నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
సాంప్రదాయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సాంప్రదాయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, జులై 2020, గురువారం

శుభానికి సంకేతం స్వస్తిక్ - Swastik Mudra

శుభానికి సంకేతం స్వస్తిక్ - Swastik

శుభానికి సంకేతం స్వస్తిక్

స్వస్తిక్ అంటే సు-మంచి, అస్తి - కలగటం, మంచిని కలిగించడం. స్వస్తిక అంటే దిగ్విజయం. స్వస్తిక్ ఎడమ నుంచి కుడికి తిరుగుతున్నట్టుగా, కాలచక్రంలా కనిపిస్తూ వుంటుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో 'ఓం' అనే ముద్రకి ఎంతటి ప్రాముఖ్యం వుందో,  స్వస్తిక్'కు అంతే ప్రాధాన్యం పుంది.
 'ఓం' అనే ముద్రతో పాటుగా 'స్వస్తిక్' ముద్ర
 'ఓం' అనే ముద్రతో పాటుగా 'స్వస్తిక్' ముద్ర 
 • 卐 మందరాలలో 'ఓం' అనే ముద్రతో పాటుగా 'స్వస్తిక్' కూడా తప్పనిసరిగా కనిపిస్తుంది. దీనిని తడి పసుపులో రాసి కుంకుమ బొట్టు పెడతాం.
 • 卐 స్వస్తిక్ గుర్తులో ఉండే నాలుగు గదులు స్వర్గం, నరకం, మానవుడు, జంతుజాలాలను సూచిస్తాయి. 
 • 卐 హిందుత్వాన్ని అనుసరించే బౌద్ధ, జైన మతాల్లో స్వస్తిక్ కు ఎంతో ప్రాముఖ్యం ఇస్తారు. స్వస్తిక్ ఆకారం సవ్య దిశగా ఉంటుంది. విష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రం వలె చేడును నివారించి శుభాలను కలిగిస్తుంది. అందుకే ప్రతీ శుభాకార్యాల్లో స్వస్తిక్ ఆకారాన్ని వేస్తారు. గృహప్రవేశాల్లో, పెళ్లి పత్రిక వాహన పూజల్లో, నూతన యంత్రాలు వాడే సమయంలో స్వస్తిక్ గుర్తు ప్రధాన పాత్రను పోషిస్తోంది. 
 • 卐 ఇంటి గుమ్మంపై కట్టుకుంటే దృష్టి దోషాల నివారణ జరుగుతోందని నమ్మకం. వేద మంత్రోచ్ఛరణ చేసేప్పుడు ఓం శబ్దం తర్వాత 'స్వస్రే' అనే పదం విరివిగా వాడటం గమనిస్తుంటాం. ఏ పని ప్రారంభించినా ఆ కార్యంలో విజ్ఞం కలగరాదనే భావంతో అలా చేస్తుంటారు. విఘ్నహర్త గణేశునికి ప్రతీక ఈ చిహ్నం. కనుక దీన్ని శుభప్రదంగా భావిస్తారు. 
 • 卐 వినాయకుడి పూజా విధానంలో స్వస్తిక్ ముద్ర మరింత విశిష్టతను సంతరించుకుంది. ప్రత్యేక పూజల సమయంలో కలశ స్థాపన చేసేటప్పుడు, ముందుగా పీఠంపై స్వస్తిక్ ముద్రను దిద్దుతారు. స్వస్తిక్ సూర్యభగవానుని గతిని సూచిస్తుందనీ అంటారు. 
 • 卐 పురాతనకాలంలో సూర్యపూజలకు చిహ్నంగానూ వుండేదట. దీన్ని శ్రీమహాలక్ష్మీదేవికి ప్రతీకగానూ చెబుతారు. దీపావళి రోజున కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించే వ్యాపారులు, ఈ చిహ్నాన్ని గీస్తారు. తమ వ్యాపారాలకు గణపతి ఆశీర్వాదం ఉండాలని ఇలా గీయడం సంప్రదాయంగా వస్తోంది. 
 • 卐 దీపావళికే కాకుండా, షష్ఠి పూజల్లోనూ స్వస్తిక్ గీస్తారు. ఉత్తరాదివారి వివాహాల్లో, వధూవరుల నుదుట ఈ చిహ్నం వుంటుంది.
 • 卐 నూతన దంపతుల దాంపత్యజీవితాలు సుఖమయంగా జరగాలనీ, జరుగుతాయనీ సూచించేందుకు స్వస్తిక్ చిహ్నం ఉపయోగిస్తారు. 
 • 卐 ప్రపంచం నలుమూలల్లో స్వస్తిక్ గుర్తును శుభానికి అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. స్వస్తిక్ మూలాలు పన్నేందు వేల సంవత్సరాల నాటి కాలంలో ఉక్రెయిన్లో లభించింది. పాశ్చాత్య దేశాల్లోని ప్రార్ధనా మందిరాల్లో ప్రసిద్ధ కట్టడాల్లో స్వస్తిక్ గుర్తు కనబడుతుంది. స్వస్తిక్ గుర్తు హిందూమతంలో నుండే ప్రపంచ దేశాలకు వ్యాపించిందని పరిశోధకులు నిర్ధారించారు.
 • 卐 వాస్తుపరమైన దోషాలను స్వస్తిక్ ముద్ర నివారిస్తుందని భావిస్తుంటారు. 
 • 卐 ఇళ్లలోనే కాదు ఆధునీకతకు అద్దంలా కనిపించే ఆఫీసుల్లోనూ, శుభం- లాభం అనే మాట కనిపించే వ్యాపార సంస్థల్లోనూ స్వస్తిక్ ముద్ర కనిపిస్తోంది, స్వస్తిక్ ముద్ర శుభాలను, విజయాలను ప్రసాదిస్తుంటుందనే నమ్మకం ప్రాచీనకాలం నుంచి వుంది. 
స్వస్తిక్ని పూజించడమంటే కాలచక్రాన్ని పూజించడమేనని చాలామంది విశ్వాసం. ఈ కారణంగానే స్వస్తిక్ ముద్ర అవసవ్యంగా లేకుండా జాగ్రత్తలు తీసుకొంటారు. స్వస్తిక్ ముద్ర వ్యతిరేక దిశలో ఉన్నట్లయితే ప్రతి విషయంలోనూ వ్యతిరేక ఫలితాలను చూడవలసి వస్తుందని అంటారు, ఆశించిన ఫలితాలు కారుమారుకాకుండా ఉండాలంటే, స్వస్తిక్ ముద్ర సవ్యంగా ఉండేలా చూసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.

సంకలనం: కోటేశ్వర్

29, జూన్ 2020, సోమవారం

భోజనానికి ముందు కాళ్ళు కడుక్కోవాలి - Bhōjanāniki mundu kāḷḷu kaḍukkōvāliభోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి?

“అన్నం పరబ్రహ్మస్వరూపం” అని ఆర్యవాక్యం.
మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి, వికసించి విజ్ఞానవంతుడైన తరువాత ఆహారానికి వున్న విలువను గుర్తించాడు. మానవుని ప్రాధమిక అవసరాలన్నిటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తరువాత సహజంగానే భక్తిభావం పెరిగింది.  

“ఆహార ఉపాహారాల యిష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు. సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదు. ఆహారాన్ని సక్రమంగా తీసికోననివానికి ఏ కోరికలు ఉండవు” అని చెబుతుంది భగవద్గీత.

