నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
గురువు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గురువు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, సెప్టెంబర్ 2020, సోమవారం

గురువు - శిష్యుడు - సాధనలు - Guru - Shisyudu - Sadhanalu

గురువు - శిష్యుడు - సాధనలు - Guru - Shisyudu - Sadhanalu

గురువు - శిష్యుడు - సాధనలు

శ్లో||  ఓం ఈశ్వరో గురారాత్మేతి మూర్తి భేద విభాగినే |
వ్యోమవత్‌ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః ||

గురువు :
లఘువు కానివాడు. గురువు కంటె అధికులు లేరు. ఆయన ముందు అందరూ లఘువులే. నగురోరధికం నగురోరధికం నగురోరధికం.

శిష్యుడు :
శాసించబడుటకు ఒప్పుదల అయినవాడు (పెద్దల చేత, గురువుల చేత)

శాస్త్రము :
శాసిస్తూ, ఆచరించే వారిని తరింప చేయుటకు మార్గదర్శకమైనది. తాను బ్రహ్మ తత్త్వమైనది ఆవరింపబడినప్పుడు, తిరిగి తాను బ్రహ్మ తత్త్వమేనని జ్ఞాపకము చేయునది. పెద్దలకు ప్రత్యక్షమైనదే, ఆగమ ప్రమాణ రూపములో మార్గదర్శకమైనది శాస్త్రము. దీనిని అనుమాన ప్రమాణము చేసికొని, విచారణ చేత ప్రత్యక్షపరచుకొనవలసి యున్నది.

వృత్తి :
ఒక ఆచార్యుడు ప్రతి ఒక్క పదమును ఎంతగా విపులీకరించగలడో అలా వివరించుటను వృత్తి అందురు. పదముల సముదాయమైన వాక్యార్ధ్థమును మరలా బాగుగా విపులీకరించుటను వాక్యవృత్తి అందురు.

వార్తికము :
వాక్య వృత్తిని వ్యాఖ్యానించుచు, చర్చించుచు, సద్విమర్శ చేయుచు గురువు బోధించగా శిష్యుడు శ్రవణము చేసి నిర్ణయించుకొనుటను వార్తికము లేక వార్తీక నిర్ణయము అందురు.

ఉపదేశము :
సమీప స్థానము, శ్రేష్ఠమైన స్థానము. శిష్యుడిని సద్వస్తువు సమీపమునకు గాని, ఆ సద్వస్తువును శిష్యుని హృదయ స్థానము వద్దకు  గాని గొనిపోవునట్లు గురువు చేయునది.

ఉపవాసము :
ఆత్మ సన్నిధిలో వసించుట.

ఉపనయనము :
గురువు శిష్యుడిని జ్ఞాన దృష్టికి సమీపముగా గొనిపోవునది. కర్మకాండగా దీక్షను ఇచ్చి శిష్యుని బ్రహ్మగా చరించే సాధన చేయించుట.

బ్రహ్మచారి :
శరీరానుసారమైన జీవితమును బ్రహ్మ జ్ఞాన లక్ష్యములో జీవించుటగా అభ్యాసము చేయుట.

ఉపరతి :
బ్రహ్మానందానుభవమును ఎవరు వ్యక్తపరచుకొనగలరో, వారికి అది ఉపరతి. తానే బ్రహ్మమైనవాడు తనలో తాను రమిస్తూ ఉంటాడు గాని, బ్రహ్మానందానుభూతి అవ్యక్తము.

గురుదక్షిణ :
ఆత్మ జ్ఞానము పొందిన శిష్యుడు, తిరిగి ఇతరులకు ఉపదేశించుటయందు గురువుకు ఆ శిష్యునిపై సంతోషము కలిగిన యెడల అదే గురు దక్షిణ.

గురూపదేశమునకు అనర్హులు :
 • 1. సాంప్రదాయములను అంటిపెట్టుకొని, క్రొత్త విషయములను తెలుసుకొనుటకు ఇచ్ఛలేనివారు.
 • 2. రాగాదులలో చిక్కుపడినవారు.
 • 3. త్రికరణశుద్ధి లేనివారు.
 • 4. విద్యా అర్థియై తనంతట తాను గురువును సమీపించనివారు.
 • 5. ప్రయత్నము, పట్టుదల, ఆసక్తి లేనివారు
 • 6.  అసూయాపరులు, కాపట్యులు, ఋజువర్తనము లేనివారు.
 • 7. ఆధ్యాత్మిక విషయములను నేర్చుకొనుట యందు ఇచ్ఛా ప్రయత్నములు, ఆతురత లేనివారు
 • 8. గురుబోధను ఊహాపోహల సాధనచేత పెంచుకొనలేనివారు.
 • 9. వినయ విధేయతలు, గురుభక్తి, శరణాగతి లేనివారు.
శిష్యుని యోగ్యత :
గురువుపట్ల సేవా నిరతి, శరణాగతి, ఇష్టదైవ భక్తితో సమానమైన గురుభక్తి ఉండవలెను. శ్రద్ధతో వినుట, విన్న విషయములపై లగ్నత, ఏకాగ్రత, సమన్వయపరచుకొనుట, దక్షత, సాధనలందు పట్టుదల, తత్త్వ జిజ్ఞాస ఉండవలెను. స్వాభిమానము, నేను, నాది అనే మమత్వము లను అధిగమించి ఉండవలెను. అసూయ, ద్వేషము, మత్సరము వదలి యుండవలెను. ఇది ఇంతేకదా! అది అంతే కాదా! అనెడి తేలిక, నిర్లక్ష్య భావన వదలవలెను. అందరిపట్ల ఉదాసీనత కలిగి, సర్వ వ్యవహారములు, గుణములు అన్నీ నిశ్చలమైన, శాశ్వతమైన తనకు వచ్చిపోయేవేనని, వాసనాత్రయమును, ఈషణా త్రయమును జయించిన వాడై ఉండవలెను. చివరిగా సాధనా చతుష్టయ సంపత్తి కలిగి తీవ్ర ముముక్షువై యుండవలెను. గురువును ఆశ్రయించినవాడై, గుర్వాజ్ఞకు బద్ధుడై, ఎందుకు? ఏమి? అని సంశయము లేకుండా ఉండవలెను.

ముముక్షువులు తెలుసుకొనవలసినవి :
(1) తానెవరు (2) ఫల స్వరూపము (3) సాధనచేత గాని, ఉపాయము చేత గాని, ఆ ఫల స్వరూపము నెరుగుట. ఈ మూడూ స్పష్టముగా తెలిసి యుండవలెను.

మనన సహాయత్రయము :
(1) యుక్తి (2) తర్కము (3) అనుమాన ప్రమాణము - ఈ మూడింటి సహాయముతో మననము చేయుచు స్వస్వరూప నిర్ణయము చేసుకొనవలెను.

నిదిధ్యాస పంచకము : 
 • (1) మంత్ర యోగము 
 • (2) స్పర్శ యోగము 
 • (3) భావ యోగము 
 • (4) అభావ యోగము
 • (5) మహా యోగము. ఈ ఐదు యోగములచే స్వస్వరూపమందు స్థిరపడుటయే నిది ధ్యాస పంచకము వలన ప్రయోజనము.
శ్రవణము :
వాసనా త్రయము, ఈషణాత్రయము వంటివి అడ్డురానీయక, గురు బోధను శ్రద్ధ, ఏకాగ్రతతో వినుట. తత్త్వమసి వాక్యార్థము బోధపడు వరకు మరల మరల వినుట, చదువుట, సహధ్యాయులతో చర్చించుకొనుట, సంశయములు తీర్చుకొనుట. ఇవన్నీ శ్రవణము క్రిందికి వచ్చును.

మననము
బోధపడిన విషయము స్వానుభవముగా, కరతలామలకముగా మారు వరకు చేయుచున్న అంతర్విచారణ. బ్రహ్మ బోధను తన గురించిన బోధగా సమన్వయపరచుకొనుచు బుద్ధిలో ధృడపడువరకు తనలోన సద్విమర్శ చేసుకొనుట మననబడును. బోధ ప్రబోధగా జీర్ణమగు వరకు ఈ మననము కొనసాగి, నిది ధ్యాసగా మారగానే మననము అప్రయత్నము గానే ఆగిపోవును.

నిదిధ్యాస : 
అధ్యవసానము, లేక నిశ్చయ జ్ఞానము. ఈ దశలో మననము దాని అంతట అదే ఆగిపోయి వాక్యార్థము రూఢియై, శిష్యుడు ఆరూఢుడగును. పర్యవసానముగా సాక్షాత్కార జ్ఞానమునకు సంసిద్ధుడగును.

    శ్రవణమనగా బ్రహ్మను అర్థము చేసుకొనుట. మననమనగా గోచరము కాని బ్రహ్మమును, గోచరమగుచున్న ప్రపంచమును వేరు వేరుగా చూడక ఈ ప్రపంచమును ఆ బ్రహ్మయొక్క విభూతియేనను భావము కలిగేదాకా చేసే అంతర్విచారణ. నిదిధ్యాసనమనగా, విభూతియైన ప్రపంచము ఆ బ్రహ్మముకంటె వేరు కాదని, ప్రపంచమును బ్రహ్మముగానే చూచుట, అనగా సర్వం ఖల్విదంబ్రహ్మ అన్నట్లు నిశ్చయ బుద్ధి కలుగుట.

    శ్రవణమునకు ఉపనిషత్తులు, మననమునకు బ్రహ్మ సూత్రములు, నిదిధ్యాసకు భగవద్గీత చక్కగా ఉపయోగపడుననని పెద్దల సూచన.

పాషండులు : 
దేనియందైనను చిక్కుపడి, విశదపరచుకొనుటకు ఇష్టపడని మూర్ఖత్వము, లేక తమోగుణులను పాషండులందురు. వీరిలో (1) యోగపాషండులు (2) కర్మ పాషండులు (3) జ్ఞాన పాషండులు (4) వైరాగ్య పాషండులు (5) మిథ్యా పాషండులు (6) మాయా పాషండులు.ఇంకను నాస్తికులు, వంచకులు, వేద బాహ్యులు, కాపట్యులు మొదలగువారి ఆయా సాధనలందు గాని, అనుభవమునందు గాని, స్వభావమందుగాని, చిక్కుకొని, ఆపైన ఉద్ధరింపబడుటకు ఇష్టపడనివారు ఉన్నారు.

బ్రహ్మ ఘాతకులు : 
పరబ్రహ్మ లేడు అని ఎవరు చెప్పెదరో, బ్రహ్మ స్వరూపమును శాస్త్రములో చెప్పినట్లు గాక మరో విధముగా ఎవరు నిరూపించుచుందురో, బ్రహ్మ - ఆత్మలతో ఎవరు విభేదించెదరో ఈ ముగ్గురూ బ్రహ్మ ఘాతకులు.

ధ్యానబంధువు : 
ఆధ్యాత్మిక శాస్త్రములను కేవలము జీవించుట కొఱకు చదివి, బాగుగా వ్యాఖ్యానము కూడా చేయుచు, కాని వాటిని తన విషయములో ఆచరణలో పెట్టనివాడు ధ్యానబంధువు.

అగస్త్యభ్రాత :
విద్యావంతుడై కూడా తన పేరు ప్రతిష్ఠలను కోరక, అనామకునివలె ఉంటూ ఆధ్యాత్మిక విద్యను తన స్వానుభవమునకు తెచ్చుకొనువాడు. అగస్త్యముని సోదరుడు అట్టివాడు.

శక్తిపాతము : 
హస్తమస్తక స్పర్శ చేతను, కరుణా కటాక్ష వీక్షణము చేతను, సంకల్పము చేతను శిష్యునికి నిర్వికల్ప సమాధిని కలిగించే గురు సత్తాను శక్తిపాతము అందురు. కుండలినీయందు చక్రభేదన, గ్రంథిత్రయ భేదనల వలన పరమ శివునితోడి సమావేశపరచుట శక్తిపాత ఫలితము. జీవుడికి ఉపాధి సంగత్వమునుండి పరిత్యాగ బుద్ధి కలిగించి, శుద్ధ బ్రహ్మ రూపత్వమును సిద్ధింపజేయునది శక్తిపాతము.

   శిష్యునికి తన దేహమునందే పరమ శివుని సమావేశపరచువాడే నిజగురువు. గురువు శిష్యుని యొక్క సుషుమ్న ద్వారా అతడి హృదయము లోనికి ప్రవేశించి, సమాధిలోనున్న శిష్యుడి యొక్క నిశ్చేష్టితము నుండి నిర్వికల్పములోనికి మేల్కొల్పు ప్రక్రియ శక్తిపాతము. దీనివలన శిష్యుడు తాను జీవించినంత కాలము జీవన్ముక్తుడై యుండును. వేరే అనుభవములు కలిగించే శక్తిపాతములు శిష్యుని భ్రాంతిలోనికి నెట్టును. ప్రమాదములో పడవేయును. శిష్యుడు పిచ్చివాడగును, మోక్షమునకు దూరమగును.

నిజగురువు గొప్పతనము : 
మహత్తత్త్వమునుండి ముందుగా గురుతత్త్వము ఉత్పన్నమైనది. అదే మహతత్త్వము నుండి జీవేశ్వర జగత్తులు ఉత్పన్నమైనవి. తరువాత ఆవిర్భవించిన ప్రకృతి శక్తులకంటే ముందే ఉద్భవించిన గురుతత్త్వములోని శక్తి చాలా చాలా గొప్పది. యావత్తు ప్రకృతి శక్తులు, సృష్టి అంతా ఆ మహత్తైన గురువు ఆధీనములో ఉండును. మహత్తరమైన గురుశక్తి త్రిమూర్తులకంటే అధిష్ఠాన దేవతా శక్తులకంటే గొప్పది. గురువు యొక్క స్వశక్తియే సర్వశక్తులకు మూలాధారము. గురుతత్త్వము అయస్కాంతము వంటిది. అది అన్ని తత్త్వములను తనలోనికి ఆకర్షించుకొనియుండి, పరిపూర్ణమై యుండును. అదియే సాక్షాత్‌ బ్రహ్మతత్త్వము.

ఈ గురుతత్త్వము శిష్యులలో ఎప్పుడు క్రియాశీలమగునో, అప్పుడు మాయావరణ తొలగి మాయాశక్తి అంతరించి శిష్యుడు పరబ్రహ్మగా ప్రత్యభిజ్ఞానమును పొందును.

   సద్గురువు శూన్య భాండమువలె మౌనముగా ఉండును. భక్తుడు చెంతకు రాగానే అతని రూపు గురువు యొక్క అంతరంగములో ప్రతిబింబించును. ఎవరూ సమీపించనప్పుడు, సంకల్పము చేతకూడా వెంబడించనప్పుడు గురుమూర్తి తటస్థముగా, లేనివాడుగా ఉండును. మౌనద్రష్ఠగా ఉండిపోవును. గురుమూర్తితో సంపర్కమైన వారిపట్ల తండ్రివలె ఉండి, జిజ్ఞాసులకు జ్ఞానోపదేశము చేయును. పిన్నలకు స్నేహాశీస్సు లందించును. తన్మయులైన శిష్యులను తిరిగి సామాన్యావస్థకు తీసుకొని వచ్చుటకు ఆప్యాయముగా స్పర్శనిచ్చును. అప్పుడా శిష్యుని మనస్సు శరీరము తేలికపడును. అతడి హృదయములో ఆనందము ఉప్పొంగును. శిష్యుడు నిశ్చలస్థితినొంది సహజమగు వరకు రక్షించుచుండును.

    నిజమునకు గురుమూర్తి నిష్క్రియుడు. మాయా శక్తి గురువుకు వశమై యుండి శిష్యులకు, భక్తులకు అవసరమైన బోధ, సూచన, స్పర్శ, శక్తిపాతములు గురువు తరఫున చేయుచుండును. దానినే గురుకరుణ అని శిష్యులు అనుకొందురు. శిష్యుడు గురువు యొక్క ప్రభా మండలములో ప్రవేశించినప్పుడు శిష్యుడు ఎల్లవేళలా గురు సత్తాతో ప్రభావితమై యుండును. శిష్యుడు ఆత్మార్పణ చేసుకొన్నచో గురు ప్రభామండలములో విలీనమగును. శిష్యుడు గురువు యొక్క ప్రేమ తత్త్వములో సంలీనమైతే మాయా ప్రభావము తగ్గిపోవును, శిష్యుడి చైతన్యము గురువు చైతన్యము ఏకీకృతమగును. శిష్యుని పూర్వభావములు ఊర్థ్వముఖమగును. శిష్యుడు  కేవలము శరణాగతుడై యుంటే భగవద్దర్శనము లభించును. శుద్ధ భక్తి మార్గములో ఉండే శిష్యుడికి స్వస్వరూప సాక్షాత్కారమగును.

    శ్రీ గురువు శరీరములోని చిదణువులన్నీ దివ్య శక్తితో స్పందించుచుండును. అందువలన గురువుయొక్క వాక్కు, స్పర్శ, సంకల్పము అన్నీ కూడా శిష్యుడికి ప్రయోజనకరముగా ఉండును. భక్తులపై చేసే శక్తి ప్రయోగము గురువు యొక్క లీలా విలాసము. గురువులో మమైకమయిన శిష్యుడు నిర్లిప్తుడగును. అతని బుద్ధి నిశ్చలత నొందును. గురు కృపవలన శిష్యుడికి అంతర్‌దృష్టి, ఆత్మ శక్తి లభించును. సత్యానుభవము పొందిన శిష్యుడికి మాత్రమే గురువు స్వభావము బాగుగా తెలియబడును.

