కర్మయోగము - Karma Yogam -శ్లోకము - 13
యజ్ఞశిష్టాశినః సన్తో ముచ్యన్తే సర్వకిల్బీషై |
భుంజతే తే త్వఘం పాపా యే పచ న్త్యాత్మకారణాత్ ॥
యజ్ఞశిష్ట - యజ్ఞాచరణ తరువాత తీసికొనే ఆహారం; ఆశినః - తినేవారై; సన్తః - భక్తులు; ముచ్యన్తే - విడివడతారు; సర్వ - అన్ని రకాలైన; కిల్బిషై: - పాపాల నుండి; భుంజతే - భోగించేవారు; తే - వారు; తు - కాని; అఘం - ఘోరమైన పాపాన్ని; పాపాః - పాపులు; యే - ఎవరైతే; పచన్తి - వండుతారో; ఆత్మకారణాత్ - ఇంద్రియభోగం కొరకు.
మొట్టమొదట యజ్ఞానికి సమర్పించిన ఆహారమును తినే కారణంగా భగవదృక్తులు అన్ని రకాలైన పాపాల నుండి విడివడతారు. స్వీయేంద్రియ భోగం కొరకు ఆహారమును తయారు చేసికొనే ఇతరులు కేవలము పాపమునే తింటారు.
భాష్యము : భగవదృక్తులు, అంటే కృష్ణభక్తిభావనలో ఉన్న మనుషులు... "సన్తులు" అని పిలువబడతారు. “ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన సన్తః సదైవ హృదయేమ విలోకయన్తి” అని . బ్రహ్మసంహితలో (5.38). వర్ణించబడినట్లు వారు సర్వదా బ్రహ్మసంహితలో ఉంటారు. దేవదేవుడైన గోవిందునితో (సమస్త సుఖాలను ఇచ్చేవాడు) లేదా ముక్తుందునితో (ముక్తి నిచ్చేవాడు) లేదా శ్రీకృష్ణునితో (సర్వాకర్షకుడు) ప్రేమతో గట్టిగా ముడివడినవారె... ఆ సన్తులు పరమవురుషునికి మొట్టమొదట సమర్పించనిదే దేనినీ అంగీకరించరు. కనుక అటువంటి. భక్తులు శ్రవణం, కీర్తనం, . స్మరణం, అర్చనం మొదలైన వివిధ భక్తిమార్గాలలో సర్వదా యజ్ఞాలు చేస్తుంటారు. ఇటువంటి యజ్ఞనిర్వహణ వారిని. భౌతికజగత్తులోని నానారకాల పావసాంగత్య కల్మషాల నుండి సర్వదా దూరంగా ఉంచుతుంది. తమ కొరకు, అంటే ఇంద్రియభోగం కొరకు ఆహారాన్ని వండుకునే ఇతరులు కేవలము దొంగలే కాకుండ నానారకాలైన పాపాలను తినేవారు అవుతారు. మనిషి దొంగ, పాపి రెండు కూడ అయితే ఎట్లా సుఖిగా. అవుతాడు? అది అసాధ్యం. అందుకే అన్నివిధాలుగా జనులు సుఖభాగులు కావాలంటే పూర్తి కృష్ణభక్తిభావనలో సంకీర్తన యజ్ఞమనే నులభమైన విధానాన్ని వారు నిర్వహించడాన్ని నేర్వాలి. లేకపోతే ప్రపంచంలో శాంతి గాని, సుఖము గాని ఉండదు.
కర్మయోగము - Karma Yogam -శ్లోకము -14
అన్నాద్భవన్తి భూతాని పర్జన్యాదన్నసమ్భవః |
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ॥
అన్నాత్ - ధాన్యము వలన; భవన్తి - పెరుగుతాయి; భూతాని - భౌతికదేహాలు; పర్జన్యాత్ - వర్షము వలన; అన్న - ధాన్యము; సమ్భవః - ఉత్పత్తి అవుతుంది; యజ్ఞాత్ - యజ్ఞాచరణము ద్వారా; భవతి - సాధ్యమౌతుంది; పర్జన్యః - వర్షము; యజ్ఞః - యజ్ఞావరణము; కర్మ - విధ్యుక్త కర్మల నుండి; సముద్భవః - పుడుతుంది.