పూర్వకాలంలో భోజనశాలను ప్రతినిత్యం ఆవుపేడతో అలికి సున్నంతో నాలుగువైపులా గీతలు (ముగ్గులు) వేసేవారు. దీనివలన సూక్ష్మక్రిములు భోజన శాలలలోనికి ప్రవేశించేవి కావు. మనుషులను హానిచేసే సూక్షక్రిములులను చంపే శక్తి (పెన్సిలిన్) ఆవుపెడలోనూ, ఆవు మూత్రంలోనూ ఉంది. భోజనం చేసిన తరువాత క్రిందపడిన ఆహారపదార్థాలను తీసివేసి మరలా నీతితో అలికి శుభ్రపరిచేవారు. చీమలు మొదలైన కీటకాలు రాకుండా వుండేవి.

మనకు శక్తిని ప్రసాదించి, మన ప్రాణాలను కాపాడి, మనలను చైతన్య వంతులను చేసి నడిపించే ఆహారాన్ని దైవసమానంగా భావించి గౌరవించి పూజించటంలో తప్పులేదుకదా!

చేతులు కడుక్కోకపోతే నీ ఆరోగ్యం మాత్రమే చెడుతుంది. కాళ్ళు కడుక్కోకపోతే కుంటుంబంలోని వారందరి ఆరోగ్యం చెడిపోతుంది. బయటనుండి ఇంటిలోనికి ప్రవేశించే ముందు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవటం కూడా మన ఆచారాల్లో ఒకటి. ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినపుడు ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు (పాద్యం) ఇస్తారు. తరువాత త్రాగటానికి మంచినీరు (ఆర్ఘ్యం) ఇస్తారు.

“మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతాం. తెలియకుండా అశుద్ధ పదార్థాలను త్రోక్కుతాం. అదే కాళ్ళతో రావటం వల్ల కుటుబంలోని అందరి ఆరోగ్యాలకూ హాని జరుగుతుంది కదా! ముఖ్యంగా పసిబిద్దలకు మరింత హానిదాయకం”

ఇపుడు మన ప్రశాంతంగా తీరికగా అన్నం తింటున్నామా! కాలిబూట్లతో అన్నం తింటున్నాం. పరుగులు తీస్తున్నాం. “బిజీ!బిజీ!బిజీ!”. అనవసరమైన అవసరాలకోసం అర్థంలేని జీవితమ గడుపుతున్నాం. కాళ్ళు కడుక్కోవటం విషయం అటుంచి చేతులు కూడా కడుక్కోలేని బిజీ అయిపోతున్నాం. ఇక ఆహారాన్ని గౌరవించే ఓపికా తీరికా ఎవరికిఉంది?

సంకలనం: నాగవరపు రవీంద్ర

24, జూన్ 2020, బుధవారం

హిందువుల దేవాలయాలలోనికి అన్య మతస్థులకు ప్రవేశాధికారం ఉందా - Devalayam, Anya Mathastulu - Entry of other religious persons into Hindu


హిందువుల దేవాలయాలలోనికి ఇతర మతస్థులకు ప్రవేశాధికారం ఉందా

ఇప్పుడిప్పుడే అన్యమతస్థులను కూడా మన దేవాలయాలలోనికి రానిస్తున్నారు. కొన్ని చోట్ల దేవాలయాలలోని కొన్ని ప్రదేశాలకు మాత్రం ఇతర మతస్థులను రానివ్వరు. 

దేవాలయాలలోనికి అసలు అడుగు పెట్టనీయకపోయినా తప్పేమీ లేదు. కారణమేమంటే, వారు తమతమ దేవాలయాలను సందర్శించేటప్పుడు పవిత్రస్థలాలుగా భావించి ఎటువంటి శ్రద్ధాభక్తులతో వెళతారో అలాగే మన దేవాలయంలోకి వస్తే మనకేమి అభ్యంతరం ఉండదు. కానీ శ్రద్ధ లేకుండా కేవలం యాత్రికులుగా, విమర్శనాత్మక బుద్ధితో, దోషాలు ఎంచటానికి వస్తే మాత్రం దానివల్ల వారికి కలిగే లాభంఉండదు. పైగా అది మన ఆస్తిక భక్తుల మనోభావాలను కంచపరిచినట్టవుతుంది.

ముందు మనం హిందూమతంలోని అన్ని వర్గాలవారికి ఎలాంటి వివక్షత లేకుండా దేవాలయాలలోనికి ప్రవేశం కల్పించాలి. ఒక పద్దతి ప్రకారం అందరికీ దైవాన్ని దర్శించుకునేందుకు వీలు కల్పించాలి. ఇతరులకు ప్రవేశం కల్పించే విషయం తరువాత ఆలోచించవచ్చు. ప్రస్తుతానికది పెద్దసమస్య కాదు.

సంకలనం: దయాత్మానంద స్వామి

3, జూన్ 2020, బుధవారం

పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి - Puttinaroju, Birthday


భారతీయ సంసృతిలో పుట్టినరోజు

కేకులు కట్ చేయడం, దీపాలు ఆర్పడం వంటి పద్దతులు మన సంప్రదాయంలో లేదు. దీపాలు ఆర్పడం అశుభం, అందులోనూ అది పుట్టినరోజున చేయడం ఎంతవరకు మంచిదో చెప్పండి .పార్టీ కి స్నేహితులు పిలిస్తే వెళ్ళకుండా ఉండలేము, వెళ్ళాక మన సనాతన ధర్మానికి విరుద్ధంగా జరిగే తంతు చూసి మనసు కష్టపెట్టుకోకుండా ఉండలేము. పాశ్చాత్య సంస్కారం ఎంత త్వరగా మన యువతను చెడగొడుతోందో తెలుస్తోంది.
వెలిగే దీపం ఆర్పడం
వెలిగే దీపం ఆర్పడం 
వెలిగే దీపం ఆర్పడం అశుభం. ఏ శాస్త్రాలలోనూ దీపాన్ని ఆర్పమని చెప్పలేదు. అగ్ని పావనుడు, ఆయనపై ఎంగిలి పడితే అది తీరని అపకారమవుతుంది.

