పిత్రుదేవతల పండుగ, మహాలయ అమావాస్య - Mahalaya Amavaasya

0
హాలయ అమావాస్య" ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమ కాలమని పురోహితులు చెబుతున్నారు. అయితే దక్షిణాయణము పితృదేవతల కాలము గనుక అశుభకాలమని మన పూర్వీకుల విశ్వాసం.

ప్రతి మాసంలో వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆరోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంటూ ఉంటారు. ఇందులో మహాలయము అంటే.. భాద్రపద బహుళ పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఉన్న 15 రోజులు. దీన్ని పితృపక్షంగా మహాలయంగా చెప్తారు. ఇందులో మరీ ముఖ్యమైన తిధి త్రయోదశి.
"యత్యించిన్మధునా మిశ్రం ప్రదద్యాత్తు త్రయోదశీమ్ |
తదప్య క్షయమేవస్యాత్ వర్షాసుచ మఘాసుచ" ||
అనగా వర్షఋతువు నందు భాద్రపద కృష్ణత్రయోదశి మాఘా నక్షత్రంలో కూడి ఉన్న సమయంలో ఏ పదార్థమైనా శ్రాద్ధం చేసిన అది పితృదేవతలకు అక్షయ తృప్తిని ఇస్తుందని విశ్వాసం.

అంతటి విశిష్టత గాంచిన ఈ మహాలయ పక్షమందు అందరూ వారి వారిశక్తిని తగినట్లుగా పితృదేవతలకు తర్పణమివ్వాలని పురోహితులు చెబుతున్నారు. కొందరు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయాతిథులలో తర్పణ శ్రాద్ధ కర్మలు ఆచరించవచ్చును. ఒకవేళ గతించిన పెద్దల తిథి గుర్తులేనప్పుడు "మహాలయ అమావాస్య"నాడే పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేయడం ఉత్తమమని పురోహితులు అంటున్నారు.

కావున పితృకార్యములు చేయుటకు అర్హత పొందినవారు అంతా విధిగా పక్షాలను ఆచరించి, వారి వారి వంశవృక్షములకారకులైన పితృదేవతలను స్మరించుకుని శ్రాద్ధ కర్మలు చేస్తే వారి శుభాశీస్సులతో సర్వశుభములు పొందుతారని పండితులు పేర్కొంటున్నారు.

అమావాస్య తిది ... పితృదేవతలకు తృప్తి :

