పుదీనాతో రోటీ ( చపాతీ )

కావల్సినవి: గోధుమపిండి - మూడు కప్పులు, పుదీనా - కట్ట, పచ్చిమిర్చి - మూడు, జీలకర్ర - చెంచా, ఉప్పు - కొద్దిగా, కారం - అరచెంచా, ధనియాలపొడి - కొద్దిగా, నూనె - అరకప్పు. 

తయారీ: పుదీనా ఆకుల్ని కడిగి మిక్సీ జారులోకి తీసుకోవాలి. అందులో పచ్చిమిర్చీ, జీలకర్ర వేసి మరీ మెత్తగా కాకుండా ముద్దలా చేసి పెట్టుకోవాలి. గోధుమ పిండిలో ఈ ముద్దా, ఉప్పూ, కారం, ధనియాలపొడి వేసుకుని నీళ్లు చల్లుకుంటూ చపాతీపిండిలా కలిపి పెట్టుకోవాలి. పదినిమిషాల తరవాత కొద్దిగా పిండి తీసుకుని చపాతీలా వత్తి.. పెనంపై ఉంచి.. నూనె వేస్తూ కాల్చుకోవాలి. ఇలాగే మిగిలిన పిండీ చేసుకోవాలి.

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top