వాయు కాలుష్యము - ఈ కాలుష్య భూతాన్ని ఎలా నివారించాలి?

0


అభివృద్ధి పేరిట మనం సాధించిన పెద్ద ప్రజారోగ్య సమస్య గాలి కాలుష్యం.గాలి కాలుష్యం గ్రామాల్లో కంటే పట్టణాల్లో ఎక్కువ. మన చుట్టూ ఉండే గాలి, నీరు, నేల, వాతారణం, వివిధ రకాల మొక్కలు, రకరకాల జంతువులు వీటన్నింటిని కలిపి పర్యావరణంగా పేర్కొనవచ్చు. మనం బ్రతకడానికి గాలి, నీరు, నేల, ఆహారం అవసరం. చెట్లు, పక్షులు, జంతువులను మనం జాగ్రత్తగా చూసుకుంటే......... మనకు కావలసినవి వాటి నుండి దొరుకుతాయి.

వాయు కాలుష్యం, వాతావరణంలోకి రసాయనాలు మరియు పరమాణువులను విడుదల చెయ్యటం.సాధారణంగా గాలిని కలుషితం చేసే వాయువులు పరిశ్రమలు మరియు మోటార్ వాహనాలుచే ఉత్పత్తిచేయ్యబడే కార్బన్ మెనోఆక్సాయిడ్, సల్ఫర్ డైఆక్సైడ్, క్లోరోఫ్లూరోకార్బన్ (సిఎఫ్సి), నైట్రోజన్ ఆక్సైడ్ మొదలైన వాటిని కలిగి ఉంటాయి. కిరణ రసాయనిక ఓజోన్ మరియు పొగమంచు నైట్రోజన్ ఆక్సైడ్ మరియు హైడ్రోకార్బన్లు సూర్యరశ్మితో చర్య జరపటం వలన ఉత్పత్తి అవుతాయి.
 • ప్రపంచవ్యాప్తంగా ఏటా గాలి కాలుష్యపు వ్యాధులతో 20 లక్షల మంది చనిపోతున్నారు.
 • వాహనాల నుండి, గృహాల నుండి, పొగతాగడం వల్ల క్రిమి సంహారక మందుల నుండి, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషన్ల వాడకం నుండి సాధారణ గాలి కాలుష్యం అవుతుంది.
 • నైట్రస్‌ ఆక్సైడ్‌, హైడ్రో కార్బనులు, ఓజోన్‌ డై ఆక్సైడ్‌, సీసం ఎక్కువ ప్రమాదాలు కలిగించే ప్రధాన కాలుష్య కారకాలు.
 • గాలి కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల కేన్సర్‌, ఆస్మ్తా, పిల్లల్లో మానసిక ఎదుగుదల లేకపోడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.
 • గాలి కాలుష్యం తగ్గించడానికి పారిశ్రామిక ప్రాంతాలు నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
 •  ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా వాడుకోవాలి.
 • సొంత కార్ల వాడకం తగ్గించుకోవాలి.
 • సైకిలు వాడకం, నడక గాలి కాలుష్యం బాగా తగ్గిస్తాయి.
 • పొగ మానాలి.
 • చెట్లు పెంచాలి.
 • జనాభా పెరుగుదల నియంత్రించుకోవాలి.
 • మనమంతా ప్రకృతి ప్రసాదించిన గాలిని రక్షించుకోవాలి. ఈ భూగోళం మనకూ, ఇతర జీవనరాశికి నివాస యోగ్యం చేయాలి.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top