     ఒక గురువుతో మరొక గురువు కలిసిన ఇద్దరూ ఒకే ప్రాణ మనస్సులను, ఒకే గుణమును కలిగి యుందురు. ఒకరినొకరు పూజించు కొందురు. వారి సంభాషణ మౌనములోనే జరిగిపోవును. ఇద్దరి ఆత్మలు ఒకే శివాత్మగా ఉండును. శిష్యుడు వేరొక గురువు చెంతకు వెళ్ళినప్పుడు ఆ గురువు శిష్యుడికి అతడి గురు రూపముగానే కనిపించును. గురువు శిష్యుడి హృదయ పీఠముపై ప్రతిష్ఠితుడైతే శిష్యుడు గురువు మాదిరిగా మారిపోవును. శిష్యుడు గురోన్ముఖుడైతే అతడిలో గురుసత్తా జేరి అతడిని ఊర్ధ్వ ముఖునిగా చేయును. గురు సత్తాకు లోబడి యున్న కొందరు శిష్యులు ఆ గురువు చేతిలో పనిముట్టుగా ఉందురు. గురువు అట్టి శిష్యుల ద్వారా తన కార్యక్రమమును నిర్వర్తించుచుండును.

   శిష్యుడి యొక్క బ్రహ్మ రంధ్రమును గురువు మూసివేసి, తన కార్యక్రమమును ఆ శిష్యుడి ద్వారా జరుపుకొనును. తగిన సమయములో శిష్యుడి బ్రహ్మరంధ్రము తెరచును. అప్పుడా శిష్యుడు స్వతంత్రుడై తాను కూడా ఒక గురుమూర్తియై తన గురు ఋణమును తీర్చుకొనును.

మానవుని భాగ్యము : 
1.తల్లి వాత్సల్యము 2. తండ్రి శాసనము 3. గురూపదేశము. ఈ మూడూ ఎవరికి లభించునో వారి  జీవితము పూర్ణము. వీటిలో ఏది లేకున్ననూ అతడి వ్యక్తిత్వములో దోషములుండవచ్చును.

శ్రీరామానుజాచార్యుల గురు పరంపర : 
శ్రీమన్నారాయణ - శ్రీ మహాలక్ష్మీ - విష్వక్‌ సేనులు - శఠగోపాచార్య - శ్రీనాధముని - పుండరీకాక్ష - రామ మిశ్రులు-యమునాచార్య - శ్రీరామానుజాచార్య.

అన్వీక్షికీ కౌశలము : 
సకల దృశ్యములను అఖండాత్మగా దర్శించే నైపుణ్యమును అన్వీక్షికీ కౌశలమందురు.

వాక్యము - పదముల సమన్వయార్థము : 
ఒక పద సముదాయములో ఆకాంక్ష, సన్నిధి, యోగ్యత అని మూడు లక్షణములున్నప్పుడే వాక్యార్థము తెలిసి నిశ్చయ జ్ఞానము కలుగును. ఈ మూడు లక్షణములు లేని వాక్యము తగిన అనుభవము నీయజాలదు.
 • 1. ఆకాంక్ష : పదముల యొక్క అర్థము సమన్వయము కావలెను. ఒక కిలో వస్త్రము, ఒక గజము బియ్యము అన్నప్పుడా పద సముదాయమందు ఆకాంక్ష లేదు. కిలో బియ్యము, ఒక గజము వస్త్రము అన్నప్పుడే ఆకాంక్ష ఉన్నది. అప్పుడే సమన్వయము కుదురును.
 • 2. సన్నిధి : పదముల మధ్య విరామము, ఉచ్ఛారణలో ఆలస్యము జరిగినప్పుడు వాక్యార్థము మారిపోవును. పదముల మధ్య సాన్నిధ్య మున్నప్పుడు అర్థము చెడదు. అశ్వద్థామ హతః.. కుంజరః అన్నప్పుడు విరామము వలన అశ్వద్థామ అనే ద్రోణాచార్యుని పుత్రుడు చచ్చెనని అపార్థము వచ్చెను. కుంజరః అను పదము విరామము తరువాత వచ్చెను. అది సన్నిధిగా చెప్పినచో అశ్వద్థామ అనెడి ఏనుగు చచ్చెనని సరిగ్గా అర్థమయ్యెడిది. అనర్థము కాకపోయెడిది.
 • 3. యోగ్యత : ప్రత్యక్ష ప్రమాణమునకు విరుద్ధము ఉండకూడదు. అగ్నితో తడుపుము అన్నప్పుడు రెండు పదములను కలిపి ఉచ్ఛరించుటలో యోగ్యత లోపించినది. ఆ వాక్యము ప్రమాణము కాదు. అగ్నితో కాల్చుము అని అన్నప్పుడు గాని, నీటితో తడుపుము అని అన్నప్పుడు గాని ఆ రెండేసి పదములకు యోగ్యత కుదిరి ప్రమాణము సిద్ధించుచున్నది. ఈ విధముగా వేదాంత వాక్యములను పరిశీలించలెను.
సద్గురువు - అంతర్యామి : 
సశరీరుడు, సర్వజ్ఞుడు అయినట్టి సద్గురువే అంతర్యామి. అవతార పురుషునిలో అంతర్యామిగా ఉండునది సద్గురు తత్త్వమే. అవతారుడు జరిపే అవతార కార్యక్రమమునకు అంతఃప్రేరణ నందించేది సద్గురువైన అంతర్యామి. అవతారుని శరీర విసర్జన జరిగిన తరువాత, అవతార చైతన్యము సద్గురుని ఇచ్ఛానుసారము ఫలితముల నిచ్చును. పరమాత్మలో, పరబ్రహ్మలో అంతర్యామి పాత్ర ఉండదు. శాస్త్రజ్ఞులలో, తత్త్వవేత్తలలో, వారు పరిశోధించే వాటికి, వారిలో అంతఃప్రేరణగా ఉండే తత్త్వము యొక్క కేంద్రము, ఆ కేంద్ర స్థితియే సద్గురు స్థితి లేక అంతర్యామిత్వము.

శ్లో||  న గురోరధికం తత్త్వం, న గురోరధికం పరం,
       తత్త్వ జ్ఞానాత్పరం నాస్తి, తస్మై శ్రీ గురవే నమః

ప||   బాలమత్తరీతి బలు పిశాచము భాతి |
       భావమందు భేదభావ మిడిచి |
       దిరుగుచుందురయ్య గురువులు ధరలోన |
       అఖిల జీవసంగ | ఆత్మ లింగ||

ప||   గురుదేవా! నీ కృపా వీక్షణ లేశమ్ము
       గూఢమౌ తత్త్వార్థ బోధకమ్ము
       ఋజుమార్గమును జూపు ఋషితుల్యుడవు నీవు |
          మార్గదర్శి మానవాళికెల్ల |
       దేశకాల వస్తు గుణ రూప జ్ఞానమ్ము |
       వాస్తవమున భావమాత్రమౌను |
       యతివరా! శాస్త్ర స్వరూపా ! నమస్సులివే |
       చిద్రూప చిన్మయానంద స్వామీ ||


శిష్యుని అనుభవము :

శ్లో||  అహం నిర్వికల్పో నిరాకార రూపః
       విభూత్వాచ్ఛ సర్వత్ర సర్వేంద్రియాణాం |
       నచాసంగతంనైవ ముక్తిర్నమేయః
       చిదానంద రూపః శివో-హం శివో-హం ||

సంకలనం: చల్లపల్లి

15, ఆగస్టు 2020, శనివారం

శ్రీ శంకరాచార్యుల చరిత్ర - Sri Aadi Shankaracharya Charitra

శ్రీ శంకరాచార్యుల చరిత్ర - Sri Aadi Shankaracharya Charitra

శ్రీ శంకరాచార్యుల చరిత్ర

శ్రుతి స్మృతి పురాణానా మాలయం కరుణాలయం
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరమ్

శంకరుల జననం:

కేరళ రాష్ట్రమునందు పూర్ణానదితీరమున కాలటియను గ్రామము కలదు. దాని సమీపముననే వృషాచలము అను పర్వతము గలదు. |గ్రామమునకు ఉత్తరమున ఒక మైలు దూరమునందు దుర్గామందిరము, శివాలయమును గలవు, ఆ గ్రామమున శివగురువు, ఆర్యాంబ అను బ్రాహ్మాణ నిపసించుచుండిరి. వీరిది ఆత్రేయస గోత్రము.

ఈ దంపతులకు చాలా కాలము వరకు సంతానముకలుగ లేదు. శివగురువు సంతానమునుగోరి వృషాచలముమీ ద నియమ నిష్ఠలతో తపస్సు చేసెను. ఆ తపమునకు మెచ్చిన పరమశివుడు శివ గురువునకు స్వప్నమున కనిపించెను. 'అజ్ఞులు చిరంజీవులగు బహుపుత్రులు కావలయునా, సర్వజ్ఞుడు, అల్పాయువు అగు ఒక కుమారుడు కావలయునా?', అని అడిగెను.  శివ గురువు సర్వజ్ఞుడయిన అల్పాయువునే కోరెను.

ఆర్యాంబ గర్భము ధరించెను. క్రీ. పూ. 509వ సంవత్సరమున విభవనామ సంవత్సర వైశాఖ శుక్ల పంచమినాడు శంకరులు రవి కుజ శనులు ఉచ్చయందుండగ కర్కాటక లగ్నమున జన్మించిరి.

శంకరుల విద్యాభ్యాసం:
శ్రీ శంకరులు రెండవయేటనే చదువుట వ్రాయుట నేర్చి రి. మూడవయేట కావ్యపఠనము చేసిరి. ఈ వయస్సు నందే తండ్రి చూడాకర్మచేసి దివంగతుడయ్యెను.

"బ్రహ్మవర్చస కామస్య కార్యం విప్రన్య పంచమే" యను శాస్త్రము ననుసరించి శంకరులకు అయిదవ యేటనే ఉపనయనము జరిగెను. వారు గురుకులమున వేద వేదాంగములను చదివి ఏడవయేట యింటికి తిరిగి వచ్చిరి.

శంకరుల దివ్య చరిత్రము

బాల్యమున శంకరులు దేవినిపూజించి పాలను నివేదన చేసిరి. దేవి పాలను స్వీకరించలేదు. దేవికి తన పై కోపము కలిగినదని శంకరులు విలపించిరి. దేవి ప్రత్యక్షమై బాలశంకరుని తనయొడిలో కూర్చుండ బెట్టుకొని పాలను త్రాగించెను. అందుచేతనే శంకరులు సర్వ విద్యా ప్రసన్ను లయిరి.

      గురుకులమునంచు చదువు సమయమున శంకరులు భిక్ష కొరకు ఒక పతివ్రత యింటికి వెళ్ళిరి. దరిద్రు రాలగు అమె బ్రహ్మతేజస్సుగల శంకతులకు ఏమియు ఇవ్వజాల నందులకు మిగుల విలపించి ఒక ఉసిరిక మాత్రము అయన జోలెలో వేసెను. శంకరులు అమె పై దయగలవారై లక్ష్మీ దేవిని సుతించిరి, అమె అనుగ్రహించి బంగారు ఉసిరికలను కురిపించెను. ఆ సమయమున శంకరులు చేసిన స్తోత్రమునకే కనకధారా స్తవమని పేరు.

    తల్లి ఆర్యాంబ ప్రతిదినము పూర్ణానదికి స్నానమునకు వెళ్ళుచుండెను. ఒక దినమున నడువ లేక మార్గములో పడిపోయెను, తల్లి పై భక్తిగల శంకరులు తన యోగశక్తిచే ఆ నదిని తన యింటి సమీపమునకు తీసుకొని వచ్చిరి ఆ సమయముననే శంకరులు ఆచార్యులుగ నుండిరి.

   శంశరులవారి లోకోత్తర శక్తిని విని కేరళ ప్రభువు శంకరులను వారి ఆస్తానమునకు ఆహ్వానించిరి. వైరాగ్యము గల శంకరులు రాజసభకు వెళ్ళలేదు. ప్రభువే స్వయముగ శంకరులను దర్శించి తాము వ్రాసిన మూడు నాటకములను వినిపించిరి. శంకరులు అందలి విషయములను వివరణ చేయగా రాజు సంతసించి సహృదయముతో స్వీకరించెను ఆ మూడు నాటక ములు భస్మము కాగా శంకరులు మరల రాజునకు స్వయముగా వినిపించిరి.

      ఒక దినమున శంకరులు పూర్ణానదిలో స్నానము చేయుచుండగ మొసలి పట్టుకొనెను. శంకరులు తల్లితో మొసలి నన్ను చంపుచున్నది. సంన్యాసాశ్రమమునకు అనుజ్ఞ ఇచ్చినచో మొసలి వదలి పెట్టునని చెప్పిరి. అమె అంగీకరించగా మొసలి వదలి వవెళ్లెను.
ఆ యర్దముగల శ్లోక మిటులున్నది
శ్లో|| నక్రోఒంబ మాం తు నయతి తీవ్రతను ర్భలాడ్యః
సంన్యస వేషకరణే మమాపి చ జీవితం స్వాత్ 

నంన్యస్య శ్రవణం కుర్యాత్ అను వచనము ననునరించి శంకరులు గురువుకొరకు వెదుక సాగిరి.

నర్మదానదీతీరమున ఓంకారనాధ క్షేత్రము గలదు. అచ్చ ట గోవింద భగవత్పాద యతీంద్రులు నివసించుచుండిరి. శంకరులు వారికి నమస్కరించి శిష్యునిగ స్వీకరింప వలసినదని ప్రార్ధించిరి. గోవిందపాదులు నీవు ఎవరు అని ప్రశ్నించిరి. శంకరులు తమ యద్వైత న్వరూపమును శోకములలో వినిపించిరి. ఆ సమయమున నే నిర్వాణషట్కం, నిర్వాణ దశకం, నిర్వాణమంజరి, నిర్దుణమానసపూజ, మొదలగు వానిని రచించిరి, శంకరులు వాక్యములకు సంతసించి గోవింద భగవత్పాదులు ప్రణవ సహితముగా దీక్ష నిచ్చిరి. శంకరులు అచ్చట రెండు సంవత్సరము లుండిరి

ఆ సమయమున ఏకధారగా అయిదు రోజులు వర్షము కురిసెను. నర్మదానదినీరు అ ఆశ్రమములోనికి వచ్చెను. నీటిని అరికట్టిరి. శంకరులు తన కమండలముతో ఆ నీటిని అరికట్టిరి. ఒక మట్టి పాత్రలో నీరంతయు నింపగల వారే తన బ్రహ్మ సూత్రములకు భాష్యము పవ్రాయుటకు సమర్థులనీ వ్యాస మహర్షి గురు గోవిందపాదులకు చెప్పియుండెను. అ విషయము గురువులు చెప్పగ శంకరులు గురువుల యనుమతి ననుసరించి వ్యాసమహర్షి ని దర్శించుటకు కాశీకేషేత్రమునకు బయలుదేరిరి. ఆ సమయమున శంకరులు గురుసుతిని చక్కగ శ్లోకములలో చేసిరి.

సర్వాణి పుణ్యతీర్థాని సేవ్యాన్యేవ ముముక్షుభిః అనియు, తీర్ది  కుర్వంతి తీర్థాని, అను నారదవచనము అనుసరించియు, స్వయం. హి తీర్థాని పునంతి సంతః అను భాగవత వచనము నరుసరించి పుణ్య క్షేత్రములు ముక్తి ప్రదములు. ప్రత్యేకముగా కాశీ క్షేత్రమునకు ముక్తిక్షేత్రమునకు ముక్తిక్షే త్రమనియు, శివపురియనియు, |త్రిపురారి రాజనగరి అనియు పేరులు గలవు.

    అట్టి క్షేత్రమునకు శంకరులు వ్యాసమహర్షి దర్శనము కోరి వెళ్ళిరి. అచ్చ ట అన్నపూర్ణావిశ్వేశ్వరుల దర్శనముచేసి వారిని స్తుతించిరి. ఒకరోజున గంగాస్నానముచేసి వచ్చు చున్న శంకరులకు పరమశివుడు ఛండాల వేషధారియై ఎదురు గావచ్చెను. శంకరులు అతనిని దూరముగా తొలగుమనిరి, ఆంతట ఛండాల వేషమున నున్న పరమశివుడు ఎవరిని తొలగమందువు? అన్న మ య శరీరమునుండి శరీరమునా? చైతన్యము నుండి చైతన్యమునా? గంగా జలము నందు, ఛండాల వాటిక యందలి గంగాజలాశయమునందు ప్రతి బింబించు సూర్యునికి భేదముండునా? అత్మయందు ఇతడు ఛండాలుడు ఇతడు విప్రుడు అను భ్రమ నీకెట్లు కలిగినది అని ప్రశ్నించెను. ఆ ఛండాలుడే విశ్వనాధుడని గ్రహించి శంకరులు మనీషాపంచకము చెప్పిరి.

    ఆ విధము గ కాశీలో నివసిందు సమయమున శంకరులు ఎన్నియో దేవతాస్తో త్రములు అత్మబోథనలు అగు రచనలు చేసిరి.

శ్రీ శంకరులు కాశీనగరము నుండి శిష్యులతో బయలుదేరి హరిద్వార హృషి కేశములమీదగ బదరీ క్షేత్రముచేరిరి. అచ్చటనే భాష్యములను రచించిరి. బదరీ నుండి తిరిగి వచ్చి కాశీనగరములో నివసించు నమయమున ఒక వృద్ద బ్రాహ్మణుడు వచ్చి బ్రహ్మసూత్రములయందలి తదనంతర ప్రతి పత్తా అనుసూతమును వివరించవలసినదనికోరి8ి. ఆ సమయమున వారిద్దరకు ఎనిమిదిరోజులు వాదము జరిగెను. పద్మ పాదులు ఆ బ్రాహ్మణుని వ్యాసునిగ గుర్తించిరి. శంకరులు వ్యాసుని స్తుతించిరి. వ్యాసులు సంతసించి యిటుల అశీర్వదించిరి.
అష్టావయాంసి విధినా తవ వత్స దత్తా
న్యన్యాని చాప్ట భవతా సుధి యార్టితాని
భూయోఒపి షోడశ భవంతు భవాజ్ఞయా తే
భూయాశ్చ భాష్య వింద మా రవి చంద్ర తారకమ్ ||

అనగా శంకరుల ఆయువు ఎనిమిది సంవత్సరములు. వారు తపస్సు చే మరియొక ఎనిమిది సంవత్సరములు సంపాదించిరి. వ్యాసులు మరియొక పదియారు సంవత్సరములు "అనుగ్రహించిరి. భాష్యము సూర్యచంద్రులున్నంత వరకు 'నిలుచునని చెప్పిరి.

శంకరులు కుమారిలభట్టుతో వాదన చేయుటకు ప్రయాగ నగరమునకు వచ్చిరి. కుమారిలభట్టు వైదికమతమును కర్మకాండను గట్టి పునాదులపై నిలబెలటైను. అయన ప్రచ్చన్న వేషములతో భౌద్ధుల నాశ్రయించి వారి విద్యలయందలి రహస్యములను తెలుసుకొని వారిని ఓడించెను. గురువులను తిరస్కరించిన దోషము పోవుటకు తన దేహమును అగ్నియందు అహుతి చేసుకొనుచుండెను. శంకరులు వారిని చూచి దగ్ధదేహమునకు స్వస్థత చేకూర్చగలనని చెప్పిరి. అందులకు కుమారిలభట్టు అంగీళరించక మండన మిశ్రునితో వాదన చేయవలసినదని చెప్పిరి.

       శంకరులు మాహిష్మతీ నగరమునకు వెళ్ళి మండన మిశ్రుల గృహమును గురించి విచారించగా నగరవాసులు ఇటుల చెప్పిరి. మండన మిశ్రుని గృహప్రాంగణమున చిలుకలు 'స్వతః ప్రమాణం పరతః ప్రమాణమ్' అని వాదనచేయుచుండును. శంకరులు వెళ్ళిన సమయమున మండనమిశ్రులు శ్రార్ధము పెట్టుచుండిరి. వ్యాస, జైనమహర్షులు భోక్తలుగా నుండిరి. తలుపులు మూసియుండుట చే శంకరులు ఇంటి కప్పులో నుండి లోనికి వెళ్ళిరి. శంకరుల రాకను చూచి మండనుడు కోపగించుకొనెను. భోక్తలు శ్రాద్ధమును శాంతముతో పెట్టవలయుననియు యతిని సత్కరించి భిక్ష పెట్టమనియు చెప్పిరి. మండన మిశ్రుడు భిక్ష స్వీకరించవ లెనని కోరగా శంకరులు వాధభిక్ష నడిగిరి. మండన మిశ్రుడు అంగీకరించెను. మండనమి శ్రుని భార్య ఉభయభారతి మధ్యవర్తిగా ఉండెను. అమె వారిద్దరికంఠములను పూల దండలతో నలంకరించి. ఓడిన వారి దండ వాడిపోవునని చెప్పెను. ఓడినవారు గెలిచిన వారి మూత్రమును స్వీకరించ వలయునని పణముగా పెట్టుకొన్నిరి. అనేక దినములు వాదన జరుగగా మండన మిశ్రుని మెడలోని దండ వాడిపోయెను.  సంన్యాసము స్వీకరించవలసిన వాడయ్యెను. ఉభయభారతి విషయము గ్రహించి ఇద్దరిని భిక్ష చేయవలసినదని పిలిచెను. అంతకు పూర్వము మండన మిత్రుని వైశ్వదేవమునకు శంకరులను భిక్షకు పిలుచు చుండెను.

      ఉభయభారతి తననుకూడ ఓడించిననేకాని తనభర్తను ఓడించినటుల కాదనియు కా మశాస్త్రమి. తనతో వాదించమనియు శంకరులను కోరినది. శంకరులు తనకు కామశాస్త్రములో పరిచయము లేదనియు నెలరోజులు గడువు కావసినదనియు కోరిరి. ఉభయభారతి ఆంగీకరించెను.

ఆ సమయమున 'ఆ దేశమునేలు రాజు మరణించెను ఆయన శవమును దహనము చేయుటకు శ్మశానమునకు తీసుకొని వెళ్ళిరి. శంకరులు ఆ విషయమును గ్రహించి తన శరీరమును ఒక గుహయందు భద్రపరచుకొని రాజుశరీరమునందు ప్రవేశించిరి తన శరీరమునకు ప్రమాదము సంభవించినపుడు తనను ప్రార్థించవలసినదని శిష్యులతో జెప్పిరి.

     రాజు శవమునందు ప్రాణము వచ్చుటచే రాజు మరలబ్రతికనని అందరు తలచిరి. రాజుభార్య మాత్రము ఎవరో మహాయోగి తన భర్త శరీరములో ప్రవేశించెను. అని తెలుసు కొనెను. దహనము చేయని శరీరములు ఎచ్చట నైనను ఉన్నచో దహనము చేయవలసినదని సేవకుల కాజాపించెను. సేవకులు శవము కొరకు వెదుక నారంభించిరి. ఈ లోపల శంకరులు ఆంతఃపుర స్త్రీలతో కలసి కామశాస్త్ర రహస్యములు తెలుసుకొనెను. సేవకులు శంకరుల శరీరమును కనుగొని దహనము చేయనారంభించిరి. శిష్యులు శంకరులను ప్రార్థించగ వారువచ్చి మరల తన శరీరములో ప్రవేశించిరి. అప్పటికే శరీరము సగము కాలి యుండెను. శంకరులు కరావలంబన క్షేత్రముచేయగా నృసింహస్వామి దయవలన స్వస్థత చేకూరెను.

ఉభయభారతి వాదమున ఓడిపోయెను. ఆమె బరహ్మ దేవుని పత్నియగు శారదాదేవి. ఒక సమయమున ఆమె దూర్వాసుని చూచి నవ్వెను. అందులకు ఆయన కోపించి మర్త్యలోకమున పుట్టవలసినదనిశపించి శంకరులవలన శాప విమోచన కలుగునని చెప్పిరి. శాప విమోచనము అయిన వెంటనే అమె నిజరూపముతో బ్రహ్మలోకమునకు బయలుదేరెను, శంకరులు అమెను వనదుగ్గామంత్రముతో బంధించి లోకోపకారమున కై భూలోకమున ఉండవలసినదని ప్రార్ధించిరి, అందులకు ఆమె అంగీకరించి మీరు ముందు నడచుచుండగ నేను వెనుక వతును. మీరు వెనుక తు మరలి చూచినచో అచ్చటనే నిలచి పోదునని చెప్పెను.. అందులకు శంకరులు అంగీకరించి ముందు నడచుచుండిరి. శారదాదేవి ఆదృశ్యరూపమున ఆయన వెనుక నడచుచుండెను. అమె నూపుర ధ్వనులు వినుచు శంకరులు ముందు నడచుచుండిరి. శృంగేరీ ప్రాంతమున అమె నూపురధ్వని వినిపించలేదు శంకరులు వెనుక కు తిరిగిచూచిరి. శారదాదేవి అచటనే నిలిచి పోయెను.

     ఆర్యాంబకు తుదిమడియలు సమీపిం చెను. శంకరులు తల్లి సమీపమునకు చేరి వేదాంత తత్త్వమును బోధించిరి, శివ విష్ణు సుతులు చేసిరి. అమె మరణించగా అంత్యక్రియలు స్వయముగా చేసిరి. అటుపిమ్మట దక్షిణదేశ మునందలి అన్ని క్షేత్రములు దర్శించి దేవతాస్తుతులు చేసిరి.

       శ్రీ శంకరులు దేశాటన చేయుచు శ్రీ శెలము చేరిరి. ఒక కాపాలికుడు శంకరునివద్ద చేరి వేదాంతపఠనముచేసెను. అతడు ఒక దినమున నేను చేయుచున్న భైరవారాధన సఫలము అగుటకు యతీశ్వరుని శిరమును హోమము చేయవలసి యున్నది. మీ శిరమును ఇవ్వవలసినదని శంకరులను ప్రార్థించెను. శంకరులు వారి శిష్యులు దగ్గరలేని సమయమున నా శిరము ను తీసుకొనవలసినదని చెప్పిరి. కాపాలికుడు తగిన సమయముకోసము చూచి తీసుకొనబోవు చుండెను ఇంతలోపద్మపాదులు నృసింహస్వామి' పూనిక తో అచటికి వచ్చి కాపాలికుని గోళ్ళతో చీల్ర్చి చంపెను. ఆ సమయమున శంకరులు పద్మపాదుని ఆవహించిన నృసింహ స్వామిని స్తుతించి శాంతింప చేసిరి.

       శంకరులు శ్రీబలి యను గ్రామము చేరిరి. ఆచ్చట ప్రభాకరుడను బ్రాహ్మణుని కుమారుడు పిచ్చి వానివలె సంచరించుచుండెను. ప్రభాకరుడు అ కుమారుని శంకరులకు చూపిరి శంకరులు నీవు ఎవరని పశ్నించగా బాలుడు ఆ ద్వైతభావమును ప్రకటించెను. వెంటనే శంకరులు ఈ బాలుడు నా దగ్గర ఉండవలసినవాడని తండ్రితో చెప్పి తన వెంట తీసుకొని వెళ్ళిరి. అతనికి హస్తామలకుడని పేరు పెట్టిరి. ఇతని మొదటి పేరు పృథ్వీథరాబార్యుడు.

     శంకరులు శాశ్వతముగ ధర్మమును రక్షించుటకై నాలుగు ధిక్కుల యందును నాలుగు పీఠములను సాపించిరి వాటి వివరములు ఈ విధముగ ఉన్నవి:

పూర్వా మ్నాయము - వేదము ఋగ్వేదము, మహా వాక్యము ప్రజ్ఞానం బ్రహ్మ-గోత్రము కాశ్యప, కేషత్రము పురుషొ త్తమదేవుడు జగన్నాధుడు. మఠనామము. గోవర్ధన-ఆచార్యుడు' హస్తామలకుడు. కేంద్రము పూరిజగన్నాధము హస్తామలకుని చరిత్ర పూర్వము ప్రాయబడినది.

దక్షిణామామ్నాయము - వేదము యజుర్వేదము మహావాక్యము అహం బ్రహ్మాస్మి, గోత్రము భూర్భువః, తీర్థము తుంగభద్ర, క్షేత్రము రామక్షేత్రము. దేవుడు వరాహస్యామి, దేవత శారదా, మఠనామము శృంగేరీ శారద. ఆచార్యుడు సరేశ్వరుడు, కేంద్రము శృంగేరి, మండన మిశ్రుడే నురేశ్వరాబార్యులుగ ప్రసిద్ది చెందిరి.

పశ్చిమామ్నాయము - వేదము సామవేదము మహా కావ్యము, తత్త్వమసి, గోత్రము అనిగత, తీర్థము గోమతీ నది, క్షేత్రము ద్వారకానగరము. దేవుడు సిద్దేశ్వరుడు, దేవత భద్రకాళి, మఠనామము ద్వార కామఠము. ఆచార్యుడు పద్మపాదులు. కేంద్రము ద్వారక. గంగానది ప్రవహించు సమయమున శంకరులు పద్మపాడుని నది పై నడచి రమ్మనిరి. అయన నడుచు సమయమున పాదముల క్రింద పద్మములు ఏర్పడుటచే పద్మపాదులు అని పేరు పొందిరి.

ఉత్తరామామ్నాయము - వేదము, అథర్వవేదము, మహా వాక్యము అయమాత్మా బ్రహ్మ, గోత్రము భృగు, తీర్థము అల కానంద. క్షేత్రము బదరికాత్రమము. దేవుడు నారాయణడు, దేవత పూర్ణ గిరి. మఠనామము జ్యోతిర్మఠము, అచార్యుడు త్రోటకుడు, కేంద్రము బదరికావనము.
   
     త్రోటకాచార్యులవారి మొదటి నామము గిరి, వీరు శంకరులను తోటక పృత్తములచే స్తుతించిర. అందువలన త్రోటకాచార్యులు అను సార్ధకనామమును పొందిరి.

శంకరుల ఆద్వైత సిద్ధాంతము

ఆచార్యుల వారు స్థాపించిన మతమునకు అద్వైతము అని పేరు, ఈ మతము వేదశాస్త్రనమ్మతమయి అనుభవవేద్యమై యున్నది. ఈ సృష్టియంతయు బ్రహ్మపదార్థము చే వ్యాప్తమై యున్నది. అయినను సామాన్యులకు వేరు వేరుగ కన్పించుట కు కారణము వారియందుగల అజ్ఞానమే. బంగారముతో చేసిన అభరణములకు, వేరు వేరు నామరూపములున్నప్పటికిని వానియందుగల బంగారము మాత్రము ఒక్కటే. అటులనే సృష్టియంతయు బ్రహ్మనికారమే గాని వేరుశాదు. బీజము నందు చెట్టునకుగల కొమ్మలు, అకులు, పూలు, కాయలు దాగియున్నటుల సృష్టికి పూర్వము ఈ పదార్థము లన్నియు బ్రహ్మయందు దాగియున్నవి. సత్కర్మాచరణము చే చిత్తశుద్దిని సంపాదించి వేదాంతశాస్త్ర శ్రవణమననాదులచే అజ్ఞానము తొలగినపుడు అంతయు బ్రహ్మమయముగా కన్పించును. ఈ ప్రపంచమంతయు స్వప్నతుల్యము, స్వప్నము పోయిన తరువాత స్వప్న మునందలి పదార్దములు కనిపించని విధమున అజానము తొలగిన తరువాత భేదఖావము నశించి అంతయు అత్మపదార్థముగా కనిపించును.

ఉప దేశ పంచకమ్

వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠియతాం 
తేనేశస్య విధీయతా మపచితిః క్లామ్యేమతి స్తజ్యతామ్
పాపౌమః పరిధూయతాం భవసుఖే దోషో నుసంధీయతాం
అత్మే చ్ఛావ్యవసియతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యుతామ్ ||

నిత్యము వేదము చదువుము, వేదము చెప్పిన కర్మలను చేయుము, ఈశ్వరుని పూజింపుము. కోరికలను విడిచి పెట్టుము, పాపములను పరిహరించుము. సంసారము నందలి దోషము తెలిసికొనుము ఆత్మజ్ఞానమునకు ప్రయత్నించుము. ఇంటిని విడిచి బయటకు వెళ్ళుము.


సంగన్సత్సువిదీయతాం భగవతో భక్తిర్తృడాధీయతాం
శాంత్యాదిః పరిధీయతాం దృఢతరం కర్మాశు సంత్యజ్యతామ్
సద్వి ద్వానుపనర్ప్యతాం ప్రతిదినం తళ్పాదు కే సేవ్యతామె
బ్రహ్మై కాక్షరమద్ద్యతాం శ్రుతిశిరోవాక్యం సమాకర్థ్యతామ్

సత్పురుషుల స్నేహము చేయుము. భగవంతుని యందు దృఢమయిన భక్తిని నిలుపుము. శాంతిని సాధింపుము, దుష్టకర్మలను విడిచి పెట్టుము. పండితుల దగ్గరకు వెళ్ళుము. వారి పాదములను సేవించుము. ఏకాక్షరమయిన ప్రణవమును యాచింపుము. వేదాంత శత్రవణము చేయుము,

వాక్యార్ధశ్చ విచార్యతాం శ్రుతిశిరః పక్షస్సమాశ్రీయతాం
దుస్తర్కా స్సు విరమ్యతాం శ్రుతిమత స్తరోనుసంధియతాం,
బ్రహ్మైవాస్మి విభావ్యతామహరహః గర్వః పరిత్యజ్యతామ్
దేహేహమ్మతి రుజ్జ్యతాం బుధజనైర్వాదఃపరితయజ్యతామ్
వేదాంత వాక్యవిచారము చేయుము. వేదాంత పక్షమును ఆశ్రయించుము. దుష్టమయిన తర్కమును విడిచి వేదవిహిత మయిన తర్కమును చేయుము. రాత్రిం బవళ్ళు బ్రహ్మను అని భావన చేయుము. గర్వము విడిచి పెట్టుము. శరీరమునందు ఆత్మబుద్ధిని విడిచి పెట్టుము. పండితులతో వాదన చేయకుము.

క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం
స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివతాత్రాత్ప్తేన
...........సంతుష్యతామ్

శ్రీతోష్ణాది విషహ్యతాం న కు వృధావాక్యం సము చ్చార్యతాం
ఔదాసీన్య మభీప్ప్యతాం జనకృపానైష్ణుర్యముత్స్ృజ్యతామ్ ||

ఆకలియనున రోగము పోవుటకు భిక్షయను మందును తినుము, రుచికరములయిన అన్న మునకు ఆశపడకుము. దైవవశమున లభించినచో సంతసింపుము. వేడిని చలిని సహించుము. వ్యర్ధముగా మాటలాడకుము. ఉదాసీనుడవయి యుండుము. జనుల దయకు ఆశపడకుము.

ఏకాంతే సుఖమాన్యతాం పరతరే చేతస్సమాధీయ కాం
పూర్ణాత్మా సునమీూక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం
ప్రాక్కర్మప్రవిలాప్యతాం చితిబలా న్నాప్యుత్తరైః శ్లిష్యతాం
ప్రారబిస్త్విహ భుజ్యతా మధ పరబ్రహ్మాత్మనాస్థీయ తామ్

ఏ కాంతమునందు సుఖముగా నుండుము, బ్రహ్మయందు చిత్తమునిలుపుము, ఈ జగత్తును అత్మస్వరూపముగా భావించుము. జగత్తు నశించునది అని తెలియుము పూర్వకర్మను జ్ఞానబలమువలన నాశనము చేసుకొనుము కొనుము. ఆగామి కర్మలయందు కోరికను విడిచి పెట్టుము. ప్రారబ్దము అనుభవించుము, పరబ్రహ్మయందు స్థిరముగా నుండుము.

శ్లో||  యః శ్లోక పంచకమిదం పఠతే మనుష్య 
సంచింత యత్యనుదినం స్థిర తాము పేత్య
తస్యాశు సంస్కృతి దవానల తీవ్ర ఘోర
తాఫః ప్రశాంతి ముపయాతి చితి ప్రసాదాత్ ||

ఈ అయిదు శ్లోకములను ప్రతిదినము స్థిరమయిన సమబుద్ధితో చదివి ఆలోచించిన వారికి అత్మ సాక్షాత్కారము వలన సంసారమనెడు దావాగ్ని నశించి శాంతి లభించును.

లింగాష్టకం

బ్రహ్మము రారి నురార్చితలింగం నిర్మలఖాసిత శోభితలింగం
జన్మజ దుఃఖవినాశక లింగం తత్ణ మామి సదాశివలింగం
దేవముని ప్రవరార్చితలింగం కామదళన కరుణాకర లింగం
రావణదర్పవినాశక లింగం తత్తణమామి సదాశివలింగం
సర్వనుగంధ ను లేపితలింగం బుద్ధి వివర్తన కారణలింగం
సిద్దసురాసుర వందితలింగం తత్రణ మా మి సదాశివలింగం
క నక మహామణిభూషితలింగం ఫణిపతి వేషిత శోభితలింగం
దక్షయ జ్ఞ వినాశసలింగం తత్ణమామి సదాశివలింగం
కుంకుమ చుదన లేపితలింగం పంకజహార సుశోభితలింగం
సంచితపాపవి నాశనలింగం తత్రణమామి నదాశివలింగం
దేవగ జార్చిత సేవితలింగం భావై ర్ృ క్లిభి రేవచలింగం
దినకరకోటి ప్రభాకరలింగం తత్త్ణమామి సదాశివలింగం
అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముదృవ కారణ లింగం
అష్టదరి ద వినాశన లింగం తత్రణ మా మి సదాశివలింగం
సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చితలింగం
పరమపదం పరమాత్మక లింగం
తత్రణమామి సదాశివలింగం
లింగాష్టక మిదం పుణ్యం యః పఠేచ్చివ, సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన నహమోదతే
ఇతి లింగాష్కమ్

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

14, జులై 2020, మంగళవారం

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి జీవిత విశేషాలు - Brahmaśrī Chāgaṇṭi kōṭēśvararāvu


ఆధ్యాత్మిక వేత్త,ప్రసిద్ధ ప్రవచనకారుడు పూజ్యులు "బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు"

జననం 14 జూలై 1959
బ్రహ్మశ్రీ చాగంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త. అయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు. తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. 1959 జూలై 14వ తేదిన రావుగారు జన్మించారు. కోటేశ్వరరావు సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు; అయన ధారణ శక్తి, జ్ఞాపకశక్తి చెప్పుకోదగ్గవి. మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ, భక్త జన మనసులను దోచుకున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది బిరుదులను అందుకున్నారు.

మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణమును, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహా పురాణాన్ని,, 40 రోజుల పాటు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమును అనర్గళంగా ప్రవచించి పండిత, పామరుల మనసులు దోచుకొని, విన్నవారికి అవ్యక్తానుభూతిని అందిస్తున్నారు. కాకినాడ పట్టణ వాస్తవ్యులనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నఎంతో మంది తెలుగు వారికి తనదైన శైలిలో ఎన్నో అమృత ప్రవచనములు అందజేయుచున్నాడు.

చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులో జనకులు గతించారు. అయనకు ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిగారు కస్టపడి నలుగురు పిల్లలను పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు. నిరుపేద కుటుంబం. సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అన్న స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయినుంచే అయన విద్యాబుద్ధులు వికసించాయి. అయన యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు.
 • ➧ అయన ధారణాశక్తి చాలా గొప్పది. ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం అయన మదిలో నిలిచిపోతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు.
 • ➧ అయన ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానే తన సంపాదనతో వివాహాలు చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు.
 • ➧ అప్పుడపుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారత భాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. ఏనాడూ డబ్బు పుచ్చుకునే వారు కారు. అయన స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అభిమానులు పెరిగారు.
 • ➧ పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటాను.. ఎక్కడో ఒకచోట చాగంటి వారిని కలిశారు. "మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి. చేసిపెడతాను" అన్నారు పీవీ.
 • ➧ చాగంటి వారు నవ్వేసి "మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు." అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు.
అయన బయటప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం వారి అమ్మగారు 1998 లో స్వర్గస్తులు అయ్యాక ప్రారంభించారు. ఎందుకంటే చాగంటి వంశంలో గత ఆరు తరాలుగా ఆ సరస్వతి కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తున్నది. ఈ తరంలో ఆ శారదాకృప నలుగురు పిల్లలలో చాగంటి కోటేశ్వర రావు గారిపై ప్రసరించింది. ఆ మాత దయను తృణీకరించలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు.

సంకలనం: పద్మనాభరావు దరపనేని

30, జూన్ 2020, మంగళవారం

గురుశబ్దం త్రిమూర్తితత్త్వం - Guru Shabdam


గురుశబ్దం త్రిమూర్తితత్త్వం - Guru Shabdam

గురుబ్రహ్మ

గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురురువేనమః

గురుశబ్దం త్రిమూర్తితత్త్వం. సృష్టి, స్థితి, లయకారం, అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడు గురువు. 
 • ➧ గురూ అనే శబ్దాన్ని విడదీస్తే ‘గ్ – ఉ – ర్ – ఉ’ అనే అక్షరాలు కనబడుతుంటాయి. 
 • ➧ వీటిలో ‘గ’ కారం సిద్ధకమైన బ్రహ్మకు, ‘ర’కారం పాపనాశకరమైన శివశాక్తికి సంకేతాలు. 
 • ➧ ఈ రెండూ పాలస్వభావం కలిగిన ‘విష్ణుశక్తి’తో కలిసినప్పుడే ‘గురు’ అనే పదం ఏర్పడి ‘గురు’తత్త్వం మూర్తీభవిస్తుంది. 
 • ➧ అందుకే గురువును మనం త్రిమూత్రిస్వరూపంగా భావిస్తూ పూజించుకుంటున్నాం.
‘గురి’ని కల్పించేవాడు గురువు. లక్ష్యసాధనామార్గాన్ని చూపేవాడే గురువు అని స్థూలార్థం. గురువు పరంపరాగత క్రమశిక్షణగలవాడైతే, శిష్యునకు ఉపదేశ మివ్వడానికి అర్హుడనీ,  అతడే సద్గురువు అని భావించాలి. శిష్యుడు గురువును గురువుగా ఎన్నుకున్నంత మాత్రానికే, ఆయన వెంటనే గురువు కాజాలడు. ఆయన కూడా అతడిని శిష్యునిగా ఎన్నుకోవాలి. తన గురువును ఎన్నుకునే అధికారం శిష్యునికి ఉన్నట్లే, శిష్యుని ఎంపిక చేసుకునే అధికారం గురువుకు ఉంది. నిదానించి, పరిశీలించి శిష్యార్హతను నిర్ణయిస్తాడు గురువు.

గురువు నడుచుకోవలసిన ప్రవర్తనా నియమావళి అంటూ ఉంటుంది. కానీ, ఏదో ఒకనాడు ఆ ప్రవర్తనా నియమావళిని అతిక్రమించినట్టు కనబడితే, శిష్యులు తమ నిర్ణయాన్ని మార్చుకుని మరో గురువుకై అన్వేషిస్తారు. అటువంటివారు ఉభయభ్రష్టులవుతారు. కావున శిష్యులు తమ హృదయాలను నిష్కల్మషంగా ఉంచుకుని సహజమైన శాంతి, తృప్తి, సహనాన్ని కలిగి ఉండాలి. సత్త్వగుణ సంపన్నుడైన గురుస్థానం శివస్థానంగా ఎంచి తన హృదయాన్ని పరిపూర్ణంగా గురువుకి అంకితమివ్వాలి. అదే శిష్యుని నిజమైన గురుత్వం. అలాగే గురువు కూడ ‘గురుతత్త్వం’ కలిగి ఉండాలి. తనను పరిపూర్ణంగా విశ్వసించిన శిష్యునికి, తాను పరిపూర్ణంగా ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించాలి. అటువంటివారే సద్గురువులుగా భావించబడతారు.

కొంతమంది, గురువులను మూడు విధాలుగా పేర్కొన్నారు.
 • 1. జన్మదాత (తండ్రి), 2. విద్యాగురువు, 3. మోక్షగురువు.
 • 1. ఉపదేశ గురువు, 2. కులగురువు, 3. జగద్గురువు.
 • 1. మాతా, 2. పితా, 3. ఆచార్యుడు.
ఈ ముగ్గురు గురువులలో విద్య నేర్పే గురువు అధికుడు. జీవుని యాత్రలో గురుయాత్ర గొప్పది. విశ్వామిత్రుడు బాలకులైన రామలక్ష్మణులను వెంటబెట్టుకుని వెళ్ళి అనేక అస్త్రవిద్యలను నేర్పి, బల, అతిబల విద్యలలో వారిని ఆరితేరులను గావించి, వారి సాయంతో నిర్విఘ్నంగా యజ్ఞాన్ని పూర్తి చేసి, అడ్డుగా వచ్చిన తాటకి, మారీచ సుబాహులు హతమారునట్లు చేశాడు. అదొక వనయాత్ర, సాహసయాత్ర లేక విజ్ఞానయాత్ర లేక శుభయాత్ర అని అనవచ్చు.

ఇక జ్ఞానాన్ని అందించే గురువులు ఐదుగురు
 • 1. పంచసంస్కార ప్రదాత, 
 • 2. బ్రహ్మప్రదాత, 
 • 3. ప్రబంధ ప్రదాత, 
 • 4. బ్రహ్మార్థప్రదాత, 
 • 5. పంచమోప్రాయప్రదాత.
ఇక ఆరు విధాలైన గురువులు: 
 • 1. ప్రేరకుడు,
 • 2. సూచకుడు,
 • 3. వాచకుడు,
 • 4. దర్శకుడు,
 • 5. బోధకుడు,
 • 6. శిక్షకుడు.
అనంతరం అష్ట గురువులు:
 • 1. అక్షరాభ్యాసాన్ని చేయించినవారు,
 • 2. గాయత్రీ మంత్రోపదేశాన్ని చేయించినవారు,
 • 3. వేదాధ్యయనం చేయించినవారు,
 • 4. శాస్త్రాభ్యాసం చేయించినవారు,
 • 5. పురాణేతిహాసాలను చెప్పినవారు,
 • 6. మతాచార సంప్రదాయాలను బోధించినవారు,
 • 7. ఇంద్రజాలాది మంత్రబోధకుడు,
 • 8. బ్రహ్మజ్ఞానోపదేశికుడు.
వీరిలో చివరి గురువే (బ్రహ్మజ్ఞానోపదేశికుడు) మోక్షగురువు. మిగిలినవారు సఛ్చీళ జీవనయాత్ర సాగడానికి ఉపయోగపడేవారు.
ఇంకా-
 • 1. బొధగురువు, 
 • 2. వేదగురువు, 
 • 3. నిషిద్ధగురువు, 
 • 4. కామ్యకగురువు, 
 • 5. సూచకగురువు, 
 • 6. వాచకగురువు, 
 • 7. కారణగురువు, 
 • 8. విషిత గురువు అంటూ ఎనిమిది మంది గురువులున్నారు.
1. గూఢుడు, 2. దృఢుడు, 3. ప్రీతుడు, 4. మౌని, 5. సకృత్ కామగతుడు అనే పంచవిధ గురువులున్నారు.

ఇలా గురువుల గురించి ఎన్నో అపురూపమయిన విషయాలున్నాయి. ఇక, లోకంలో అనేకావతారాలున్నాయి. కాని, శ్రీదత్తావతారంలో గురు ప్రభావములు, గురు విలక్షణలు గ్రహింపదగినవి. జగద్గురువు అయిన తనకు కూడా ప్రవృత్తిమార్గాన్ని చూపిన గురువులున్నారని శ్రీగురుదత్తాత్రేయుడు భాక్తవరడుడైన ప్రహ్లాదునితో వివరించినట్లుగా మనకు తెలుస్తోంది.

“ప్రహ్లాదా! నా స్మృతిపథంలో ఉన్నవి అవి, అవి రెండే రెండు గురువులు. అవియే, ఎలా ఉండకూడదో చెప్పింది జుంటీగ. ఎలా ఉండాలో చెప్పింది కొండచిలువ. అనగా, జుంటీగ వైరాగ్యాన్ని నేర్పింది. కొండచిలువ సంతుష్టిని నేర్పింది” అని గూఢాతిగూడమైన గురుతత్త్వాన్ని బోధించాదు దత్తాత్రేయులు.

అలాగే, శ్రీకృష్ణపరమాత్మ ఆవిర్భవించిన యాదవ వంశానికి మూలపురుషుడైన “యదువు” అనే మహారాజునకు ఒకప్పుడు శ్రీఅవధూత దత్తస్వామి దర్శనం లభించింది. వారిలో చీకూచిన్తలేని స్థితిని చూసిన యడురాజు, “స్వామీ! అంతర్గతంగా ఏ ధర్మాన్ని ఆశ్రయించి ఉండటం వలన మీకీ స్థితి లభించింది? దయతో నాకు ఉపదేశించండి” అని అభ్యర్థించాడు.

అతని మాటలోనున్న ఆర్తిని, వినయాన్ని చూచిన శ్రీ అవధూత ఇలా సమాధానమిచ్చారు.

“యదురాజా! నేను లోకాన్ని విస్తృతంగా పరిశీలించి, ఎందరెందరో గురువుల నుండి రవ్వంత జ్ఞానాన్ని సంపాయించాను. రాజా! నాకు ఇరువది నలుగురు గురువులున్నారు. 
జాగ్రత్తగా విను.
 •  1. భూమి, 
 •  2. వాయువు, 
 •  3. ఆకాశము, 
 •  4. నీరు, 
 •  5. అగ్ని ఇవియే పంచభూతాలు. 
 •  6.సూర్యుడు, 
 •  7. చంద్రుడు, 
 •  8. పావురాలు, 
 •  9. అజగరము(కొండచిలువ), 
 • 10. సముద్రము, 
 • 11.మిడత, 
 • 12. తుమ్మెద, 
 • 13. గజము, 
 • 14. మధుహారి (తేనెటీగ), 
 • 15. లేడి, 
 • 16. చేప, 
 • 17. ‘పింగళా’ – అనే వేశ్య, 
 • 18. కురరము (లకుముకిపిట్ట), 
 • 19. బాలుడు, 
 • 20. బాలిక, 
 • 21. శరకారుడు, 
 • 22. సర్పము, 
 • 23. సాలీడు, 
 • 24. పురుగు ఇవి నా గురువులు.
వాటి నుండి గ్రహించినది విను.
 • భూమి నుండి – క్షమా, పరోపకారత్వం
 • వాయువు నుండి – నిస్సంగత్వము, నిర్లేపత్వము
 • ఆకాశము నుండి – సర్వవ్యాపకతత్త్వం
 • జలం నుండి – నిర్మలత్వం, మాధుర్యం, స్నిగ్ధత్వం
 • అగ్ని నుండి – తేజస్సు, ఈశ్వరతత్త్వం
 • ➧ సూర్యుని నుండి – జలగ్రాహి, జలత్యాగియు. లోక బాంధవుడతడు. సర్వలోకాలకు అతడొక్కడే.
 • చంద్రుని నుండి – వ్రుద్ధిక్షయాల రూపుడు, అట్టివి షడ్భావ వికారాలు దేహానికేకాని, తనకు (ఆత్మకు) కావని చంద్రుడు నేర్పించాడు.
 • ➧ పావురాల జంటనుండి – కామక్రోధాలకు వశమైనచో ‘ఆత్మానురాగం’ కోల్పోతారని గ్రహింపు.
 • అజగరము నుండి – దైవికంగా లభించినదానికి తృప్తి చెంది, ఆత్మనిష్ఠ కలడైయుంటుంది.
 • సముద్రం నుండి – తనలో దేన్నీ ఉంచుకోదు. అపవిత్రమైనది కల్మషమైనదియు అనగా అడియోగాతత్త్వం కలది. కామాన్నీ, వికారాన్నీ కూడా తనలో చేరనీయదు. తన మనోభావాన్ని బైటకు పొక్కనీయదు.
 • మిడత నుండి – మ్రుత్యురూపమైన మోహమనెడి జ్వాలాగ్నికి బలియవడం, సుఖమను తలంపుతో మృత్యురూపం పొందుతుంటుంది.
 • తేనెటీగ నుండి – ఏ పూవును కూడ బాధించకుండ తను పొందాల్సినదానిని (మధురమును) పొంది జీవిస్తుంది. యోగి కూడ ఎవరిని నొప్పించకుండా భిక్ష గ్రహించి పోషించుకొంటాడు. ప్రతి పుష్పాన్ని వదలక ఉండటమనేది, ముని ప్రతీ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, నేర్పుతో సారాన్ని గ్రహించడం, కానీ, కూడబెట్టిన మధుసంపద రేపటికిని ఉంచుకొంటే అది పరుల సోత్తగునని గ్రహించదు. అందుకే ముని తాను పొందిన భిక్ష మరునాటికని ఉంచుకొనడు. ఉంచుకొన్నా అది పనికిరానిదవుతుంది కదా!
 • గజం నుండి – తానెంత బలిష్ఠమైనదో, అంట మ్రుత్యురూపమగు మోహంగలది. అనగా స్త్రీలౌల్యం కలది. ఆ మోహంలోపడి తాను ఇతరులకు వశమవుతుంది.
 • మధుహారి నుండి – ఇతరులు కూడబెట్టుకొనిన వస్తువు (మధువు)ను, లోభం చేత న్యాయాన్యాయాలు లెక్కించక, అపహరించువాడు కడు నీచుడు.
 • లేడి నుండి – అమాయకత్వంలో సంగీతంమోజుతో వేటగానికి చిక్కుతుంది, ఋష్యశృంగముని సంగీత నాట్యాలకు భ్రమసి మాయ వలలో పడ్డాడు.
 • చేప నుండి – ‘ఎర’కు (జిహ్వ) చాన్చాల్యంతో ఇంద్రియనిగ్రహం కోల్పోయి గాలానికి చిక్కుతుంటుంది. ‘జిహ్వ’ కానరాని దొంగ కదా!
 • పింగళ నుండి – ధనాశతో కాలహరణం, భౌతిక వాంఛకు శరీరాన్ని భ్రష్టత్వమొనర్చుకొనుట.
 • కురరము నుండి – తనకు ప్రియమైనది, ఇతరులకు ప్రియమైనది లెక్కించక పోటీపడుటలో పొందు దుఃఖము.
 • బాలుడు నుండి – యోగితో సమానుడు. పాప పుణ్యాలు ఎరుగనివాడు. భగవత్ర్పాప్తి వల్ల నిరుద్యముడై ఉంటాడు.
 •  కన్యక నుండి – తనకున్న లేమిని కనబరచకుండా కుటుంబ గౌరవాన్ని కాపాడుకొంటుంది.
 • శరకారుడు నుండి – ఏకాగ్రతను సాధిస్తాడు.
 • సర్పము నుండి – ఈ శరీరం క్షణ భంగురమని, తనకంటూ ఒక గృహము ఏర్పరచుకోదు.
 • సాలెపురుగు నుండి – పరబ్రహ్మతత్త్వం తెలియును. సృష్టిలయములు క్రియస్వరూపి.
 • పురుగు నుండి – రోదచేస్తున్న తుమ్మెదనే చూస్తూ మనస్సనంతయు ఆ తుమ్మెదవైపు లగ్నమొనర్చినా, కొంతసేపటికి, తాను ఆ తుమ్మెద రూపం పొందుతుంది. అనగా భక్తుడు దేనిపై లగ్నమొనర్చునొ అటుల రూపధారి అవుతాడు. ఉదా|| భరతుడు. (శ్రీరాముని తమ్ముడు).
అలాగే, అనకు ప్రతీ అణువు గురువేయని, తనలోని మనస్సే తనగురువని కూడ చాటాడు అవధూత శ్రీదత్తాత్రేయులు. ఇక, ఆచార్యులు జ్ఞానంతో పాటూ సదనుష్టానాన్ని కలిగివుండాలి. అటువంటి ఆచార్యులకు చక్రవర్తియైనప్పటికీ తలొంచవలసిందే. ఆ రోజుల్లో గురువులకు ఈ

క్రింది లక్షణాలు ఉండేవి.
 • ➣ శిష్యవాత్సల్యం
 • ➣ విషయపరిజ్ఞానం
 • ➣ బోధనా కౌశలం
 • ➣ మనస్తత్త్వాన్ని తెలుసుకుని ఉండటం అనే లక్షణం
 • ➣ అందరిపట్ల సమభావాన్ని కలిగి ఉందటం
అయితే, ప్రస్తుత గురువులలో చాలామంది ‘చెవిలో మంత్రం చేతిలో ధనం’ అన్నట్లుగా ఉంటున్నారు. ఇది భవిష్యతరాలకు మంచిది కాదు. శిష్యులు కూడ గురువుల పట్ల భక్తిప్రపత్తులతో మెలగాలి. అప్పుడే మన జీవితానికైన జ్ఞానార్జన లభిస్తుంది.

