నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
ఆచారాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆచారాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, జులై 2020, ఆదివారం

పవిత్ర ధారణము - Pavitra Dharanamu


పవిత్ర ధారణం

దార్భం పవిత్రం తామ్రంవా రాజతం హైమ మేవవా| ధారయేద్దక్షిణే పాణౌ పవిత్రం చోత్తరోత్తరమ్||యాఙ్ఞవల్క్యః|
అనామికా ధృతం హైమం తర్జన్యాం రౌప్యమేవచ| కనిష్ఠికా ధృతం ఖాడ్గం తేన పూతో భవేన్నరః||
తర్జన్యాబి భూయాద్రౌప్యం స్వర్ణంచోప కనిష్ఠయా| గృహస్థః కర్ణయోశ్చైవ శుభేరౌక్మేచ కుండలే||
యోగ పట్టోత్తరీయంచ తర్జన్యారౌప్యమేవచ| కనీయసా సపిత్రాచ నధార్యమితి కౌశికః||

బ్రాహ్మణుడు సౌవర్ణముగాని, రాజతముగాని, తామ్రమయముగాని, దర్భ తోచేసినదిగాని ఐన పవిత్రమును ధరించ వలెను. ఉంగరపువ్రేలి యందు సువర్ణమును, చూపుడు వ్రేలి యందు వెండిని, చిటికెన వ్రేలి యందు ఖడ్గ మృగ సంబంధమునూ ధరించ వలెను. అట్లు ధరించిన పవిత్రత కలుగును.

అదేవిధంగా చెవులయందు సువర్ణ కుండలములను ధరించవలెను. “ తండ్రి జీవించినవాడు, అన్న జీవించి ఉన్నవాడు చూపుడు వ్రేలి యందు వెండిని, యోగ పట్టమును ఉత్తరీయముగా ధరించుట చేయగూడదు” అని కౌశికుడు చెప్పెను.

సంకలనం: కోటేశ్వర్ 

25, జులై 2020, శనివారం

వర్ణ ధర్మములు - Varna Dharmamulu

వర్ణ ధర్మములు - Varna Dharmamulu

వర్ణ ధర్మములు

శ్లో||  జన్మనా జాయతేశూద్రః | కర్మణా జాయతే ద్విజః
       వేదపాఠంతు విప్రాణాం | బ్రహ్మజ్ఞానంతు బ్రహ్మణః

వర్ణములు చేతనాశక్తి భేదము చేత నిర్ణయింపబడినవి :


1. బ్రాహ్మణులు :

మనస్సు, బుద్ది, చిత్తము, అహంకారము - ఈ నాలుగు ఎవరిలో చక్కగా పనిచేయునో వారే బ్రాహ్మణులు. వీరి స్వభాము శమము, దమము, సత్యము, అహింస, మొదలగు సద్గుణములు కలిగియుండుట.

2. క్షత్రియులు :

మనస్సు, బుద్ధి, అహంకారము - ఈ మూడు ఎవరిలో బాగుగా పనిచేయునో వారే క్షత్రియులు. వీరి స్వభావము తేజస్సు, బలము, శౌర్యము, ఐశ్వర్యము కలిగి యుండుట.

3. వైశ్యులు :

మనస్సు, బుద్ధి, ఈ రెండు చక్కగా ఎవరిలో పనిచేయునో వారే వైశ్యులు. వీరి స్వభావము ఆస్తికత్వము, దానము, నిష్ఠ, ధన సంచయము కలిగియుండుట.

4. శూద్రులు :

మనస్సు ఒక్కటే ఎవరిలో పనిచేయునో వారే శూద్రులు. వీరి స్వభావము ఇతర మూడు వర్ణములలో చెప్పబడినవి లేకుండుట. అందువలన దేవ, గో, బ్రాహ్మణ సేవ చేయుచు, వారికి సహాయము చేయుట వలన వారి స్వభావమును క్రమముగా పెంపొందించుకొనగలరు.

5. అంత్యజులు :

శుచి శుభ్రతలు లేకుండుట, అబద్ధములాడుట, దొంగతనము చేయుట, నాస్తికత్వము, కలహ ప్రియము, కామక్రోధ తృష్ణలు, కలిగియున్నవారు అంత్యజులు. ఈ వర్ణములు వారి వారి గుణకర్మ స్వభావములను బట్టి నిర్ణయింపబడినవే గాని తల్లిదండ్రుల నుండి సంక్రమించినవి కాదు. స్వభావమును మెరుగుపరచుకున్నవారు తగిన వర్ణస్థులగుదురు. జన్మతః వర్ణములందు ఉచ్ఛనీచములు లేవు.

స్వాభావిక లక్షణములు:

బ్రాహ్మణులు :
 • ☀ శమము అనగా మనో నిగ్రహము. దమము అనగా ఇంద్రియ నిగ్రహము; 
 • ☀ శౌచము అనగా పవిత్ర భావములు, భగవత్‌ ప్రసాద బుద్ధి, దైవేచ్ఛ అనే ప్రపత్తి; 
 • ☀ తపస్సు అనగా భగవత్‌ విశేషములపట్ల, సాధనలపట్ల తపనతో కూడిన ప్రయత్నము చేయు స్వభావము; 
 • ☀ సంతోషము అనగా ఏది ప్రాప్తించినా సంతోషము తృప్తి కలిగియుండి అవగాహన పెంపొందించుకొను స్వభావము; 
 • ☀ క్షాంతి అనగా కష్ట సుఖాలు రెంటిని సాధన కొఱకు పెట్టిన పరీక్షలనే భావముతో ఉంటూ, ఆత్మ దృష్టి కలిగి యుండుట, ఆర్జవము అనగా త్రికరణములు ఏకీకృతమై; 
 • ☀ శుద్ధిగా నుండునట్లు అభ్యసించుట. భక్తి అనగా పరాభక్తి, పరాప్రేమను పెంపొందించుకొనుట; 
 • ☀ దయ అనగా తానుకోరే దయను, అట్లే సహజీవుల యెడల కలిగియుండుట, ఇతరుల కష్టములు తనవైతే ఎట్లో, అట్లే భావించి, వీలైనంత సహాయము చేయుట, సత్యము అనగా సర్వజీవులలోని నిత్యమైన సత్యమును ఆశ్రయించుచు, సందర్శించుచు, అవలంబించుచు, ఆరాధించుచు ఉండే స్వభావము.
క్షత్రియులు:
 • ☀ తేజస్సు అనగా విషయములను సత్య దృష్టితో, పవిత్ర దృష్టితో ఆకళింపు చేసుకునే వివేక కాంతితో విరాజిల్లుట; 
 • ☀ బలము అనగా శరీర మనోబుద్ధుల బల సంపన్నతను పెంపొందించుకొనుట; 
 • ☀ ధృతి అనగా ధైర్య స్థైర్య సంపన్నత; 
 • ☀ శౌర్యము అనగా సమస్యలను సమర్ధతతో ఎదుర్కోగల ఉత్సాహము, సాహసము వృద్ధి చేసుకొనుట; 
 • ☀ తితిక్ష అనగా సహనము, ఓర్పు అలవరచుకొనుట, ఔదార్యము అనగా ఉదారత త్యాగ నిరతి, ఇతరుల సుఖశాంతులు, సంతోషముకొఱకు ఏదైనా చేయాలనే స్వభావము, ఉద్యమము అనగా కార్యములను చేపట్టి సఫలము చేయుటకు ఉత్సాహముతో ఉద్యమించు శక్తి సంపన్నత.
వైశ్యులు :
 • ☀ ఆస్తిక్యము అనగా పరమాత్మ యొక్క సర్వతత్త్వ స్వరూపముపట్ల తన బుద్ధి చిత్తములను ఆయత్తపరచి పెంపొందించుకొను స్వభావము; 
 • ☀ దానము అనగా దానధర్మములు నిర్వర్తించే శ్రద్ధ, అభ్యాసములను పెంపొందించుకొను స్వభావము; 
 • ☀ నిష్ఠ అనగా శాస్త్రములలో చెప్పబడే విధి విధానములను తాను నిర్వర్తించవలెనని నియమనిష్ఠలు కలిగియుండుట; 
 • ☀ అదంభము అనగా దంభము, దర్పము, గర్వములను త్యజిస్తూ, అణకువ, ప్రపత్తి, శరణాగతితో కూడిన స్వభావము, సంపద అనగా సంపదలను వృద్ధి చేసుకొనవలెననెడి ఉత్సాహము, బ్రహ్మ సేవనము అనగా బ్రహ్మజ్ఞులు, వేదజ్ఞులపట్ల సేవాభావము.
శూద్రులు:
శుశ్రూష అనగా దేవ, గురు, బ్రాహ్మణ, సాధు, సన్న్యాసులపట్ల నిస్వార్థ నిష్కపట సేవా నిరతి కలిగియుండి, దైవచింతన, సేవాభావంతో జీవనం సాగించుట.

అంత్యజులు:
పై చతుర్వర్ణస్థుల ధర్మ నిరతిని ఏమరచినవారు. అశౌచము, అనృతము, స్తేయము, నాస్తిక్యము, కామక్రోధ ప్రధానములు కలిగియుండు స్వభావము, ఇంద్రియ విషయములపట్ల సదా మననము, తపన కలిగియున్న స్వభావము, ఎంత పొందినా కృతజ్ఞత ఉండక, అసంతృప్తితో అలమటించే స్వభావము.

బ్రాహ్మణ్యము :
బ్రహ్మ జ్ఞానులను సేవించి, తద్వారా లోకహితమును తెలుసుకొని, అమలు చేయు స్వభావము.

అన్ని వర్ణముల వారు ఆచరించవలసిన ధర్మములు :
 • 1. అహింస : శారీరకముగా గాని, మానసికముగా గాని, బాధించకుండుట.
 • 2. సత్యము : సత్యమును ఆశయముగా కలిగియుండి, సత్యమును దర్శించుట, సత్యమును ఆశ్రయించుట, సత్యము పలుకుట, సత్యాన్వేషణ జరుపుట.
 • 3. అస్తేయము : ఇతరుల సంపదను ఉచితముగా గాని, అక్రమముగా గాని పొందే బుద్ధి లేకుండుట.
 • 4. అక్రోధము : క్రోధావేశములను నిగ్రహించి, పోగొట్టుకొనుట.
 • 5. అలోభము : నాది నాకే ఉండవలెననియు, ఎవరితోనూ పంచుకొనను అనే బుద్ధిని విడచిపెట్టుట.
 • 6. భూతప్రీతి : సహజీవులకు ప్రీతి, సంతోషము కలుగజేయు ఉద్దేశ్యము.
 • 7. భూత హితము : ఇతరుల హితము, శ్రేయస్సు కోరుకొనుట, ప్రయత్నించుట. జంతువులు, పక్షులు, వృక్షములు మొదలగు భూతములకు ఆహార పానీయములనిచ్చి సంతోషపెట్టుట.

చతుర్వర్ణ ధర్మములు 

1. బ్రాహ్మణులు :
వేదాధ్యయనము పరమ ధర్మము. విహిత కర్మలను వేద ప్రమాణముగా నియమ నిష్ఠలతో చేయవలెను. దయ కలిగి యుండవలెను. శాంతమును విడువరాదు. ఉదాత్తమైన పద్ధతిలో లభించిన ధనమును కేవలము తన సంతానమునకే గాక, యోగ్యులైన వారికి ధర్మ మార్గములో పంచవలెను. గర్వము పనికిరాదు.

2. క్షత్రియులు :
యజ్ఞములు చేయుట, దానక్రియలు, వేదాధ్యయనము, దుర్మార్గులను శిక్షించుట, ప్రజలనుండి అనురాగమును పొందే విధముగా రాజ్యపరిపాలన, నిర్భీతితో పరాక్రమించుట, యుద్ధము చేయుట.

3. వైశ్యులు :
వేదాధ్యయనము, దానములు, యజ్ఞముల నిర్వహణ, న్యాయముగా ధనార్జన, సక్రమముగా ఖర్చు చేయుట, పశు సంరక్షణ.

4. శూద్రులు :
పై మూడు వర్ణముల వారికి మంచిగా పనులు చేసి పెట్టుచు, బ్రతుకుట.

నాలుగు వర్ణముల వారికి గల ధర్మములు :
కోపము ఉండకూడదు. సత్యమే మాట్లాడవలెను. కట్టుకున్న భార్యతోనే భోగించవలెను. శుచిగా ఉండవలెను. డాంబికము లేకుండా ఒదిగి యుండవలెను. ఎవరికీ ద్రోహము తలపెట్టరాదు.

క్షత్రియుని లోక తంత్రములు :
ఆత్మ, ధృతి, దాక్షిణ్యము, దేశము, కాలము, పరాక్రమము అనే అయిదు లోక తంత్రములు. వీటిని బాగుగా తెలుసుకొని, ధర్మవిదుడైన ఉత్తమ క్షత్రియుడు తన రాజ్యమును చక్కగా పాలించును.

చతుర్వర్ణ కర్మోపాసకులు :
 • 1. బ్రాహ్మణులు : వీరిలో బ్రహ్మయతులు అని ఉందురు. ఇదంతా పరబ్రహ్మ స్వరూపమే కదా! నాతో సహా సర్వమూ అద్వితీయ నిరామయ నిరాకార నిర్గుణ బ్రహ్మము యొక్క చమత్కార సంప్రదర్శనమే అనెడి అవగాహన పెంపొందించుకొనుటకు మనస్సు యొక్క శుద్ధి కొఱకై కర్మలు, ఉపాసనలు విధిగా చేపట్టేవారు బ్రహ్మయతులు. వీరిది సాత్వికోపాసన
 • 2. క్షత్రియులు : వ్యవహార దక్షత, కార్య దీక్ష, పరిస్థితుల సానుకూల్యత, పేరు ప్రతిష్ఠలు - ఇట్టి వ్యవహారికమైన ఆశయములతో వాటి సముపార్జనకై పరమాత్మను ఉపాసించేవారు. ఇది సామర్ధ్య రాజసికోపాసన.
 • 3. వైశ్యులు : వస్తు సమృద్ధి, ధన, గృహ సంపద మొదలైనవి పొందుటకు లక్షితులై దైవోపాసన చేయువారు. వీరిది సంపద సిద్ధి రాజసికోపాసన.
 • 4. శూద్రులు : ఇంద్రియ సంబంధమైన అనుభవముల సంప్రాప్తికై దైవోపాసనను ఆశ్రయించేవారు. వీరిది ఇంద్రియానంద ఆశ్రిత తామసికోపాసన.
ఉర్వి :
వర్ణాశ్రమ ధర్మములు నశించి, అధర్మము, పాపము పెరిగి భూమి క్రుంగిపోగా, కశ్యప మహర్షి తన ఊరువులను దన్నుగా పెట్టి, భూమిని పైకి లేవనెత్తినందు వలన, భూమికి ఉర్వి అని పేరు వచ్చినది.