పుట్టినరోజు దీపాలు వెలిగించే పండుగ కావాలి గాని, దీపాలు ఆర్పి అశుభం కార్యక్రమంగా చేయకూడదు. ఇక కేకు అంటార, అంగడిలో కొని తెస్తారు, అందులో కోడి గుడ్డు కలుపుతారు. తినేవారి సంగతి సరె, గుడ్డు తినని వారు ఈ పని చేసి తప్పు చేస్తున్నారు. ఇక ఎంగిలి తినడం మంచిది కాదు.ఇటీవల కాలంలో కేకులు కట్ చేయడం వివాహ వేడుకలలో ఫాషన్ అయింది. ఇది పద్దతి కాదు.
మన శాస్త్రం ప్రకారం పుట్టినరోజు వేడుక
మన శాస్త్రం ప్రకారం పుట్టినరోజు వేడుక
మన శాస్త్రం ప్రకారం పుట్టినరోజు వేడుకలలో ఏమి చేయాలో చూద్దాం:
 • ➣ ప్రతి జన్మ నక్షత్రమందో, పుట్టిన రోజు తిధి నందో అపమృత్యు పరిహారం కోసం ఆయుష్యు సూక్తంతో హోమం చేయాలి. ఈ హోమం ఆ వ్యక్తి దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. వ్యాధులు రాకుండా పరిహారాన్ని ఇస్తుంది.
 • ➣ ఇంద్ర, రుద్రాది దేవతలకు చేసే ప్రార్ధనలు వారికి సకల క్షేమాలనిస్తాయి. వేదవేత్తుల ఆశీస్సులు వారిని కాపాడుతాయి, ఆరోజు చేసే దానాలు వారికి పుణ్యాన్ని ఇవ్వడం కాకుండా మనకన్నా తక్కువస్థితిలో ఉన్న వారికి సహాయం చేశామన్న తృప్తిని కలిగిస్తాయి.
 • ➣ లలితా, విష్ణు సహస్రనామాలు పారాయణ చేయాలి.
 • ➣ అంతేకాకుండా, గ్రహచారాదుల వలన అపమృత్యు దోష ప్రాప్తమైనప్పుడు, మృత్యుంజయహోమం మంచిది.
 • ➣ కేవలం అనుకరణ చేసి అదే గొప్ప అనుకునే భ్రమ నుండి బయటపడాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి?
 • ➣ మన ఆచారాల ప్రస్తావన వచ్చినప్పుడు “ఇందులో అర్ధం ఎమిటి “అని పెద్ద మేధావుల వలె ప్రశ్నించే మనం ..ఈ అనుకరణ వ్యవహారాలను ప్రశ్నిస్తున్నామా??
 • ➣ ఎవరి ఆచారం వారికి గొప్ప. మన ధర్మాలు మనకు గొప్ప కావాలి, అంతేగాని కించపరచకూడదు.
 • ➣ పసితనంలో సంవత్సరం పూర్తి అయ్యేవరకు ప్రతినెలా “జన్మ తిధి” రోజు జన్మదినోత్సవం చేయాలి. తరువాతి ప్రతిఏడు జన్మతిధినాడు జన్మదినం చేయాలి. కొందరు జన్మ నక్షత్రం ప్రకారం కూడ జరుపుకుంటారు. అదీ మంచిదే.
 • ➣ ఆ రోజు కులదేవతలను స్మరించాలి. తదుపరి గణపతి, సూర్యుని, మార్కండేయుని, వ్యాసుని, పరశురాముని, అశ్వత్ధాముని, హనుమంతుని, విభీషణుని, షష్టీదేవిని తలచి నమస్కరించాలి. 
 • ➣ పుట్టినరోజు కేశఖండనం, గోళ్ళు తీయడం, కలహం, మాసభోజనం, ప్రయాణం, హింస విడిచిపెట్టాలి.
 • ➣ చిన్నవారందరు పెద్దవారికి నమస్కరించి వారి ఆశీస్సులు పొందాలి. వయసైన వారు పనికిరాని వారని భావింపక వారి ఆశేస్సులే మనకు శ్రీరామ రక్ష అని భావచడానికే ఈ కార్యక్రమం ఏర్పడింది.
 • ➣ మహాభారతం లో అంతటి శ్రీకృష్ణుడే తానే కొందరికి నమస్కరిస్తానన్నాడు. వారు..
వీడియో లో చూడవచ్చును:


“నిత్యాన్నదాత, నిత్యాగ్నిహోత్రి, ప్రతిమాసం ఉపవాసం చేసేవారు, పతివ్రత, వేదాంతవేత్త, సహస్ర చందన దర్శనం చేసినవారు – ఈ ఆరుగురు నాకు వందనీయులు” అని శ్రీకృష్ణుని మాట.

 రచన: శ్రుతి

22, ఏప్రిల్ 2020, బుధవారం

దేవాలయములో ప్రదక్షిణ చేసేటప్పుడు పరిగెడుతున్నట్టు అడుగులు వేయకూడదట ఎందుకు? - Devalayam, Pradikshinalu


దేవాలయములో ప్రదక్షిణ చేసేటప్పుడు పరిగెడుతున్నట్టు అడుగులు వేయకూడదట ఎందుకు? - Devalayam, Pradikshinalu
నము దేవాలయమునకు వెళ్ళాలనుకున్నప్పుడు, స్వామివారిని దర్శించడానికి ముందు దేవాలయంలో ప్రదక్షిణించడంలో తొందర పనికిరాదు. 

మనస్సును ప్రశాంతపరచి, స్వామివారిని మనస్సును ధ్యానిస్తూ మంత్రం గాని, అష్టోత్తరం గాని, ఇవి ఏవి తెలియని వారు ఆ స్వామివారి నామజపము చేస్తూ భక్తితో ఆ దైవం చుట్టూ ప్రదక్షిణ చేయాలి.  ఆలయంలోని గర్భగుడిలో దేవతా విగ్రహం ఉంటుంది. ప్రతి నిత్యం పురోహితులు జరిపే అర్చనలలోని మంత్రాల ద్వారా ఆ మంత్రాలలో ఉండే శక్తిని విగ్రహం క్రిందనున్న యంత్రం ఆ శక్తిని గ్రహించి, ఆ శక్తి ద్వారా మన కోర్కెలను తీరుస్తుంది. 

కనుక భగవదర్శనానికి వెళ్ళినప్;పుడు మన మది నిండా భగవంతుని రూపమే నింపి నిదానంగా ప్రదక్షిణ చేసి ఆ స్వామి కౄపకు పాత్రులు కావాలి.

సంకలనం: నాగవరపు రవీంద్ర

24, మార్చి 2020, మంగళవారం

యుగాది - తెలుగువారి "ఉగాది” - Ugadi

ఉగాది:
యుగాది - తెలుగువారి "ఉగాది”  ఉగాది తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది కి ఇల్లు శుభ్రం చేసి,ఇంటికి వెల్ల వేయిస్తారు. కొత్త బట్టలు, కొత్త సామాగ్రి కొనడంలో ఉత్సాహంగా పండుగ సందడి ఒక వారం ముందే మొదలవుతుంది. ఉగాది రోజున తెల్లవారుఝామునే లేచి, ఇంట్లోని వారంతా అబ్యంగన స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని, ప్రతీ ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపి జల్లి , రంగు రంగుల రంగ వల్లులు తీర్చి దిద్దుతారు. ఇంటికి మామిడి తోరణాలు కడతారు. (పచ్చటి మామిడి తోరణాలు, ఈ రోజుకు సంబంధించి ఒక కధ ప్రచారములో ఉంది. శివ పుత్రులు గణపతి, సుబ్రమణ్యస్వాములకు మామిడి పండ్లంటే ఎంతో ప్రీతి. ఏ ఇంటికి పచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద, మంచి పంట కలుగుతుందని సుబ్రహ్మణ్యస్వామి దీవించాడని కధ.)శాస్త్రయుక్తంగా తమ ఇష్టదైవానికి పూజ చేసుకుని కొత్త సంవత్సరం అంతా శుభం కలగాలని కోరుకుంటారు. ఆరోగ్య, ఐశ్వర్యాలను ఆకాంక్షిస్తారు . ఈ రోజున కొత్త పనులు వ్యాపారాలు మొదలెడతారు. పరగడుపున, దేవునికి నైవేద్యంగా పెట్టిన ఉగాది పచ్చడిని ప్రసాదంగా తీసుకొని తర్వాత అల్పాహారం తీసుకుంటారు.ఇంటింట ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. పులిహోర, బొబ్బట్లు, పాయసం, అలాగే పచ్చి మామిడి కాయతో వంటకాలు విశేషం.

యుగాది ఎలా జరుపుకోవాలి " బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనం వినండి !
పంచాంగ శ్రవణం:
ఈ రోజున ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం జరుగుతుంది. సాధారణంగా సాయంత్ర సమయాన ఊరి జనాలు ఒక చోట చేరి, సిద్ధాంతి చెప్పే పంచాంగ వివరాలు, ఆ సంవత్సర రాశి ఫలాలు తెలుసుకుంటారు సిద్ధాంతి దేశ, రాష్ట్ర, వ్యక్తీ స్థితి గతులు ఎలా ఉంటాయో వివరణ చేస్తాడు. పంచాంగ శ్రవణం వాళ్ళ రానున్న మంచి చెడులను సమభావంతో స్వీకరించ గలరని, పంచాంగ శ్రవణం వినడం మంచిది అని మన పెద్దలు చెప్పటం జరిగింది. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల వంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగ శ్రవణం  చేస్తారు.

