స్త్రీ కన్నేపోర ఒక అపోహ మాత్రమేనా ? - Strila Kannepora Apoha ?

స్త్రీ కన్నేపోర ఒక అపోహ మాత్రమేనా ? - Strila  Kannepora Apoha ?
కొంత మంది పురుషులు శోభనం గదిలో స్త్రీ యోని భాగంలోని కన్నెపొర తామ అంగప్రవేశం చేసినపుడు చిరిగి రక్తం వస్తేనే అమె కన్య అని అలా రక్తం రానిచో అమె వివాహానికి ముందు ఎవరితోనో రతిలో పాల్గొన్నదని అనుమానపడుతుంటారు. ఇలా చాలా జీవితాల్లో కలతలు రేగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయుతే ఇదంత వట్టి అపోహ మాత్రమే అని వైద్యులు అంటున్నారు.
అసలు కన్నెపొరకి కన్యత్వానికి సంభందమే లేదని స్త్రీలు చిన్నతనంలో ఆటలు అడుకున్నప్పుడు, సైకిల్ తొక్కినపుడు, లేదా వేలుతో యోని భాగంలో పెట్టి పెట్టి రాపిడి కలిగించినపుడు కన్నె పొర చిరిగిపోయే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఆక్కడ ఆశక్తి కరమైన విషయం ఏమిటంటే కొందరు స్త్రీలలో ఎన్ని సార్లు శృంగారంలో పాల్గొన్నప్పటికి కన్నెపొర అనేది చిరగకుండా సాగుతుందట.

సో.. కేవలం కన్నెపొర చిరగకుండా ఉన్న స్త్రీనే కన్య అని వివహానికి ముందు ఎటువంటి కారణాల వల్లనైనా చిరిగిపొయప్పటికీ ఆమెను మూర్ఖంగా కన్య కాదని అనుకోవడం చాలా పొరపొటు.రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top