వేసవిలో చర్మ రక్షణ - Skin care in the summer

0
Skin care in the summer

90 వేసవిలో చర్మం ఎండతాకిడికి కమిలిపోవడం, దుమ్ముధూళి పేరుకుపోవడం, పొడిబారడం లేదంటే జిడ్డుగా తయారవడం వంటి సమస్యలెన్నో తలెత్తుతుంటాయి. వీటికి విరుగుడు ఫేషియల్స్‌ అని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఫేషియల్‌ చేయించుకోవాలనే విషయంలో సందేహాలూ ఉంటాయి. వేసవిలో చర్మకాంతి దెబ్బతినకుండా రిపేర్‌ చేయడానికి ఎలాంటి ఫేషియల్స్‌ చేయాలో తెలుసుకుందాం...

రిపేర్‌ ఫేషియల్‌
పొడిచర్మం గల వారికి రిపేర్‌ ఫేషియల్‌ మంచి ఫలి తాన్ని ఇస్తుంది. ఎండకు చర్మం త్వరగా డీహైడ్రేషన్‌ అవుతుంది. దీనివల్ల చర్మం మరింత పొడిబారే అవకాశం ఉంది. అలాగే వదిలేస్తే త్వరగా ముడతలు రావడం, చర్మకణాలు దెబ్బతినడం వంటివి సంభవిం చవచ్చు. అందుకని 20 రోజులు లేదా నెల రోజులకు ఒకసారి రిపేర్‌ ఫేషియల్స్‌ చేయించుకోవడం వల్ల చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. హీలింగ్‌ ఎఫెక్ట్‌, స్కిన్‌ సెల్స్‌ రీ గ్రోత్‌ ఈ ఫేషియల్‌ వల్ల ప్రయోజనాలు.

కూలింగ్‌ ఫేషియల్‌
ఈ కాలంలో చెమట వల్ల ఆయిలీ స్కిన్‌ మరింత జిడ్డు గా తయారవుతుంది. అందుకని వీరు కూలింగ్‌ ఫేషియల్స్‌ వాడచ్చు. ఆక్సిజన్‌ ఫేషియల్‌ కూడా వీరికి బెస్ట్‌ ఆప్షన్‌.

ఫూట్‌ ఫేషియల్‌
సాధారణ చర్మతత్త్వం గలవారు ఏ ఫ్రూట్‌ ఫేషియల్‌ అయినా ఉపయోగించవచ్చు. ఫ్రూట్‌ ఫేషియల్స్‌లో బనానా, మ్యాంగో, పీచ్‌, వాటర్‌మెలన్‌, బ్లాక్‌బెర్రీ... ఇలా అన్ని రకాల ఫ్రూట్‌ ఫ్లేవర్‌ ప్రొడక్ట్‌ను వాడవచ్చు.

చాక్లెట్‌ ఫేసియల్‌
వేసవిలో చర్మం ఎక్కువగా ట్యాన్‌ అవుతుంది. దీనికి విరుగుడుగా చాక్లెట్‌ ఫేషియల్‌ చేయించుకోవచ్చు. అలాగే ఆక్సిజన్‌, డీ-ట్యానింగ్‌, అరోమా ఫేషియ ల్స్‌నూ ట్రై చేయవచ్చు.

బేసిక్‌ ఫేసియల్‌
క్లెన్సింగ్‌ స్క్రబ్బింగ్‌ ఆవిరిపట్టడం బ్లాక్‌ హెడ్స్‌ను తొలగించడం మసాజ్‌ ఫేస్‌ప్యాక్‌ ఈ పద్ధతిలో ఇంట్లో కూడా ఫేషియల్‌ చేసుకోవచ్చు. అయితే నాణ్యమైన సౌందర్య ఉత్పత్తులతో నిపుణుల ఆధ్వర్యంలో ఫేషియల్స్‌ చేయించుకుంటే సరైన ప్రయోజనాలను పొందుతారు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top