కవి సమ్మేళనం
       ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా "కవి సమ్మేళనం" నిర్వహిస్తారు. కొత్త, పాత కవులు నవ భావన, పాత ఒరవళ్ళు కలిపి కొత్త పద్యాలు, కవితలు తయారు చేసి చదువుతారు. సామాజిక జీవనం, రాజకీయం, వాణిజ్యం ఇలా అన్నివిషయాలను గూర్చి ప్రస్తావిస్తారు, కవులు తమకవితలలో. ఈ విధంగా నానా రుచి సమ్మేళనంగా జరుగుతుంది ఉగాది కవి సమ్మేళనం.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

15, మార్చి 2020, ఆదివారం

బొట్టు ప్రాముఖ్యత - Bottu praamukhyata

బొట్టు ప్రాముఖ్యత - Bottu praamukhyata
బొట్టు ప్రాముఖ్యత..
బొట్టు పెట్టుకోకపోతే ఏమవుతుందో తెలుసుకోండి!
మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. బొట్టులేని ముఖము, ముగ్గులేని ఇల్లు అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము, ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు రెండూ కూడా స్మశానంతో సమానం అని పెద్దలు చెబుతూ ఉంటారు.

కాబట్టి ఇంటి ముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు, దరిద్రదేవత తాండవం చేస్తాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు.

ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్రదేవతగా పిలువబడే జ్యేష్టదేవి ఇద్దరూ భార్యా భర్తలే.కాబట్టి ఒకరు ఉంటే రెండోవారు కూడా ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు ఉంటాడు, వారిద్దరూ ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. కాబట్టి ముఖానికి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు.

మన ముఖములో ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి యొక్క కంటి నుండి వచ్చేటటువంటి నకారాత్మక శక్తి అంటే నెగెటివ్ఎనర్జీ (వ్యతిరేక శక్తి) అంటారు.

నరుడు కంటే చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని అంటూ ఉంటారు పెద్దలు, అలాగే ఎదురుగా ఉండేటటువంటివారు. మన ముఖాన్ని చుస్తే వారి యొక్క చూపులో ఉన్నటువంటి నెగెటివ్ఎనర్జీ (వ్యతిరేక శక్తి) మన యొక్క కనుబొమ్మల రెండింటికీ మధ్యలో ఉండేటటువంటి స్థానంలో కేంద్రీకృతమవుతుంది.

మన శరీరంలో ఉండేటటువంటి నాడులలో కొన్ని సున్నితమైనటువంటి నాడులు రెండు కనుబొమ్మలకు మధ్యభాగంలో ఉంటాయి. ఎప్పుడైతే అటువంటి సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి.

ఆ నాడులు ఒత్తిడికి లోనవటం వలన ఆ నాడులు మెదడుకు అనుసంధానమై ఉంటాయి. అంటే మెదడుకు సంభందించినటు వంటి నాడులు మన ముఖములో కనబడుతాయి. కాబట్టి ఆ మెదడు దెబ్బ తింటుంది. మెదడు దెబ్బ తినడం అంటే మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది, తద్వారా మనకు తలనొప్పి వస్తుంది, మనఃశాంతి పోతుంది, చిరాకు వస్తుంది.

ఏ విషయం పైన సరిగా దృష్టి పెట్టలేము. కాబట్టి ఎదుటి వారి యొక్క కంటిచూపు నుండే మన యొక్క మేధాశక్తిని కాపాడుకోవాలంటే మెదడును కాపాడుకోవాలంటే మనకు ఉన్నటువంటి పాజిటివ్ఎనర్జీని (సానుకూల శక్తి) కాపాడుకోవాలంటే ఖచ్చితముగా వారి చూపులకు మన కనుబొమ్మల మధ్య భాగానికి మధ్య ఏదైనా అడ్డంగా పెట్టాలి, అంటే బొట్టు పెడితే చాలు.

మనం బొట్టు పెట్టుకున్నామంటే ఎదురుగా ఉండేటటువంటి వారి యొక్క చూపు మన యొక్క నుదుట మీద పడినా కూడా మన సున్నితమైనటువంటి నాడులకు ప్రమాదం లేకుండా బొట్టు అడ్డుకుంటుంది ,తద్వారా మన యొక్క శక్తి మన దగ్గరే ఉంటుంది.

జ్ఞాపకశక్తి, మేధాశక్తి అన్నీ రకాలయినటువంటి విశేషమైనటువంటి శక్తులు మన దగ్గరే ఉంటాయి. ఎటువంటి ఒత్తిడికి లోనూ కావు, మనల్ని కాపాడుతూ ఉంటాయి. మన యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి, అందుకని బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి.

సైంటిఫిక్ (శాస్త్రీయంగా) కూడా తప్పనిసరిగా సైన్సు ప్రకారం కూడా ఇది నిరూపించడం జరిగింది, అందుకని ఎప్పుడైనా సరే చక్కగా బొట్టు పెట్టుకోండి.

ఋణ బాధలు ఉన్నటువంటివారు నాగసింధూరాన్ని బొట్టుగా ధరించండి, ఆ బొట్టు పెట్టుకోవడం వలన ఋణబాధలు అన్నీకూడా తొలగిపోతాయి. అదే విధంగా సర్పదోషాలు, నాగదోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి.

ఎక్కువగా మనఃశాంతి లేక ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అంటే ఆరావళి కుంకుమను బొట్టు పెట్టుకోండి.

పుణ్యస్త్రీలు మాత్రమే కాకుండా సౌభాగ్యవతులే కాకుండా మగవారే కాకుండా వైథవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా కుంకుమను ధరించవచ్చు దానినే గంగసింధూరము అంటారు.

ఆంజనేయస్వామి వారి యొక్క బొట్టు అని కూడా అంటారు, ఆ బొట్టును వైదవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు, ఎటువంటి తప్పూ లేదు. అందువల్ల చక్కగా కుంకుమను ధరించండి.

మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన ఆచారాలే, ఆ ఆచారాలను కనుక మనం అనుసరిస్తే హైందవ ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాము దానితో పాటుగా మన యొక్క రక్షణను కూడా మనం పొందగలుగుతాము. పాపటిలో సింధూరం ఆడవాళ్లకు మరింత గౌరవాన్ని కలిగిస్తుంది.. భర్తకు క్షేమం కూడా అంటారు.

ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారుబాటలు అందుకని చక్కగా కుంకుమను ధరించండి.

శ్రీ మాత్రే నమః
రచన: భానుమతి అక్కిశెట్టి

12, ఫిబ్రవరి 2020, బుధవారం

కొబ్బరికాయ కొట్టడం - Kobbarikaaya yenduku Kottali

కొబ్బరి కాయ కొట్టడమెందుకు దేవతలను పూజించే నమయంలో ఇతర శుభకార్యాలు, యజ్ఞాలు, వ్రతాలు చేసే సమయంలో కొబ్బరికాయను తప్పనిసరిగా కొడతారు. నైవేద్యము సమర్పిస్తారు.  కొబ్బరికాయపైన ఉన్న పెంకు "ఆహంకారానికి" ప్రతీకగా చెప్పబడింది. పరమేశ్వరుని నిత్యం ధ్యానించడం లేదా పూజించడంవలన అహం నశిస్తుంది.

టెంకాయను కొట్టగానే అది పగిలి తెల్లని మనసువలె కొబ్బరి కనిపిస్తుంది. దాన్ని స్వయంగా దేవుడు ముందు నివేదిస్తాం. అందులో నుండి వచ్చే కొబ్బరినీరులా తమ జీవితాలను భగవంతుని దివ్యచరణాలకు అర్పించా మని తెలుపడమే కొబ్బరికాయ కొట్టడంలోని అర్థం.
కొబ్బరికాయ కొట్టడం
కొబ్బరికాయ కొట్టడం
కొబ్బరి కాయను మానవదేహంతో పోల్చి భగవంతునికి సమర్పించడం వెనక ఉన్న పరమార్థం మానవులందరూ ఆయనకు శరణాగతులు కావాలనే ఉద్దేశ్యం నెరవేర్చడం కోసమే. అయితే దేవుడికి నివేదించే కొబ్బరికాయకు ఎప్పడు కుంకుమ పెట్టకూడదు. నైవేద్యం శుద్దంగా ఉండాలి గుమ్మం వద్ద, క్రొత్త వాహనం కొనుగోలు చేసేటప్పుడు, దిష్టి తీసిన సమయాలలో మాత్రమే కుంకుమ వేయాలి. దీనిని “బలిహరణం అంటారు. బలిని భూత, ప్రేత పిశాచాలకు నైవేద్యంగా పెడతారు. భగవంతునికి సమర్పంచే టెంకాయకు కుంకుమ పెట్టకూడదు. యధాతధంగా సమర్పించాలని పెద్దలు చెబుతున్నారు.

రచన: జాగృతి

28, నవంబర్ 2019, గురువారం

వైదిక సంస్కారములు - Vedic Sanskarasవైదిక సంస్కారములు - Vedic Sanskaras
షివర్యులు చరకుడు ఇలా అన్నాడు, “సంస్కారో హాయ్ గుణంతరాధనముచ్యతే” అనగా మంచి లక్షణాలు మరియు ధర్మాల ద్వారా మనలో ఉన్న చెడు లక్షణాలను మంచి వైపు నడిపించే మార్గాలే సంస్కారములు.

సంస్కారములు:
 • 1. గర్భాదానము: వివాహానంతరము కులగురువు ఇంటి బ్రహ్మగారిచే నిర్ణయింపబడిన సుముహూర్తములో ప్రజాపత్యర్థం కొరకు చేయు క్రియ.
 • 2. సీమంతోన్నయనము: భర్త, అడవి పంది ముల్లు తెచ్చి, తలలో మొదటినుండి (సీమంతము)బ్రహ్మరంథ్రము వరకు,పాపిటి తీసి, జడను పైకి ఎత్తి మేడి ఆకులతో, తోరణము కట్టుట. గర్భస్తు గృహిణి ఏడవ మాసంలో ఆ గర్భమును చెణకడానికి(పాడు చేయడానికి) దుష్ట గ్రహములు గర్భములో ప్రవేశిస్తాయి. వాటి నివారణ కొరకు సీమంతము అంటారు కానీ అది శాస్త్రములో సీమంతోన్నయనము.
 • 3. పుంసమనము: అనువంశిక సింహాసనమున (గృహస్తు తన గృహములోని భగవతామూర్తుల) కు నిత్యార్చనకు తనూభవుడు కావలయునని కోరుట.
 • 4. జాతకర్మ: పుట్టిన శిశువుకు చేయు కర్మ.
 • 5. నామకరణము: పుట్టిన శిశువుకు (ఏదో పేర్లున్న పుస్తకము పట్టుకొని పేర్లు మన ఇష్టానుసారము పెట్టకుండా) ఇంటి బ్రహ్మచే శిశువు యొక్క జనన కాలమును గణించి తత్ సంబంధమైన పేరు పెట్టుట.
 • 6. అన్నప్రాశన: శిశువుకు అన్నము మొదటిసారిగా రుచి చూపించుట.
 • 7. చౌలము: శిఖ ఉంచడము ( పిలక )
 • 8. ఉపనయనము: తనూభవుని సంస్కరించి, మంత్రోపదేశము చేసి, సనాతన ధర్మమార్గములను తెలియజేయుట. ప్రజాపత్య సంస్కారములు అనెడు నాలుగు సంస్కారములను, పూర్తి చేసి 5ద వది ఐన సమావర్తనము అని ఒక స్నానమాచరించుట. (దివ్య స్నానము)
 • 9. వివాహము: గృహస్తాశ్రమ ధర్మ స్వీకారము. గృహస్తాశ్రమ ధర్మములో గృహస్తు కు పంచమహాయజ్ఞములు పంచ సంస్కారములు ఉంటాయి.
పంచమహాయజ్ఞాలు:
1. బ్రహ్మయజ్ఞము: వేదము చదువుకోవడం లేదా వేదము అభ్యసించిన, తెలిసిన పండితులకు నమస్కరించడం.
2. దేవయజ్ఞము: ప్రతిరోజూ ఈశ్వరాధన చేయడం.
3. పితృయజ్ఞము: తల్లితండ్రులకు తద్దినం పెట్టడం అమావాస్యలనాడు వారికి తర్పణము వదలడం.
4. భూతయజ్ఞము: కేవలం గృహస్తులే అన్న పానీయాలు భుజింపకుండా, మిగతా భూతములకు ఆహారము సమర్పించుట.
5. మనుష్యయజ్ఞము: అతిథి అభ్యాగతులను గృహస్తు, సాదరముగ, త్రికరణ శుద్దిగా ఆచరించుట.

పాత్రయజ్ఞములు అనేవి 7 యజ్ఞములు
హిరణ్యయజ్ఞములు అనేవి 7 యజ్ఞములు
వాజపేయములు అనేవి 7 యజ్ఞములు
కలిపి మొత్తం 40 సంస్కారములు శాస్త్రము చెప్పినది.

పుత్రులు వారి వివరములు
ఈ దశవిధములుగా జన్మించిన పుత్రులు, దేవ సంబంధ, శాస్త్ర సంబంధ కార్యములు చేయుటకు, అర్హులని వేదములు, ఉపనిషత్తులు చెబుచున్నాయి.

దేవీ భాగవతము నుండి.
 • 1. అంశజుడు: అగ్ని సాక్షిగా స్వీకరించిన (గృహస్తాశ్రమ ధర్మంలో) భర్తవలన జన్మించినవాడు.
 • 2. పవిత్రుడు: గృహస్తుకు పుత్రులు లేనప్పుడు కేవలం స్త్రీలు(ఆడ సంతానం)మాత్రమే కలిగి ఉన్నప్పుడు, మొదటి కుమార్తెకు పుట్టిన మొదటి కుమారుడు. (గృహస్తు కన్యాదానము చేసిన మొదటి కుమార్తెకు)
 • 3. క్షేత్రకుడు: గృహస్తుకు ఏకారణము చేతనైనా సంతాన వంతుడు కాలేక పోయినప్పుడు, అగ్ని సాక్షిగా స్వీకరించిన భర్త అనుజ్ఞు ఆదేశము మేరకు మునుల యొక్క ఆహ్వానము మేర సమాజోద్దరణకు జన్మించినవాడు. 
 • 4. గోళకుడు: ఏ కారణము చేతనైనా ఒక స్త్రీ వైధవ్యమును పొంది, మరలా వివాహమాడి నటువంటి స్త్రీలకు జన్మించినవాడు. (వితంతు సంతానము)
 • 5. కుంభకుడు : ఉపగ్రస్తకు జన్మించినవాడు.
 • 6. మహోధుడు: వివాహము నాటికే స్త్రీ గర్భము దాల్చియుండి, వివాహానంతరము జన్మించినవాడు.
 • 7. కాణ్వికుడు: వివాహ పూర్వము కన్నెగా ఉన్నప్పుడు పుట్టినవాడు.
 • 8. క్రీపుడు: గృహస్తు అర్థము( ధనము) నిచ్చి కొనబడినవాడు.
 • 9. వనప్రాప్తుడు: గృహస్తుకు వనములలో లభించినవాడు.
 • 10. దత్తుడు: గృహస్తుకు సంతానము లేక ఇక సంతానము కలుగదని నిర్ణయించుకొన్న తర్వాత, వేరొకరి బిడ్డను వేదాభిమతముగ శాస్త్ర బద్దముగా, అగ్ని సాక్షిగా స్వీకరింప బడినవాడు.
రచన: శ్రావణీ రాజ్ 

12, నవంబర్ 2019, మంగళవారం

ఆధునిక భారతంలో ఆలయ సాంప్రదాయ వస్త్ర ధారణ నియమాలు - Hindu Temple Dress Codeఆధునిక భారతంలో ఆలయ సాంప్రదాయ వస్త్ర ధారణ నియమాలు - Hindu Temple Dress Code
ప్రపంచమంత నూతన తరము జీవన శైలిలో డ్రస్స్ కోడ్ను ప్రతి ఫంక్షనుకు రకరకాల హంగులతో నేటి సమాజములో
1) పార్టీ డ్రెస్ అని, 
2) మ్యారేజ్ డ్రెస్ అని ,
3) కుకింగ్ డ్రెస్ అని,
4) నైట్ డ్రెస్ అని,
5) డ్రైవింగ్ డ్రెస్ అని,
6) స్కూల్ డ్రెస్ అని,
7) ఆఫీసు డ్రెస్
అని బహు హుందాగా అమలు చేస్తున్నపుడు. టెంపుల్ డ్రెస్ ( దేవాలయ వస్త్రాలు ) అని ప్రతి దేవాలయములో మన భారతీయ పురాతన సాంప్రదాయ దుస్తులను 
1)మగవారికి ధోవతి మరియు ఉత్తరీయము,
2)ఆడవారికి చీర మరియు జాకిట్టు,
3)మగ చిన్న పిల్లలకు ధోవతి, ఉత్తరీయం మరియు ఆడ చిన్న పిల్లలకు పట్టు లంగా, జాకిట్టు, ఓణీ కట్టుకోవటం తప్పనిసరి చేయవలెను.

కచ్చితమైన నిభందనలు:
మన హిందూ సాంప్రదాయ దుస్తులు తొడుక్కోకుండా భక్తులు ఆలయానికి వస్తే యిక దేవాలయములో అడుగు పెట్టకుండా నిషేదించాలి. అలాగే భారత దేశం నలుమూలల దేవాలయాల సిబ్బంది కూడా అటెండరు,స్వీపరు దగ్గరి నుండి ఆఫిసుర్ దాక ఆడ మరియు మగ ప్రతి వారు ఆఫీసులో మరియు దేవాలయా ప్రాంగణములో కూడా హిందూ సాంప్రదాయ దుస్తులు ధరించే ఆజ్ఞలు జారి చేయాలనీ మన పూర్వీకుల సనాతన సంప్రదాయాల్ని యావత్ ప్రపంచానికి తెలియ జేయాలని కోరుతున్నాను.

మన దేశ సంప్రదాయాల్ని గౌరవించే ప్రచాత్య దేశ భక్తులు కూడా మన కట్టు,బొట్టు తప్పకుండ పాటించి మన దేవాలయాల్లో దర్శనం భవిష్యత్తులో చేసుకుంట్టారు.

సర్వేజన సుఖినోభవంతు.
సర్వ మంగలనిభావంతుసర్వేజన సుఖినోభవంతు సంమగాలని భవంతు.

అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి 

30, ఆగస్టు 2019, శుక్రవారం

దేవాలయాల్లో కట్టు,బొట్టు కట్టుబాట్ల సంప్రదాయం తక్షణ అవసరం - Devalaya Dress Code


ప్రపంచమంత నూతన తరము జీవన శైలిలో డ్రస్స్ కోడ్ను ప్రతి ఫంక్షనుకు రకరకాల హంగులతో నేటి సమాజములో:
 • 1) పార్టీ డ్రెస్ అని, 
 • 2) మ్యారేజ్ డ్రెస్ అని ,
 • 3) కుకింగ్ డ్రెస్ అని,
 • 4) నైట్ డ్రెస్ అని,
 • 5) డ్రైవింగ్ డ్రెస్ అని,
 • 6) స్కూల్ డ్రెస్ అని,
 • 7) ఆఫీసు డ్రెస్ అని బహు హుందాగా అమలు చేస్తున్నపుడు.
టెంపుల్ డ్రెస్ అని ప్రతి దేవాలయములో మన భారతీయ పురాతన సాంప్రదాయ దుస్తులను1)మగవారికి ధోవతి మరియు ఉత్తరీయము,2)ఆడవారికి చీర మరియు జాకిట్టు,3)మగ చిన్న పిల్లలకు ధోవతి,ఉత్తరీయం మరియు ఆడ చిన్న పిల్లలకు పట్టు లంగా,జాకిట్టు,ఓణీ కట్టుకోవటం తప్పనిసరి చేయవలెను.మన హిందూ సాంప్రదాయ దుస్తులు తొడుక్కోకుండా భక్తులు ఆలయానికి వస్తే యిక దేవాలయములో అడుగు పెట్టకుండా నిషేదించాలి.
టెంపుల్ డ్రెస్
టెంపుల్ డ్రెస్ 
అలాగే భారత దేశం నలుమూలల దేవాలయాల సిబ్బంది కూడా అటెండరు,స్వీపరు దగ్గరి నుండి ఆఫిసుర్ దాక ఆడ మరియు మగ ప్రతి వారు ఆఫీసులో మరియు దేవాలయా ప్రాంగణములో కూడా హిందూ సాంప్రదాయ దుస్తులు ధరించే ఆజ్ఞలు జారి చేయాలనీ మన పూర్వీకుల సనాతన సంప్రదాయాల్ని యావత్ ప్రపంచానికి తెలియ జేయాలని కోరుతున్నాను.మన దేశ సంప్రదాయాల్ని గౌరవించే ప్రచాత్య దేశ భక్తులు కూడా మన కట్టు,బొట్టు తప్పకుండ పాటించి మన దేవాలయాల్లో దర్శనం భవిష్యత్తులో చేసుకుంట్టారు.

ఓం
సర్వేజన సుఖినోభవంతు సంమగాలని భవంతు.

రచన: H.V.S.R.C. SHARMA C.ENGR.(RTD)

9, సెప్టెంబర్ 2018, ఆదివారం

ఎంతటి వారైనా... అమ్మకు కొడుకే - Yenta Varalaina Amma ku Koduke

ఎంతటి వారైనా... అమ్మకు కొడుకే - Yenta Varalaina Amma ku Koduke
అమ్మ ప్రత్యక్ష దైవం. జగద్గురువైన ఆదిశంకరులు సైతం అమ్మ మాటకు కట్టుబడి ఉన్నారు. తల్లి అవసాన దశలో తప్పక వస్తానని మాటిచ్చిన శంకరులు.. యతిగా ఉన్నా.. ఆర్యాంబకు అంత్యేష్ఠి సంస్కారాలు నిర్వహించారు. ఆధునిక భారతంలో పరమయోగిగా భాసిల్లిన రమణ మహర్షి సైతం అమ్మ దగ్గరకు వచ్చేసరికి మామూలు మనిషైపోయారు.