కృతయుగము పేరు :
ఈ యుగారంభములో హంస అను ఒకే వర్ణముండెను. చాతుర్వర్ణములు లేవు. హంస శబ్దార్థము పరతత్త్వమే. జనులు జన్మతః అనన్య భక్తి పరాయణులై జగత్తును ఈశ్వర భావముతో ఉపాసించుచూ అతి త్వరగా కృతకృత్యులయ్యేవారు. ఇది హంస యోగము. అందువలన ఈ యుగమునకు కృతయుగమనే పేరును శాస్త్రవేదులు నిర్ణయించిరి. ఈ యుగములో వేదము ప్రణవాత్మకముగా అనుభవమయ్యేది.

కలియుగములో వర్ణసాంకర్య ఫలితములు :
మానవులు సత్యమునకు, ధర్మమునకు దూరమగుదురు. ఆయుఃప్రమాణము తగ్గిపోవును. అజ్ఞానము, ప్రబల మోహము, దాని వలన లోభము కలిగి కామమునకు దారి తీయును. దానివలన క్రోధము, దానివలన వైరము ఉద్భవించును. సకల వర్ణములలో ఒకరినొకరు బాధించుకునే శత్రుత్వము ఉదయించును. హద్దులు మీరి అందరూ వర్ణ సాంకర్యము చేయుదురు.

బ్రాహ్మణులు జపతపములు, స్వాధ్యాయము, నియమ నిష్ఠలు విడచిపెట్టెదరు. అదే సమయములో శూద్రులు అధిక తపస్సంన్నులగుదురు. అరాచకము ప్రబలి ధర్మము నశించి ధనాపేక్షగల నీచ జాతులతో నిండిపోవును. అన్ని వర్ణముల వారిలో, వారి స్వధర్మము క్షీణించి, శారీరక మానసిక బలహీనతలు పెరుగును. మద్యపానము, వ్యభిచారము, అపనమ్మకము పెరిగి అందరూ భ్రష్టులగుదురు.

రస వస్తువులలో, సుగంధ ద్రవ్యములలో గుణము తగ్గిపోవును. పాడిపంటలు తగ్గును. నాణ్యత తగ్గిపోవును. పన్నులు అధికముగా వసూలు చేసెదరు. జనులు భయాందోళనలో జీవించుచుందురు. మోసము అధికమగును. శరీరముపై ఆసక్తి కలిగి దానినే ఆరాధించెదరు. వారికి ముక్తి అసాధ్యమగును. కలియుగాంతములో పదహారు సంవత్సరములే పూర్ణాయువు. ఏడెనిమిదేళ్ళకే ఆడపిల్లలు బిడ్డలని కందురు. వేదధర్మములు శూద్రులు చెప్పగా బ్రహ్మణులు ఆసక్తితో విందురు. గురువంటే శిష్యునికి లక్ష్యముండదు. కుటుంబ వ్యవస్థ పాడైపోవును. యుద్ధములు, ఉత్పాతములు సంభవించును. దేవతారాధనలు, పితృకార్యములు, వేద బోధ ఆగిపోవును. పెద్దల బోధను పెడచెవిన పెట్టెదరు. దుష్టులు అధికమయ్యెదరు.

కలియుగాంతములో శంబళ గ్రామములో విష్ణువు విష్ణుయశుడనే పేరుతో కల్కిగా అవతరించి, కృతయుగ ధర్మమును మరలా స్థాపించును.

శ్లో||  యదాయదాహి ధర్మస్యగ్లా నిర్భవతి భారత |
 అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌ ||

తా|| ధర్మమునకు హాని కలిగినప్పుడును, అధర్మము పెచ్చు పెరిగినప్పుడును నన్ను నేను సృజించుకొందును, అనగా సాకార రూపముతో అవతరించెదను.

- శ్రీకృష్ణ పరమాత్మ


సంకలనం: చల్లపల్లి విజ్ఞాన స్వరూప్

14, జులై 2020, మంగళవారం

చిన్న పిల్లలకి దిష్టి తీయడం - Cinna pillalaki diṣṭi thīyaḍaṁ

చిన్న పిల్లలకి దిష్టి తీయడం

చినారుల పుట్టిన రోజు పండగ వేడుకలలో అలాగే అనేక శుభ కార్యాల్లో పాల్గొన్న పెద్దదిష్టిని లకీ, పిల్లలకీ విభిన్నపద్ధతులలో తీస్తూ ఉంటారు. పిల్లలూ, పెద్దలూ ఘనవిజయాలు సాధించినప్పుడూ, బాగా ప్రశంసలు పొందినప్పుడు అతిగా నీరసించి డీలాపడినప్పుడు దిష్టి తీస్తారు. అలాగే పిల్లలకి పసుపూ, సున్నం కలిపినా నీతితో దిష్టి తీస్తుంటారు. బయటజనుల దృష్టిదోషం తగలకుండా ఉండాలని దిష్టితీస్తే చిన్నపిల్లవాడు కలవరింతలు లేకుండా నిద్రపోవటమూ, నిద్రలో ఉలిక్కిపడుతూ లేవటం వంటి అవలక్షణాలు లేకుండా ఉంటాడు.

చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చూ అనేక వేడుకల్లో పాల్గొనటం వల్ల చుట్టూ అంతా చేరటంవల్ల చిన్నపిల్లలూ లేదా పెద్దలూ కోంత అస్వస్థతకు గురిఅవుతారు. అందుకే వివాహవేడుకలలోను, పుట్టిన రోజువేడుకలలోను విధిగా హారతి ఇచ్చి చివరలో ఎర్ర నీళ్ళలో దిష్టి తీస్తారు. ఎర్రరంగు పదేపదే చూడటం వల్ల అనేక రోగాలు సమసిపోతాయి. మనసుకి ప్రశాంతతతోపాటు ధైర్య గుణంవస్తుంది.

సంకలనం:  నాగవరపు రవీంద్ర

4, జులై 2020, శనివారం

పూజామంత్రాలను సంస్కృతంలోనే ఎందుకు చెప్పాలి? - Samskrutamlo Pooja mantramulu

పూజామంత్రాలను సంస్కృతంలోనే ఎందుకు చెప్పాలి? - Samskrutamlo Pooja mantramulu
పూజామంత్రాలను సంస్కృతంలో వాడటానికి బదులుగా అందరికీ అర్థమయ్యే మాతృభాషలోనే ఎందుకు చెప్పకూడదు?

పూజ, హోమం మొదలైనవి పవిత్రమైన ధార్మిక క్రియలు. వీటియొక్క క్రమాన్ని వాటికి సంబంధించిన మంత్రాలను మనకి తెల్సినవారు మన సంప్రదాయకర్తలైన ఋషులు. వారికి ఈ మంత్రాలు ధ్యానంలో దైవంచే అనుగ్రహించబడ్డాయి. ఇవి వారు రచించినవి కావు. మనస్సులో ఊహించి, కల్పించినవి కావు. అందుకే వాటిని మనం మంత్రాలు అంటాం.

కనుక వారు మనకు ఏ రూపంలో, ఏ భాషలో వాటిని ఇచ్చారో అదే రూపంలో, అదే భాషలో ప్రయోగించటం సబబుగా ఉంటుంది. దానివలన ఒక పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాక మంత్రశాస్త్ర ప్రకారం ఈ మంత్రాలను సరిగా ఉచ్చరించినప్పుడు అవి వినేవారి మనస్సులలో ఉత్కృష్టమైన ఉల్లాసభరిత స్పందనలను కలుగజేస్తాయి.

కొన్ని శతాబ్దాలుగా వేలమంది పవిత్ర మనస్సుతో, విశ్వాసంతో అవే అక్షరాల కూర్పుతో భగవంతుణ్ణి ఉపాసిస్తూ వస్తున్నారు కనుక దైవశక్తి వాటిలో గర్భితంగా దాగి ఉంటుంది. మంత్రాలు శబ్దరూప పరబ్రహ్మగా మారతాయి.

ఇంతకుముందు తెలిపినట్లు అవి పరదైవమే ప్రసాదించినవి కాబట్టి మంత్రమంటే శబ్దరూప పరబ్రహ్మమే. కనుక వీటిని ఇతర భాషలలో చెప్తే అవి కేవలం అనువాదాలౌతాయి కాని 'మంత్రాలు' కావు.

ఐతే ఒక పని చేయవచ్చు పూజలో చేసే కర్మలను గురించిన విషయాల వివరాలు మంత్రాలు, వాటియొక్క అర్థం, వాటిని ప్రయోగించే పద్ధతులను గురించి ప్రాంతీయ భాషలలో వివరించి చెప్పి తర్వాత సంస్కృతంలోనే వాటిని ఉచ్చరించి, విధ్యుక్తరీతిలో పూజాదులను చేస్తే అది అందరికీ ఇతోధికంగా తోడ్పడుతుంది. ఇతర మతాలలో కూడా ధర్మకార్యాలన్నీ వాటి మూలశాస్త్రాలు ఏ భాషలలో ఉన్నాయో ఆ భాషలలోనే నెరవేర్చబడతాయన్న సంగతి మనం మరచిపోకూడదు.

రచన: స్వామి హర్షానంద

18, మే 2020, సోమవారం

మనుస్మృతి లో శూద్రులను అణగద్రొక్కారనేది నిజామా, విశ్లేషణ ! - Manusmruti, Sudrulanu Anagdokkevaara

మనుస్మృతి లో శూద్రులను అణగద్రొక్కారనేది నిజామా, విశ్లేషణ ! - Manusmruti, Sudrulanu Anagdokkevaara

 శూద్రులను అణగద్రొక్కారా?: 

శూద్రులను గురించి మనువు అభిప్రాయాలని చూద్దాము. “శోచంతి ఖిద్యస్త ఇతి శూద్రా" కష్టపడేవారని అమరము. బ్రాహ్మణులు విరాట్పురుషుని ముఖం నుంచి. శూద్రులు పాదాలనుంచి పుట్టారని మనుస్మృతి. 
 • ➣ శరీరంలో ముఖం ఎంత ముఖ్యమో పాదాలు అంతే ముఖ్యము. 
 • ➣ ఛందస్సు వేదపురుషునికి పాదాల వంటిది అన్నదాని భావం కూడా అంతే. 
 • ➣ మనిషి సర్వాం గములతో కూడిన వాడైనప్పటికీ, కాళ్ళు లేకపోతే ఎంత కష్టమో, అట్లాగే కష్టపడి
 • ➣ పంటలు పండించి, సేవలుచేసే వాళ్లు లేక పోతే కూడా అంతే కష్టము. అదే మనువు భావంగా కన్పిస్తుంది.
 • ➣ అట్లాకాకపోతే అంటరానివాడైన శూద్రుడు కూడా ఆ విరాట్పురుషుని నుంచే పుట్టినట్లుగా ఎందుకు వర్ణిస్తాడు? కనుక పై కులాల వారందరికీ శూద్రుడే ఆధారభూతుడని అర్థం చేసుకోవాలి.
అదీకాక - పౌండ్రకులు, ఓడ్రులు, ద్రావిడులు, కారిభోజులు, యవనులు, శకులు, పారదులు, పప్లవులు, చీనులు, కిరాతులు, దరదులు, ఖశులు మొదలైనవారు సంస్కార రాహిత్యం వల్లనే శూద్రులయినారని చెప్పబడింది. కనుక సంస్కారదూరులైన వారంతా ఆ రోజులలో శూద్రులుగా పరిగణింపబడే వారని తెలుస్తుంది
 • ➣ అంతేకాదు - వృద్ధుడైన శూద్రుడు బ్రాహ్మణునికి గౌరవింపదగినవాడేనట.
 • ➣ ఆకలితో ఉన్న బ్రాహ్మణుడు శూద్రునికంటె తక్కువ వారి ఇంటకూడా భోజనం తినవచ్చును. అందుకు బ్రాహ్మణాలులైన విశ్వామిత్రుడు, భరద్వాజుడు వంటివారే నిదర్శనము.
 • ➣ కనుక వీటన్నింటిని బట్టీ ఆలోచిస్తే ఆనాటి శూద్రులు, మనమనుకొనే శూద్రులు కారనిపిస్తోంది. 
అయితే - శూద్రుడు తాకితే అతని నాలుక కోసి వెయ్యాలని, శూద్రుడు ఉన్నత జాతి స్త్రీతో రమిస్తే లింగచ్ఛేదం చెయ్యాలని మనుస్మృతిలో కన్పిస్తోంది. అది తీవ్రమైన నాటి శిక్షావిధానానికి నిదర్శనం ఎందుకంటే దొంగతనం చేస్తే శిరచ్చేదం చెయ్యమని మనువే చెప్పాడు. 

ఏమైనప్పటికీ అంత క్రూరమైన శిక్షలు అలనాటి పరిస్టుల బట్టి ఉండేవని తెలుస్తోంది. ఏమైనప్పటికి ఇలాంటివి సమర్థనీయములు కావు.

రచన: నల్లందిగళ్ లక్ష్మీనరసింహ ఆచార్యులు

6, మే 2020, బుధవారం

శయన నియమాలు, ఆధ్యాత్మిక ఆరోగ్య సూత్రాలు - Sayana niyamalu

శయన నియమాలు, ఆధ్యాత్మిక ఆరోగ్య సూత్రాలు - Sayana niyamalu

శయన నియమాలు

 •  1. నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశానవాటికలో కూడా పడుకోకూడదు ( మనుస్మృతి)
 •  2. పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు ( విష్ణుస్మృతి)
 •  3. విద్యార్థి,నౌకరు,మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో,వీరిని మేల్కొలపవచ్చును ( చాణక్య నీతి)
 •  4. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి( దేవీ భాగవతము).
 • పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు (పద్మ పురాణము)
 •  5. తడి పాదములతో నిద్రించవద్దు. పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి (ధనం)ప్రాప్తిస్తుంది( అత్రి స్మృతి)
 • విరిగిన పడకపై,ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం ( మహాభారతం)
 •  6. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు ( గౌతమ ధర్మ సూత్రం)
 •  7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య,పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని,మృత్యువు.ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించిన చో ధనము,ఆయువు ప్రాప్తిస్తుంది( ఆచార మయూఖ్ )
 •  8. పగటిపూటఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసం లో 1 ముహూర్తం(48నిమిషాలు) నిద్రిస్తారు.పగటిపూట నిద్ర రోగహేతువు,మరియు ఆయుక్షీణత కలుగచేస్తుంది.
 •  9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు( బ్రహ్మా వైవర్తపురాణం)
 • 10. సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు3 గంటల) తరువాత నే పడుకోవాలి.
 • 11. ఎడమవైపు పడుకోవడం వలన స్వస్థత లభిస్తుంది.
 • 12. దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు యముడు మరియు దుష్ట గ్రహముల  నివాసము వుంటారు.దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు మృత్యువు లేదా అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి.
 • 13. గుండెపై చేయి వేసుకుని, చెట్టు యొక్క బీము కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.
 • 14. పడక మీద త్రాగడం- తినడం చేయకూడదు.
 • 15. పడుకొని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు. ( పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసకబారుతుంది.)
ఈ నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి, మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు..

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

1, మే 2020, శుక్రవారం

16 ముఖ్యమైన 'ఆహార నియమాలు' - Ahara Niyamalu


16 ముఖ్యమైన 'ఆహార నియమాలు' - Ahara Niyamalu
- ఆహార నియమాలు -
 • 1. దేవుడికి నివేదన చేయడానికి ముందు విస్తట్లో ఉప్పు వడ్డించకూడదని పండితులు చెబుతున్నారు. స్వామికి సమర్పించే విస్తట్లో ఉప్పు మాత్రం ప్రత్యేకంగా వడ్డించకూడదని వారు అంటున్నారు.
 • 2. ఇక యోగశాస్త్రం ప్రకారం మనుష్యుని శ్వాసగతి 12 అంగుళాల దాకా ఉంటుంది. భోజనం చేసేటపుడు 20 అంగుళాల దాకా ఉంటుంది. మాట్లాడితే శ్వాసగతి ఎక్కువవుతుంది. కాబట్టి ఆయుష్షు తగ్గుతుంది. కనుక ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు.
 • 3. అలాగే త్రయోదశినాడు వంకాయ తినకూడదు. అష్టమి నాడు కొబ్బరి తినకూడదని, పాడ్యమినాడు గుమ్మడికాయ తినకూడదని, పురాణాలు చెబుతున్నాయి. దొండకాయ తింటే వెంటనే బుద్ధి నశిస్తుంది.
 • 4. రాత్రి అన్నం తినేటపుడు దీపం ఆరిపోతే విస్తరాకునుగాని, పాత్రనుగాని చేతులతో పట్టుకొని సూర్యుణ్ణి స్మరించాలని దీపాన్ని చూసి మిగిలినది తినాలని అప్పుడు మరోసారి వడ్డించుకోవద్దని పెద్దలంటారు.
 • 5. రాత్రి తింటూ ఉన్నప్పుడు తుమ్మితే నెత్తిపై నీళ్ళు చల్లడం, దేవతను స్మరింపచేయడం ఆచారంగా ఉంది. రాత్రి పెరుగు వాడకూడదు. ఒకవేళ వాడితే నెయ్యి, పంచదార కలిపివాడవచ్చు. ఇలా చేస్తే వాతాన్ని పోగొడుతుంది.
 • 6. రాత్రిళ్లు కాచిన పెరుగును మజ్జిగపులుసు మొదలైనవి) వాడకూడదు. దేశవాళీ ఆవునేయి కంటికి మంచిది. దేశవాళీ ఆవు మజ్జిగ చాలా తేలికైనది. అందులో సైంధవలవణం కలిపితే వాతాన్ని పోగొడుతుందని, పంచదార కలిపితే పిత్తాన్ని పోగొడుతుందని, శొంఠికలిపితే కఫాన్ని పోగొడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 • 8. నలుగురు కూర్చొని తింటూ ఉన్నప్పుడు మధ్యలో లేవకూడదు. తేగలు, బుర్రగుంజు, జున్ను, తాటిపండు మొదలైనవి వేదవేత్తలు తినరు. మునగ, పుంస్త్వానికి (మగతనానికి) మంచిదంటారు.
 • 9. ఆకలితో బాధపడేవారు కోడి, కుక్క మొదలైనవి చూస్తూ ఉండగా తినకూడదన్నారు. దృష్టిదోషం పోవడానికి ఇది చదవాలి.
 • 10. ఎప్పుడూ నిర్ణీత సమయం లోనే భోజనం చెయ్యాలి . ( అందువలన బయోలాజికల్ క్లాక్ సక్రమంగా ఉంటుంది )
 • 11. ఆహారం నెమ్మదిగా పూర్తిగా నమిలి తినాలి ( ఘన పదార్ధాలను త్రాగండి అంటారు . అంటే నోటిలోనే సగం నమలబడాలి . అందువలన లాలాజలం పూర్తిగా కలిసి , ముద్దా మింగడం సులువు అవుతుంది . పిండి పదార్ధాలు పూర్తిగా జీర్ణం అవుతాయి . కడుపులో ఊరే ఆమ్లాలకు లాలాజలం ( క్షారం ) విరుగుడు గా పనిచేస్తుంది .
 • 12. ఆహార నియమాలను పాటించే వ్యక్తికి ఔషధాల అవుసరం ఏమి ఉంటుంది ? ఆహార నియమాలను పాటించని వ్యక్తికి ఔషధాలు ఏమి ఫలితాలను ఇవ్వగలవు ?
 • 13. పధ్యే సతి గదార్తస్య కి మౌషద నిషేవనై:
 • వినాపి భేశాజేవ్యర్ది : పత్యాదేవ్ నివర్తత
 • న తు పథ్య విహీనస్య భేశాజానాం శథైర్యపి
 • అంటే రోగికి ఔషధాల అవుసరం లేకుండానే కేవలం నియమిత ఆహారం పాటించడం వలన వ్యాధులు దూరమవుతాయి .
 • 14. రోగికి ఆహారం పై నియంత్రణ లేక పోతే మాత్రం అత్యుత్తమ మైన మందులు కూడా ఫలితాన్ని ఇవ్వలేవు అని అర్ధం .
 • 15. అన్నం బ్రహ్మ రసోవిష్ణు: బోక్తా దేవో మహేశ్వర: ఇతి సంచింత్య భుంజానం దృష్టిదోషో నబాధతే అంజనీగర్భంసంభూతం కుమారం బ్రహ్మచారిణం దృష్టిదోషవివానాశాయ హనుమంతం స్మరామ్నహం||
 • 16. అనగా అన్నం బ్రహ్మం, అన్నరసం విష్ణురూపమై ఉన్నది. తినువాడు మహేశ్వరుడు, ఇట్లా చింతిస్తే దృష్టిదోషం ఉండదని పండితులు అంటున్నారు.
సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

30, ఏప్రిల్ 2020, గురువారం

అగ్ని హోత్రము - Agni Hotramu

 అగ్నిహొత్రం
కింద చెప్పబొవు సనాతన అగ్ని కార్యం సులువుగా ఉన్నా , తప్పకుండా మమ్మల్ని సంప్రదించకుండా చేయరాదు.

అగ్నిహోత్రం గురించి సంపూర్ణ వివరణ: 
ప్రస్తుతం మన పరిస్థితి ఎంత దారుణంగా మారిందో మీకు అనుభవపూర్వకంగా అర్థం అవుతుంది కదా ! ఇలాంటి సమస్య రావడానికి ప్రధానకారణం. మనకి, ప్రకృతికి మధ్య ఉన్న బంధం చెరిగిపోవడమే.

ప్రకృతి ఒక నియమబద్దంగా తనపని తాను చేసుకుంటూ వెళ్తుంది. కాని మనుష్యులు ప్రకృతివిరుద్ధంగా ప్రవర్తించడం వలన ప్రకృతి జూలు విదులుస్తుంది. అటువంటి సమయాల్లోనే ఇప్పుడు మనం చూస్తున్న విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇలాంటి దారుణ పరిస్థితుల్లో సమస్త మానవాళిని కాపాడటానికి మన సనాతన సంప్రదాయవాదులు , ఋషులు మనకి అనేక గొప్పగొప్ప నియమాలు ఏర్పరిచారు. ఈ నియమాలు కొన్నివేల సంవత్సరాల నుంచి మన భారతీయుల జీవితాలతో పెనవేసుకుపోయాయి. కాని నాగరికత పేరుతో సంప్రదాయ పద్ధతులు వదిలివేసి మనుష్యులు తమ శక్తిని , ఆయుష్షును కోల్పోతున్నారు.
నిత్యాగ్నిహోత్రం సాక్షిగా వైదిక వివాహం చేసుకుంటున్న విదేశీయులు !
నిత్యాగ్నిహోత్రం సాక్షిగా వైదిక వివాహం చేసుకుంటున్న విదేశీయులు !
నిత్యాగ్నిహోత్రం
మన సనాతన భారతీయుల గృహాల్లో నిత్యం అగ్నిహోత్రం వెలుగుతూ ఉండేది. దీనికి కారణం ఆ అగ్నిహోత్రం నందు అనేకరకాలైన ఔషధ మూలికలను మండించడం ద్వారా చుట్టుపక్కల గాలిలో ఉండే వైరస్ మరియు బ్యాక్టీరియా సమూలంగా నాశనం అవుతాయి. ఇలా ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యంతో సంపూర్ణ ఆయుష్షుతో జీవించేవారు. మనందరం మరిచిపోయిన మన సనాతన సంప్రదాయం అయిన అహోగ్నిత్రం గురించి , దాని గొప్పతనం గురించి సంపూర్ణంగా మీకు వివరిస్తాను . 

అసలు మొదట అగ్నిహోత్రం అంటే ఏమిటి?
సరిగ్గా సూర్యోదయం , సూర్యాస్తమయ సమయముల యందు పిరమిడ్ ఆకారపు రాగిపాత్రలో అగ్నిని రగిలించవలెను. 
 • ⧫ అగ్నిహోత్రమునకు ఎండిన ఆవుపిడకలు, 
 • ⧫ ఔషధయుక్తమైన ప్రత్యేకమైన వనమూలికలు అనగా జిల్లేడు , 
 • ⧫ మోదుగ , 
 • ⧫ చండ్ర , 
 • ⧫ దర్భ , 
 • ⧫ గరిక వగైరా వంటి మాత్రమే వాడవలెను. 
ఒకవేళ అటువంటి మూలికలు దొరకానిచో ముండ్లు లేనివి , చేదు లేని తియ్యటి పండ్లు కాయు ఏ చెట్టునైనా ఉపయోగించవచ్చు. ఆవునెయ్యి , గోధుమరంగు బియ్యపు అన్నమును హావిస్సుగా అగ్నికి అర్పించుచూ మీకు వచ్చింది ఏవైనా ఒకటి రెండు మంత్రాలను ఆ సమయములో ఉచ్చరించవలెను.

ఇట్టి అగ్నిహోత్రమును సులభముగా ఎవరైననూ ఆచరించవచ్చు. వాతావరణంలో ఏ విధమైన మార్పు సంభవించినను అది వెంటనే ప్రాణము మీద ప్రభావం చూపించును. ప్రాణము మరియు మనస్సు అనేది బొమ్మ , బొరుసుల వలే ఒక నాణెముకు రెండువైపులు అని చెప్పవచ్చు.

ఇది వేదములోని హోమథెరఫీ విధాన ప్రక్రియ వివరణము. మనము అగ్నిని ప్రేరిపించినప్పుడు వాతావరణములో మార్పు కలుగుట సహజమే కదా ! మంత్రోచ్చారణ చేసినప్పుడు ఆ మంత్రాల ప్రకంపనాలు వాతవరణం లో ప్రయాణించును. ఈ అగ్నిహోత్ర ప్రభావం బాలుర మీద అత్యంత ప్రభావం చూపించును.అత్యంత తెలివి,పరిపూర్ణత,దయ సంపన్న గుణములతో వారు ప్రవర్తించును. అగ్నిహోత్రపు బూడిద మీద పరిశోధన చేసిన జర్మనీ పరిశోధకులు ఇది ఒక మహోత్తర శక్తివంతమైన ఆయుధం అని క్యాన్సర్ వంటి మొండివ్యాధులను కూడా నయం చేయగలదని తెలుసుకొన్నారు.
నిత్యాగ్నిహోత్రం ఆచరిస్తున్న విదేశీయులు !
నిత్యాగ్నిహోత్రం ఆచరిస్తున్న విదేశీయులు !
ఇప్పుడు మూలికల ఔషధ గుణాలు వివరణ: 
 • ⭄ అందులో మొదటిది జిల్లేడు.ఈ జిల్లేడులో తెల్లది , ఎర్రది అని రెండుజాతులు కలవు. 
 • తెల్లజాతికి గుణం ఎక్కువ అని ఆయుర్వేద వైద్యుల సూచన.
 • ⭄ కఫ, వాత వ్యాధులను హరించును .
 • ⭄ ప్రథమ దశలోని కుష్టువ్యాధిని నయం చేయును . 
 • ⭄ జీరకోశము నందలి జబ్బులను,
 • ⭄ పేగులయందలి క్రిములనుచంపును. 
 • ⭄ దీని ఆకుపోగ ఉబ్బసరోగులకు హితముగా ఉండును.
 • ⭄ దీని వేరు బెరడు నీటిలో వేసి కాచి ఆ నీటిని కొద్దిగా తాగించిన చలిజ్వరం , రోజుమార్చి రోజు వచ్చే జ్వరములు తగ్గును.
సంకలనం: ఋషి పరం పర

22, ఏప్రిల్ 2020, బుధవారం

దేవాలయములో ప్రదక్షిణ చేసేటప్పుడు పరిగెడుతున్నట్టు అడుగులు వేయకూడదట ఎందుకు? - Devalayam, Pradikshinalu


దేవాలయములో ప్రదక్షిణ చేసేటప్పుడు పరిగెడుతున్నట్టు అడుగులు వేయకూడదట ఎందుకు? - Devalayam, Pradikshinalu
నము దేవాలయమునకు వెళ్ళాలనుకున్నప్పుడు, స్వామివారిని దర్శించడానికి ముందు దేవాలయంలో ప్రదక్షిణించడంలో తొందర పనికిరాదు. 

