పెండ్లికూతురును నెలలోపల పంపుట మరియు పెండ్లి పెట్టె - అంటే ఏమిటి ? - Pellikituri pampakalu yela cheyali

0
pelli-kuturrini-pamputa-mariyu-pelli-petti-ante-yemiti-marriage-box-telugu
1. పెండ్లికూతురును నెలలోపల పంపుట:
తెలుపు రంగు డిజైను వున్న చీర తీసుకొనవలెను. అమ్మాయి భోజనము చేసిన తరువాత చీరచేతికి ఇచ్చినచో కట్టుకొనును. తూర్పువైపుకు కూర్చొనపెట్టి ఒడిలో 3ముద్దలు చలిమిడి, పసుపుకుంకుమ, జాకెటు ముక్క, తాంబూలము, పండ్లు, పీచువున్న కొబ్బరికాయ, పూలు, బియ్యము 5గుప్పిళ్ళు వడిలో పెట్టవలెను.

పసుపు చెంబు:
వెండి లేక ఇత్తడి చెంబు నిండా పసుపు పోయాలి. తెల్లటి గుడ్డ లేక తెలుపు చేతిరుమాలు చెంబుకు కట్టి, అత్తవారింటికి వెళ్ళునప్పుడు అమ్మాయి చేతికి ఇవ్వవలెను. అత్తగారింటికి వెళ్ళినాక దేవుని గుడివద్ద పసుపుకుంకుమ, ఆ పసుపు చెంబు పెట్టవలెను. పసుపు మామూలుగా వాడుకొనవచ్చును. నెల లోపల పసుపు ఇవ్వనిచో కాపురమునకు పంపు సమయములో ఇచ్చెదరు.

2. పెండ్లి పెట్టె:
మంచిరోజున జాకెటు ముక్క, పసుపు, కుంకుమ ఒక పెట్టెలో పెట్టెదరు. వక్కలు, ఖర్జూరాలు, అప్పగింతల బట్టలు, తలంబ్రాల బియ్యము, తలంబ్రాలు బట్టలు, వడిగట్టు బియ్యం, ఆడపడుచు బట్టలు, తలపాగ, పిల్లమేనమామల బట్టలు, తాళిబొట్టు, భటువు, కంకణము, ఉత్తర జన్యములు, పెండ్లి కుమారునకు ఇచ్చు వెండి సామాను పెండ్లి కుమార్తెకు ఇచ్చు నగలు సర్దవలెను.
  • వడిగంటు బియ్యము: పెద్దసైజు కండువాలో 5 గిద్దల బియ్యము వడి గంటు గిన్నె, కంద పిలక, ఆకులు 3, వక్కలు 2 ఉంచి, ముడి పెట్టి పెండ్లి పెట్టెలో సర్దవలెను. మగ పెండ్లి కుమారుని కండువాలో కంద పిలక అవసరంలేదు. 
  • తలంబ్రాల బియ్యము 21/2 శేర్లు: పెండ్లిపనులు మొదలు పెట్టిన రోజు కొట్టిన పసుపు, పెండ్లి కుమారుని చేసినప్పుడు కొట్టిన పసుపు, కొద్దిగ ఆవునెయ్యి, మంచి ముత్యములు 3, బియ్యములో వేసి 5గురు ముత్తైదువులు కూర్చొని కలపవలెను. ఈ బియ్యము పెండ్లి పెట్టెలో పెట్టుకొనవలెను. 
  • మంగళ సూత్రము తీసుకురావటము: మేళముతో కంసాలి వద్దకు వెళ్ళాలి. ఒక పళ్ళెములో జాకెటు ముక్క, పసుపు, కుంకుమ, ఎండు కొబ్బరిచిప్ప, ఆకులు, పండ్లు 6, కంసాలికి దక్షిణ ఇవ్వవలెను. ఆడవాళ్ళు, మగవాళ్ళు వెళ్ళవచ్చును. కంసాలి సూత్రమునకు పూజచేసి ఇచ్చును. పెండ్లిపెట్టెలో సర్దుకొనవలెను. మంగళసూత్రము తెచ్చిన తరువాత ఇంటిలో నిదురచేయరాదు. కావున పెండ్లి రోజుననే తీసుకురావలెను.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top