సంకలనం: నాగవరపు రవీంద్ర

9, జూన్ 2020, మంగళవారం

శ్రీ రామానుజులు - Ramanujulu

శ్రీ రామానుజులు - Ramanujulu

శ్రీ రామానుజాచార్య

సాక్షాత్ అదిశేషులు లక్ష్మణస్వామి బలరాముడు మన రామానుజులు
బ్రహ్మరాక్షసిని పారద్రోలి రాజును ఆకర్షించి అందరి మతం మార్చాడని జైనులకు రామానుజుని మీద విపరీతమైన కోపం వచ్చింది. జైన గురువులు రామానుజుడు నరసింహాలయంలో ఉన్నారని తెలిసి అక్కడికి దండెత్తి వెళ్లారు. ఒకేసారి పన్నెండు వేలమంది రామానుజుడిని శాస్త్ర చర్చకు రమ్మన్నారు. ముందు తమను జయించాలని, ఆ తరువాతే రాజుతో మాట్లాడాలని సవాలు చేశారు. ఓడిపోతే తమ మార్గాన్ని, మతాన్ని అనుసరించాలన్నారు. రామానుజులు వారి సవాల్‌ను స్వీకరించారు. ‘మేమంతా ఒకేసారి ప్రశ్నిస్తాం. అన్నింటికీ సమాధానాలు చెప్పాల’ని వారు నిబంధన విధించారు. వచ్చిన జైనులలో దిగంబరులూ ఉన్నారు. శ్వేతాంబరులూ ఉన్నారు. రామానుజ యతీంద్రుడికి ఒక కట్టుబాటు ఉంది. దిగంబరులను చూడరు, మాట్లాడరు. కనుక ‘‘నా చుట్టూ తెర కట్టండి, మీరు చుట్టూ చేరి ప్రశ్నలు అడగండి. నా నుంచి సమాధానాలు వినిపిస్తాయి వినండి. నా తెరలోకి తొంగి చూస్తే మీకే నష్టం జాగ్రత్త’’ అన్నారు.

రామానుజులు కనిపించకుండా తెర కట్టారు. చర్చ మొదలైంది. వాదప్రతివాదాలు జరుగుతున్నాయి. వేలాది గొంతులు వినిపిస్తున్నాయి. ఒక్కో జైనుడికి ఒక్కో గొంతుక వినిపిస్తున్నది. సూటిగా ఒక్కో ప్రశ్న వేసిన వ్యక్తికే వినిపించే సమాధానం దూసుకుని వస్తున్నది. జైన మునులు ఆశ్చర్యపోతున్నారు. ఏం జరుగుతున్నదో తెలియడం లేదు. ప్రశ్నించడమో ప్రతిపాదించడమో జరిగిందో లేదో, సమాధానాలు శరాల్లా వస్తున్నాయి. శరవేగంగా ప్రతివాదాలు, ఖండన మండనలు వెలువడుతున్నాయి. శాస్త్ర, పురాణ ప్రమాణాలు, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల వాక్యాలు, ఈటెల్లా వస్తున్నాయి. రాను రాను జైనుల ప్రశ్నాస్త్రాలు వడిసిపోతున్నాయి. నిరస్త్రమై నిస్తేజమై పడిపోతున్నాయి. అడగడానికేమీలేక జైనుల నోళ్లు మూతబడుతున్నాయి. కొందరికి అనుమానం వచ్చింది. తెరలోపల ఏం జరుగుతున్నది? ఒక్కవ్యక్తి ఇన్ని గొంతులతో ఏవిధంగా మాట్లాడుతున్నారు? ఇది వాస్తవమా లేక కనికట్టా? అని తెరతీసి చూశారు. చూసిన వారు వెంటనే మతిభ్రమించినట్టు పడిపోయారు. పిచ్చిబట్టినట్టు పరుగెత్తిపోయారు.

‘‘ఏమైంది.. ఏం కనిపించింది..’’ అని వారిని అడిగితే ‘‘అక్కడ రామానుజ వీర వైష్ణవ తేజం ప్రజ్వరిల్లుతున్నది. వేలాది పడగల ఆదిశేషుడై రామానుజుడు విజృంభించి వాదనా కదన రంగంలో వీరవిహారం చేస్తున్నాడు. ఆ భయానక దృశ్యం చూడగానే మాకు మతిపోయింది. నాతోపాటు చూసిన వారు, తెరతీయడానికి భయపడేవారు, తెరతీసి భయపడి పారిపోయినారు. వేలాది ప్రశ్నల వేగాన్ని బట్టి సమాధాన సహస్రాలు మహాగ్ని జ్వాలలై వచ్చాయి’’ అని చెప్పుకున్నారట. న్యాయనిర్ణేతగా ఉన్న రాజు వాద ప్రతివాదాలు వినడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రశ్నలూ ప్రతిపాదనలూ ముగియగానే తెరవెనుక ఆదిశేషుని అవతారమైన యతిరాజు ప్రత్యక్షమైనాడు. తెరతొలగగానే దివిలో జ్ఞాన సూర్య సహస్ర కాంతులతో రామానుజుడు దుర్నిరీక్షుడై కనిపించాడు. కాసేపటి తరువాత జైన శాస్త్రవేత్తలు, పండితులు, తర్కశాస్త్రజ్ఞులు మౌనం పాటించారు. ఆ మౌనం పరాజయానికి ప్రతీక కనుక జైనులు పరాజితులని రాజు ప్రకటించారు. తొండనూరులో జైనుల ఆధిక్యం సమసిపోయి వైష్ణవం వెల్లివిరిసింది.
శ్రీమతే రామానుజాయ నమః
ఇళయపెరుమాళ్! ఇళయాళ్వార్! లక్షణముని! రామానుజ!
యతిరాజ! శ్రీభాష్యకార! ఉడయవర్! ఎమ్బెరుమానార్! పెరియకోయిల్అణ్ణా!

గోదాగ్రజ! శఠకోపన్ పొన్నడి! తిరుప్పావైజీయర్! భవిష్యదాచార్య!
దేశికేంద్ర! యతిపతి! ఆదిశేషామణి! శ్రీపెరంబూదూర్ మాముని!

యతిరాజసార్వభౌమ! యతివరచూడామణి! యతికులచంద్ర! యతిశైలశేఖర!
యతిశైలరాజేంద్ర! యతివరభాస్కర! యతివరగోవింద! యతిశైలమఙ్గలమణి!

శ్రీరఙ్గేశవిజయద్వజ! ఆచార్యరత్నాకర! దివ్యసూరిదాస! ఉభయవిభూతినాయక!
శ్రీభూతపురిక్షమావల్లభ! శ్రీభూతపురీశ! ఆచార్యకులతిలక! శ్రీకలివైరిదాస!

శ్రీదేశికశిఖామణి! రామానుజదివాకర! శ్రీరఙ్గప్రవణ! యతిరాజశేఖర!
యతిశైలచక్రవర్తి! శ్రీసంపత్కుమారజనక! శ్రీకృపామాత్రప్రసన్నాచార్య!

శ్రీరఙ్గరాజచరణాంబుజరాజహంస! శ్రీవిష్ణులోకమణిమండపమార్గదాయి!
గురుకులాంబుధిచంద్ర! కాంతిమతీనందన! యామునాచార్యకారుణైకపాత్ర!

వేదార్ధప్రకాశక! అఖిలలోకైకపూజ్య! విజయశీల! విశిష్టాద్వైతనిర్వాహక!
శఠజిత్ సూక్తివర్ధన! శ్రీశఠకోపచరణరూప! సర్వజ్ఞశిరోమణి!

శ్రీభూతపురినిలయ! భవబంధవిమోచక! సర్వోత్తమోత్తమ!
యతీంద్ర! క్షమాగుణనిధి! శ్రీరఙ్గనాథప్రియ! భక్తజనచింతామణి!

నిత్యసూరిశ్రేష్ఠ! అఖిలలోకరక్షక! రామానుజమునిశేఖర! అపారకరుణాంబుదే!
సర్వవిజ్ఞానసాగర! అప్రమేయదివ్యమఙ్గలస్వరూప! సర్వజగదాచార్య!

శ్రీవైష్ణవగురుకులధుర్య! శ్రీవైకుంఠఫణిపుంగవ! శ్రీపరాంకుశపాదభక్త!
ముముక్షులోకబాంధవ! మోక్షఫలసంధాయక! ఆచార్యరత్నాహారమధ్యమణి!
దివ్యదేశ కైంకర్యదీక్షాపర! శ్రీమన్మాహాభూతపురినాథన్! యతిరాజన్!🙏


సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

31, మే 2020, ఆదివారం

కరపాత్ర స్వామిజీ...మూడు జన్మల భిక్షుని గాధ - Karapatra Swamiji


కరపాత్ర స్వామిజీ...మూడు జన్మల భిక్షుని గాధ.

ఒక గ్రామంలో ఒక బిచ్చగాడు ప్రతి ఇంటికి వెళ్లి బిచ్చమెత్తుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక ఇంటి వద్ద భవతీ భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరీ అని అడిగాడు.

ఆ ఇంటి యజమాని పండితుడు. అతను అరుగుమీద కూర్చుని పారాయణ చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఇల్లాలికి వినిపించ లేదేమో అని బిచ్చగాడు గట్టిగా మళ్లీ భవతీ భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని అన్నాడు. పండితుడికి కోపం వచ్చింది నేనిక్కడి ఉంటుండగా నాతో మాట్లాడకుండా నాకు చెప్పకుండా ఇంత నేను సంపాదిస్తుంటే ఆమెను పిలిచి బిచ్చం అడుగుతాడా. వీటికి తగిన శాస్తి చేస్తాను అని అనుకుని వెంటనే ఏమేవ్ మూడు జన్మల ముష్టివాడు వచ్చాడు బిచ్చం వెయ్యి అని గట్టిగా అరిచాడు. ఆ గొంతు పోల్చుకున్న ఆమె భర్తకి కోపం వచ్చిందని గ్రహించి వెంట వెంటనే బియ్యం తీసుకొచ్చి బిచ్చగాడి పాత్రలో వేసి ఆవిడ వెంటనే లోపలకు వెళ్లిపోయింది. కానీ బిచ్చగాడు మాత్రం కదల్లేదు. అతని చేతిలో కర్ర కూడా ఉంది. అప్పుడు పండితుడికి అనుమానం అలజడి మొదలయ్యింది. అకారణంగా నేను అన్న మాటలు వీడికి బాధ కలిగించాయి. వీడిపుడు ఏంచేస్తాడు తిడతాడా లేదా ఇంకా ఏం చేస్తాడా అని లోలోపల బాధ పడుతూ చూస్తున్నాడు. ఇంతలో బిచ్చగాడు ఏమండీ అని పిల్చాడు. ఆ అంటూ చిన్న అహంకారాన్ని ప్రదర్శించాడు పండితుడు. ఏం లేదు మీరు నన్ను మూడు జన్మలు ముష్టి వాడన్నారు అది ఎలాగా అన్నాడు అదా దానికే ఉంది. తెలుసుకోవాలనుకుంటున్నావా అయితే ఇలా కూచో అన్నాడు. ఫరవాలేదు చెప్పండి నిలబడతాను అన్నాడు.

శ్లోకం :
అదత్త దానాచ్చ భవేత్ దరిద్రః
దరిద్ర దానాచ్చ కరోతి పాపం।
పాప ప్రభావాత్ పునర్దరిద్రః
పునర్దరిద్రః పునరేవ పాపీ॥

అని శ్లోకం చదివాడు. వెంటనే బిచ్చగాడు అయ్యా మీరు చదివిన శ్లోకానికి అర్థం నాకు తెలియదు. నాకు అర్ధమయ్యేటట్లు మాటల్లో చెప్పండి అన్నాడు. నువ్వు గత జన్మలో ఎవరికీ ఏమీ ఇవ్వలేదు. అంటే రెండు కారణాలు. నీకు లేకపోయి వుండొచ్చు. ఉండి కూడా దానం చేయక పోయుండచ్చు. లేకపోతే గతజన్మలో నువ్వు ముష్టి వాడివి కాబట్టి ఆ ఫలితంగా నువ్వు ఈ జన్మలో కూడా ముష్టి వాడుగా అయిపోయావు. అంటే రెండు జన్మలు ముష్టివాడివి. అర్థమైంది మరి చెప్పొద్దన్నాడు బిచ్చగాడు. ఎందుకు ?

ఈ జన్మలో కూడా ఇవ్వడానికి నాదగ్గర ఏమీ లేదు కాబట్టి వచ్చే జన్మ కూడా. అని గొణుక్కుంటూ వెళ్లిపోయాడు. మర్నాడు అదే సమయానికి ఆ బిచ్చగాడు పండితుని ఎదురుగా నిలబడి ఇందులోంచి బయటపడే మార్గం ఏమీ లేదా. నేనిలాగే జన్మజన్మలకు బిచ్చగాడి గానే ఉండిపోవాలా? అని అడిగాడు.

జ్ఞానం సమయం వ్యక్తిత్వ విలువలు తెలిసిన పండితుడు ఇలా కూచో అన్నాడు. పెద్దవారి మీదగ్గర నేను కూర్చోవడం అన్నాడు. పర్వాలేదు కూచో జిజ్ఞాసా పరులకు శాస్త్రం చెప్పొచ్చు చెప్పాలి కూడా అందుకే ఈ శాస్త్రాలన్నీ అన్నాడు. కూర్చున్నాడు బిచ్చగాడు. ఇప్పుటికైనా దానం చేయడం మొదలుపెట్టాలి అన్నాడు నేను దానం ఎలా చేస్తాను నాదగ్గర ఏముంది గనుక. అన్నీ ఉన్నాయి లేకపోవడమనేది లేదు. నీలో దాన గుణం ఉంటే చాలు. 

నీ దగ్గర ఉన్నదే దానం చెయ్. ఈరోజునుంచి నీ కడుపుకి ఎంత కావాలో అంత మాత్రమే బిచ్చమెత్తుకుని అందులో సగం దానం చేస్తుండు. తనకు అవసరమున్నాసరే అందులోంచి మిగిల్చి ఇవ్వడమేదానం తాలూకు ముఖ్యోద్దేశ్యం. తను వాడుకోగా మిగిలినది ఇవ్వడం కాదు. బిచ్చగాడికి విషయం అర్థమైంది. వెంటనే ఆరోజు నుంచి ఓ నియమం పెట్టుకున్నాడు. తనకి ఎంత అవసరమో అంతే అడుక్కుని అందులోంచి సగం దానం చేయాలి. ఇది ఎలా తెలుస్తుంది దాని కోసం తన చేతిని భిక్షాపాత్రగా చేసుకుని అందులో పట్టినంత మాత్రం తీసుకుంటూ అందులో సగం దానం చేస్తూ సగం మాత్రమే తిన్నాడు. దాంతో బిచ్చగాడికి బిచ్చమెత్తుకునే ఇళ్ల సంఖ్య తగ్గిపోయింది. తిరగడం కాలం కూడా తగ్గిపోయింది. అతనికి ఒక గుర్తింపు లాంటిది వచ్చింది. కొద్ది రోజుల్లోనే ఇతను ఎవరి దగ్గర పడితే వారి దగ్గర బిచ్చమెత్తుకోడు ఇతను మన ఇంటికొస్తే ఈ రోజు బాగుణ్ణు. అనేటటువంటి భావాలు జనాల్లో కూడా వచ్చాయి. అంతేకాదు మొన్న వాళ్ళింటి కెళ్ళాడు. నిన్న వీళ్ళింటికి ఒచ్చాడు. ఇవ్వాళ మనింటికి తప్పకుండా వస్తాడని వాళ్లు ఆ బిచ్చగాడి కోసం మరికొంచెం పవిత్రంగా ఇవ్వాల్సిన పదార్థాల్ని సిద్ధం చేసేవాళ్లు. అందరికీ ఇచ్చే బిచ్చం కంటే ఇతనికి వేసే బిచ్చం చాలా ప్రశస్తంగా ఉండేది. సాత్వికంగా ఉండేది. మంచి ఆహారం లభించేది. 

పుచ్చకున్న దాంట్లో ఇతడు దానం చేయడం అందరూ చూశారు. అతనిలో ఏదో గొప్పతనం ఉందని చెప్పి పది మంది బిచ్చగాళ్లు చుట్టూ చేరి నువ్వే మా గురువన్నారు. ఇతడికది అంగీకారం లేదు. ఇదే నియమం పెట్టుకుని నేనెందుకు కాశీ వెళిపో కూడదు అని అనిపించింది. బయలుదేరాడు వెడుతున్నప్పుడు కూడా ఇదే నియమాన్ని పాటించాడు. తన చేతుల్లో ఎంత పడితే అంత ఆహారం తీసుకోవడం అందులోనున్న సగం దానం చేయడం. మిగిలినదే తినడం అంటే అర్థాకలి తన ఆకలి కడుపుని భగవదర్పణంగా జీవనం సాగిస్తున్నాడు. మొత్తం మీద కాశీ పట్టణాన్ని చేరాడు. అతను ఇదేనియమాన్ని అక్కడ కూడా పాటిస్తూ ఓ చెట్టుకింది ఎక్కువసేపు కూచునేవాడు. ఆతడు అందరిలాగా ఒక అరగంట కూర్చుని ఏదో వస్తే తీసుకుని వెళ్లిపోవడం ప్రసక్తి లేదు. లేదా సాయం ధర్మం చేయండి దానం చేయడానికి వంటి మాటలు కూడా అతని నోట ఎప్పుడూ వినిపించేవి కాదు. ఎప్పుడూ ఏదో ఒక ధ్యానంలో ఉంటూ ఉండేవారు. అతిని దగ్గర పడిన డబ్బులు లేదా బియ్యం ఇవన్నీ కూడా ఆతను వెళ్లాక ఎవరో తీసుకునే వాళ్లే తప్ప అతడు ఏనాడు అవి ఆశించలేదు. ఇలా కొన్నాళ్లు గడిచేసరికల్లా అతని మీద పదిమంది దృష్టి పడింది. అతనొక సాధకుడనికారణ జన్ముడనీ* అతనికి ఏం చేసినా మంచి జరుగుతుంది అని చెప్పి అతని పేరుతో ఒక వేద పాఠశాల ఒక సత్రం కూడా నిర్మించారు. ఆ సత్రం పేరు కరపాత్ర సత్రము. అతని పేరును కరపాత్ర స్వామీజీ అని ప్రజలే ఆపేరు పెట్టారు . కరమే పాత్రగా కలిగినటువంటి వాడి అని పేరుపెట్టారు. ఇలాగ వేద విదులు వేదాభ్యాసం చేస్తున్నారు పిల్లలకు వేదం శాస్త్రం పురాణం ఇతిహాసాలు చెప్తున్నారు. 

సత్రాల్లో బస చేస్తున్నారు వచ్చే పోయే వాళ్లు కూడా భోజనం చేస్తున్నారు. కానీ ఇతని కీవిషయాలు ఏవీ తెలియవు. ఇతడు మాత్రం రోజుకు నదికి వెళ్లి స్నానంచేసి ధ్యానం చేయడం మధ్యహ్నం బిచ్చమెత్తుకోవడం తనకు వచ్చినదాంట్లో సగం దానం చేస్తుండం యథాతథంగా జరుగుతోంది. కొన్నాళ్లయింతర్వాత అక్కడ అతని దగ్గర కూర్చునే వాళ్లు నిలబడే వాళ్ళు చూసేవాళ్ళు దండంపెట్టుకునే వాళ్లు పెరిగారు. వారి కోసం అన్నట్టుగా అక్కడ నీడని కల్పించడం పందిళ్లు వేయడం మొదలుపెట్టారు. పెద్ద తీర్థ యాత్రగా మారిపోయింది. ఇంకొన్నాళ్లయినాక ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఈయన్ని పెద్దగా పిలవాలని అనిపించి ఆ సభ బాధ్యత అంతా వాళ్లే భరిస్తూ కరపాత్ర స్వామీజీ ని పిలిచారు. అందులో మాట్లాడుతున్న పెద్దవాళ్లందరూ కూడా నాకు ఈయన 15 ఏళ్లుగా తెలుసు. వీరిని చూసిన తరువాత నాలో చాలా మార్పు అంతేకాదు కొన్ని కుటుంబాలు వాళ్లయితే మేమీయనకి దండం పెట్టిన తర్వాత మొక్కుకున్న తర్వాత మా పిల్లకి పెళ్లయిందన్నవారు, మాకుఉన్న అప్పులన్నీ తీరాయి కష్టాలు తీరాయి అన్నవాళ్లు మాకు ఏ ఇబ్బందులు లేకుండా అయిపోతున్నాయి పరమేశ్వరుని దర్శిస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యమూ వీరిని దర్శిస్తే నాకు జరిగిందని ఇలా అనేక రకాలుగా చెబుతున్నారు. కానీ ఒకటి మాత్రం అందరూ చెప్తున్నది ఈయనే గురువు నాకు. మా గురువు గారు కాశీ వెళ్లమని చెప్పారు. అందుకే ఇక్కడ వేదాదులు అధ్యయనం చేశాను. ఇలా అనేక మంది అనేక విషయాలు చెప్తున్నారు.

మన కరపాత్ర స్వామీజీకి అర్థం కాని విషయాలు రెండు. 
ఇంతకీ 1) కరపాత్ర స్వామిజీ ఎవరు. ఇన్నాళ్లు కాశీలో వుండి వారిని దర్శించుకోలేక పోయాను ఎంత దౌర్భాగ్యుణ్ణి.
2) నాకు గురువు ఎవరు ఈ రెండు ప్రశ్నలను ఆయన బాధిస్తున్నా అక్కడికొచ్చే వారికి ఏమిచెప్పాలో తెలియక భగవదనుగ్రహంతో ఏవో చెప్పేసి నాకు భిక్షా సమయమయింది నేను వెళ్లాలి అన్నాడు. ఆయన్ని ఎవరూ అడ్డుకోలేదు. అతడు సరాసరి భిక్ష ఐన తర్వాత ఒక్కసారి తన గురువు ఎవరు ఆలోచించుకున్నాడు. ప్రశ్నించుకుంటూ ఉంటే తనకొక విషయం తట్టింది. తనలో మార్పునకు కారణమైన వ్యక్తే గురువు అని నిర్ణయించుకున్నాడు.

అంతే వెంటనే తను ఎక్కడైతే మొట్టమొదట బిక్షాటన చేసుకున్నాడో ఆ గ్రామం గూర్చి బయలుదేరాడు. దారిలో ఇతన్ని గుర్తించిన వాళ్లు కలసి చూసి వచ్చిన వాళ్లు అక్కడ వేదం చదువుకున్న వాళ్లే కాదు ఆ సత్రంలో భోంచేసిన వాళ్లు అందరూ ప్రతి గ్రామంలోని గుర్తించి ఇతనికి స్వాగతం పలకడం అయనకేదో ఇవ్వడం అతను ఆ ధనాన్ని ఆ గ్రామంలోనే ఖర్చుపెట్ట మని చెప్పి పెద్దలకు ఇచ్చేస్తుంటే తానేమీ తీసుకోకపోవడం ఈయన ఖ్యాతి ఆనోట ఆనోట ప్రతి గ్రామానికి చేరింది. అందరూ ఇతని కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు అతను తన మొదటి గ్రామానికి వచ్చాడు ఆ గ్రామంలో వాళ్ళు కూడా చాలా ఆనందంతో కరపాత్ర స్వామిజీ వారు వచ్చేరు అని చెప్పి ఆయనకి ఆగ్రామంలో ఉంటున్న పండితుడిని పిలిచారు. ఆయనకూడా వెంటనే అంగీకరించాడు. పండితుడువెళుతూనే పాద నమస్కారం చేసాడు ఆయనకి మంత్రపూర్వకంగా తీసుకొచ్చి వేదిక మీద కూచోబెట్టారు. ఆయన గురించి నేను చూశానంటే నేను చూశాను నేనక్కడ సత్రంలో పనిచేశాను అక్కడ వేదపండితులు శాస్త్ర పండితులు శాస్త్రములు అని నేర్చుకుంటారు నేనక్కడున్నాను వీరిని మళ్లీ ఇక్కడ చూడ్డానికి చాలా ఆనందంగా ఉందంటే ఆనందంగా ఉంది. ఇలా చాలామంది మాట్లాడారు. 

స్వామీజీ కూడా మాట్లాడటం ఐపోయిన తరువాత నాకు భిక్షా సమయం అయింది నేను వెళ్లిపోతానని చెప్పాడు. పండితుల వారు మా ఇంటికి భిక్షకి దయచేయండి అని పిలిచారు. వెంటనే ఆయన అంగీకరించాడు. వాళ్ళింటికి వెళ్ళాడు. ఇద్దరు లోపల కూర్చున్నారు. ఆయన నియమం ముందే ఎరిగిన ఆతల్లి అతనికి సంప్రదాయ ప్రకారంగా కరతల భిక్ష పెట్టింది. ఆవిడ ఆభిక్ష పెడుతున్నప్పుడు ఆమెకుఏదో మాతృత్వం తొణికిసలాడింది. ఇదేం గమనించని స్వామీజీ భిక్షకోసం దోసిలి చాపాడు. ఆవిడకు ఎందుకో అనుమానం వచ్చింది చూస్తున్నప్పుడే కొంత అనుమానము ఇలా అడిగే సరికి ఇంకా అనుమానం వచ్చింది. సరే అని ఆయన నియమాన్ని భంగ పరచకూడదని కరతలంలో భిక్ష పెట్టింది.

అమ్మా నేను ఇది ఎవరికైనా దానం చేసుకోవచ్చు కదా అని అడిగాడు స్వామిజీ. అయ్యో అదెంత మాట అన్నది ఆ ఇల్లాలు. వెంటనే పండితుడు స్వామీజీ ఆభాగం నాకు ప్రసాదంగా ఇవ్వండని చెయ్యి పట్టాడు. స్వామిజీ ఇచ్చేశాడు.

ఆ ఇంటి అన్నపూర్ణ వడ్డిస్తోంది. గృహ యజమాని ఐన పండితుడు అతిథి ఐన స్వామీజీ ఇద్దరు కూడ భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో స్వామిజీ అ అడిగాడు. పండితుల వారు నన్ను గుర్తు పట్టారా అని. అబ్బే నేనెప్పుడూ కాశీమహానగరం రాలేదండీ నాకు అంత అవకాశం రాలేదు అన్నాడు.

సరే నేనెవరో చెప్తా వినండి అన్నాడు పండితుడు. వద్దండీ శాస్త్ర ప్రకారమూ ఏరుల(నదుల), శూరుల, మహనీయుల మహాత్ముల జన్మ రహస్యం అడగ కూడదు. సరే మీరు అడగలేదు నేనే చెప్తున్నాను వినండి. నాగురుదేవులు మీరు. అన్నాడు స్వామి. అబ్బే నేను పండితుడను. అంత వరకే అన్నాడు.

అయ్యా ముందు వినండి. నేను ఎవరో కాదు మీమూడు జన్మల ముష్టివాణ్ణి అని చెప్పాడు. పండితుడు ఒక్కసారిగా భోజనం మానేసి నిశ్చేష్టుడయ్యాడు. ఆ ఇల్లాలైతే ఏకంగా కన్నీరు పెట్టుకుంటూ వచ్చి స్వామి పాదాలపై పడి పతి భిక్ష పెట్టమని ప్రార్థించింది. అంత మాటలొద్దు అమ్మా. ధర్మం చెప్పేవాడు నిష్కర్షగా చెప్పాలి. ఆనాటికే కాదు ఈనాటికీ నేను సామాన్యుడినే. కానీ ఆ రోజు పండితుల వారు అంత తీవ్రంగా అంత కఠినంగా చెప్పకపోతే నాలో మార్పు వచ్చేది కాదు. నేను ఈనాడు ఈస్థితికి వచ్చే వాణ్ణి కాదు. 

అంచేత మీరే నాగురువు అంటూ నమస్కరించారు స్వామీజీ. లేదు లేదు మీరే నాకు జ్ఞానోపదేశం చేశారు. నేను మహా అహంకారిని పండితుడని గర్వం ఉండేది నా గర్వాన్ని పోగొట్టారు కాబట్టి మీరే నాకు గురువు అన్నాడు పండితుడు. అహంకారాలు పోయాయి గనక ఇద్దరి భావాలు ఒకటయ్యాయి. ఇద్దరూ హాయిగా పరమానందానుభూతిని పొందారు.

బెనారస్ యూనివర్శిటీ (కాశీ విశ్వ విద్యాలయం) లోఇప్పటికీ ఈ కరపాత్ర స్వామీజీ పేరుతో అవార్డ్ ఇస్తున్నారు*.

ఓం శ్రీ అన్నపూర్ణా దేవ్యే నమః

3, మే 2020, ఆదివారం

గురు అను పదానికి అర్ధము - "Guru" Ardhamu
గురు అను పదానికి అర్ధము
గురు అను మంత్రములో --గు , ర , ఉ అను మూడు అక్షరములు ఉన్నవి.

 •  - అనునది విఘ్నేశ్వర బీజాక్షరము
 • ర - అనునది అగ్నిబీజక్షరము
 •  - అనునది విష్ణుబీజాక్షరము

ఈ - మూడు బీజాక్షరాలు చేరి "గురు " అను మాత్రం ఏర్పడింది.

సంకలనం: గాయత్రీ

27, ఏప్రిల్ 2020, సోమవారం

హిందూమతోద్ధారకుడు.. ఆది శంకరాచార్యుడు - Saint Aadi Shankaracharya

Saint Aadi Shankaracharya

హిందూమతోద్ధారకుడు... ఆదిశంకరుడు

సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరా చార్యుడు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడే ఈ ఆచార్యుడు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథముడు. గొప్ప పండితుడు, గురువు, మహాకవి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788-820 మధ్యకాలంలో శంకరుడు జీవించాడని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నారుు. శంకరుడు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది.

సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యుడు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడే ఈ ఆచార్యుడు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథముడు. గొప్ప పండితుడు, గురువు, మహాకవి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788-820 మధ్యకాలంలో శంకరుడు జీవించాడని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. శంకరుడు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది.

బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి, శంకరుడు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు.

ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశాడు. తరువాత శంకరుని అనుసరించినవారికీ, శంకరునితో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంధాలుగా ఉపయుక్తమయ్యాయి. శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠాలను స్థాపించాడు. అవి శంకరుని సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.

గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధారా స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్ధనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.

ఆదిశంకరుని జీవితగాధ...
శంకరుని జీవితానికి సంబంధించిన వివిధ గాధలు, నమ్మకాలు ‘శంకర విజయం’ అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి చరిత్రలలో కొన్ని - శంకరుని జీవిత గాధలో ఎన్నో అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి.
 • మాధవీయ శంకర విజయం - 14వ శతాబ్దికి చెందిన మాధవుని రచన.
 • చిద్విలాస శంకర విజయం - 15 - 17 శతాబ్దుల మధ్యకాలంలో చిద్విలాసుని రచన.
 • కేరళీయ శంకర విజయం - 17వ శతాబ్దికి చెందిన రచన.
వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచగలిగారు.
జననం...

సదాశివుడే ఆదిశంకరుని రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురువులకు కేరళ లోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడి లో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్‌ కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ, శివగురువులు త్రిచూర్‌ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్ధించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందారు. పార్వతీ దేవి, సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ శంకరునికి అదేవిధంగా జన్మనిచ్చింది అని శంకరవిజయం చెబుతోంది.

శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి (ఈ తిథి ఈ ఏడాది 15 మే 2013న వస్తుంది) నాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితి లో ఉండగా జన్మించారు. ఆదిశంకరుని జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీ.శ. 788లో జన్మించారు, కంచి మఠం ప్రకారం స్వామి రెండు వేల సంవత్సరాలకు పూర్వం, క్రీ.పూ. 509 సంవత్సరంలో జన్మించారు.

బాల్యం...
శంకరుని బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరుడు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేస్తుంది. ఒకరోజు శంకరుని తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు.

సన్యాస స్వీకారం...
సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరుడు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినవుతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరుడు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి పట్టుకుంది.

సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరాడు. దానికి ఆమె అంగీకరించింది. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది.

గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారతయాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, ప్రాతఃకాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.

శంకరుని అసమాన ప్రతిభ...
ఒకరోజు శంకరుడు గంగా నది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తరువాత, ఆ వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరునికి చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరుడు మాత్రమేనని ప్రశింసించాడు.

వేదవ్యాసుడు నిష్ర్కమించ బోవడం చూసి, శంకరుడు ‘‘నేను చెయ్యవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించ’’మని వ్యాసుని కోరుతాడు. అప్పుడు వ్యాసుడు ‘‘లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే, నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది.

నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్నివ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరో 16 ఏళ్ళు అయుష్షు లభించుగాక’’ అని దీవిస్తాడు.
జగద్గురు ఆది శంకరాచార్య:
సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం
కైలాస వాసుని అవతారంగా భావించబడే శంకరుల కృప వలన మనకు ఈ రోజు హిందూ మతములో స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నవని అనుటలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. ఎందరో మహర్షుల, ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పలుకబడిన శక్తి వేదములుగా ప్రకాశిస్తున్నాయి. ఎవరో రచించి, మరెవరో పరిశీలనము, విమర్శ చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు. విశ్వవ్యాప్తుని మనోకమలము నుండి స్వయంగా మహాపురుషుల నోట వెలువడిన సచ్చిదానందములు వేదములు. అంతటి వేదములకు కూడా వక్ర భాష్యము చెప్పి, భారతీయ సమాజంలో విభజన కలిగించి, మూఢ చాందస భావాలను ప్రేరేపించి అన్యమతముల వైపు ప్రజలను మళ్లించిన సమయంలో ఆ పరిస్థితిని చక్క దిద్దటానికి శంకరులు కాలడిలో శివ గురు శక్తితో ఆర్యాంబ గర్బములో ఉత్తరాయణ పుణ్య కాలమున వైశాఖ శుద్ధ పంచమి నాడు అవతరించారు. చిన్ముద్రతో, మౌనంతో జ్ఞానాన్ని వ్యాపింప జేసే దక్షిణామూర్తి రూపమైన పరమ శివుడు ఈ దంపతులను ఆశీర్వదించగా శంకరులు ఉదయించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆయన దైవిక శక్తి, మార్గము కాలడిలో ప్రస్ఫుటించాయి.

మూడవ యేటనే తండ్రిని కోల్పోయిన శంకరులకు ఐదవ యేట ఉపనయన సంస్కారము జరిగింది. బ్రహ్మచర్య దీక్షలో భాగంగా మాధుకరం కోసం భిక్షాటనకు వెళ్లిన శంకరులకు ఒక పేద బ్రాహ్మణుని యింటి యిల్లాలు వద్ద ఉసిరికాయ తప్ప ఏమీ దొరకలేదు. ఆమె దుస్థితికి కరిగిన శంకరులు లక్ష్మీదేవిని కనకధారా స్తోత్ర రూపంలో ప్రార్థించగా ఆ తల్లి కరుణించి ఆ ఇంట బంగారు ఉసిరికలు కురిపించి వారి దారిద్ర్యాన్ని పోగొట్టిందిట. దిన దిన ప్రవర్థమాన మవుతున్న శంకరులకు మహర్షులు వచ్చిన దేశాన్ని ఉద్ధరించాలన్న కర్తవ్యాన్ని గుర్తు చేస్తారు. తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి శంకరులు భారత దేశ యాత్ర మొదలు పెడుతారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నర్మదానదిని తన కమండలములో బంధించిన శంకరుని చూసి ముగ్ధులైన గురు గోవింద భగవత్పాదులు శంకరులను తన శిష్యునిగా స్వీకరిస్తారు. గోవింద భగవత్పాదులు శంకరులకు వేదవేదాంగాలు ఉపదేశిస్తారు. ఆత్మ, పరమాత్మ ఒక్కటే అన్న అద్వైత సిద్ధాంతాన్ని కూడా శంకరులకు బోధిస్తారు. ఆ సందేశాన్ని ప్రపంచానికి చాటమని శంకరులను ఆశీర్వదించి పంపిస్తారు.

శంకరులు కాశీకి పయనమవుతారు. అక్కడికి చేరే సమయానికి ఆయనకు చాలా మంది శిష్యులు ఏర్పడుతారు. ఒకసారి ఒక శిష్యుడు నది ఈవలి ఒడ్డున గురువుల వస్త్రములు ఆరవేస్తుండగా శంకరులు అతనిని ఆవలి ఒడ్డు నుండి పిలుస్తారు. గురువుగారి పూర్తి ధ్యాసతో ఆ శిష్యుడు అడుగులు వేస్తూ నదిని దాటుకుంటూ వెళుతాడు. ఆ శిష్యుడు అడుగు వేసిన ప్రతిచోట ఒక పద్మము వెలసి ఆయనను నీట మునగ కుండా కాపాడుతుంది. అంతటి మహిమాన్వితమైన గురుకృపను పొందిన ఆ శిష్యుడు పద్మపాదునిగా పేరు పొందాడు.

ఒక రోజు శంకరులు గంగానదిలో స్నానం ముగించుకుని శిష్యులతో కలిసి విశ్వనాథుని మందిరానికి వెళుతున్నప్పుడు ఒక నిమ్న జాతికి చెందిన వాడు ఎదురు పడతాడు. అప్పటి ఆచారాల ప్రకారం శంకరులు వాడిని తప్పుకో, దారి విడువుము అని అంటాడు. అప్పుడా చండాలుడు నీవు తప్పుకోమంటున్నది ఈ దేహమునా? నా ఆత్మనా? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శంకరులు తన అహంకారానికి పశ్చాత్తాపపడి ఆ చండాలుని పరమశివునిగా గ్రహించి ప్రణమిల్లుతాడు. ఆ సందర్భంలో చండాలుని రూపములో ఉన్న శివుడు శంకరుని ఉద్దేశించి వేసిన ప్రశ్నలు మొదటి రెండు శ్లోకములు, అటు తర్వాత శంకరుల నోట వెలువడిన శ్లోకాలు మనీషా పంచకంగా పేరొందాయి. అద్వైతామృత సారమైన ఈ మనీషా పంచకం పరబ్రహ్మమొక్కటే అన్న సందేశాన్ని శంకర భగవత్పాదుల నోట మనకు అందించబడినది. తనలో ఉన్న ఆఖరి దుర్గుణమును ఈ సందర్భముగా శంకరులు దగ్ధము చేసుకునే అవకాశమును ఆ పరమ శివుడు చండాలుని రూపములో కలిగించాడు.

బ్రహ్మసూత్రాల కర్త అయిన వ్యాసుల వారి అనుగ్రహంతో వాటి భాష్యాలను అద్వైత సిద్ధాంతంతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేయటానికి పయనమవుతారు శంకరులు. దేశాటన చేస్తూ కాంచీపురంలో కామకోటి పీఠం, శృంగేరి శారదా పీఠం వంటి ఎన్నో క్షేత్రాలను స్థాపించారు. ఎన్నో వేల దేవాలయాలను పునరిద్ధరించారు. తిరువైమరుదూరు, తిరుచ్చి, శ్రీశైలము మొదలైన ప్రదేశాలలో ఎన్నో అద్బుతమైన స్తోత్రాల ద్వారా అక్కడి పుణ్యక్షేత్రాలను పునరుత్థానం చేసారు. హఠకేశ్వరం అడవులు శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కీకారణ్యములు. ఇక్కడ కాపాలికులు నివసించే వారు. కాపాలికులు శ్మశానాలలో ఉంటూ ఆటవిక జంతు మానవ బలుల ద్వారా దేవతలకు ప్రీతి కలిగించే వారు. ఆది శంకరులు ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తుండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరులను ఆ పరమేశ్వరునికి బలిగా రమ్మని అడిగాడుట. అందుకు శంకరులు సమ్మతించి బలికి సిద్ధమయ్యారు. కాపాలికుడు శంకరుల తల నరుకబోగా విష్ణుమూర్తి నృసింహ రూపంలో ప్రత్యక్షమై కాపాలికుని సంహరించాడు.

తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు సన్యాసియైన తాను ఆమెకు ఉత్తరక్రియలు చేయకూడదని తన కంటి నుండి అగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పు రాజిల్ల జేస్తారు. తన అనుపమానమైన శక్తితో మూకాంబిక, కోటచాద్రి, తిరుమల, పురీ, ద్వారక మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా తీర్చిదిద్దుతారు శంకరులు.భక్తి, జ్ఞాన, వైరాగ్యములతో మానసికోత్థానం కోసం, హిందూ మత శాఖల, పీఠాల ఐక్యత కోసం, ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఎందరో పండితులు, విమర్శకులను ఒప్పించి దేశ వ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపించారు. పామరులనుండి పండితుల వరకు వారి వారి చేతనావస్థను బట్టి స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి, ఈనాటి వరకు ఆ జ్ఞాననిధి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద నిలిచేలా చేశారు.

తన యాత్రల చివరలో శంకరులు బదరీ క్షేత్రానికి వెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనను అలకనంద నదిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని నిర్దేశిస్తాడు. శంకరులు అక్కడ బదరీనారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించి ఆ పరమాత్మలో ఐక్యమవుతారు.ఆ శంకరుల కృప వలననే మనకు నేడు అష్టాదశ శక్తి పీఠములు, చార్ ధామ్ మొదలైన పుణ్య క్షేత్రాలు, వాటి వలన మనకు అత్యున్నతమైన హైందవ అద్వైత సిద్ధాంత సారమైన జీవనశైలి, సమాజము భాసిల్లుతున్నాయి.

శంకరుల రచనలు:
ఆయన చేసిన స్తోత్రాల్లో మనీషా పంచకము, సాధన పంచకము, భజగోవిందము, గోవిందాష్టకము, పాండురంగాష్టకము, శివ సువర్ణమాలా స్తోత్రము, అర్థనారీశ్వర స్తోత్రము, కాలభైరవాష్టకము, దక్షిణామూర్తి స్తోత్రము, నిర్వాణ షట్కము, అన్నపూర్ణాష్టకము, అచ్యుతాష్టకము, మహిషాసుర మర్దిని స్తోత్రము, త్రిపురసుందరీ స్తోత్రము, భుజంగాష్టకాలు, భవాన్యష్టకము, దేవీనవరత్నమాలికా, విశ్వనాథాష్టకము,

ఉమామహేశ్వర స్తోత్రము
ఇలా ఎన్నో సామాన్య జనులకు జీవన దిశానిర్దేశము చేసే స్తుతులను రచించారు. ఆధ్యాత్మికంగా ఇంకొక పై మెట్టులో సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి మొదలైనవి, ఇంకొక పై మెట్టుపై భాష్యాలు.

ఆదిశంకరుల రచనలు మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మీద రాసిన భాష్యాలు. రెండవది వీటి సారాన్ని ప్రకరణలుగా రాసినవి. మూడవది దేవతా స్తోత్రాలు. కొన్ని స్తోత్రాల వివరాలు.

విష్ణు షట్పది:
మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం. భయము, అహంకారముతో కప్పబడిన ఈ జీవితం భవ సాగరమై మరిన్ని జన్మలకు కారణము అవుతుంది. కావున, వాటిని అధిగమించి, మనసును లగ్నము చేసి, ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలెను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆది శంకరులు చక్కని సందేశాన్ని అందించారు. భయమే మృత్యువు, భయమే శత్రువు. అహంకారమే పతనము. అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించటం ఆధ్యాత్మిక పరమార్థము. అదే పరమాత్ముని దర్శనము. అదే మోక్ష కారకము.

సాధనా పంచకము:
శంకరులు అద్వైత సిద్ధాంతమును కాలి నడకలో భారత దేశమంతా తిరుగుతూ ప్రచారం చేసి, దానికోసం కావలసిన పీఠాలను, ధార్మిక క్షేత్రాలను స్థాపించారు. సద్గురు సాంగత్యము, శిష్యరికము, దైవారాధన, నిత్య నైమిత్తిక చర్యలు, ధ్యానము, యోగము, సత్సంగము, భక్తి మొదలైన సాధనాలతో పరబ్రహ్మ తత్త్వమును గ్రహించి, అనుభూతి పొందవచ్చు అని శంకరులు మనకు దివ్యామృతమును అందజేశారు.

దీనికోసం ఏమి చేయాలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఐదు సూత్రాలను ఆదిశంకరులు మనకు సాధనా పంచకం రూపంలో ఇచ్చారు. ఇందులో విషయము చాలా సులభముగా అనిపించినా, అది ఆచరణలో పెట్టటానికి ఎంతో నియమము, నిగ్రహము, పట్టుదల అవసరం. ఉదాహరణకు - వేదములను అధ్యయనం చేద్దాము - అనేది ఒక ధ్యేయము. మరి దానికి సరైన గురువు, పాఠశాల, క్రమశిక్షణతో కూడిన దైనందినచర్య, అభ్యాసము, ఏకాగ్రత, సాధన - ఇవన్నీ కావాలి. అలాగే, అహంకారము వదలుట అనేది ఒక ధ్యేయము - మరి దీనికి మన అలవాట్లు, మానసిక స్థితి ఏవిధంగా ఉండాలో ఊహించండి. నియమిత సాత్త్విక ఆహారము తీసుకోవటం, సుఖములకు, దుఖములకు అతీతంగా, రాగద్వేషాలు లేకుండా - ఒక రకమైన ఉదాసీన వైఖరిని అలవరచుకోవాలి. దీనికి మళ్లీ పైన చెప్పిన గురువు, అభ్యాసము, సాధన, క్రమశిక్షణ అన్నీ అవసరం.సాధనా పంచకాన్ని ఒక శిఖర మార్గముగా తీసుకుని, దానిలో ఉన్న ప్రతి పరమాణు ధ్యేయములకు సద్గురువును ఆశ్రయించి, శ్రుతులను అనుగమిస్తూ, జీవన శైలిలో వాటిలో పయనిస్తూ, అవరోధాలను అధిగమిస్తూ అవరోహణ చెయ్యాలి. దీనికి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, పరిశ్రమ, సహనము, శ్రద్ధ అన్ని తోడు చేసుకోవాలి. అప్పుడే ఆ సచ్చిదానంద స్థితిని పొందగలరు. ఈ పంచకము లోని భావమును, నిగూఢమైన ఆశయములను, సందేశమును తెలుసుకోవలసినదిగా సాధకులకు శంకరుల ఉద్దేశము.

శివ సువర్ణమాలా స్తుతి:
యాభై శ్లోకాలలో లయ బద్ధమైన పదాలు, భక్తి, సర్వస్య శరణాగతి, ఆత్మానుభూతి, లోతైన వివేచనము తో సాగే సువర్ణమాల స్తోత్రమును ఆ అపర శంకరుడు ఆది శంకరులు రచించారు. సాంబ = స+ అంబ - నిరంతరం ఆ జగదంబ అయిన పార్వతితో కూడి అర్థనారీశ్వరుడై ఉన్నాడు కాబట్టే ఆ పరమ శివుడు సాంబుడు అయినాడు. పార్వతీ సమేతుడవైన శివా! శంభో! నీ పాదములకు నమస్కారములు. నాకు శరణునిమ్ము అనే అంతరార్థంతో సాగే ఈ స్తోత్రములో శివుని అశేష కీర్తి, అగణిత గుణ గణములను ఆది శంకరులు నుతించారు. స్తోత్రము ముందుకు సాగుతున్న కొద్దీ ఆ పరమశివుని వర్ణన, కైలాసము ఎదుట ఉందా అన్న భావన ఆదిశంకరులు కలిగిస్తారు. యాభై శ్లోకాలు అనర్గళంగా ఒకే దేవతపై రాయాలంటే ఆత్మ జ్ఞాన పరిపూర్ణుడై, దైవ సాక్షాత్కారము కలిగి, ఎల్లప్పుడూ ఆ దైవము కన్నుల ఎదుట నిలిచి ఇటువంటి అనుభూతిని కలిగిస్తే, ఆ ఆవేశం స్తోత్ర రూపంలో వెలువడి ఇన్ని వేల ఏళ్ళు నిలబడ గలుగుతుంది.

ఆయన మహిమను తెలిపే ఒక స్తుతి - తోటకాష్టకము:
ఆ శంకరుని శిష్యులలో ఒకడైన ఆనందగిరి తన గురువులను స్తుతిస్తూ రచించిన తోటకాష్టకం ఆ శంకరుల లక్షణాలను, వైభవాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తుంది.ఆనందగిరి ఈ స్తోత్రాన్ని తోటక ఛందములో రాయటం వలన దీనికి తోటకాష్టకం అని పేరు వచ్చింది. దీని వెనక ఒక చిన్న కథ ఉంది.

శంకరుల శిష్యులలో ఆనందగిరి కొంత మంద బుద్ధి. కానీ, అమితమైన గురు భక్తి కలవాడు. నిరంతర గురు సుశ్రూషలో ఉండేవాడు గిరి. ఒక రోజు, శంకరులు తన ప్రాతః కాల దినచర్యలో భాగంగా ఉపనిషత్ ప్రవచనం ఆరంభించారు. ఆ సమయంలో శిష్యులంతా శాంతి పాఠం మొదలు పెట్టారు. కానీ, గిరి మాత్రం అక్కడ లేదు. గురువు గారి వస్త్రములు ఉతకటానికి నది దగ్గరకు వెళ్ళాడు. శంకరులు ఇది గమనించి మిగిలిన శిష్యులను గిరి వచ్చేదాకా వేచి ఉండమని పలుకుతారు. అప్పుడు పద్మపాదుడనే శిష్యుడు గర్వముతో 'వాడు మూర్ఖుడు, వానికి శాస్త్రములు నేర్వవలసిన అర్హత లేదు. వానికోరకు ఎందుకు వేచి ఉండటం' అని అంటాడు. శంకరులు పద్మపాదుని గర్వము అణచుటకు, తన దైవ శక్తితో ఆనందగిరికి సకల శాస్త్ర పరిజ్ఞానమును క్షణకాలములో కలిగేలా చేస్తారు. నది వద్దనుండి తిరిగి వచ్చిన ఆనందగిరి గురువుగారిని నుతిస్తూ తోటకాష్టకాన్ని ఆశువుగా పఠించాడు మిగిలిన శిష్యులకు సిగ్గు, విస్మయం కలిగించేలా అతి కష్టమైనా తోటక ఛందములో ఎనిమిది శ్లోకాలతో అద్భుతంగా సాగుతుంది తోటకాష్టకం. అటు తర్వాత, ఆనందగిరి శృతి సార సముద్ధరణ అనే ఇంకొక రచన కూడ తోటక ఛందములో చేస్తాడు. శంకరుల నలుగురు ముఖ్య శిష్యులలో ఒకడై , తోటకాచార్యులుగా పిలవబడి, గురువులచేత బదరీలోని జ్యోతిర్మఠం నడపటానికి నియమించబడతాడు.

ముగింపు:
ఎంతో మంది స్వాములు, యతులు తర్వాత భారత దేశంలో జన్మించి, ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రచారం చేశారు, కానీ శంకరులు సుస్థిర పరచిన అద్వైత సారము, ధార్మిక సిద్ధాంతాలు, పద్ధతులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా, ప్రామాణికాలై కాలపు ఒడిదుడుకులను తట్టుకొని హిమాలయముల వలె ఉన్నతముగా నిలిచినది. ఇట్టి ఆధ్యాత్మిక సంపదను ఇచ్చిన ఆ పరమ శివ రూపమైన జగద్గారువులకు శత సహస్ర పాదాభివందనములు.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

శ్రీ రామానుజచార్యులు - Sri Ramanujacharya


శ్రీ రామానుజచార్యులు - Sri Ramanujacharya
1000 సంవత్సరాలుగా భద్రపరచబడిన - శ్రీ రామానుజాచార్యుల పవిత్ర శరీరం...

శ్రీ రంగంలో ఎప్పుడైనా చూసారా?
వేదానికి సరైన అర్ధం చెప్పి, విశిష్టద్వైత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు శ్రీ రామానుజాచార్యులు. ఆయన పరమపథం చెంది వెయ్యేళ్లు అయినా ఇప్పటికీ ఆ శరీరం భద్రపరిచి ఉండడం విశేషం.

శ్రీ రామానుజచార్యులు
భారతదేశంలో హిందూ మతానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది. ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తాయి. వాటిలో తమిళనాడులోని తిరుచ్చునాపల్లికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్న శ్రీరంగం పట్టణం కూడా ఒకటి. ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీరంగం ఆలయంలో విష్ణు మూర్తి స్వయంభువుగా అవతరించినట్లు చెబుతారు. ఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం.
1000 సంవత్సరాలుగా భద్రపరచబడిన - శ్రీ రామానుజాచార్యుల పవిత్ర శరీరం...
1000 సంవత్సరాలుగా భద్రపరచబడిన - శ్రీ రామానుజాచార్యుల పవిత్ర శరీరం...
శ్రీరామానుజాచార్యులు పరమపదించి వెయ్యేళ్లకు పైగా గడిచినా ఆయన శరీరాన్ని నేటికీ ఇక్కడ భద్రపరిచి ఉంచడం విశేషం. అయితే చాలా మంది భక్తులకు దీని గురించి తెలియకపోవడం విచారకరం. కొందరు శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా... అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు.

పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది. ప్రతి ఏటా రెండు సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు. అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లు, గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
1000 సంవత్సరాలుగా భద్రపరచబడిన - శ్రీ రామానుజాచార్యుల పవిత్ర శరీరం...
రామానుజాచార్యుల గొప్పదనం:
రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరు (భూతపురి)లో జన్మించారు. దాదాపు 123 ఏళ్లు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు. ఆయన జీవిత కాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు.

కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి విగ్రహం విష్ణువు రూపానిదా? శివ రూపానిదా? అని వైష్ణవులు, శైవులకు మధ్య ఏర్పడిన వాదోపవాదాలకు రామానుజాచార్యులు పరిష్కారం చూపించారు. తిరుమల స్వామి వారి గర్భాలయంలో శంఖు చక్రాలను ఉంచగా తెల్లవారి చూసే సరికి స్వామి వాటిని ధరించి కనిపించడంతో ఈ సమస్య సులువుగా పరిష్కృతమైంది. తిరుమల వెంకటేశ్వరుని నిత్య కైంకర్యాలను, సేవలను కూడా రామానుజాచార్యులే నిర్ణయించారు.

కొందరికే పరిమితమైన అష్టాక్షరీ ముక్తి మంత్రాన్ని తిరుకొట్టియూర్ ఆలయం గోపురం పైకి ఎక్కి అందరికీ వినిపించారు. ఈ మంత్రం బహిరంగంగా ప్రకటిస్తే నరకానికి వెళ్తారనే వాదనలను తోసి పుచ్చి.. తాను నరకానికి వెళ్లినా పర్వాలేదు, ఈ మంత్రోపదేశం పొందిన వారికి ముక్తి లభిస్తే చాలని ఆయన భావించారు. ఇలా సమ భావన, సహ జీవన, సమతా భావాలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు. హిందూ మతంలో ఎన్నో గొప్ప సంస్కరణలకు ఆద్యుడయ్యారు.

ప్రాచుర్యంలోకి రాని రహస్యం:
క్రీస్తు శకం 11 - 12 శతాబ్ధాల మధ్య రామానుజాచార్యులు శ్రీరంగంలో శరీరాన్ని విడిచి పెట్టారు. అప్పటి నుంచి ప్రత్యేక లేపనాలను అద్ది ఆయన శరీరాన్ని భద్రపరుస్తున్నారు.

అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన రహస్యంగా ఇది మిగిలిపోయింది. కాబట్టి శ్రీరంగం పర్యటనకు మీరు వెళ్లినట్లయితే రామానుజుల పవిత్ర దేహాన్ని తప్పక సందర్శించండి.

ఓం నమో నారాయణాయా

సంకలనం: అడియేన్ రామానుజ దాసన్

18, ఏప్రిల్ 2020, శనివారం

గురుదర్శనమే సర్వదేవతా దర్శనము - Guru Darshanam, Sarva Devata Darsanamu

గురుదర్శనమే సర్వదేవతా దర్శనము - Guru Darshanam, Sarva Devata Darsanamu
గురుదర్శనమే సర్వదేవతా దర్శనము గురుర్బ్రహ్మా, గురుర్విష్ణుః, గురుర్దేవోమహేశ్వరః గురుస్సాక్షాత్ పరంబ్రహ్మా, తస్మైశ్రీగురవేనమః

సృష్టి, స్థితి, లయ కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వారికి మూలమైన పరబ్రహ్మా కూడా సాక్షాత్ గురువే. కనుక గురువుకి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్ధం. ఇది గురువు యొక్క సమగ్రరూపాన్ని మనముందు ఉంచుతుంది. గురువును మించిన దైవం మరొక్కటి లేదని, అన్నీ గురువులోనే ఉన్నాయని, గురువుకు నమస్కరిస్తే అందరు దేవతలకు నమస్కరించినట్టేనని అర్ధం.

భగవంతుడున్నాడని ఆస్తికులందరూ నమ్ముతారు. పేర్లు వేరు కావచ్చు కాని భగవంతుని చూచినవారు అరుదు. సద్గురువుని ఆశ్రయిస్తే దైవదర్శనం ప్రాప్తిస్తుంది.

సద్గురువు అంటే భగవంతుని దర్శించి, భగవదనుభూతి తాను పొంది, తన శిష్యులకు పంచగలవాడు, ఒక్కసారి భగవదనుభూతిని పొందితే పరసువేది స్ప్రర్శసోకిన లోహంలాగ ఎవరైనా భగవత్స్వరూపమే! సద్గురువు పరమాత్మ స్పర్శను అనుభవించాడు కనుక పరమాత్మయే, వారిని దర్శిస్తే సర్వదేవతలను దర్శించినట్టే అవుతుంది, అటువంటి సద్గురువు లభించిన తర్వాత నిశ్చింత. పాదాలు పట్టుకోవటం వరకే శిష్యుడి పని. ఆపై బరువు బాధ్యతలన్నీ వహించి, దరిచేర్చవలసింది గురువే భగవత్సాన్నిధ్యమో, మోక్షమో! శిష్యుడి పని - గురువుపై అంచలంచల విశ్వాసం ఉంచి, గురువు చెప్పినట్టు వినటమే. కన్నతల్లి లాగా ఎవరికేది కావాలో, ఎవరికి ఏది తగినదో దానిని సమకూరుస్తాడు గురువు. భగవంతుడు పాంచభౌతిక శరీరంతో అందరికీ దర్శనమీయటం సాధ్యంకాదు, కనుక గురువులోనే కనపడతాడు శిష్యులకి.

రచన: శ్రీ రత్న కమలాంబికా సేవ ట్రస్ట్ - ఏలూరు

2, మార్చి 2020, సోమవారం

వసిష్ఠ మహర్షి - Vasishta Maharshi

వసిష్ఠ మహర్షి - Vasishta Maharshi
వసిష్ఠుడు
వసిష్ఠ మహర్షి బ్రహ్మర్షులలో అగ్రగణ్యుడు, నవబ్రహ్మలలో కీర్తించదగినవాడు. సప్త ఋషులలో ఉత్తముడు, ఇక్ష్వాకు వంశీయులకు కులగురువు, త్రిలోకపూజ్యురాలైన అరుంధతికి ప్రాణనాధుడైనవాడు.

బ్రహ్మమానసపుత్రునిగా జన్మించిన వసిష్ఠుడు దక్షుని కూతురైన ఊర్జను వివాహం చేసుకున్నాడు. అతని సంతానమైన ఏడుగురు పుత్రులు తమ తపఃప్రభావముచే ఉత్తర మన్వంతరంలో సప్తమహర్షులుగా విరాజిల్లారు. ఆ తరువాత వసిష్ఠుడు ఘోరతపస్సులో నిమగ్నుడై వాలఖిల్యాదులు వంటి బ్రహ్మర్షి శిష్యులను కలిగి, బ్రహ్మతేజంతో వెలుగొందాడు.
వశిష్ఠుడితో రామ లక్ష్మణులు
వశిష్ఠుడితో రామ లక్ష్మణులు 
ఒకనాడు అయోధ్య రాజైన ఇక్ష్వాకుడు, వసిష్ఠుని వినయంతో ప్రార్థించాడు భూతభవిష్యద్వేది అయిన వసిష్ఠుడు, విష్ణుమూర్తి శ్రీరామునిగా ఆ వంశంలో అవతరించనున్నాడని గ్రహించి, అతని ప్రార్థనను తమ కులగురువుగా ఉండమని వినయంతో ప్రార్ధించాడు. ఆనాటి నుండి ఇక్ష్వాకు వంశీయులకు కులగురువైనాడు వసిష్కుడు.

ఇక్ష్వాకుని కుమారుడైన నిమిచక్రవర్తి, తండ్రివలె, తను కూడా వసిష్ఠుని ఎడల భక్తిప్రపత్తులను కలిగి ఉండేవాడు. అతనికి కొంతకాలానికి సత్రయాగం చేయాలని సంకల్పం కలిగి వసిష్ఠుని వద్దకు వెళ్ళి, విషయం తెలిపి, హోతగా ఉండమని ప్రార్ధన చేశాడు. అపూర్వమైన ఆ యజ్ఞానికి హోతగా ఉండటానికి తనకు అభ్యంతరం లేదని, అయితే ఇంద్రుడు చేసే యజ్ఞానికి వస్తానని ముందే చెప్పానని, అది పూర్తయ్యాక దీనిని ఆరంభిద్దామని తెలిపి వెళ్ళిపోయాడు వసిష్టుడు.

నిమిచక్రవర్తి సత్రయాగానికి అన్నీ సిద్ధపరుచుకుని, వసిష్ణుడు వచ్చేంతవరకు ఆగక, అసహనాన్ని కలిగి, గౌతమమహర్షిని పురోహితునిగా పిలిచి యజ్ఞారంభం చేశాడు. వసిష్ఠుడు తిరిగివచ్చేటప్పటికే యాగం జరుగుతుండడం చూసి, తృణీకారభావంతో తనకు తెలియజేయకుండా యాగం ఆరంభించినందుకు విదేహుడివి (శరీరం లేకుండా) కమ్మని నిమిచక్రవర్తిని శపించాడు. అంతట నిమిచక్రవర్తి కూడా క్రోధావేశంతో, వసిష్ఠునికి తిరిగి అదే ప్రతిశాపమిచ్చాడు. ఆ తరువాత గౌతముడు, ఇత్యాది మహర్షులంతా ఆ నిమిచక్రవర్తి శరీరం పాడవకుండా సంరక్షిస్తూ యాగాన్ని పూర్తిచేసారు.

అయితే నిమిచక్రవర్తి యజ్ఞారంభంలో, చిరంజీవిత్వం సంకల్పించినందున, అతనిని సమస్త జీవుల నేత్రపద్మాలకు కనురెప్పయై ఉండేలా వరమిచ్చారు ఇంద్రాదిదేవతలు. మన కంటిరెప్పపాటే శాశ్వతంగా నిమిదేహం అయింది. ఇంక వసిష్ఠుడు కూడా నిమిశాపం వలన విదేహుడై, మిత్రావరుణులయందు తేజోరూపాన ప్రవేశించాడు, ఊర్వశి కారణంగా మిత్రావరుణుల నుండి బహిర్గతమైన తేజం నుండి వెలువడి కుంభంలో భద్రపరచబడ్డాడు.

అగస్త్యునితోపాటు కుంభసంభవునిగా తిరిగి దేహధారి కాగలిగాడు. అయితే తన తపః శక్తితో నిమిశాపాన్ని ఉపసంహరించ గలిగినా, దానికి తపోధనాన్ని వినియోగించక, స్వేచ్ఛాజన్ముడై, ద్విజన్ముడై, తన ఆత్మశక్తిని లోకానికి చాటి చెప్పాడు. పిదప కర్థమ ప్రజాపతి కుమార్తె అయిన అరుంధతిని వివాహం చేసుకున్నాడు.
ఈవిడ ఇసుక రేణువులను కూడా ఇయ్యంగింజలుగా మార్చి అన్నం వండగల మహాత్మురాలు, పరమ పతివ్రతాశిరోమణిగా, సాధ్వీమణిగా, అరుంధతి పేరు లోకాన శాశ్వతంగా నిలిచి ఉన్నది.
వసిష్ఠుడు, జనకమహారాజు ప్రార్ధన మేరకు 'అక్షరం' గురించి చేసిన తత్త్వబోధ గుహ్యమైనది, ఆనందభరితమైనటువంటిది. అంతేకాక భృగువిద్యాధర వృత్తాంతం, సుందోప సుందోపాఖ్యానం, మాఘస్నాన ఫలాదులతో పాటు, అష్టాకరీ మంత్ర మహాత్త్వం మున్నగునవి అనేక మోక్షదాయకాలను వివరించాడు.

       సత్యవ్రతుడనే రాజు (అతడే త్రిశంకుడు) సశరీరంగా స్వర్గానికి వెళ్ళేలా యాగం చేయమని అడిగితే వసిష్ఠుడు అతనిని అటువంటి అసమంజసమైనవి అడగరాదన్నాడు.

అయితే సత్యవత్రునితో విశ్వామిత్రుడు యజ్ఞం చేయించి, త్రిశంకుస్వర్గానికి పంపగలిగాడు.
కానీ వసిష్ఠుని మాటకి తిరుగులేక స్వర్గానికి చేర్చలేకపోయాడు. సకల సంపదలతో తులతూగే మాంధాత చక్రవర్తికి, కర్మ స్వరూపం, బ్రహ్మస్వరూపం, భక్తియోగ స్వరూపం వంటివి వసిష్ణుడు వివరించాడు.

వసిష్ఠ మహర్షి స్కృతికర్తలలో ఒకరు. వసిష్ఠ స్మృతిలో ముప్పయి అధ్యాయాలు కలవు. దీనికే 'వసిష్ఠ ధర్మసూత్రమని' ఇంకొక పేరు కూడా ఉంది. ఋగ్వేద్రంలోని దశమండలాలలో, సప్తమమండలానికి ద్రష్ట వసిష్ఠుడు., అందుచే ఆ సప్తమ మండలాన్ని 'వాసిష్ఠ మండలం' అంటారు.

బారతీయ సనాతన సంస్కృతి నిర్మాతలలో ఒకడైన వసిష్ఠుడు శ్రీవిష్ణావతారమైరామచంద్రునికి గురువుగా నిలిచి, ఆయనకు ఉపదేశించిన జ్ఞానమే 'యోగవాసిష్ఠం'గా పేరుపొంది తత్త్వశాస్త్రాల్లో అగ్రస్థానాన్ని పొందింది. యోగవాసిష్ఠం ఆరుప్రకరణాలతో, నలభైవేల శ్లోకాలతో కూడి ఉన్నది. ఇది రెండు భాగాలుగా (పూర్వార్ధం, ఉత్తరార్ధం) విభజించబడింది.

ఆ తత్త్వబోధలోని కొంత సారాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం:
 • 🝒 అజ్ఞానదశలో జీవునికి జగత్తుగా భాసించేది, జ్ఞాని దృష్టిలో మిధ్య మాత్రమే. కలలోని వివిధ దృశ్యాలను మేల్కొన్నవాడు, ఏ విధంగా కలగా గుర్తిస్తాడో, 
 • 🝒 అలాగే జ్ఞాని కూడా జాగ్రదవస్థలో తాను చూసేదానిని భ్రమగా గుర్తిస్తాడు. 
 • 🝒 జగత్తు జగత్తుగా కనిపించడానికి చిత్తమే కారణం. దీనికే అవిద్య అని సంస్కారమని, వాసన అని వివిధ నామాలు. 
 • 🝒 అన్నింటిని సంపూర్ణంగా త్యజించగలిగిననాడు, సాధకుడు దేహధారుడైననూ, శరీర భ్రాంతిని
 • 🝒 విడనాడి శాంతి స్వరూపుడై, చిదానందంలో సుస్థిరంగా నెలకొని ఉంటాడు. 
 • 🝒 ఈ జగత్తు మనకంటే భిన్నమైనది కాదు. మనం కల్పించుకున్నది. 
 • 🝒 'నేను అన్న భావన సహితం కల్పసనలో ఒక భాగమేనని సంకల్పం వల్లనే జగత్తు సృష్టించబడి, లయిస్తోందనే' మహాబోధను మనకు యోగవాసిష్ఠం అందజేస్తోంది.
 • 🝒 జ్ఞానవాసిష్ఠమని, జ్యోతిర్వాసిష్ఠమని పిలువబడుతోంది,
ప్రవృత్తిమార్గానికి, నిషృకత్తిమార్గానికి అదర్శప్రాయుడైన వసిష్ఠుని యొక్క కుమారులలో ఒకడైన శక్తి కుమారుడు పరాశరుడు, ఆ పరాశరునికి పుత్రుడైనవాడు వ్యాసుడు, అతని పుత్రుడు శుకుడు, వీరంతా మహనీయులే. వీరందరిని స్మరిస్తూ, వ్యాసుని స్తుతిస్తూ ఉన్న శ్లోకం లోకవిదితమైనదే.
వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||

    పరమ పావన భారతవర్షంలో, బ్రహ్మతేజోమయమైన రూపంతో నిలిచిన వసిష్ఠుని కీర్తి ఆచంద్రార్కం చిరస్థాయిగా నిలిచిపోతుంది.

రచన: డా.. అపర్ణా శ్రీనివాస్