మనస్సును ప్రశాంతపరచి, స్వామివారిని మనస్సును ధ్యానిస్తూ మంత్రం గాని, అష్టోత్తరం గాని, ఇవి ఏవి తెలియని వారు ఆ స్వామివారి నామజపము చేస్తూ భక్తితో ఆ దైవం చుట్టూ ప్రదక్షిణ చేయాలి.  ఆలయంలోని గర్భగుడిలో దేవతా విగ్రహం ఉంటుంది. ప్రతి నిత్యం పురోహితులు జరిపే అర్చనలలోని మంత్రాల ద్వారా ఆ మంత్రాలలో ఉండే శక్తిని విగ్రహం క్రిందనున్న యంత్రం ఆ శక్తిని గ్రహించి, ఆ శక్తి ద్వారా మన కోర్కెలను తీరుస్తుంది. 

కనుక భగవదర్శనానికి వెళ్ళినప్;పుడు మన మది నిండా భగవంతుని రూపమే నింపి నిదానంగా ప్రదక్షిణ చేసి ఆ స్వామి కౄపకు పాత్రులు కావాలి.

సంకలనం: నాగవరపు రవీంద్ర

20, ఏప్రిల్ 2020, సోమవారం

తులసి పూజ - Tulasi Pooja

తులసి పూజ - Tulasi Pooja
తులసి పూజ
తులసీ దయాపూర్ణకలశీ - తులసి పూజ, దళచయనం

తులసి పూజ, తులసి వివాహం ఈ నెలలో వచ్చిన విశేషమైన పూజలు. తులశమ్మ విశేషాలు కొన్ని తెలుసుకుందాం.

తులసి పూజ - తులసి ప్రాశస్త్యమ్‌

శ్లో|| యన్మూలే సర్వతీర్ధాని యన్మధ్యే సర్వదేవతా
య దగ్రే సర్వవేదశ్చ తులసీం త్వా నమామ్యహమ్‌ ||

శ్రీ మహాలక్ష్మీ నారాయణ స్వరూపిణియైన "తులసి" యొక్క మూలంలో సర్వతీర్ధాలు, మధ్యభాగమందు సమస్త దేవతలు, తులసిమొక్క పైభాగమున సర్వవేదాలతో కొలువైవున్న తులసి మాతకు ముందుగా నమస్కరించుకుని, అంతటి పూజ్యనీయమైన ఆ తులసి ఆవిర్భావ చరిత్ర - తులసి ప్రాశస్త్యమును గూర్చి, మన పురాణములలో ఎన్నో కధలు కానవస్తున్నాయి. వాటిలో ఒకగాధను సమీక్షించుకుందాం!

"బ్రహ్మవైవర్తపురాణ"మందు గల తులసి వృత్తాంతము ఇలా ఉన్నది. ధర్మధ్వజుడు, మాధవి అను దంపతులకు అతిలోక సౌందర్యవతియైన కుమార్తై కలిగినది. వారు ఆ బిడ్డకు "బృంద" అను నామకరణము చేసుకుని అల్లారు ముద్దుగా పెంచుకోసాగిరి. ఆమెకు వివాహవయస్సురాగనే శ్రీహరిని వివాహమాడతలచి బదరికాశ్రమము జేరి బ్రహ్మనుగూర్చి ఘోరముగ తపమాచరించినది. బ్రహ్మదర్శన మిచ్చి నీ కోరిక ఏమిటో చెప్పుమనగా "నేను రాధాశాపముతో నున్న రుక్మిణిని, నాకు శ్రీకృష్ణుడే భర్తగా పొందుటకు"- వరమీయమని ప్రార్ధించినది.

అందులకు బ్రహ్మ ! నీ కోరిక తప్పక నెరవేరగలదు. కాని! ముందుగా గోలోకనివాసి సుదాముడే ముందుగా నీకుభర్త కాగలడు, అనంతరమే నీవు కోరిన వాడే నీకు పతియగును అని వరమిచ్చి అంతర్ధానమయ్యెను.

ఇలా ఉండగా బ్రహ్మదేవుడు చెప్పిన సుదాముడు పుష్కరకాలము శాపకారణముగా భూలోకమున శంఖచూడుడై జన్మించి తపమాచరించసాగెను. అతని తపస్సునకు మెచ్చి బ్రహ్మ ఏమివరము కావాలో కోరుకోమన్నాడు. అంత శంఖ చూడుచు "లక్ష్మీభూలోకమున పుట్టినదట! నాకామెతో వివాహాము చేయించమని వేడుకొనెను" బ్రహ్మ 'తధాస్తు' అని పలికి ఆమె బదరికాశ్రమమున నున్నది. ఆమె నీకు తప్పక లభ్యముకాగలదు అని యంతర్ధానమందెను. అనంతరము శంఖ చూడుడు బృందవాద ప్రతి వాదములను గమనించి అప్పుడు వార్కి మరల బ్రహ్మ ప్రత్యక్షమై వారి వారి అభీష్టములు నెరవేరుటకు వార్కి వైభవముగా వివాహము గావించెను.

ఇక శంఖచూడునకు లక్ష్మీయంశతో నున్న భార్య లభ్యమగుసరికి! అష్ట్తెశ్వర్యము లతో తులతూగుచూ అతిసమయము పెంచుకుని స్వర్గాధిపత్యము పొందగోరి దేవరాజ్యమును కొల్లగొట్టి; దేవతలను పలు ఇక్కట్లు పాలు చేయుటయే కాకుండా; పరమేశ్వరుని చెంతకేగి, శివా! నీ భార్య సుందరాంగి. అమెను నాకు వశ్యురాలును చేయుము లేనిచో యుద్ధమునకు తలపడమని ఘోరముగా శివునితో యుద్ధము చేయసాగెను. వెంటనే శ్రీహరి వారిని సమీపించి "శివా! వీడు అజేయుడు అగుటకు కారణం! ఈతని భార్య మహాపతివ్రత. ఆమె పాతివ్రత్య భంగము నేనాచరించదను. నీవు వీనిని వధించుము." యని యుక్తి చెప్పెను.

అనంతరము మాయా శంఖచూడుని వేషము ధరించి యున్న శ్రీహరిని చూచి బృంద తన భర్తే వచ్చినాడని భ్రమించి! ఆతనికి సర్వోపచారములుచేసి శ్రీహరి చెంతకు చేరగానే! ఆమె పాతివ్రత్యము భగ్నమగుట గ్రహించి శివుడు శంఖచూడుని సంహరించగా! నాతడు దేహమును విడచి "సుదాముడై" గోలోకమునకు పోయెను. బృంద తన ఎదుట ఉన్నది మాయా శంఖచూడుడని గ్రహించి శ్రీహరిని "శిలారూప మందుదువుగాక" యని శపించగా! తిరిగి ఆమెను నీవు "వృక్షమగుదువుగాక" యని శపించెను. ఆవిధంగా శ్రీహరి గండకీనదిలో సాలగ్రామ శిలగాపుట్టి; బృంద తులసీ వృక్షమై పోయి ఇద్దరూ ప్రపంచముచే పూజనీయస్వరూపములు పొందినట్లుగా బ్రహ్మవైవర్త పురాణగాధ ద్వార విదతమగుచున్నది.

ఒకసారి పరమేశ్వరుడు కుమారుడైన కుమారస్వామిని చెంతకుం చేర్చుకుని; పుత్రా!
"పుత్రా! సకల వృక్షములలోన తులసియొక్కటయే
పూజ్యమైక క్ష్మారుహంబు దాని పత్రములను దాని
పుష్పములను బ్రాణ సమములగును అచ్యుతనకు."

మరియు వృక్షాలన్నిటియందు తులసి శ్రేష్ఠమైనది, శ్రీహరికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైనది.
"తులసిపూజ" తులసీ స్త్రోత్రం చదవడం, తులసి మొక్కలో పోసిన నీటిని శిరస్సున జల్లుకోవడం, తులసీవనమును పెంచి వాటి మాలలు శ్రీహరికి సమర్పించుట ఎంతో! పుణ్యప్రదమైనవి. గోదాదేవి తులసీవనంలోనే అయోనిజగా విష్ణుచిత్తునింట వెలసి శ్రీరంగనాధుని ఇల్లాలయింది.

శ్లో|| వశిష్ఠాది ముస్తోమై: పూజితో తులసీవనే
తదా ప్రభృతి యద్విష్ణు : బ్రతిజ్ఞాం కృతవాన్‌ ప్రభు:
తస్మిన్‌ తులస్యాంతు య: పూజాంకురు తేనర:
సర్వపాప వినిర్ముక్త : మమసాయుజ్య మాప్నుయాత్.

వశిష్ఠాది మునిగణముచే ఎన్నో విధములుగా స్తోత్రపూర్వకముగా శ్రీహరి తులసీ వనమందు పూజలందుకొని నన్ను "కార్తీక శుద్ధద్వాదశి" నాడు విశేషించి ఎవరు బూజచేయుదురో! అట్టివారి సమస్తయొక్క పాపములు అగ్నిలోపడిన మిడుతలు వలె భస్మమయి వారు తప్పక నా సాన్నిధ్యమును పొందుదురని ప్రతిజ్ఞ చేసెనట!

శ్లో|| తులసీవ్రత మహాత్మ్యం శ్రోతవ్యం పుణ్యవాంచ్చిన:
యదిచ్చేద్విష్ణు సాయుజ్యం శ్రోతవ్యం బ్రాహ్మ్ణ్తణ్తెస్సహ
విష్ణో : ప్రీతిశ్చ కర్తవ్యా శ్రోత వ్యాతులసీకధా
ద్వాదశ్యాం శ్రవణాత్తస్యా: పునర్జన్మ న విద్యతే.

విష్ణు సాన్నిధ్యముగోరి విష్ణుదేవునకు యేమాత్రమైన ప్రీతి జేయవలయునునని తలచేవారు తులసీ వ్రతమహాత్మ్యము తప్పక వినవలయును. అందునా! ఆ వ్రత కధను "క్షీరాబ్ధిద్వాదశి" రోజున తులసీ కధ వినువార్కి, చదువువార్కి, పూర్వజన్మ కృతమైన దు:ఖములన్నియు తొలగిపోయి విష్ణులోకమును పోందుదురు, అని శంకరునిచే "తులసి" కొనియాడబడినట్లు చెప్పబడినది. అట్టి తులసీ బృందావన మందు ఉసిరిమొక్కతో కలిపి "తులసీధాత్రీ సమేత శ్రీమన్నారాయణుని" ఈ కార్తీక ద్వాదశినాడు పూజించుట ఎంతో విశిష్టమైనదిగా పేర్కొనబడినది. మరియు అట్టి తులసీ దళములకు "నిర్మాల్యదోషం" పూజలో ఉండదని కూడా చెప్పబడినది.

కావున! మన హిందూమతంలో "తులసి" ఆధ్యాత్మిక దృష్టిలో విశిష్టమైన స్ధానాన్ని పొందింది. తులసిమొక్క హిందువులకు పూజనీయమైనది. కావున హిందువులు ప్రతిఇంటా తులసి మొక్కను కోటలో పెంచి పూజించుట మనం చూస్తూ ఉంటాము. ఇక పట్టణావాసులైతే అంతలో కొంత జాగా ఏర్పరచుకుని, చిన్నచిన్న కుండీల్లోనో, డబ్బాల్లోనో పెంచి పూజిస్తూ ఉంటారు. కావున 'తులసి' ఉన్న ఇల్లు నిత్యకళ్యాణము పచ్చతోరణంతో శోభిల్లుతూ ఉంటుంది.

ఇక ఈ తులసిని వైద్యపరంగా కూడా చూస్తే! ఆయుర్వేద శాస్త్రంలో 'సప్తతులసి-భరతవాసి' అంటూ..

తులసిని ఏడువిధాలుగా వివరించబడినది. అవి:
 • 1. కృష్ణ తులసి 
 • 2. లక్ష్మీతులసి 
 • 3. రామతులసి 
 • 4. నేల తులసి 
 • 5. అడవి తులసి 
 • 6. మరువ తులసి 
 • 7. రుద్రతులసిగా వివరుస్తారు. 
తులసితో ఆరోగ్యం
 • వైద్యపరంగా వాటి అన్నిటికి ఎన్నో అమోఘమైన ఔషధగుణాలతో కూడి ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం కొనియాడుతోంది. 
 • ప్రతిరోజు ఉదయం రెండు తులసి ఆకులు (కోటలోవికాదు) విడిగా పెంచుకున్న మొక్కలనుండి నమలి మింగితే వార్కి బుద్ధిశక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 
 • మరియు అనేక మానసిక రుగ్మతలు నయమవుతాయని; ఇలా ఎన్నో విశేష గుణాలను చెప్తారు.
 • ఇక దాని కాండముతో తయారుచేయబడ (తులసిమాల)కు ఇటు ఆధ్యాతికపరంగా అటు ఆరోగ్యపరంగా ఎన్నోలాభాలు ఉన్నాయిట !
కావున ఈ "క్షీరాబ్దిద్వాదశి" వ్రతాన్ని ఆచరించి ఇటు ఆధ్యాత్మిక సంపదతో పాటు ఆరోగ్య భాగాన్ని సర్వులమూ పొందుదాం!
తులసీ పూజ
తులసీ పూజ
తులసీ పూజతో సర్వదేవతారాధన
ప్రతి మనిషికీ తల్లి తొలిగురువు అని పెద్దలంటారు. ఆ తల్లిని గురువుగా భావించి, గురుదక్షిణ ఇవ్వడం కొద్ది మందికే సాధ్యం. అటువంటి అసాధారణ వ్యక్తులలో సంగీత త్రయంలోని త్యాగరాజును చెప్పుకోవాలి. సంగీత కుటుంబం నుండి వచ్చిన తల్లి సీతమ్మ సంగీతంలోని ఓనమాలు నేర్పి త్యాగరాజు తొలిగురువయింది.

