నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

20, నవంబర్ 2017, సోమవారం

అద్దె ఇంటికి వెళ్ళునప్పుడు చేయవలసిన కార్యక్రమాలు !

adde-intloki-vellinappudu

అద్దె ఇంటికి వెళ్ళునప్పుడు:

తీసుకువెళ్ళవలసినవి:
 • సీతారాముల పటము 
 • నూనె, కుంది 
 • గిన్నె, గరిటె 
 • యాలుకులు, ఉప్పు
 • లక్ష్మీ, వినాయకుడు పటాలు 
 • గరిట, హారతి ఇచ్చునది  పళ్ళెము, 
 • కొబ్బరికాయలు 2 
 • పెరుగు, కందిపప్పు పసుపు, కుంకుమ
 • ఆకులు, వక్క 
 • పొయ్యి, మసిగుడ్డ, పాతగుడ్డ 
 • కవ్వము, మంచినీళ్ళు
 • అక్షింతలు, కర్పూరము 
 • పూలమాల, విడిపూలు 
 • బియ్యము, బెల్లము 
 • దిండ్లు, దుప్పట్లు
 • వత్తి, పత్తి 
 • నిమ్మకాయలు, చాకు 
 • జీడిపప్పు, నెయ్యి 
 • కట్టుకొనుగుడ్డలు, చాపలు
మగవారు రాముని పటము, ఆడవారు ఒక ప్లేటులో పసుపు, కుంకుమ, అక్షింతలు, పెరుగు, కవ్వము, ఉప్పు, కందిపప్పు వుంచి పట్టుకుందురు. పంతులుగారు చెప్పిన టైముకు మొదటి గుమ్మము వద్ద కొబ్బరికాయ కొట్టి, నిమ్మకాయ కట్‌చేసి, గుమ్మము మీద పసుపు, కుంకుమ, అక్షింతలు చల్లి, నిమ్మచెక్కలకు కుంకుమ అద్ది గుమ్మమునకు రెండువైపులా పెట్టవలెను. తూర్పు ఈశాన్యములో పేపరు మీద దేముని పటము పెట్టి పూజచేసుకోవలెను. పొంగలి నైవేద్యము పెట్టవలెను. పిలిచిన అతిధులకు పొంగలి పెట్టి బొట్టు, పండు, తాంబూలము ఇవ్వవలెను. పెరుగు, ఉప్పు, కవ్వము ఆ ఇంట్లో వుంచవలెను. 3/4 డబ్బా, 3 గిద్దలు, 3 గుప్పిడులు, అవసరమును బట్టి పొంగలి చేసుకొనవచ్చును. పేపరు ప్లేట్లు, గ్లాసులు, మంచినీరు ఏర్పాటుచేయాలి.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »