వెంకటేశ్వరస్వామికి అఖండదీపారాధన ఎలా చేయాలో తెలుసుకుని ఆచరించండి ! - Venkatesvarasvamiki akhandadiparadhana

0
Venkatesvarasvamiki akhandadiparadhana

వెంకటేశ్వరస్వామికి అఖండదీపారాధన:

కావలసినవి:
  • మూకుడు 
  • నాము
  • సాంబ్రాణి 
  • తిరుచూర్నము
  • ఎండుకొబ్బరి చిప్ప
  • నూనె - 1/4 కేజి 
  • మల్లుగుడ్డ - 1/4 మీ
మగపిల్లవాని పెండ్లికి వ్రతము చేసుకున్న తరువాత వెంకటేశ్వరస్వామికి అఖండదీపారాధన చేయుదురు. 5గురు బాలదాసులు అనగా 10సం|| లోపు మగపిల్లలకు నామములు పెట్టి, తుండ్లు కట్టించి గోవిందుని నామం అనిపించాలి. పిల్లలకు కొత్త టవలు, పండు తాంబూలము పెట్టి ఇవ్వవలెను (5గురు ముత్తైదువులకు, బాలదాసులకు భోజనము పెట్టెదరు. ముత్తైదువులకు జాకెటు ముక్క, పసుపుకుంకుమ ఇవ్వవలెను).

మూకుడులో నిప్పులు పోసి పెండ్లికొడుకు పట్టుకొనును, పెండ్లికూతురు సాంబ్రాణి వేసుకుంటూ భోజనములు వడ్డించినాక గోవిందలు కొట్టుచు వైరములు తిరగాలి. అప్పటివరకు భోజనము చేయడం ఎవరూ మొదలుపెట్టరాదు. ఆ తరువాత భోజనము అందరూ చేయవచ్చును.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top