ప్రతి నిత్యం తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తూ, మధురమైన కంఠంతో పురందరదాసు, రామదాసు, అన్నమయ్యల కీర్తనలు తల్లి పాడుతుంటే వింటూ, గొంతు కలిపి పాడుతూ త్యాగరాజు పెరిగాడు. వంశానుగతంగా వచ్చిన శ్రీరామభక్తి, తల్లి సంకీర్తనల ద్వారా మరింత పరిపుష్టమై, త్యాగరాజును అచిరకాలంలోనే గొప్ప సంగీతజ్ఞుడిగా, వాగ్గేయకారుడిగా తీర్చిదిద్దింది.

తన బంగారు భవితవ్యానికి మార్గదర్శకురాలైన తల్లికి గురుదక్షిణ సమర్పించడమే తన ప్రథమ కర్తవ్యమని త్యాగరాజు భావించాడు. తల్లికి అత్యంత ప్రియమైన తులసీమాతపై కీర్తనలు రచించి తద్వారా ఆమెకు సంతృప్తి కలిగించాడు. ఎన్నో ఔషధగుణాలు కలిగి, సౌభాగ్యప్రదాయినిగా ప్రతియింటా వెలసిన తులసీమాతపై త్యాగరాజు రచించిన కీర్తనలు ఎంతో ప్రసిద్ధి పొందాయి.

సావేరి రాగం - రూపకతాళం
ప॥తులసీ జగజ్జననీ దురితాపహారిణీ॥
చ॥చరణ యుగంబులు నదులకు పరమ వైకుంఠమట
సరసిజాక్షి నీమధ్యము సకల సురావాసమట
శిరమున నైగమకోట్లు చెలగుచున్నారట
సరస త్యాగరాజాది వర భక్తులు పాడేరట

తులసి మొక్క అడుగుభాగాన శ్రీ మహావిష్ణువు సాలగ్రామ రూపంలో ఉంటాడు. విష్ణుపాదాల నుండే గంగ పుట్టడం వల్ల, నదులకు పుట్టిల్లు వైకుంఠమనీ, విష్ణు నివాసమైన తులసియే వైకుంఠమని, మధ్య భాగంలో సకల దేవతలు కొలువుంటారనీ, శిరోభాగం వేద స్వరూపంగా భాసించడం వల్ల, ఒక్క తులసి మాతను పూజిస్తే సకల దేవతలనూ పూజించినట్లే అని త్యాగరాజు తులసీ మహాత్మ్యాన్ని తెలియపరిచాడు.

అనన్యదర్శనాః ప్రాతః మే పశ్యంతి తపోధన
జగత్త్రితయ తీర్థాని తైర్దృష్టాని న సంశయః

ఉదయము నిద్రనుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది. తులసిచెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరిక, మానసిక ఆరోగ్యమునిస్తుంది.

తులసి పూజ చేయు విధానము:
తులసికోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణము చేయాలి, నమస్కరించాలి. దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వ పాపప్రక్షాళన జరుగుతుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము, సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు.

పూజ:
ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి చెట్టు వద్ద నిలుచొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి.
నమస్తులసి కళ్యాణీ! నమో విష్ణుప్రియే! శుభే!
నమో మోక్షప్రదే దేవి! నమస్తే మంగళప్రదే!
బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ!
పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణజీవనీ!
ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్థసంయుతం
యః పఠేత్తం చ సంపూజ్య సోశ్వమేధ ఫలం లభేత్

అని తులసిని ప్రార్థించి, అచ్యుతానంతగోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి. తరువాత క్రింది శ్లోకాన్ని ప్రార్థనా పూర్వకంగా పఠించాలి.
యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం ||
ని చెంబులోని నీళ్లను తులసిచెట్టు మొదట్లో పోసి నమస్కరించాలి.

తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే
నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే ||
ని తులసికోట లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి.

పూజ కోసం తులసీ పత్రాలను ఎలా కోయాలి అన్నదానికి సనాతన ధర్మం ఒక పద్ధతిని తెలియజేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం:
 • 🙙 తులసీం యే విచిన్వంతి ధన్యాస్తే కరపల్లవాః - పూజ చేయటం కోసం తులసి దళాలను త్రెంపిన చేతులు ఎంతో ధన్యములు అని స్కాందపురణం చెప్పింది.
 • 🙙 తులసి చెట్టునుండి దళాలను మంగళ, శుక్ర, ఆది వారములలో, ద్వాదశి, అమావాస్య, పూర్ణిమ తిథులలో, సంక్రాంతి, జనన మరణ శౌచములలో, వైధృతి వ్యతీపాత యోగములలో త్రెంప కూడదు. ఇది నిర్ణయసింధులో, విష్ణుధర్మోత్తర పురాణంలో తెలియజేయబడినది. తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణం అయినట్లు కాదు.
 • 🙙 ఇది వరాహ పురాణంలో చెప్పబడింది. కాబట్టి నిషిద్ధమైన రోజులలో, తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలి పడిన ఆకులతో, దళములతో పూజ చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళములను త్రెంపి దాచుకొని మరుసటి రోజు ఉపయోగించాలి.
 • 🙙 సాలగ్రామ పూజకు మాత్రం ఈ నిషేధము వర్తించదు. సాలగ్రామమున్నవారు అన్ని తిథివారములయందు తులసి దళములను త్రెంపవచ్చు. ఎందుకంటే సాలగ్రామం స్వయంగా విష్ణు స్వరూపం.
 • 🙙 శ్రీమహావిష్ణువు మందిరంలో వచ్చి ఉన్నప్పుడు ఏ దోషాలూ వర్తించవు. ఇది ఆహ్నిక సూత్రావళిలో చెప్పబడింది. స్నానము చేయకుండా మరియు పాద రక్షలు ధరించి తులసి చెట్టను తాకరాదు, దళములను త్రెంపకూడదు. ఇది పద్మపురాణంలో చెప్పబడింది.
తులసి దళాలను ఎలా త్రెంపాలి?
తులసి ఆకులను ఒక్కొక్కటిగా త్రెంపకూడదు. రెండేసి ఆకులు కలిగిన దళముతో కూడిన కొసలను త్రెంపాలి. అన్ని పుష్పాల కన్నా తులసీ మంజరులు (అంతే తులసికి వచ్చే పుష్పాలు) అత్యంత శ్రేష్ఠమని, ఈ మంజరులను కోసేటప్పుడు వాటితోపాటు ఆకులు తప్పనిసరిగా ఉండాలని బ్రహ్మపురాణం చెప్పింది.

తులసిమొక్కకు ఎదురుగా నిలబడి, రెండు చేతులు జోడించి, కింది మత్రాన్ని చదువుతూ పూజా భావంతో మొక్కను కదిలించకుండా తులసి దళాలను త్రెంపాలి. దీనివలన పూజాఫలం లక్షరెట్లు అధికంగా లభిస్తుంది అని పద్మపురాణం చెప్పింది.

మాతస్తులసి గోవింద హృదయానందకారిణి
నారాయణస్య పూజార్థం చినోమి త్వాం నమోస్తుతే

తులస్యమృతజన్మాసి సదా త్వం కేశవప్రియా
చినోమి కేశ్వస్యార్థే వరదా భవ శోభనే

త్వదంగసంభవైః పత్రై పూజయమి యథా హరిం
తథా కురు కురు పవిత్రాంగి! కలౌ మలవినాశిని!

(ఆహ్నిక సూత్రావళి)
శ్రెహరికి ఆనందాన్ని కలిగించే తులసీ మాతా! నారాయణుని పూజ కొరకు నీ దళములను కోస్తున్నాను. నీకు నా నమస్కారములు. అమృతమునుండి జన్మించిన, ఎల్లప్పుడు శ్రీహరికి ప్రియమైన తులసీమాతా! ఆ కేశవుని పూజ కొరకు నీ దళాలను త్రెంపుతున్నాను. నాకు అభయమునివ్వు శుభకరీ! నీ శరీరమునుండి జన్మించిన పత్రములతో ఆ శ్రీహరిని పూజిస్తాను. కలియుగంలో సమస్త దోషములు తొలగించే పవిత్రమైన శరీరము కల తల్లీ! నేను తలపెట్టిన హరిపూజను సాఫల్యము చేయుము.

పూజ చేసిన తరువాత ఒక తులసీదళాన్ని "అచ్యుతానంతగోవింద" అని స్మరిస్తూ నోట్లో వేసుకొని తినాలి. ప్రతిరోజు భక్తిభావంతో ఒక తులసిదళాన్నిసేవించటం వలన సకల రోగాలు నశిస్తాయి, రాబోయే రోగాలు నిరోధించబడుతాయి.

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తులసీ దయాపూర్ణకలశీ అన్నారు ఒక గీతంలో. తులసి అంతటి వైభవము, దయ కల మాత. నిత్యం పూజిద్దాం, దళాన్ని సేవిద్దాం. సకల శుభాలను,ఆరోగ్యాన్ని పొందుదాం.

రచన: శేషగిరి రావు

15, ఏప్రిల్ 2020, బుధవారం

ప్రధమ రజస్వల శుభ మరియు అశుభ విషయములు - Pradhama Rajashwala Subha, Asubha Vishyamuluప్రధమ రజస్వల శుభ మరియు అశుభ విషయములు - Pradhama Rajashwala Subha, Asubha Vishyamulu
స్త్రీ రజస్వల శుభ అశుభ విషయములు
రజస్వల విషయములు ప్రధమ రజస్వల ప్రాతః కాలమునుంచి మధ్యాహ్నములోపు అయిన శుభము. మిగిలిన కాలము అశుభము. ప్రాత కాలము అయినచో నిత్య సుమంగళి గానూ, మథ్యాహ్నం పూట అయినచో గొప్ప ధనవంతురాలవుతుంది. అర్థ రాత్రి అయితే గ్రహ తిథిలను బట్టి శాంతులు చేయించాలి. రజస్వల సరిసంఖ్య తేదీ కన్నా బేసి సంఖ్యా తేది మంచిది.
చిరుగులు లేనివీ, శుభ్రమైనవీ, రంగు గలవి అయిన దుస్తుల్లో ప్రధమ రజస్వల అయితే శుభప్రదములు. 
రజస్వల సమయం మంచిది కాకపోతే నవగ్రహ శాంతితొ పాటు గౌరీదేవి కుంకుమార్చన చేయించుట మంచిది. 

శుభ అశుభ విషయములు:
 • రాజస్వలకు దుష్ట తిధులు: అమావాస్య, ఉభయ పాద్యమిలు, షష్టి, అష్టమి, ద్వాదశి తిదుల యందును పరిఘ యోగముల పూర్వార్ధమునండును, వ్యతీపాత, వైధృతి యోగాములండును, సంధ్యా కాలమునండును, ఉప్పెన, భూకంప మొదలైన వుపద్రవ కాలమండును భద్ర కారణమూ నందును మొదటిసారి రజస్వల అయిన శుభకరము కాదు. సోమ, బుధ, గురు, శుక్ర వారములందు ప్రధమ రజస్వల అయిన శుభ ఫలము, ఆది, మంగళ, శని వారములందు అశుభ ఫలము కలుగుతుంది. 
 • శుభ నక్షత్రములు: అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ , శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి యీ నక్షత్రములందు ప్రధమ రజస్వల అయిన సౌభాగ్యము, సౌఖ్యము, సంతానము, ఆయువు, ధనము కలుగుతుంది. మిగిలిన నక్షత్రములు అశుభ ఫలములు ఇచ్చును. కావున శాంతి చేయాలి. గ్రహణ సమయములందు, సంక్రాంతి యందు, అశుభమైన నిద్రా సమయములందు, అర్ధరాత్రి యందు ప్రధమ రజస్వల అయినచో యుక్తమైన శాంతులు నిర్వహించాలి.
 • శుభ తిధులు: తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిధులు శుభము. 
 • లగ్న గ్రహ ఫలము: ప్రదమ రాజోదర్శన సమయమున కేంద్ర, కోణ, లాభ స్థానములందు శుబ గ్రహములు, తృతీయ, షష్ట లాభ స్థానములందు క్రూర గ్రహములు శుభ ఫలములిస్తాయి. చంద్రుడు అష్టమ స్థానమునందు వుండిన పతి నాశనము కలుగ జేస్తాడు. కాని చంద్ర తారాబలములు సంపన్నమైనపుదు పుత్ర, ధన సంపత్తులు కలుగుతాయి. కుజుడైనాను లేక చంద్రుడైనాను లగ్నమునకు 3, 6, 10 స్తానములన్డున్నచో సంపంనులగు కుమారులు కలుగుతారు. 
 • నక్షత్ర గ్రహ ఫలము: రజస్వలా సమయ నక్షత్రమందు గురుడుగాని, శనిగాని వున్నాను, యే గ్రహము లేకున్నను శుభము.  రజస్వలా సమయ నక్షత్రము నందు కుజుడున్నను బుధ శుక్రులు కలిసి వున్నాను, రవి వున్నాను రాహు కేతువులున్నను అశుభము.
రసజ్వల
రసజ్వల అయిన బాలిక ఊహా చిత్రం
సమయ మరియు స్థాన ఫలితములు:
 • తన యింటి యందును, గోడల చావిదియండును, స్వగ్రామ మధ్యమందు, జల సమీపమున, ఇంటి ఆవరణ మధ్య ప్రధమ రజస్వల అయిన శుభము.
 • గ్రామము బయట, ఇతర గ్రామములందు, నగ్నముగా వున్నపుడు ఇతరుల యిండ్లలోను ప్రదమ రజస్వల అయిన అశుభము.
వేళా విశేషములు: ప్రాతః కాలం చిర సౌభాగ్యం, ఉషః కాలం శోవ్భాగ్య లోపం, పూర్వాహ్నం పుణ్య క్షేత్ర దర్శనం, మధ్యాహ్నం ధనవతి, పుత్రవతి, సాయంత్రం జారగునం, సంధ్యలందు చేడుప్రవర్తన కలది, అర్ధరాత్రి బాల వైధవ్యం కలుగును. 

రాత్రి వేళ నిర్ణయం: రాత్రి రజస్వల అయినచో రాత్రిని మూడు భాగాలుగా చేసి రెండు భాగముల కాలము పూర్వదినము, మూడవ భాగాకాలమున తదుపరి దినమునకు చెందుతుంది.

వస్త్రఫలము: తెల్లబాట్ట కట్టుకొని రజస్వల అయిన సౌభాగ్యవతి, గట్టి బట్ట కట్టుకొని రజస్వల అయిన పతివ్రతయు, దుకూల వస్త్ర దారియైన పట్టపురాణి యగును, నూతన వస్త్రము ధరించాగానే శుభ సంపన్నురాలగును, చిరిగినా బట్ట కట్టుకొనిన దౌర్భాగ్య రాలగును, యెర్రని బట్టకట్టుకోనిన వ్యాధి గ్రస్తురాలగును, నల్లని వస్త్రము ధరించినదైన దరిద్రురాలగును.

రసజ్వలకు నక్షత్ర ఫలములు
 •  అశ్వని : భోగభాగ్యములు పొందును. మొదటి సంతానం నష్టం.
 •  భరణి : అనారోగ్యము, భీతి, అల్పాయువు.
 •  కృత్తిక : కష్టనష్టములు అల్పసంతానం కలది చంచలము.
 •  రోహిణి : ధనధాన్యవృద్ధి, పుత్ర సంతావంతురాలు.
 •  మృగశిర : సుఖసౌఖ్యాదులు, దైవభక్తి కలది, యోగ్యురాలు.
 •  ఆర్ద్ర : నీతినియమములు లేనిది, దురదృష్టవంతురాలు.
 •  పునర్వసు : స్వగృహమును విడిచిపెట్టునది.
 •  పుష్యమి : పతిభక్తి గలది, సంతానం కలది యోగ్యురాలు.
 •  ఆశ్రేష : దుష్టసంతానం కలది పతి సౌఖ్యము తక్కువ కలిగినది.
 •  మఘ : తండ్రి యింటి వద్ద ఉండునది, భర్తకు కష్టం తెచ్చునది.
 •  పుబ్బ : గర్భస్రావం కలది దీనురాలు అనారోగ్యం కలది.
 •  ఉత్తర : సంతానం కలది. మంచిసౌఖ్యముగలది.
 •  హస్త : మంచిపుత్రికలు కలది. బందువులను ఆదరించునది.
 •  చిత్త : పతిభక్తిగలది. లలితకళల యందు ఆశక్తికలది.
 •  స్వాతి : పుత్రసంతానంగలది, పతివ్రత, భోగి.
 •  విశాఖ : ధనధాన్యములు లది విలాసవమ్తురాలు, భోగి.
 •  అనూరాధ : పుత్రసంతానంకలది పవిత్రురాలు.
 •  జ్యేష్ఠ : దుష్ఠ ప్రవర్తనకలది. పతినిపోగొట్టుకొనునది.
 •  మూల : పుణ్యక్షేత్రసంచారి, ధర్మంచేయుట యదిష్టతకలది.
 •  పూర్వాషాడ : వైధ్యవ్యము పొందునది. హంతకురాలు అగును.
 •  ఉతరాషాడ : పుణ్యకార్యములు చేయునది. సంపదలు గలది, భోగి శ్రవణం : దీర్ఘాయుర్దాయం కలది. పుత్రసంతానం కలది.
 •  ధనిష్ఠ : ధనధాన్యములు స్త్రీ సంతానం కలది. శతబిషం : సుఖ సౌఖ్యములు, ధన వృద్ధి కలది.
 •  పూర్వాభాద్ర : మూర్ఖత్వము కలది. అనారోగ్యము గల భర్త కలది.
 • ✹ ఉత్తరాభాద్ర : జ్ఞానము కలది. బంధువర్గము కలది. పవిత్రురాలు.
 • ✹ రేవతి : ధనవంతురాలు. పుణ్యకార్యములు చేయునది. మంచిజీవనము చేయునది.
క్రతువు:
 • ⭄ ప్రధమ రజస్వల అయిన కన్యకు అక్షతలు తలపై వేసి ఆసనమేసి కూర్చుండ బెట్టాలి. 
 • ⭄ దీపమున్న గదిలోనే కన్యను ఉంచాలి. సువాసినులకు శ్రీ గంధము, పుష్పములను, తమ్బూలములను లవణము, పెసలు మొదలగునవి ఇవ్వాలి. 
 • ⭄ ప్రధమ రజస్వల అయిన వస్త్రముతోనే మూడు రోజులు ఉంచాలి. 
 • ⭄ ఎవరిని తాకకుండా జాగ్రత్త గా, ప్రశాంతముగా, ఉండునట్లు చూడాలి.
 • ⭄ భోజన విషయంలో పులగము, నెయ్యి, పాలు వంటి సాత్విక ఆహారము ఉప్పు, పులుపు, కారము లేకుండా ఇచ్చుట మంచిది, నాలుగవ రోజు స్నానము చేయించి నూతన వస్త్రములు కట్టించాలి. 
 • ⭄ మూడు దినములు ఎవరిని తాకకూడదు. 
 • ⭄ అభ్యంగనము, కాటుక, స్నానము, పగలు నిద్రించుట , అగ్ని ముట్టుట, ప్రాసనము, సూర్యావలోకనము, భూమిపై గీతాలు గీయుట చేయుట చేయకూడదు. 
 • ⭄ క్రింద పడుకోవాలి, ఆవుపాలు, పెరుగు, మజ్జిగ, తాంబూలము, గంధమాల్యములు ఉపయోగించరాదు.
ఆరోగ్యం అంతరార్ధం:
 • ⧫ రజస్వలా అయిన స్త్రీ మొదటి దినమునండు చండాల స్త్రీ సమానురాలు,
 • ⧫ రెండవ దినమందు పతితురాలితో సమానురాలు,
 • ⧫ మూడవ దినమునండు చాకలి స్త్రీతో సమానము,
 • ⧫ నాలుగవ దినమున కూడా శూద్ర స్త్రీ సమానురాలు,
 • ⧫ ప్రధమ రజస్వల అయిన స్త్రీ అయిదవ దినమందు దేవ పితృ కార్యములందు పరిశుద్దురాలూ అన్నారు.
 • ⧫ నాలుగవ దినమందు స్నాముచేత శుచి కాగలదు.
బహిష్టు అయిన స్త్రీ మూడు రోజుల తరువాత శుద్ధి అవుతుంది. తిరిగి మల్లి పంతొమ్మిది రోజులలో బహిష్టు అయిన ఒక దినముతో శుద్ధి అట్లుగాక ఇరవై రోజుల అనంతరము ఎప్పుడైనా బహిష్టు అయిన మూడు రోజుల తరువాత శుద్ధి అగును.

సంకలనం: ప్రసాద్

19, మార్చి 2020, గురువారం

సదాచారాలు - Sadaacharamulu

సదాచారాలు - Sadaacharamulu
సదాచారాలు ఏవేవి ?
 • 1. దేవతలను, గోవులను, బ్రాహ్మణులను, సిద్ధులను, ఆచార్యులను పూజించాలి. 
 • 2. చిరగని వస్త్రద్వయాన్ని, విష్ణుక్రాంతం మొదలగునవి ఓషదుల్ని, గారుడం మొదలగు రత్నాలను ధరించాలి.
 • 3. సంధ్యావందనం - అగ్నిహోత్రం ఆచరించడం మంచిది.
 • 4. అలంకరించబడిన వేషం గలవాడై, ఎల్లప్పుడూ ఇతరులకు ఆహ్లాదకరమైన రూపంతో కనిపించాలి. (ఈ వేషాలంకరణలో సమస్త మంగళ ద్రవ్యాలూ చేరతాయి).
 • 5. పర ధనాదులను అపహరించరాదు.
 • 6. స్వల్పంగానైనా అప్రియం పలకరాదు. 
 • 7. ప్రియమైనా అసత్యం కూడదు.
 • 8. ఇతరుల దోషములెన్నరాదు.
 • 9. పరస్త్రీని - విరోధాన్ని కోరుకోరాదు.
 • 10. దుష్టమైన వాహనాలు ఎక్కరాదు.
 • 11. జలం చేత ఆవరించబడిన ప్రదేశంలో నీడ వున్నా ఆశ్రయించకూడదు.
 • 12. శత్రువు, పాపి, ఉన్మాది, అందరితోనూ జగడాలాడేవాడు, కీటకంలాగా బాధించేవాడు, నీచుడు, అసత్యప్రలాపి, నిత్యచోరజారకార్యకలాపి, మూర్ఖుడు, పరస్త్రీ వాంఛగలవాడు, జారిణి, సంకరజాతి స్త్రీలతో సంభాషించ కూడదు.
 • 13. దారిలో ఒంటరిగా పోరాదు.
 • 14. జలప్రవాహం వేగంగా వున్నప్పుడు మునక పనికిరాదు.
 • 15. చెట్టు చివరికంటా ఎక్కరాదు.
 • 16. దంతాలు కొరకడం, ముక్కునలపడం, గట్టిగా అపానవాయువు విడవడం, గోళ్లుకొరకడం, గడ్డి త్రుంచడం, మట్టిగట్టచిదుపడం....ఇవన్నీ నిషిద్ధాలు.
 • 17. నగ్నంగా ఉన్న స్త్రీని, ఉదయాస్తమయాలలో సూర్యుని చూడరాదు.
 • 18. శవాన్ని ఏవగించుకోరాదు.
 • 19. రాత్రులలో రచ్చచెట్టుకు - దుష్టస్త్రీలకు దూరంగా ఉండాలి.
 • 20. బ్రాహ్మణులు, పూజ్యులైనవారు, దేవతలు, దేవతావిగ్రహాలు వీటి నీడను సైతం దాటరాదు.
 • 21. ఒంటరిగా శూన్యారణ్యాలకు వెళ్లరాదు.
 • 22. జనశూన్యాలైన గృహాలలో నివశించకూడదు.
 • 23. కేశములు, ఎముకలు, ముండ్లు అపవిత్రములు, బూడిద, ఊక, స్నానంచే తడిసిన నేల..వీటికి దూరంగా ఉండాలి.
 • 24. అయోగ్యుల్ని ఆశ్రయించకూడదు.
 • 25. కుటిలుడైనవాడిని ఏదీ కోరకూడదు.
 • 26. కృరమృగాలు - సర్పములు మొదలగు వాటిని చూస్తే దూరంగా జరగాలి.
 • 27. వాటికి చేరువుగా కొద్దికాలమైనా నిలబడరాదు.
 • 28. అతిగా మేల్కోవడం అతిగా నిద్రపోవడం, అతిగా వ్యాయామం చేయడం నిషిద్ధం.
 • 29. కోరలు కొమ్మలుగల జంతువులకు, మంచుకు, మిక్కిలి బాధించే గ్రీష్మానికి దూరంగా ఉండాలి.
 • 30. దిసమెలతోస్నానం చేయడం గాని, నిద్రించడంగాని, ఆచమనం చేయడం గాని పనికిరాదు.
 • 31. అట్లే జుట్టుముడివేయక ఆచమించకూడదు.
 • 32. దేవతార్చనాదులూ పనికిరావు.
బ్రాహ్మణుని కాళ్లుకడిగేటపుడు, దేవతార్చనలోను, హోమాలు చేసేటపుడు, ఆచమనం చేసేటపుడు ఏకవస్త్రం పనికిరాదు. అంగవస్త్రం (భుజం మీద ఇంకొక వస్త్రం) ధరించి తీరాలి.
 • 33. మంచి శీలవంతులనే స్నేహం చేయడానికి ఎన్నుకోవాలి. 
 • 34. దుర్నడతగలవారికి దూరం జరగాలి. 
 • 35. అరక్షణకాలమే అయినా సాధుపుంగవుల సాంగత్య మహిమ నెన్నతరమా?
 • 36. ఉత్తములతో గానీ - అథములతో గానీ విరోధమెన్నడూ పనికిరాదు సగరచక్రవర్తీ! హాని అల్పంగా ఉంటే సహించే నేర్పు కలిగిఉండాలి.  ఓర్పుముఖ్యం. 
 • 37. పెనుహాని అయినపుడు అలక్ష్యం పనికిరాదు. 
 • 38. ప్రాజ్ఞుడు కయ్యానికి కాలుదువ్వరాదు. 
 • 39. శుష్కకలహం పనికిరాదు. 
 • 40. వివాహమైనా వివాదమైనా సమఉజ్జీలతోనే సాగాలి. 
 • 41. వైరం చేత ధనాన్ని ఎన్నడూ ఆర్జించవద్దు. నిలబడి ఆచమనం చేయవద్దు.
 • 42. ఒక కాలితో ఇంకోకాలు తొక్కరాదు. 
 • 43. స్నానంచేసిన వస్త్రంతోగాని చేత్తోగాని అవయవాలను తుడుచుకోరాదు. 
 • 44. కేశాలను దులుపుకోరాదు. పూజ్యులైన వారివైపు కాళ్లు చాచరాదు.
 • 45. గురువుగారు ఎదుట ఉండగా ఆసనం అధిష్ఠించరాదు. తప్పని పరిస్థితిలో వినయంగా కూర్చోవాలి. దేవాలయంలో అపసవ్యప్రదక్షిణ పనికిరాదు. పూజ్యులకెదురుగా, సూర్యచంద్రాగ్నుల కెదురుగా ఉమ్మివేయుట తగదు.
 • 46. శ్లేషం, మూత్రం, రక్తం, పురీషాలను ఎప్పుడూ దాటకూడదు. 
 • 47. అగ్నిహోత్ర సమయంలో గాని,పూజాసమయంలోగాని, మహాజన మధ్యంలోగాని, హోమశాలలోగాని కఫం, శ్లేషం విడువరాదు. 
 • 48. (చీదరాదని అర్థం!) స్త్రీలను అమ్మడం గాని, అవమానించడం గాని, ఈర్ష్యపడడం గాని, ధిక్కరించడం గాని నిషేదము. 
 • 49. రత్నాదిపూజ్య వస్తువులకు నమస్కరించకుండా ఇంటినుంచి బయలుదేరరాదు. 
 • 50. విద్వాంసుల సేవ, సకాలంలో హోమక్రియ సజ్జనలక్షణాలు దీనోద్ధరణ కూడ.
ఓ రాజా! దేవతలను, ఋషులను పూజించేవాడు - పితృదేవతలనుద్దేశించి తర్పణాలు - పిండప్రదానాలు చేసేవాడు - అతిథులను సత్కరించేవాడు ఉత్తమలోకాలకు వెళ్తారు. హితకరమైన పలుకులను ఆహ్లాదంగా చెప్పేవాడు, అక్షయమైనట్టి లోకాలను చేరతాడు.
 • 51. బుద్ధిమంతులు, క్షమావంతులు, వినయశిలురు, ఆస్తికులు సర్వోత్తమ లోకాలను పొందగలరు. అశౌచాది వేళలలోను, సూర్యగ్రహణాదులలోను, మేఘగర్జన సమయంలోను, పూర్నిమనాడు వేదాధ్యయనం పనికిరాదు. 
 • 52. కోపగ్రస్తుడ్ని శాంతపరచడం - భయపడ్డవాడిని ఓదార్చడం - ఎవరిమీదా ద్వేషం లేకుండా ఉండడం - అందరికీ బంధువుగా మెలగడం అనేవి సాధుకృత్యాలు. 
 • 53. ఇటువంటి సాధువుకు స్వర్గసౌఖ్యం సైతం అల్పమైన ఫలితంగానే తోచగలదు.
ఇంకా సదాచారాలు (జాగ్రత్తల నిమిత్తం చెప్పబడినవి) కొన్ని ఉన్నాయి. వాటిని ఆచరించడం సత్పురుష లక్షణం అనిపించుకుంటుంది.
 • 54. ఎండా వానల్లో గొడుగుధరించి, అడవుల్లో - రాత్రుల్లో దండము ధరించి, దేహరక్షణ నిమిత్తం పాదరక్షలు ధరించి సంచరించాలి. 
 • 55. పైకి చూస్తూ, అడ్డముగా చూస్తూ, దూరాన్ని పరికిస్తూ నడకసాగించకూడదు. 
 • 56. కనుచూపుమేర ఏవేవి స్పష్టంగా కనిపిస్తుంటాయో అవే చూసుకుంటూ నడవాలి.
 • 57. నియత్రితమైన మనస్సుతో, దోషాలు కలిగించేవాటన్నిటినీ దూరం జరిపి సంచరించేవారికి ఎటువంటి హాని కలుగదు. 
సదాచారవంతునికి ముక్తి కరతలామలకమే అనవచ్చు! కామక్రోధలోభాది అరిషడ్వర్గాలకు లోను కాకుండా సదాచారులై సంచరించేవారివల్లనే ఈ భూమి ఇంతకాలం నిశ్చింతగా ఉంది. (లేకున్నచో అల్లకల్లోలం తథ్యమని భావం)