ఐహిక విషయాలను విసర్జించి రమణులు కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి.. అరుణాచలం వచ్చేశారు. రమణుల జాడ తెలిసిన బాబాయి నెల్లియప్ప అయ్యర్‌ అరుణాచలం వచ్చారు. ఇంటికి రావాలని కోరగా.. స్వామి స్పందించలేదు. ఇదే విషయాన్ని నెల్లియప్ప.. రమణుల తల్లి అళగమ్మకు తెలియజేశారు. కొడుకుపై అవ్యాజమైన ప్రేమ కలిగిన ఆ మాతృమూర్తి.. నిమిషం నిలువక అరుణాచలం చేరుకుంది. తనతో పాటు ఇంటికి రావాల్సిందిగా రమణులను కోరింది. అప్పుడూ స్వామి మౌనాన్ని ఆశ్రయించారు. తల్లికి ఒక కాగితంపై.. ‘కర్త వారి ప్రారబ్ధానుసారం జీవులను ఆడించును. జరగనిది ఎవరెంత ప్రయత్నించినా జరగదు. జరిగేది ఎవరెంత అడ్డుపెట్టినా జరగక మానదు. ఇది సత్యం. కనుక మౌనంగా ఉండటమే ఉత్తమం’ అని రాసిచ్చారు. ఆ సమాధానం చదివి బరువెక్కిన గుండెతో ఆ తల్లి వెనుదిరిగింది.

ఆ తర్వాత చాలాసార్లు రమణుల దగ్గరికి ఆ తల్లి వస్తూ, పోతూ ఉండేది. ఓసారి అళగమ్మకు తీవ్రమైన జ్వరం వచ్చింది. తల్లికి రమణులు ఎన్నో సపర్యలు చేశారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మనామదురైకి తిరిగి వెళ్లారు. 1916లో తిరువణ్ణామలై వచ్చిన ఆమె.. రమణుల వద్దనే స్థిరపడాలని నిశ్చయించారు. తర్వాత నాలుగేళ్లకు అళగమ్మ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. రమణులు కంటి మీద కునుకు లేకుండా తల్లికి సేవలు చేస్తూ గడిపారు. స్వామి ఆజ్ఞ చేస్తే చాలు.. ఆ తల్లికి సేవ చేయడానికి ఎందరో సిద్ధంగా ఉన్నారు. అయినా.. తల్లికి రమణులే సపర్యలు చేశారు. అమ్మకు వేదాంత సారాన్ని బోధిస్తూ ఉండేవారు. చివరగా.. రమణుల కుడిచేతిని ఆమె హృదయంపైన.. ఎడమచేతిని శిరస్సుపైన ఉంచి.. తదేక దృష్టితో తల్లిని వీక్షిస్తూ.. ముక్తిని ప్రసాదించారు. ఏ స్థాయి వ్యక్తులైనా.. తల్లికి కొడుకులేనని.. తల్లికి సేవ చేయడం కొడుకుల బాధ్యత అని జగతికి చాటారు రమణులు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

24, ఏప్రిల్ 2018, మంగళవారం

మంగళ సూత్రం - అర్ధం పరమార్ధం - Mangala sutram Meaning !

మంగళ సూత్రం - అర్ధం పరమార్ధం - Mangala sutram Meaning !
భార్య మంగళ సూత్రo లో పిన్నీసులున్నాయా.. ఒకసారి ఇది చూడండి దానివల్ల కలుగు….

మీ ఇంటికి… ఇల్లాలికి శుభం జ‌ర‌గాలంటే… కొన్ని నిమాలను పాటించాలి. భర్త అనురాగం పెరగటానికి… సంతాన భాగ్యానికి… సిరిసంపదలు పొందటానికి… వ్యాధులు రాకుండా ఉండటానికి ఈ నియమాలు పాటించి చూడండి.
మంగళ సూత్రం - అర్ధం పరమార్ధం - Mangala sutram Meaning !
 • మంగళ సూత్రంలో పిన్నీసులు ఉంచరాదు. అలానే కొన్నిసార్లు హెయిర్ పిన్నులను కూడా తాత్కాలికంగానైనా స్త్రీలు మంగళ సూత్రానికి ఉంచుతుంటారు. మంగళ సూత్రం వేద మంత్రాల సహితంగా ప్రభావితం కాబడిన భర్త ఆయువుపట్టు. మంగళ సూత్రం రూపంలో హృదయం వద్ద చేరి ఉంది. ఇనుప వస్తువులు [పిన్నీసులు, ఇనుముతో చేసినవి] దివ్య శక్తులను ఆకర్షించుకొను గుణం ఉన్నాయి. అవి మంగళ సూత్రంలో దివ్య శక్తులను ఆకర్షించి భర్తను శక్తి హీనుడిని చేస్తాయి. భర్తకు అనారోగ్యం, భార్యాభర్తల పట్ల అనురాగం తగ్గటం ఇలాంటి దుష్ఫలితాలొస్తాయి. ఈ అలవాటు ఉంటే వెంటనే సరి చేసుకోవాలి.
 • స్త్రీలు ధరించే గాజులు మట్టి గాజులై ఉంటే చాలా మంచిది. ఈ గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక, వీటి శబ్దం శుభాలను, అనురాగాలను పెంచుతుంది.
 • ఇంట్లో గుర్రం బొమ్మలు ఉంచ‌డం అంత క్షేమం కాదని, డబ్బు విపరీతంగా ఖర్చవుతుందని చాలా మంది నమ్మకం.
 • సంపదలను, ఎక్కువగా ప్రదర్శించ‌డం వల్ల నరఘోష ఏర్పడుతుంది. తద్వారా చెడు జరుగుతుంది. అలంకారాదులు సాధారణంగా ఉండేలా చూసుకోవటం,
 • సాధారణ జీవిత విధానాన్ని పాటించటం ఇలా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు.
 • ఆడపడుచులు, అత్తమామలతో విభేదాలు ఎక్కువైతే, వారు మిమ్మలను ఇబ్బందులు పెడుతుంటే వారు పడుకునే దిండు కింద తులసి వేరు ఉంచండి వారు మిమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటారు. విరోధాలు తగ్గిపోతాయి.
 • వంట చేసేప్పుడు రెండు బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్పించండి… వంటకాలు ఎంతో రుచిగాను, ఆరోగ్యకరంగాను ఉంటాయి.
 • భర్త తాగి వచ్చి హింస పెడుతుంటే ఉదయం పూట టిఫిన్ చేసిన తరువాత ఒక చిన్న స్పూన్ అంటే సుమారు అర గ్రాము కరక్కాయ పౌడరును ఆరు చెంచాల నీటిలో కలిపి తాగించండి. ఇలా అరవై రోజులు చేస్తే…. వాళ్లకు తాగుడుపై విరక్తి కలుగుతుంది. కరక్కాయ పొడి ఆరోగ్యానికి చాలామంచిది. మొదట దీనిని తాగనని మారాం చేస్తారు. కొద్దిగా బతిమాలి తాగించటం అలవాటు చేయండి ఈ ఔషధాన్ని. తాగుడు ఖాయంగా మానుతారని పలువురు అనుభవపూర్వకంగా చెబుతున్నారు.
 • సుఖ సంతోషాలు కరువైనవారు పసుపు రంగు పూలు ధరించండి, క్రమేపీ స్థితి మెరుగవుతుంది.
 • అప్పుల బాధ ఎక్కువగా వుంటే తెలుపు పూలు ధరించటం వల్ల రుణ బాధలు తగ్గుతాయి.
 • ఆరోగ్యం సరిగా లేని వారు, శరీరం నొప్పులు వున్నవారు మరువం, మందారాలు కలిపి ధరించండి. ఇరవై రోజులలో ఫలితం కనిపిస్తుంది.
 • పెళ్ళి చూపులప్పుడు ఎరుపు పూలు, పసుపు పూలు కలిపి మాలకట్టి ధ‌రించండి వివాహం విషయంలో కన్యలకు ఎంతో శుభకరంగా ఫలితాలొస్తాయి .
 • మంచి తీర్థంలో రెండు తులసి దళాలు వేస్తే అవి మానస సరోవర జలాలంత పవిత్రమవుతాయి.
  మంగళ సూత్రం - అర్ధం పరమార్ధం - Mangala sutram Meaning !
 • కూర్చునే పీఠానికి శుభ్రం చేసి నాలుగు మూలలా బొట్లు పెట్టి కూర్చోవాలి. చాపైతే విభూది బొట్లు గుడ్డను ఆసనంగా వాడితే కుంకుమ బొట్లను పెట్టండి.
 • భర్త బయటకు వెళ్ళుటకు షర్ట్ వేసుకుంటుంటే, గుండీలు మీరు పెట్టండి. మీ కుడి చేతిని తాకి వెళ్లమనండి. భర్తకు ఆ రోజు సంపాదనా , విజయం సంతోషం వెంట ఉంటాయి.
 • ఆ… ఇవన్నీ మూఢ నమ్మకాలు. అలా జరుగుతుందా.. ఇలా ఎందుకు జరుగుతుందనే సోమరిపోతు వాదనలు చేసేవారిని వదిలేయండి. ప్రపంచవ్యాప్తంగా నమ్మకాలు అనుభవాలను బట్టే కలుగుతాయి. వీటిని పాటించటానికి మీకు ఖర్చేమీ కాదు కదా? కొంచెం శ్రద్ధ కావాలి అంతే.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

