శివుని దగ్గర ఏదైనా పదార్థంగానీ వదిలివేయడానికి కారణమేమిటి?

0
న ఈ శరీరాలు, ఇంద్రియాలు, అవయవాలు, బుద్ధి, మనసు... ఇలా అన్నీ పరమాత్మ ఇచ్చినవే. ఆయన ఇచ్చిన వానితో ఆయన సేవే చేయాలి. నాలుకతో నామకీర్తన చేయాలి. మనసుతో ధ్యానం, చేతులతో పూజ చేయాలి. చెవులతో ఆయన కథలనే వినాలి. కన్నులు ఆ స్వామిని, స్వామి భక్తులనే చూడాలి. కాళ్లు దేవాలయాలకు, భక్తుల ఇళ్లకు వెళ్లాలి. నాసిక స్వామి పాదాలపై ఉంచిన తులసిని వాసన చూడాలి. ప్రతి నాలుగు మాటలలో ఒక మాట భగవానునిది కావాలి. ఇలా చేస్తే సంసారంలో ఉన్నా సన్యాసంలో ఉన్నా ఒకటే! కానీ కన్ను, ముక్కు, చెవులు, నాలుకకు ప్రకృతిలో లభించేవే ఇష్టం.

మన ఇష్టాల కోసం భగవంతుని వదులుకుంటున్నాం. ఇలా చేస్తే మన ఇష్టాలన్నీ కష్టాలనే కలిగిస్తాయి. బాగా తింటే అజీర్ణం, బాగా అనుభవిస్తే అంటువ్యాధులు.. ఇలా కలుగుతాయి. భగవంతుని వదిలి ఇష్టాలను పట్టుకుని కష్టాల పాలుకాకుండా భగవంతుని కోసం మన శరీరానికిష్టమయ్యే వాటిని వదిలితే మనసు, బుద్ధి, శరీరం ప్రసన్నంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా ఒక్కసారే అన్నీ వదలటం కష్టం కాబట్టి ఒక్కొక్క క్షేత్రంలో ఇష్టాన్ని విడుస్తూపోతే కోరికలు తగ్గుతాయి. ఇష్టం కోసం భగవంతుని విడిస్తే సంసారం.. భగవంతుని కోసం ఇష్టాన్ని విడిస్తే ప్రసన్నత, సంతృప్తి, సంతోషం, లభిస్తాయి! అందుకే కాశీలో కొన్ని, గయలో కొన్ని, ప్రయాగలో కొన్ని, గంగలో కొన్ని ఇలా విడుచుకుంటూపోతే చివరికి ఆశ లేకుండా పోతుంది. ఇదీ ఇందులోని అంతరార్థం. కోరికలకు దాసుడివి కాకు! కోరికలను దాసులను చేసుకో! ఇవీ బోధ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top