ఇతరులకు దుఃఖకారణమవుతుందనుకుంటే, అది సత్యవచనం అయినప్పటికీ చెప్పకూడదు. మౌనమే శ్రేయోదాయకం. సాధారణస్థితులలో సత్యమే పరమప్రమాణం. ప్రియమైనదే అయినప్పటికీ హితకరం కాదని తెలిస్తే అప్పుడు కూడా మౌనంగా ఊరకుండడం ఉత్తమం. ప్రాణులకేది హితకరమో దాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించేవాడే బుద్ధిమంతుడు.

సంకలనం: భానుమతి అక్కిశెట్టి

8, మార్చి 2020, ఆదివారం

యజ్ఞోపవీతం'లో (జంధ్యం ధారణ) - (సైన్స్) శాస్త్రీయ పరంగా ఉపయోగాలు - Yagnopavitam Scienceయజ్ఞోపవీతం'లో (జంధ్యం ధారణ) - (సైన్స్) శాస్త్రీయ పరంగా ఉపయోగాలు - Yagnopavitam Science
జంధ్యం అనగా యజ్ఞోపవీతం గురించిన గొప్పతనం చివరలో దానివలన సైన్స్ పరంగా ఉపయోగాలు చూద్దాం.

 జంధ్యంను సంస్కృతం లో యజ్ఞోపవీతం అంటారు, చూడడానికి ఇది మూడు పోగులతో మామూలు దారంలా కనిపిస్తుంది. కానీ వైదిక ధర్మం అనుసరించే ధర్మాలలో ఇది ఒక పరమ ధర్మంగా ఉంది. దీనినే ఉపనయన సంస్కారం అంటారు. 

ఇందులో మూడు దారాలు ఉంటాయి: అవి త్రిమూర్తులకు చిహ్నాలు:

1. దేవశరన్, 
2. పితృ శరన్, 
3.ఋషి శరన్ లకు ప్రతీకలు, సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీక, కుడిచేతి కింది యెడమ చేతి భుజం నుండి తాకేలా వేసుకుంటారు. 

దీని ఒక్కో ఉపవీతంలో మూడేసి దారాలు ఉంటాయి, అంటే మొత్తం 9 (పోగులు) దారాలు అన్నమాట, వాటిని ఒక ముఖము, రెండు నాసిక రంధ్రాలు, రెంద కళ్ళ గ్రంధులు,రెండు చెవులకు,ఒక మలగ్రంధి,ఒక మూత్ర గ్రంధి మొత్తం నవరంధ్రాలకు ప్రతీకలు, అంటే ముఖం తో మంచివి చూసి,తిని, కళ్ళతో మంచిని చూసి, మంచిని వినడం ప్రతీక.

దీనిలోని 5 బ్రహ్మ ధర్మ, అధర్మ, కామ,మోక్షాలకు ప్రతీక, ఇవే పంచజ్ఞానేంద్రియాలకు, పంచకర్మలకు, పంచ యజ్ఞాలకు ప్రతీక.

ఈ జంధ్యం 96 అంగుళాలు ఉంటుంది, ఎందుకంటే ఇది వేసుకునే వారికి 64 కళలు,22 విద్యలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అంటే ఇది 8 సంవత్సరాల వయసు లో వేయడం సరి అయిన వయసుగా నిర్ణయించబడింది. ఆ తరువాతే శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ కాలంలో అలా కాకుండా పెళ్లిలో కూడా చేస్తున్నారు.

ఇక జంధ్యం వేసుకున్న తరువాత నియమాలు:
 • 1) మల, మూత్ర విసర్జన సమయం లో యజ్ఞోపవీతాన్ని ఎడమ చెవి కి కట్టాలి,చేతులు కడుక్కున్నకే దానిని కిందికి దించాలి,ఎందుకంటే ఇది ఆ సమయంలో నడుము కు పైభాగంలో ఉండడం వలన అపవిత్రం కాకుండా ఉంటుంది.
 • 2) ఏ పోగు అయినా తెగిపోయిన,6 నెలలు గడిచినా నూతన యజ్ఞోపవీతం వేసుకోవాలి.
 • 3) తెగిన, విరిగిన వి పూజకు అనర్హం కనుక అది పాడైపోయిన కూడా వెంటనే మార్చాలి.
 • 5) పుట్టుక పురుడు,చావు సూతకం తరువాత కూడా జంజం మార్చాలి.
 • 6) ఏ స్త్రీ కి అయితే పిల్లలు పుట్టడం అవకాశం లేకపోతే వారు కూడా యగ్నిపవీత ధారణ చేయవచ్చు.
 • 7) కానీ ఆ స్త్రీ ప్రతి నెల తన ఋతుక్రమం తరువాత కచ్చితంగా మార్చాలి.
 • 8) దీన్ని శుభ్రం చేయడానికి కూడా బయటకు తీయకూడదు,కంఠం లో ఉంచే అటూ, ఇటూ తిప్పుతూ శుభ్రం చేయాలి.
 • 9) పొరపాటున కిందికి పడిపోతే ఒక మాల జపం ప్రాయశ్చిత్థమ్ గా జపం చేసి మళ్లీ నూతన యజ్ఞోపవీతం వేసుకోవాలి.
ఇక సైన్స్ శాస్త్రీయ పరంగా ఉపయోగాలు:
 • 1) ఎవరైతే దీనిని వేసుకుంటారో,నియమాలు పాటిస్తారో,మల,మూత్ర సమయం లో నియమంగా ఉంటారో వారు ఆ ఉపవీతాన్ని చెవికి పెట్టుకోవడం వలన,ఆ అలవాటు తో నోరు మూసుకొని ఉండడం వలన క్రిమి,కీటకాల నుండి తమను తాము రక్షించుకుంటారు.
 • 2) చెవికి పెట్టుకోవడం వలన ఆ సమయంలో చెవికి దెగ్గరలో తిరిగే క్రిమి కీటకాల పైన వత్తిడి పెరిగి దెగ్గరకు రాకుండా ఉంటుంది.
 • 3) సైన్స్ ప్రకారం కూడా ఇది నిరూపితమైంది ఏంటంటే,ఇది ధరించేవాళ్ళు మిగతా వారికంటే రక్తపోటు మిగతా రోగాల విషయం లో కాస్త బాగా వుంటారు అని నిరూపితమైంది.

రచన: రేణుకా పరశురామ్

28, ఫిబ్రవరి 2020, శుక్రవారం

నిత్యం ఆచరించే ఆచారాలో అంతరార్థం - Aacharalu Antharaardham


నిత్యం ఆచరించే ఆచారాలో అంతరార్థం - Aacharalu Antharaardham
ఆచారాలు - అంతరార్థం

ఆల‌యాల్లో గంట‌లు ఉండ‌డం:
ఆల‌యాల్లో ఉండే గంట‌ను ఏడు సార్లు కొడితే మ‌న శ‌రీరంలో ఉన్న ఏడు చ‌క్రాలు ఉత్తేజం అవుతాయ‌ట‌. అంతేకాదు మెద‌డు కుడి, ఎడ‌మ భాగాలు రెండూ కొంత సేపు ఏక‌మ‌వుతాయ‌ట‌. దీంతోమ‌న మ‌న‌స్సుకు ప్ర‌శాంత‌త క‌లుగుతుంద‌ట‌. ఏకాగ్ర‌త పెరుగుతుంద‌ట‌. గంట‌ను మోగించ‌డం వ‌ల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నాశ‌న‌మ‌వుతాయ‌ట‌.

ఆడ‌వారు గాజులు ధరించ‌డం వెనుక‌:
ఆ గాజుల వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ట‌. గాజులు ఎల్ల‌ప్పుడూ చేతి న‌రాల‌కు తాకుతూ ఉండ‌డం వ‌ల్ల బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంద‌ట‌.

పిల్ల‌ల‌కు చెవులు కుట్టించ‌డం:
చిన్నారుల‌కు చెవులు కుట్టించ‌డం స‌హ‌జ‌మే. ప్ర‌ధానంగా ఆడ‌పిల్ల‌ల‌కు, ఆ మాట‌కొస్తే కొంత మంది మ‌గ పిల్ల‌ల‌కు కూడా చెవులు కుట్టిస్తారు. అయితే ఇలా కుట్టించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి దాంతో వారికి వ‌చ్చే అనారోగ్యాలు పోతాయ‌ట‌. ప్ర‌ధానంగా ఆస్త‌మా వంటి వ్యాధులు రావ‌ట‌.

రావి చెట్టును పూజించ‌డం:
హిందువుల్లో అధిక శాతం మంది రావి చెట్టుకు పూజ‌లు చేస్తారు. ఈ చెట్ల‌యితే ఎక్కువ‌గా దేవాల‌యాల్లోనే ఉంటాయి. అయితే సాధార‌ణంగా చెట్ల‌న్నీ ప‌గ‌టి పూట ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తే ఈ చెట్టు మాత్రం రాత్రి పూట ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తుంద‌ట‌. దీంతోనే రావి చెట్టును పూజిస్తారు.

కాలి వేళ్ల‌కు మెట్టెలు ధ‌రించ‌డం:
హిందూ సాంప్ర‌దాయంలో పెళ్ల‌యిన మ‌హిళ‌లు కాలికి మెట్టెల‌ను ధ‌రిస్తారు. ఇలా ధ‌రించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి వారి గుండె నుంచి గ‌ర్భాశ‌యానికి ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. అయితే వెండి మెట్టెలు ధ‌రిస్తే ప్ర‌కృతిలో ఉన్న పాజిటివ్ ఎన‌ర్జీ వారి శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంద‌ట‌.

నిద్రించేట‌ప్పుడు త‌ల‌ను ఉత్త‌రానికి పెట్ట‌క‌పోవ‌డం:
భూమికి అయ‌స్కాంత క్షేత్రం ఉన్న‌ట్టుగానే మ‌న శ‌రీరానికి కూడా అయ‌స్కాంత క్షేత్రం ఉంటుంద‌ట‌. ఒక వేళ మ‌నం ఉత్త‌రం దిశ‌గా త‌ల‌ను పెట్టి ప‌డుకుంటే మ‌న శ‌రీరంలో ఉన్న ఐర‌న్ మెద‌డుకు ప్ర‌వ‌హించి బీపీ, గుండె సంబంధ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. త‌ల‌నొప్పి, అల్జీమ‌ర్స్‌, పార్కిన్‌స‌న్స్ డిసీజ్ వంటి వ్యాధులు వ‌స్తాయ‌ట‌. కాబ‌ట్టి త‌ల‌ను ఉత్త‌రం దిశ‌కు పెట్టి నిద్రించ‌కూడ‌ద‌ట‌.

నుదుట‌న కుంకుమ బొట్టు ధ‌రించ‌డం:
నుదుట‌న కుంకుమ బొట్టును ధ‌రిస్తే అక్క‌డి న‌రాలు ఉత్తేజిత‌మై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయ‌ట‌. దీంతో బీపీ, ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ట‌.

ఎదుటి వారికి రెండు చేతులతో న‌మ‌స్క‌రించ‌డం:
ఎదురుగా ఉన్న వారికి రెండు చేతుల‌తో న‌మ‌స్క‌రిస్తే మ‌నం వారిని ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటామ‌ట‌. ఎలాగంటే రెండు చేతుల‌ను జోడించిన‌ప్పుడు చేతి వేళ్ల‌న్నీ క‌లిసిపోయి ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి మ‌న జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయ‌ట‌. దీంతోపాటు మెద‌డు ప‌నితీరు కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌.

నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం:
నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం వ‌ల్ల ప‌ద్మాస‌నం భంగిమ వ‌స్తుంది. దీంతో జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రిగి జీర్ణాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయ‌ట‌.

కార‌మైన ఆహారం ముందు, తీపి త‌రువాత తిన‌డం:
భోజ‌నం చేసిన‌ప్పుడు ముందుగా కారంగా ఉండే ఆహారం తిన‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో జీర్ణ‌క్రియ‌కు అవ‌స‌ర‌మైన ఆమ్లాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయ‌ట‌. దీంతో జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రుగుతుంద‌ట‌. అయితే భోజ‌నం మొదట్లోనే స్వీట్లు తింటే అది మ‌నం తిన్న ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణంచేయ‌నీయ‌ద‌ట‌.

న‌దుల్లో నాణేలు వేయ‌డం:
ఒక‌ప్పుడు మ‌న ద‌గ్గ‌ర రాగితో చేసిన నాణేలు చ‌లామ‌ణీలో ఉండేవి. ఈ కార‌ణంగా ఆ నాణేల‌ను న‌దుల్లో వేస్తే ఆ రాగి అంతా ఆ నీటిని శుద్ధి చేసేద‌ట‌. దీంతో ఆ నీటిని తాగేవారికి ఎన్నో అనారోగ్యాలు దూర‌మ‌య్యేవ‌ట‌.

ఉప‌వాసం ఉండ‌డం:
హిందువుల్లో అధిక శాతం మంది వారంలో ఏదో ఒక రోజు దేవుడికి ఉప‌వాసం ఉంటారు క‌దా.ఆయుర్వేద ప్ర‌కారం అలా ఉప‌వాసం ఉండ‌డం చాలా మంచిది. ఎందుకంటే ఉప‌వాస స‌మ‌యంలో మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థకు పూర్తిగా విశ్రాంతి ల‌భించి శ‌రీరంలో ఉన్న ప‌లు విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్ల‌గొట్ట‌ బ‌డ‌తాయ‌ట‌. దీంతోపాటు దేహం త‌న‌కు తాను మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంద‌ట‌. ఉప‌వాసం ఉండ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్‌, బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్లు రావ‌ట‌!!!

అనువాదము: కోటి మాధవ్ బాలు చౌదరి

3, జనవరి 2020, శుక్రవారం

ప్రదక్షిణ - Pradakshinaప్రదక్షిణ - Pradakshina
ప్రదక్షిణ
ఈ జగత్తులో సూర్యుని చుట్టు అనేక గ్రహాలు తిరుగుతూంటాయి. అలా ప్రదక్షిణ చేయడం వలనే అవి సుస్థిరమైన స్థానాన్ని పొందగలుగుతున్నాయని చెప్పవచ్చు. విశ్వంలో జననం నుండి మరణం వరకు ఒక ప్రదక్షిణ. ఎన్నో జన్మల కర్మ ఫలాలను అనుభవించడమే, వాటి దుష్ఫలితాలను తొలగించుకునేందుకు తాపత్రయ పడటమే ప్రదక్షిణ. 

నవమాసాలు మోసి, రక్త మాంసాలను పంచి, ప్రాణాలను కూడ లెక్క చేయకుండా, బిడ్డకు జన్మనిచ్చి, తమకంటే బిడ్డను ఉన్నతస్థాయిలో ఉంచేందుకు తపనపడే తల్లికి ఎంతటి ఉన్నతస్థానం ఇస్తామో, ప్రప్రధమ దైవంగా భావిస్తామో, ఏమి చేస్తే కృతఙ్ఞత ప్రకటింపబడుతుందో తెలిపే వివరణ ఇది.

మూడు సార్లు భూప్రదక్షిణ చేసినా, 100సార్లు కాశి యాత్ర చేసినా, కార్తీక,మాఘ స్నానాలు చేసినా, అమ్మకు వందనం చేసినదానితో సాటిరాదు.
 • 🖝 ప్ర - అక్షరం సమస్త పాప నాశనకారి
 • 🖝  - అక్షరం కోరికలన్ని తీరుతాయనే భావం
 • 🖝 క్షి - అక్షరం రాబోయే జన్మ జన్మల రాహిత్యాన్ని సూచిస్తుంది
 • 🖝 ణం - అక్షరం అఙ్ఞానం వీడి ఙ్ఞానం ప్రసాదించే ఆవృతం అని అర్ధం ( భగవాన్ శ్రీ రమణ మహర్షి వివరణ)
ప్రదక్షిణ చేసేటప్పుడు, చేతిలొ కాగితం పై లెక్కించుకుంటు, ధ్యాసంతా ఎపుడెపుడు 108 అవుతాయా, తొందరగ చేద్దాం అని, భగవంతుని మీద ధ్యాసలేకుండా త్వర త్వరగా చేయడం అనేది పద్దతి కాదు.

నిండు నెలల స్త్రీ, నిండు కుండతో నడిచే వ్యక్తి ఎలా నడుస్తారో, అంత నెమ్మదిగా, దైవ నామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణా విధానంలో ఎంత నెమ్మదిగా ఉంటే అంత ఫలితం ఉంటుందని విఙ్ఞులు అంటారు. ప్రదక్షిణ చేసేటప్పుడు ఇష్టమైన దైవాన్ని స్మరించాలి. 

అడుగులో అడుగు వేసుకుంటూ, అడుగు అడుగుని అనుసరిస్తూ, చేతులు నిశ్చలంగా జోడించి, దైవ నామస్మరణతో ప్రదక్షిణ చేయాలని పెద్దలంటారు. దీనినే "చతురంగ ప్రదక్షిణ" అంటారు.
 • ✹ సృష్టి, స్థితి, లయ కారకులను స్మరిస్తూ చేసే ప్రదక్షిణాలు 3 ప్రదక్షిణాలు.
 • ✹ పంచభూతాలలోని పరమాత్మను దర్శిస్తూ 5 ప్రదక్షిణాలు.
నవగ్రహ ఆలయాలలో చేసే ప్రదక్షిణలు :
 • ✹ మొదటిది - ఫలాన వ్యక్తిని ప్రదక్షిణ చేయడానికి వచ్చానని చెప్పడానికి
 • ✹ రెండవది - నవగ్రహాధిపతి అయిన సూర్యునకు చేసే ప్రదక్షిణ 
 • ✹ మూడవది - ప్రదక్షిణాలు చేయాలనే బుద్ధిని ప్రసాదించినందుకు

రచన: కళ్యాణ్ 

2, జనవరి 2020, గురువారం

సనాతన ఆచారాలు: ఆరోగ్య సూత్రాలు - Sanatana Aacharaluసనాతన ఆచారాలు: ఆరోగ్య సూత్రాలు - Sanatana Aacharalu
1. ఆల‌యాల్లో గంట‌లు
టెంపుల్ బేల్ల్స్ ఆలయం లో గంటలు - temple bells
ఆలయంలో గంటలు మ్రోగిస్తున్న 
ఆల‌యాల్లో ఉండే గంట‌ను ఏడు సార్లు కొడితే మ‌న శ‌రీరంలో ఉన్న ఏడు చ‌క్రాలు ఉత్తేజం అవుతాయ‌ట‌. అంతేకాదు మెద‌డు కుడి, ఎడ‌మ భాగాలు రెండూ కొంత సేపు ఏక‌మ‌వుతాయ‌ట‌. దీంతోమ‌న మ‌న‌స్సుకు ప్ర‌శాంత‌త క‌లుగుతుంద‌ట‌. ఏకాగ్ర‌త పెరుగుతుంద‌ట‌. గంట‌ను మోగించ‌డం వ‌ల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నాశ‌న‌మ‌వుతాయ‌ట‌.

2. ఆడ‌వారు గాజులు ధరించ‌డం
ఆడ‌వారు గాజులు ధరించ‌డం: girl in bangles
గాజులు ధరించిన అమ్మాయి
ఆ గాజుల వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ట‌. గాజులు ఎల్ల‌ప్పుడూ చేతి న‌రాల‌కు తాకుతూ ఉండ‌డం వ‌ల్ల బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంద‌ట‌. 

3. పిల్ల‌ల‌కు చెవులు కుట్టించ‌డం
పిల్ల‌ల‌కు చెవులు కుట్టించ‌డం
పిల్ల‌ల‌కు చెవులు కుట్టించ‌డం
చిన్నారుల‌కు చెవులు కుట్టించ‌డం స‌హ‌జ‌మే. ప్ర‌ధానంగా ఆడ‌పిల్ల‌ల‌కు, ఆ మాట‌కొస్తే కొంత మంది మ‌గ పిల్ల‌ల‌కు కూడా చెవులు కుట్టిస్తారు. అయితే ఇలా కుట్టించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి దాంతో వారికి వ‌చ్చే అనారోగ్యాలు పోతాయ‌ట‌. ప్ర‌ధానంగా ఆస్త‌మా వంటి వ్యాధులు రావ‌ట‌.

4. రావి చెట్టును పూజించ‌డం:
రావి చెట్టును పూజించ‌డం - Raavi Chettu
రావి చెట్టుకు పూజ చేస్తున్న స్త్రీమూర్తులు 
హైందవుల్లో అధిక శాతం మంది రావి చెట్టుకు పూజ‌లు చేస్తారు. ఈ చెట్ల‌యితే ఎక్కువ‌గా దేవాల‌యాల్లోనే ఉంటాయి. అయితే సాధార‌ణంగా చెట్ల‌న్నీ ప‌గ‌టి పూట ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తే ఈ చెట్టు మాత్రం రాత్రి పూట ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తుంద‌ట‌. దీంతోనే రావి చెట్టును పూజిస్తారు.

5. కాలి వేళ్ల‌కు మెట్టెలు ధ‌రించ‌డం
 మెట్టెలు ధరించిన స్త్రీ మూర్తి 
హిందూ సాంప్ర‌దాయంలో పెళ్ల‌యిన మ‌హిళ‌లు కాలికి మెట్టెల‌ను ధ‌రిస్తారు. ఇలా ధ‌రించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి వారి గుండె నుంచి గ‌ర్భాశ‌యానికి ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. అయితే వెండి మెట్టెలు ధ‌రిస్తే ప్ర‌కృతిలో ఉన్న పాజిటివ్ ఎన‌ర్జీ వారి శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంద‌ట‌.

6. నిద్రించేట‌ప్పుడు త‌ల‌ను ఉత్త‌రానికి పెట్ట‌క‌పోవ‌డం 
నిద్రిస్తున్న సాధువు
భూమికి అయ‌స్కాంత క్షేత్రం ఉన్న‌ట్టుగానే మ‌న శ‌రీరానికి కూడా అయ‌స్కాంత క్షేత్రం ఉంటుంద‌ట‌. ఒక వేళ మ‌నం ఉత్త‌రం దిశ‌గా త‌ల‌ను పెట్టి ప‌డుకుంటే మ‌న శ‌రీరంలో ఉన్న ఐర‌న్ మెద‌డుకు ప్ర‌వ‌హించి బీపీ, గుండె సంబంధ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. త‌ల‌నొప్పి, అల్జీమ‌ర్స్‌, పార్కిన్‌స‌న్స్ డిసీజ్ వంటి వ్యాధులు వ‌స్తాయ‌ట‌. కాబ‌ట్టి త‌ల‌ను ఉత్త‌రం దిశ‌కు పెట్టి నిద్రించ‌కూడ‌ద‌ట‌.

7. నుదుట‌న కుంకుమ బొట్టు ధ‌రించ‌డం
కంకుమ ధరించిన స్త్రీ మూర్తి
నుదుట‌న కుంకుమ బొట్టును ధ‌రిస్తే అక్క‌డి న‌రాలు ఉత్తేజిత‌మై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయ‌ట‌. దీంతో బీపీ, ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ట‌.


8. ఎదుటి వారికి రెండు చేతులతో న‌మ‌స్క‌రించ‌డం
నమస్కరిస్తున్న స్త్రీ మూర్తి
ఎదురుగా ఉన్న వారికి రెండు చేతుల‌తో న‌మ‌స్క‌రిస్తే మ‌నం వారిని ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటామ‌ట‌. ఎలాగంటే రెండు చేతుల‌ను జోడించిన‌ప్పుడు చేతి వేళ్ల‌న్నీ క‌లిసిపోయి ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి మ‌న జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయ‌ట‌. దీంతోపాటు మెద‌డు ప‌నితీరు కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌.

9. నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం
నేల‌పై కూర్చుని భోజ‌నం బాలుడు

నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం వ‌ల్ల ప‌ద్మాస‌నం భంగిమ వ‌స్తుంది. దీంతో జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రిగి జీర్ణాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయ‌ట‌.

9. కార‌మైన ఆహారం ముందు, తీపి పదార్దములు త‌రువాత తిన‌డం 
తీపి పదార్ధము 
భోజ‌నం చేసిన‌ప్పుడు ముందుగా కారంగా ఉండే ఆహారం తిన‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో జీర్ణ‌క్రియ‌కు అవ‌స‌ర‌మైన ఆమ్లాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయ‌ట‌. దీంతో జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రుగుతుంద‌ట‌. అయితే భోజ‌నం మొదట్లోనే స్వీట్లు తింటే అది మ‌నం తిన్న ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణంచేయ‌నీయ‌ద‌ట‌.

10. న‌దుల్లో నాణేలు వేయ‌డం
న‌దుల్లో నాణేలు
న‌దుల్లో నాణేలు
ఒక‌ప్పుడు మ‌న ద‌గ్గ‌ర రాగితో చేసిన నాణేలు చ‌లామ‌ణీలో ఉండేవి. ఈ కార‌ణంగా ఆ నాణేల‌ను న‌దుల్లో వేస్తే ఆ రాగి అంతా ఆ నీటిని శుద్ధి చేసేద‌ట‌. దీంతో ఆ నీటిని తాగేవారికి ఎన్నో అనారోగ్యాలు దూర‌మ‌య్యేవ‌ట‌.

11. ఉప‌వాసం ఉండ‌డం
ఉప‌వాసం
ఉప‌వాసం దీక్ష
హిందువుల్లో అధిక శాతం మంది వారంలో ఏదో ఒక రోజు దేవుడికి ఉప‌వాసం ఉంటారు క‌దా.ఆయుర్వేద ప్ర‌కారం అలా ఉప‌వాసం ఉండ‌డం చాలా మంచిది. ఎందుకంటే ఉప‌వాస స‌మ‌యంలో మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థకు పూర్తిగా విశ్రాంతి ల‌భించి శ‌రీరంలో ఉన్న ప‌లు విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్ల‌గొట్ట‌ బ‌డ‌తాయ‌ట‌. దీంతోపాటు దేహం త‌న‌కు తాను మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంద‌ట‌. ఉప‌వాసం ఉండ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్‌, బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్లు రావ‌ట‌!!!

రచన: కళ్యాణ్