- మీ శరీరమైనా, మీ మనస్సైనా లేదా మీ జీవ శక్తులైనా – మీరు వాటిని ఎంతగా ఉపయోగిస్తే, అవి అంతగా మెరుగవుతాయి.
 - నియంత్రణ అంటే కొన్నినిర్దిష్ట పరిమితులలో కట్టడి చేయడం. మీ మనసుని నియంత్రించకండి – దానికి విముక్తి నివ్వండి.
 - మీ శరీరం, మనస్సులు గనక మీ నుంచి ఆదేశాలు తీసుకుంటే, ఆరోగ్యంగా ఉండటం, శాంతియుతంగా ఉండటం, ఆనందంగా ఉండటం అనేది ఓ సహజమైన పరిణామమవుతుంది.
 - మనసులో జరుగుతున్నదానిలో ఎక్కువ శాతం ఓ మానసిక అతిసారమే – ఎప్పుడూ అదుపు లేకుండా పరిగెడుతూ ఉంటుంది.
 - గతానికి చెందిన జ్ఞానంతో జీవించడమంటే ప్రస్తుతం పట్ల ఎరుకతో ఉండే అవకాశాన్ని వదులుకోవడమే.
 
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి








