రుచికరమైన - కరకరలాడే బీట్రూట్ సలాడ్ - Delicious - crusty beetroot salad

0
రుచికరమైన - కరకరలాడే బీట్రూట్ సలాడ్


కావాల్సిన పదార్థాలు :
  • బీట్‌రూట్‌:  1 కప్పు (పొడుగు ముక్కలు)
  • క్యాబేజి: 1 కప్పు (పొడుగు ముక్కలు)
  • అప్పడాలు: వేయించినవి 2
  • నిమ్మరసం: 2 టేబుల్‌ స్పూన్‌లు
  • పుదీనా: 1/4 కప్పు – సన్నగా తరిగినది
  • ఉప్పు:  తగినంత
  • ఆలివ్‌ ఆయిల్‌:  1 టేబుల్‌ స్పూను
  • మిరియాల పొడి:  1 టీస్పూను
తయారీ విధానం :

1. క్యాబేజీని, బీట్‌రూట్‌ని (పైన తొక్కతీసి) పొడవుగా ముక్కలు చేయాలి. వేడి నీళ్ళలో 2 నిమిషాలు ఉంచి నీరు తీసి పక్కకి ఉంచుకోవాలి. ఆలివ్‌ ఆయిల్‌, నిమ్మరసం, పుదీనా, ఉప్పు, మిరియాలపొడి అన్నీ మిక్సీలో వేసి ఒకసారి తిప్పాలి.

2. బీట్‌ రూట్‌, క్యాబేజి ముక్కలతో మిక్సీలో చేసిన పేస్టును కలిపి ఒక ప్లేట్‌ తీసుకుని కింద అప్పడం ముక్కలు వేసి పై మిశ్రమాన్ని పేర్చి వడ్డించాలి.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top