హనుమాన్‌ చాలీసా - Hanuman Chalisa in Telugu Language

0
హనుమాన్‌ చాలీసా - Hanuman Chalisa in Telugu Language
హనుమాన్‌

గురు వార్టన

శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక చరణములు |
బుద్ధిహినతను కలిగిన తనువులు
బుదృుదములని తెలుపు సత్యములు || శ్రీ ||

హనుమాన్‌ చాలీసా

జయ హనుమంత జ్ఞానగుణవందిత
జయ పండిత (తిలోక పూజిత |
రామదూత అతులిత బలథామ
అంజనీపుత పవనసుతనామ ||

ఉదయభానుని మధుర ఫలమని
భావన లీల అమృతమును గ్రోలిన |
కాంచనవర్ణ విరాజిత వేష
కుండలమండిత కుంచితకేశ    || శ్రీ ||

రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి
రాజపదవి సుగీవున నిలిపి |
జానకీపతి ముద్రిక దోడ్కొని
జలధి లంఘించి లంక జేరుకొని |
సూక్ష్మరూపమున సీతను జూచి
వికట రూపమున లంకను గాల్చి |
భీమ రూపమున అసురుల జంపిన
రామ కార్యమును సఫలము జేసిన   || శ్రీ ||

సీత జాడగని వచ్చిన నిను గని
శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని |
సహస్ర రీతుల నిను గొనియాడగ
కాగల కార్యము నీపై నిడగ |

వానరసేనతో వారిధి దాటి
లంకేశునితో తలపడి పోరి |
హోరుహోరున పోరు సాగిన
అసురసేనల వరుసను గూల్పిన   || శ్రీ ||

లక్ష్మణ మూర్చతో రాముడడలగ
సంజీవి దెచ్చిన ప్రాణప్రదాత |
రామలక్ష్మణుల అస్త్రధాటికి
అసురవీరులు అస్తమించిరి |
తిరుగులేని రామబాణము
జరిపెంచెను రావణసంహారము |
ఎదురు లేని ఆ లంకాపురమున
ఏలికగా విభిషణు జేసిన || శ్రీ ||

సీతారాములు నగవుల గనిరి
ముల్లోకాల హారతులందిరి |
అంతులేని ఆనందాశృవులే
అయోధ్యాపురి పొంగిపొరల |

సీతారాముల సుందర మందిరం
శ్రీకాంతువదం నీ హృదయం |
రామచరిత కర్ణామృతగాన
రామనామ రసామృతపాన || శ్రీ ||

దుర్గమమగు ఏ కార్యమైన
సుగమమే యగు నీకృపజాలిన |
కలుగు సుఖములు నిను శరణన్న
తొలగు భయములు నీ రక్షణయున్న |

రామద్వారపు కాపరివైన నీ
కట్టడి మీర బ్రహ్మాదుల తరమా |
భూత పిశాచ శాకిలీ ఢాకిని
భయపడిపారు నీ నామజపము విని || శ్రీ ||

ధ్వజవిరాజా వజశరీరా
భుజబలతేజా గదాధరా |
ఈశ్వరాంశ సంభూత పవిత్రా
కేసరీ పుత్ర పావన గాత్ర |

సనకాదులు బ్రహ్మాదిదేవతలు
శారద నారద ఆదిశేషులు |
యమ కుబేర దిగ్పాలురు కవులు
పులకితులైరి నీ కీర్తి గానముల || శ్రీ ||

“సోదర భరత సమానా* యని
శ్రీ రాముడు ఎన్నికగొన్న హనుమా |
సాధులపాలిట ఇందుడవన్నా
అసురుల పాలిట కాలుడవన్నా |

అష్టసిద్ధి నవనిధులకు దాతగ
జానకీమాత దీవించెనుగ |
రామరసామృత పానము జేసిన
మృత్యుంజయుడవై వెలసిన |
నీ నామ భంజన శ్రీ రామ రంజన
జన్మ జన్మాంతర దుఃఖభంజన  || శ్రీ ||

నీ నామ భంజన శ్రీ రామ రంజన
జన్మ జన్మాంతర దుఃఖభంజన |
ఎచ్చటుండినా రఘువరదాసు
చివరకు రాముని చేరుట తెలుసు |

ఇతర చింతనలు మనసున మోతలు
స్థిరముగ మారుతి సేవలు సుఖములు |
ఎందెందున శ్రీరామ కీర్తన
అందందున హనుమాన నర్తన  || శ్రీ ||

శ్రద్ధగ దీనిని ఆలకింవుమా
శుభమగు ఫలములు కలుగుసుమా |
భక్తిమీర గానము చేయగ
ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగ |

తులసీదాస హనుమానచాలీసా
తెలుగున సుళువుగ నలుగురు పాడగ |
పలికిన సీతారాముని పలుకున
దోషములున్న మన్నింపుమన్న ॥శ॥

మంగళ హారతి గొను హనుమంత
సీతారామలక్ష్మణ సమేత |
నా అంతరాత్మ నిలుమో అనంత
నీవే అంతా శ్రీ హనుమంత ॥

ఓ౦ శాంతిః శాంతిః శాంతిః
శ్రీ రామారణమస్తు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top