నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Tuesday, August 29, 2017

మనం ఆహారం ఎలా తీసుకోవాలి, ఎలా కూర్చుని తినాలి..? - How do we take food, how to sit and eat?

మనం ఆహారం ఎలా తీసుకోవాలి, ఎలా కూర్చుని తినాలి..? - How do we take food, how to sit and eat?
హారానికి సంబంధించిన ప్రశాంతత గురించి మనం మాట్లాడుకుందాము. ముఖ్యంగా మన శరీరాలను మనం హింసాత్మకంగా చూసుకుంటున్నాము, మనం హింసాత్మకంగా జీవిస్తున్నాము కూడా. ఇలా చేస్తూనే మనం ప్రపంచ శాంతి గురించి ఆశిస్తున్నాము. ఈ ప్రపంచంలో మనుషులు లేకపోతే అది ప్రశాంతంగానే ఉంటుంది. మన జీవన విధానమే ఈ భూమి మీద హింసను సృష్ఠిస్తోంది. ప్రపంచంలో యుద్ధాలతో ఎంతో క్రూరమైన,హింసాత్మకమైన పరిస్థితులు ఉన్నాయి. వాటిని మనం అదుపు చేయాలనటంలో ప్రశ్నే లేదు కాని మనం ప్రతి రోజు మన జీవితాల్లో చేస్తున్న హింస గురించి కూడా మనం పట్టించుకోవాలి.

ప్రతీ సంవత్సరం మనం 53 బిల్లియన్ల జంతువులనూ, ఒక కోటి జలచరాలను చంపేస్తున్నాము. మనము ఇంత హింస చేస్తున్నప్పుడు మనం ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండటమనేది జరిగే పని కాదు. మనం తినే ఆహర నాణ్యతే కాదు మనం తినే విధానం – ఎంత ఆత్రంగా లేక ఎంత చేతనంగా తింటున్నాము అనేది కూడా చాలా ముఖ్యమే. మనం ఏవి తినాలి అనే దాని గురించి ఎంతో మాట్లాడుతున్నారు కాని ఎలా తినాలి అనే దాని గురించి ఏ మార్గదర్శకత్వం కాని జనాలలో అవగాహన కలిగించే ప్రయత్నాలు కాని ఏమీ జరగటం లేదు. అమెరికాలో 20% ఆహరం కారులోనే తింటున్నారని ఈ మధ్యనే నేను ఎక్కడో చదివాను.
మనం తినే ఆహర నాణ్యతే కాదు మనం తినే విధానం – ఎంత ఆత్రంగా లేక ఎంత చేతనంగా తింటున్నాము అనేది కూడా చాలా ముఖ్యమే.
సంప్రదాయంగా తూర్పు దేశాల్లో, ఆహరం శరీరంలోకి వెళ్ళేటప్పుడు మీరు ఎలా ఉండాలి, మీరు ఏ పరిస్థితిలో ఉండాలి, ఎలా కూర్చుని తినాలి, మీరు ఆహారాన్ని ఎలా చూడాలి – ఇవి అన్నీ తూర్పు దేశాల్లో చాలా పెద్ద విషయాలే. 20% ఆహరం కారులో తింటుంన్నారన్టే, బహుశా మరో 20% బార్ లో తింటున్నారేమో! అసలు ఎంత మంది టేబుల్ దగ్గర కూర్చుని, ఏమి తింటున్నారనే అవగాహనతో, ఆహారంతో, చుట్టూ ఉన్న జనాలతో కొంత నిమగ్నమై తింటున్నారు? ఆహారంలో ఏముంది అనే దాని గురించి నేడు ప్రపంచంలో ఎక్కువ జ్ఞానమే ఉంది అయినా కూడా జనాలు ఇంకా అవసరమైన మార్పులు చేయాల్సి ఉంది, జరిగిందల్లా పైపైన మార్పులే.

ఆహారంగా ఏమి తింటున్నారు అనేది ఎక్కువ ప్రభావమే చూపించినా,దాన్ని మీరు ఎలా తింటున్నారు అనేది కూడా సమానమైన ప్రాధాన్యత కలిగి ఉంది. మీరు మాంసాన్ని, కూరగాయల్ని లేక మరేది తిన్నా కూడా ప్రధానంగా ఆహరం అనేది ప్రాణం కలిగినదే. ఏదైతే దానంతట అది ప్రాణం కలిగి ఉందో అది మీలో భాగం అవుతోంది. తినడం అంటే కేవలం జీర్ణం అవ్వటం మాత్రమే కాదు – ఇది మరొక ప్రాణం మీతో మమేకమవ్వటమే.
ఆహారంగా ఏమి తింటున్నారు అనేది ఎక్కువ ప్రభావమే చూపించినా,దాన్ని మీరు ఎలా తింటున్నారు అనేది కూడా సమానమైన ప్రాధాన్యత కలిగి ఉంది.
మీరు మరొక ప్రాణాన్ని మీలో కలుపుకున్నప్పుడు అది మీ శరీరంలో ఎలా కలుస్తుంది, అది ఏమి ఉత్పత్తి చేస్తుంది అనేది మీరు భోజనం చేసేటప్పుడు మీ రసాయనికతను ఎలా ఉంచుకున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం తినేటప్పుడు ఎలా ఉండాలి, ఎప్పుడు తినాలి, ఎలా కూర్చుని తినాలి, మీరు మీలోకి ఆహారాన్ని ఎలా స్వాగతించాలి – ఇలాంటి వాటిని అసలు పూర్తిగా పట్టించుకోవటం మానేసాము ఈ రోజుల్లో. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం మనం అసలు ఏమి తినాలి అనే దాని గురించే జరుగుతుంది.  ----సద్గురు

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com