నూతన విశేషాలు:
latest

728x90

header-ad

Latest Posts

భౌతిక మరియు ఆంతరంగిక శరీరం - Our physical and intellectual body

భౌతిక మరియు ఆంతరంగిక శరీరం - Our physical and intellectual body
క వ్యక్తికి ఈ భౌతిక సృష్టిలో అత్యంత ఆంతరంగికమైనది తన శరీరమే. అతడికి తెలిసిన మొదటి కానుక ఇదే. ఈ శరీరం మొదటి కానుకే కాదు, ఇదే ఏకైక కానుక. యోగా శాస్త్రంలో మెదడు లేక ఆత్మ అనేవి లేవు. అన్నీ – స్థూలమైనదాని నుంచి సూక్ష్మమైనదాని వరకు – అన్నీ కూడా కేవలం వివిధ పార్శ్వాలలో వ్యక్తమవుతున్న శరీరమే. శరీరానికి అయిదు పార్శ్వాలు లేక కోశాలు ఉన్నాయి, వీటి గురించి వేరే వ్యాసంలో ప్రస్తావించాము.

ఇప్పటికి భౌతిక శరీరం గురించి చూద్దాం. మీరు ఎక్కువగా పాల్గొనకుండానే ఇది పని చేసేటట్లు రూపొందించబడి, నిర్మించబడింది. మీరు మీ గుండె కొట్టుకునేలా, మీ కాలేయం చేసే సంక్లిష్ట రసాయన ప్రక్రియ జరిగేలా చేయనక్కరలేదు, కనీసం మీరు శ్వాస తీసుకోవటానికి కూడా ప్రయత్నించనక్కర్లేదు; మీ భౌతిక అస్థిత్వానికి అవసరమైనవన్నీ వాటంతట అవే జరుగుతున్నాయి.
మీరు ఈ మధ్యానం ఒక అరటిపండు తిన్నారనుకుందాం. సాయంత్రానికంతా ఈ అరటిపండు మీరైపోయింది.
మీ భౌతిక శరీరం స్వీయ నియంత్రణ కలిగిన ఒక సంపూర్ణ సాధనం. మీరు సాధనాలను చూసి అబ్బురపడే వారైతే, దీనికి మించిన సాధనం లేదు. మీరు శోధించి ఈ శరీరం గురించి తెలుసుకున్న ప్రతీ చిన్న విషయం ఎంతో ఆశ్చర్యకరమైనదే కదా? ఈ గ్రహం మీద ఇది ఎంతో అధునాతనమైన యంత్రం. మీ ఊహకు, ఆలోచనకు అందని అత్యుత్తమ స్థాయి యంత్రగతి శాస్త్రము (మెకానిక్స్), మీరు కలగనలేనంత అత్యుత్తమ స్థాయి విద్యుత్ సంధాయకత (ఎలక్ట్రికల్ కనెక్టివిటీ), మీరు కనిపెట్టలేనంత అత్యుత్తమ స్థాయి కంప్యూటింగ్ సామర్ధ్యము ఈ శరీరం కలిగి ఉంది.

మీరు ఈ మధ్యానం ఒక అరటిపండు తిన్నారనుకుందాం. సాయంత్రానికంతా ఈ అరటిపండు మీరైపోయింది. మీరు ఒక కోతి నుంచి మనిషిగా మారటానికి కొన్ని మిలియన్ల సంవత్సరాలు పట్టిందని చార్లెస్ డార్విన్ చెప్పాడు, కానీ ఈ అరటిపండుని కొన్ని గంటల్లోనే మీరుగా మార్చుకోగలిగే సామర్ధ్యం మీకు ఉంది! ఇదేదో చిన్న విషయం కాదు. అంటే ఈ సృష్టి యొక్క మూలం మీలోంచి పని చేస్తుంది అని అర్ధం.
మీ తార్కిక మేధస్సుకు అందని కొంత నిర్దిష్ట స్థాయి ప్రజ్ఞ, సామర్ధ్యం మీలో ఉన్నాయి. అవి ఒక అరటిపండుని ఒక అత్యున్నత సాంకేతిక పరికరంగా రూపాంతరం చేయగలవు.
మీ తార్కిక మేధస్సుకు అందని కొంత నిర్దిష్ట స్థాయి ప్రజ్ఞ, సామర్ధ్యం మీలో ఉన్నాయి. అవి ఒక అరటిపండుని ఒక అత్యున్నత సాంకేతిక పరికరంగా రూపాంతరం చేయగలవు. యోగా అంతా దీని గురించే – ఆ పార్శ్వాన్ని అందుకోవటం, ఆ ప్రజ్ఞను, అరటిపండుని కొన్ని గంటల్లో మనిషిగా మార్చగల సామర్ధ్యాన్ని అందుకోవటం గురించే. మీరు అచేతనంగా కాక, చేతనంగా ఈ రూపాంతరాన్నిచేయగలిగితే, ఈ జ్ఞానంలో నుంచి కేవలం ఒక బొట్టునైనా మీ దైనిక జీవితంలోకి తీసుకురాగలిగితే, మీరు ఇక ఎంతో అధ్బుతంగా జీవిస్తారు, దుఃఖంతో కాదు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »

భక్తి