తొలిగా పితృ దేవతల ఆవిర్భావం ఎప్పుడు జరిగినది ? ఎవరి నుంచి జరిగినది ? ఆ పిత్రుదేవతకు అమావాసి తిదికి ఉన్నా సంభందం ఎలాంటిది ? అనే వివరించే కదా సందర్భం ను వరాహ పురాణం ముపైనలుగో అశ్యమం లో వివరించబడి ఉన్నది.
పూర్వము సృష్టి ప్రారంభములో ఈ జగత్తును సృస్తిచేందుకు బ్రహ్మ దేవుడు ధ్యానం లో కూర్చున్నాడు . . ఆయనలా యోగానిస్టలో ఉండగానే శరీరము నుండి కొన్ని దేవతా గణాలు ఆవిర్భవించాయి . ముందు గా పొగ రంగు కాంతుల తో కొన్ని గణాలు, ఆ తరువాత మరి కొన్ని గణాలు వచ్చాయి .పోగరగు తో ఉన్నవారు ఆవిర్హవించిన వెంటనే తామూ ఊర్ధ్వ లోకాలకు పోవాలని సోమరసము తాగాలని ముఖాలు పైకెత్తి నిలుచొని పలుకసాగారు . ఆ శబ్దాలను విన్న బ్రహ్మ ... ముందుగా అలా తల పైకిట్టి ఉన్నా వారిని చూసి మీరంతా పైకెత్తిన తలల to ఉన్నారు కనుక నాందీ ముఖులు అనే పేరున్న దేవతలు గా ఉండండి అని అన్నాడు . గృహస్తులంతా ఆ నాన్దీముఖులను పితృదేవతలు గా పూజిస్తారని చెప్పాడు . వృద్ధి పొందటం కోసం వేద మార్గం లో చేసే కార్యాలలో నాన్దీముఖులకు పుజలన్డుతాయన్నాడు . అలా పూజ లందు కొంటూ పూజలు చేసేవారిని సంరక్షిస్తూ ఉండమని పెరోకొన్నాడు బ్రహ్మ . అగ్నిహోత్రాన్ని అర్చించేవారు , నిత్య , నైమిత్తిక , కామ్య కర్మలను చేసేవారు , పర్వదినాలలో నాన్దీముఖులను తృప్తి పరచాలని ఆనాడు బ్రహ్మ ఒక కట్టడి చేశాడు . . ఆ తర్వాత అక్కడే ఉన్నా బహిహ్ప్రావారునులు అనే పితురులను బ్రహ్మదేవుడు చూసి వారిని క్షత్రియులు తృప్తి పరుస్తారని అన్నాడు . ఆ తర్వాత ఆజ్యపుల (నెయ్యి తాగడం ఇష్టము ఉన్న )గణాలను చూస్తూ వారిని వైశ్యులు తర్పణాలు ఇచ్చి తృప్తి పరుస్తారని అన్నాడు . వేద మంత్రాలు పూర్తిగా తెలుసుకోలేని వారు కుడా ఈ పితృదేవతలను అర్చించ వచ్చునని , మంత్ర విధానం లేకుండానే పండితుల సూచనల మేరకు ఈ దేవతలను కొలవవచ్చునని చెప్పాడు బ్రహ్మదేవుడు . పితృదేవతలు కేవలం పూజలందుకొని ఉరకనే కుర్చోకుడదని ... తమని అర్చించిన వారి కోర్కెలు తీర్చుతూ వారికి ఆయువు , కీర్తి ,దానం , పుత్రులు , విద్య , గొప్పతనం , జ్ఞానం లాంటివి ప్రసాదిస్తూ ఉండమని ఆజ్ఞాపించాడు . ఆ నాడు వారి కోసం దక్షిణాయనం అనే స్థానాన్ని , అమావాస్య అనే తిధిని ప్రత్యేకం గా ఏర్పాటు చేశాడు .

అమావాసి తిదినాడు దర్భల to , నువ్వులతో , జలం to పితురులకు మానవులు తర్పణాలు విడుస్తుంతారని పేర్కొన్నాడు . ఆ తర్పనాలతో పితృదేవతా గన్నలకు తృప్తి కలుగుతుంతోందని బ్రహ్మదేవుడు చెప్పాడు . అమావాస్య తిది అంటే ప్రత్యేకం గా పితృదేవతలకు అందుకే అంట ఇస్తామని వరహ పురాణం లో ఈ కధాంశం వివిరిస్తోంది .

మత్స్యపురాణం ఇరవై రెండో అధ్యాయం .. పితృదేవతలకు శ్రాద్ధం ఇచ్చేందుకు తగిన సమయాలను , తగిన ప్రదేశాలను గురించి వివరించి చెబుతోంది . అభిజితే ముహూర్తం , రోహిణి ముహూర్తం , అపరాహ్న కాలాల్లో జరిగిన శ్రాద్ధం , పూజలు .. పితృదేవతలకు ఏంటో ఇష్టం గా ఉంటాయి . పితృదేవతా ప్రీతికరమైన తీర్ధక్షేత్రాలు అసంఖ్యాకం గా ఉన్నాయి . వాటిలో గయా , కాశి , హరిద్వారం , పూరి , గంగా గోమతి సంగమ స్థానము , కురుక్షేత్రం , నైమిశారణ్యం లాంటివి శ్రద్ధకర్మకు , అతడి పితురులము గొప్ప పుణ్యాన్ని సంపాదిన్చుకోనేందుకు ఉపయుక్త మవుతాయన్తోంది మత్యపురణం ,

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top