడిచిపెట్టినవాడు, కోరికల నుండి విడివడి జీవించేవాడు, సమస్త స్వామ్యభావమును త్యజించినవాడు, మమకార రహితుడు అయిన వ్యక్తి మాత్రమే నిజమైన శాంతిని పొందగలడు.

భాష్యము : కోరికలు లేకపోవడమంటే ఇంద్రియభోగానికి ఏదీ కోరకపోవడమని అర్థం. అంటే కృష్ణ భక్తి భావనలో ఉండాలనే కోరిక నిజానికి కోరికలు లేకపోవడమే అవుతుంది. ఈ భౌతికదేహమే తానని మిథ్యగా పలకకుండ, ఈ ప్రపంచంలో దేని మీద కూడ మిథ్యా స్వామ్యభావన లేకుండ శ్రీకృష్ణుని నిత్యదాసునిగా నిజమైన స్థితిని అర్థం చేసికోవడమే.
   కృష్ణ భక్తి భావనలో పరిపూర్ణస్థితి. శ్రీకృష్ణుడే సమస్తానికీ యజమాని కనుక సమస్తాన్నీ కృష్ణప్రీత్యర్థము తప్పక ఉపయోగించాలని అట్టి పరిపూర్ణస్థితిలో నెలకొన్నవాడు తెలిసికొంటాడు. అర్జునుడు స్వీయేంద్రియ తృప్తి కారణంగానే యుద్ధం చేయగోరలేదు, కాని పూర్ణ కృష్ణ భక్తిభావనాయుతుడు అయినప్పుడు అతడు. శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని కోరాడు కనుక యుద్ధం చేసాడు. తన కొరకు యుద్ధం చేయాలనే కోరిక అతనికి లేదు. కాని శ్రీకృష్ణుని కొరకు అదే అర్జునుడు శక్త్యనుసారము యుద్ధం చేసాడు. కృష్ణప్రీతివాంఛయే నిజమైన వాంఛారాహిత్యము గాని కోరికలను నశింపజేయడానికి చేసే కృత్రిమ యత్నం కాదు. జీవుడు వాంఛారహితుడు గాని, ఇంద్రియరహితుడు గాని కాలేడు. కాని అతడు తన కోరిక గుణాన్ని మార్చుకోవలసి ఉంటుంది. సమస్తము శ్రీకృష్ణునికే చెందినదని (ఈశావాస్యమిదం సర్వం) భౌతికవాంఛ లేని వ్యక్తి తప్పక ఎరిగి
ఉంటాడు. అందుకే అతడు దేని మీద కూడ మిథ్యాస్వామ్యము ప్రకటించడు. ఈ దివ్యజ్ఞానము ఆత్మానుభూతి పైన, అంటే ప్రతీ జీవుడు ఆధ్యాత్మిక ఉనికిలో శ్రీకృష్ణుని నిత్యాంశమని, కనుక జీవుని నిత్యస్థితి కృష్ణునితో సమానం గాని, అధికము గాని కాదని చక్కగా తెలియడం మీద ఆధారపడి ఉంటుంది. ఈ కృష్ణభక్తి భావన అవగాహనే నిజమైన శాంతి యొక్క మూల సిద్ధాంతము.

శ్లోకము - 72

ఏషా బ్రాహ్మీ స్థితి: పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వాస్యామన్తకాలేకపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ||

ఏషా - ఇది; బ్రాహ్మీ - ఆధ్యాత్మికమైన; స్థితిః - స్థితి; పార్థ - ఓ పృథా కుమారా; ఏనాం - దీనిని; ప్రాప్య - పొంది; న విముహ్యతి - మోహము చెందుడు; స్థిత్వా - నెలకొని ఉండి; అస్యాం - దీనిలో; అన్తకాలే - జీవితము చివరన; అపి - కూడ; బ్రహ్మనిర్వాణం - భగవంతుని ఆధ్యాత్మిక రాజ్యమును; బచ్ఛతి - పొందుతాడు.

ఇదే ఆధ్యాత్మికము, భగవన్మయము అయినట్టి జీవనవిధాము. దీనిని పొందిన తరువాత మనిషి మోహము చెందడు. మరణసమయంలో వాడు ఈ విధంగా నెలకొంటే అతడు భగవద్రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు.

భాష్యము : మనిషి కృష్ణ భక్తి భావనను లేదా ఆధ్యాత్మిక జీవితాన్ని తక్షణమే, ఒక్క క్షణంలో పొందగలడు; లేదా అట్టి జీనస్థితిని కోట్లాది జన్మల తరువాతమైనా పొందలేకపోతాడు. ఇది కేవలము యధార్ధాన్ని అర్ధం చేసికొని అంగీకరించడానికి సంబంధించిన విషయము. ఇట్వాంగ మహారాజు కృష్ణునికి విలుచ్చెడు ద్వారా ఈ జీవనస్థితిని తన మరణానికి కేవలము కొన్ని నిమిషాల ముందే పొందాడు. లౌకిక జీవన విధానాన్ని ముగించడమే నిర్మాణానికి అర్థం. ఆ సిద్ధాంతము ప్రకారము ఈ లౌకిక జీవితాన్ని ముగించిన తరువాత కేవలము భార్యను మిగులుతుంది. కాని భగవద్గీత దీనికి భిన్నంగా బోధిస్తుంది. నిజమైన జీవితము ఈ భౌతికజీవితము ముగిసిన తరువాతే ప్రారంభమౌతుంది. 
   మనిషి ఈ లౌకిక జీవన విధానాన్ని సమాప్తము చేయవలసి వస్తుందని తెలిసికోవడము లౌకికునికి సరిపోతుంది. కాని ఆధ్యాత్మికంగా ప్రగతి చెందిన వ్యక్తులకు ఈ లౌకిక జనము తరువాత వీరి జీవితము ఉంటుంది. ఈ జన్మను ముగించడానికి ముందే మనిషి అదృష్టవశాత్తుగా కృష్ణ భక్తిభామాయురుడైతే తక్షణమే బ్రహ్మనిర్వాణ స్థితిని పొందుతారు.భాగవద్రాజ్యానికి, భగవత్సేవకు భేదము లేదు. ఆ రెండు కూడ పూర్ణస్థితిలోనే ఉంటాయి. కనుక అవంతుని దివ్యమైన ప్రేమయుత సేవలో నెలకొనడమంటే ఆధ్యాత్మిక రాజ్యాన్ని పొందడమే అవుతుంది. భౌతికజగత్తులో ఇంద్రియభోగ కలాపాలు ఉంటాయి. కాగా ఆధ్యాత్మిక జగత్తులో కృష్ణ భక్తి భావన కలాపాలు ఉంటాయి. ఈ జన్మలో కృష్ణభక్తిభావనను పొందడమనేది తక్షణమే బ్రహ్మమును పొందడము అవుతుంది. కృష్ణభక్తి భావనలో నెలకొన్నవాడు నిక్కముగా అదివరకే భగద్రాజ్యములో ప్రవేశించినవాడౌతాడు.

    బ్రహ్మము భౌతిక పదార్థానికి వ్యతిరేకమైనది. కనుక " బ్రాహ్మీస్థితి" అంటే లౌకిక కలాపాల స్థాయిలో లేకపోవడమని అర్ధము. భగవానుని భక్తియుతసేవ భగవద్గీతలో ముక్తస్థితిగా (స గుణాన్ సమతిథ్యేతాన్ బ్రహ్మభూయాయ కల్పతే) అంగీకరించబడింది. కనుక బ్రాహ్మీస్థితి అనేది భవబంధము నుండి విముక్తి అవుతుంది. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top