ఉండ్రాళ్ళ తద్దె నోము - Undralla Thadde Nomu

Undralla Thadde Nomu
ఉండ్రాళ్ళ తద్దె:
పౌర్ణమినాటికి చంద్రుడు పూర్వాభాద్ర/ఉత్తరాభాద్ర నక్షత్రానికి సమీపాన ఉంటాడు కాబట్టి ఈ మాసాన్ని భాద్రపదం అన్నారు పెద్దలు. ఈ నెలలో శుక్లపక్షం దేవతా పూజలకూ... కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకూ ఉత్కృష్టం అని పురాణప్రవచనం.

ఈ రోజున వరాహమూర్తిని పూజిస్తే విశేషఫలం లభిస్తుందని నమ్మిక. వరాహస్వామి ఆలయం లేని చోట వైష్ణవాలయాలకు వెళ్లి స్వామిని దర్శించుకున్నా అదే ఫలితం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఈరోజున చాలామంది మహిళలు సిరిసంపదలు కోరి 'పదహారు కుడుముల తద్దె' నోము నోచుకుంటారు. ఇక భాద్రపద శుద్ధ చవితి... అందరికీ తెలిసిన పర్వదినమే. విద్యల ఒజ్జ వినాయకుడు పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన దినం. ఈ చవితి ఆదివారం లేదా మంగళవారం వస్తే మరింత ప్రశస్తమని పురాణాలు చెబుతున్నాయి. గణపతి పూజ, ఉపాసనల్లాంటివి ఈరోజున మొదలు పెడితే విశేషఫలాలనిస్తాయని విశ్వాసం

ఉండ్రాళ్ళ తద్దె నోము:
వివాహము అయిన సంవత్సరము వచ్చు ఉండ్రాళ్ళతద్దె రోజున ఈ నోము పట్టుకొందురు. ముందు రోజు గోరింటాకు పెట్టుకొనవలెను. ఉదయమే 4 గంటలకు, లేచి గోంగూర పచ్చడితో భోజనము చేయవలెను. తెల్లవారినాక స్నానము చేసి 3 ఇళ్ళలో ఉయ్యాల ఊగవలెను. గౌరిపూజ చేసి వాయనము ఇచ్చుకొనవలెను.
గౌరిపూజ అయినాక ఉండ్రాళ్ళతద్దె కథ చదవాలి. అక్షింతలు చేతితో పట్టుకుని, కథ పూర్తి అయినాక అక్షింతలు తలపై చల్లుకొనవలెను. నోము పట్టినట్లు టెంకాయకొట్టి, పొంగలి నైవేద్యము పెట్టవలెను.
ఒక పళ్ళెములో 5 పూర్ణములు లేక 5 పచ్చి ఉండ్రాళ్ళు, పండు, తాంబూలము, 5 పోగుల తోరము, దక్షిణ ఇలా 2 ప్లేట్లులో సర్దాలి. ఒకటి గౌరమ్మకు నైవేద్యము. తోరము చేతికి చుట్టుకుని ఎవరైన ముత్తైదువ వున్న, వాయనము ఆమెకు ఇవ్వవచ్చును. లేనిచో గౌరమ్మకు వాయనము ఎత్తి విడువవలెను. వాయనము ఇచ్చినాక ఇచ్చినవాళ్ళు తినకూడదు. వాయనము ఇచ్చినాక తోరము చేతికి చుట్టి నమస్కారము చేసి అక్షింతలు వేయించుకొనవలెను.

నోము చెల్లించుకొనుట:
5గురు ముత్తైదువులను పిలవవలెను. వారు ఆ రోజు తలస్నానము చేసి భోజనమునకు రావలెను. వాయనము 6 ప్లేట్లలో సర్దవలెను. 5 పూర్ణములు లేక 3 పూర్ణములు, 2 గారెలు పెట్టవచ్చును. 5 పోగుల తోరము, 1 వాయనము గౌరిదేవికి, పొంగలి, టెంకాయ, నైవేద్యము. గౌరిపూజ చేసి కధ చదువుకుని అక్షింతలు మొత్తము గౌరిదేవి పైన చల్లాలి. పూజ అయినాక నైవేద్యము గౌరిదేవి వద్ద పెట్టిన ప్లేటులోని తోరము చేతికి కట్టుకుని 5 గురికి భోజనము వడ్డించినాక ఒక్కొక్కరికి ఒక వాయనము ఇవ్వవలెను. వాయనము ఇచ్చునప్పుడు
  • ఇచ్చువారు --> తీసుకొనువారు
  • ఇస్తి వాయనము  --> పుచ్చుకొంటి వాయనము
  • ఇస్తి వాయనము  --> పుచ్చుకొంటి వాయనము
  • ముమ్మాటికి ఇస్తి వాయనము  --> ముమ్మాటికి పుచ్చుకొంటి వాయనము
  • వాయనము తీసుకున్నది ఎవరు  --> నేనే పార్వతిని
ఇలా 5గురికి ఇవ్వవలెను. అందరికి తోరములు చేతికి చుట్టవలెను. ముడివేయకూడదు. బియ్యంపిండి ముద్దతో కుందిలాగ చేసి, దానిలో ఆవునేతితో తడిపిన కుంభవత్తి పెట్టి, 5గురి ఇస్తరాకుల ముందు వెలిగించవలెను. అవి ఆరినాక జ్యోతితో సహా చలిమిడిని తినవలెను. నోము చెల్లించుకునే ముత్తైదువు నెయ్యి వడ్డించినాక భోజనము చేయుదురు. 5 పోగులకు పసుపు రాసి, 3 చోట్ల పూలు ముడివేసి, 2 చోట్ల ఉత్త ముడి వేయవచ్చును. తోరము రెడీ అయినట్లు. ఈ నోము పట్టుకొనుట, పుట్టింటిలోకాని అత్తగారింటిలోకాని పట్టుకొనవచ్చును.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top