దేహాలన్నీ ధాన్యముపై ఆధారపడి జీవిస్తాయి, ధాన్యము వర్షము వలన ఉత్పత్తి అవుతుంది. వర్షాలు యజ్ఞాచరణము ద్వారా కురవగా, యజ్ఞము విధ్యుక్తకర్మము నుండి ఉద్భవిస్తుంది.
భాష్యము : భగవద్గీతకు... గొప్ప వ్యాఖ్యాతయైన శ్రీల బలదేవ విద్యాభూషణులు ఈ విధంగా వ్రాసారు : “యే ఇంద్రాద్యంగతయావస్థితం యజ్ఞం సర్వేశ్వరం విమ్ణమభ్యర్చ్యతచ్చేష మశ్నన్తి తేన తద్దేహేయాత్రాం సంపాదయన్తి, తే సన్తః సర్వేశ్వరస్య యజ్ఞపురుషస్య భక్తాః సర్వకిల్బిషై అనాదికాలవివృద్ధైః ఆత్మానుభవ ప్రతిబన్దకై ర్నిఖిలైః పాపైర్విముచ్యన్తే”.
యజ్ఞపురుషునిగా అంటే సర్వయజ్ఞాలకు భోక్తగా _తెలియబడే భగవంతుడే దేవతలందరికీ ప్రభువు. వివిధ దేహాంగాలు పూర్తి దేహాన్ని సేవించినట్లుగా ఆ దేవతలందరు భగవంతుని సేవిస్తారు. ఇంద్రుడు, చంద్రుడు వరుణుడు వంటి దేవతలు లోకకలాపాలను నిర్వహించడానికి నియమించబడిన పాలకులు. ఈ దేవతల సంతృప్తి కొరకే వేదాలు యజ్ఞాలను ఉపదేశించాయి.. తద్ద్వారా వారు. ప్రసన్నులై ధాన్యోత్పత్తికి తగినంతగా గాలి, వెలుతురు, నీళ్ళు సరఫరా చేస్తారు.
శ్రీకృష్ణభగవానుని అర్చించినప్పుడు ఆతని వివిధ దేహాంగాలే అయినట్టి దేవతలు కూడ అప్రయత్నంగా పూజింపబడతారు. అందుకే దేవతలను వేరుగా పూజించవలసిన అవసరము లేదు. ఈ కారణంగానే భగవదృక్తులు, అంటే కృష్ణభక్తిభావనలో ఉన్నవారు శ్రీకృష్ణునికి ఆహారం
నైవేద్యం పెట్టి తరువాత తింటారు. ఈ పద్ధతి దేహాన్ని ఆధ్యాత్మికంగా పోషిస్తుంది. అటువంటి కార్యం ద్వారా కేవలము దేహంలోని గత పాపాలన్నీ నశించిపోవడమే కాకుండ దేహము. సమస్త ప్రకృతి కల్మషాలకు అతీతమౌతుంది. అంటువ్యాధి ప్రబలినవుడు రోగనిరోధక బెషధము అటువంటి వ్యాధి నుండి మనిషిని కాపాడుతుంది. అదేవిధంగా విమ్ణుభగవానునికి నైవేద్యము. పెట్టి తీసికొనిన ఆహారము. మనలను భౌతికాసక్తి నుండి తగినంతగా. నిరోధిస్తుంది. ఇటువంటి అభ్యాసానికి అలవాటు. పడినవాడే భగవద్భక్తునిగా పిలువబడతాడు. అందుకే కేవలము కృష్ణార్పితమైన ఆహారాన్ని తినే కృష్ణభక్తిభావనాయుతుడు ఆత్మానుభూతిలో ప్రగతికి అవరోధాల వంటి సమస్త పూర్వ పాపాలను నశింపజేసికొంటాడు. ఇంకొక ప్రక్క ఆ రకంగా చేయనివాడు పాపరాశిని పెంచుకోవడం కొనసాగిస్తాడు. ఆ. పావఫలాలను అనుభవించడానికి ఇది తదుపరి జన్మలో శునక్క సూకర దేహాలను కలుగజేస్తుంది. భౌతికజగత్తు కలుషాలతో నిండినట్టిది.