8, ఏప్రిల్ 2018, ఆదివారం

స్త్రీ రజస్వల అగుట - శుభ మరియు అశుభ ఫలితములు? - Stri Rajaswalaguta

/stri-rajaswala-ante-ardham-girl-becoem-Menarche
 రజస్వల..!!🍁

రజోదర్శనము అనగా స్త్రీ రజస్వల అగుట. ప్రధమ రజోదర్శనమునకు వాడుకలో సమర్థ, పుష్పవతి, పెద్దమనిషి అయినదని కూడా అంటారు. నెల నెల రజోదర్శనమును బహిష్టు అంటారు.

ప్రధమ రజస్వల ప్రాతః కాలము నుంచి మధ్యాహ్నము లోపు అయిన శుభము. మిగిలిన కాలము అశుభము.

రజస్వలకు దుష్ట తిధులు:
 • అమావాస్య,
 • ఉభయ పాడ్యమిలు,
 • షష్టి,
 • అష్టమి,
 • ద్వాదశి తిదుల యందును
 • పరిఘ యోగముల పూర్వార్ధమునందును,
 • వ్యతీపాత,
 • వైధృతి యోగములందును,
 • సంధ్యా కాలమునందును,
 • ఉప్పెన, భూకంప మొదలైన ఉపద్రవ కాలమందును
 • భద్ర కరణము నందును
 • మొదటిసారి రజస్వల అయిన శుభకరము కాదు.
/stri-rajaswala-ante-ardham-girl-becoem-Menarche
వారఫలము:.
సోమ, బుధ, గురు, శుక్ర వారములందు ప్రధమ రజస్వల అయిన శుభ ఫలము, ఆది, మంగళ, శని వారములందు అశుభ ఫలము కలుగుతుంది.

శుభ నక్షత్రములు: ✶
 1. అశ్విని,
 2. రోహిణి, 
 3. మృగశిర, 
 4. పుష్యమి, 
 5. ఉత్తర, 
 6. హస్త, 
 7. చిత్త, 
 8. స్వాతి, 
 9. విశాఖ, 
 10. అనూరాధ, 
 11. మూల, 
 12. ఉత్తరాషాఢ ,
 13. శ్రవణం, 
 14. ధనిష్ఠ, 
 15. శతభిషం, 
 16. ఉత్తరాభాద్ర, 
 17. రేవతి 
యీ నక్షత్రములందు ప్రధమ రజస్వల అయిన సౌభాగ్యము, సౌఖ్యము, సంతానము, ఆయువు, ధనము కలుగుతుంది.

మిగిలిన నక్షత్రములు అశుభ ఫలములు ఇచ్చును. కావున శాంతి చేయాలి. రజస్వల కాకుండానే వివాహాలు జరిపించే పూర్వపు రోజుల ప్రకారము భర్త యొక్క జన్మ నక్షత్రము నాడు హాని అని చెప్పబడినది.

దుష్ట నక్షత్రములందు ప్రధమముగా రజస్వల అయినపుడు హోమయుక్తమైన శాంతి జరిపించి దానాదులు నిర్వహించి తిరిగి షుహ నక్షత్రములో రజోదర్శనమైన తదుపరి శుభ ముహూర్త కాలమందు గర్భాదానము చేయాలి. ఆ విధంగా చేసిన యెడల సంతాన ప్రాప్తి కలుగుతుంది మరియు..
గ్రహణ సమయములందు,
సంక్రాంతి యందు,
అశుభమైన నిద్రా సమయములందు,
అర్ధరాత్రి యందు
ప్రధమ రజస్వల అయినచో యుక్తమైన శాంతులు నిర్వహించాలి.

శుభ తిధులు: 
తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిధులు శుభము.

లగ్న గ్రహ ఫలము:
ప్రదమ రజోదర్శన సమయమున..
కేంద్ర, కోణ, లాభ స్థానములందు శుభ గ్రహములు, తృతీయ, షష్ట లాభ స్థానములందు క్రూర గ్రహములు శుభ ఫలములిస్తాయి.
చంద్రుడు అష్టమ స్థానమునందు వుండిన పతి నాశనము కలుగజేస్తాడు. కాని చంద్ర తారాబలములు సంపన్నమైనపుదు పుత్ర, ధన సంపత్తులు కలుగుతాయి. కుజుడైనను లేక చంద్రుడైనను లగ్నమునకు 3, 6, 10 స్తానములన్డున్నచో సంపంన్నులగు కుమారులు కలుగుతారు.

నక్షత్ర గ్రహ ఫలము:
రజస్వలా సమయ నక్షత్రమందు గురుడుగాని, శనిగాని వున్నాను, యే గ్రహము లేకున్నను శుభము. రజస్వలా సమయ నక్షత్రము నందు కుజుడున్నను బుధ శుక్రులు కలిసి వున్నను, రవి వున్నను రాహు కేతువులున్నను అశుభము.

రజోదర్శన స్థాన ఫలితము:
తన యింటి యందును,
గొడ్డల చావిడియందును,
స్వగ్రామ మధ్యమందు,
జల సమీపమున,
ఇంటి ఆవరణ మధ్య..
ప్రధమ రజస్వల అయిన శుభము. గ్రామము బయట, ఇతర గ్రామములందు, నగ్నముగా వున్నపుడు ఇతరుల యిండ్లలోను ప్రదమ రజస్వల అయిన అశుభము.

వేళా విశేషములు:
 • ప్రాతః కాలం..చిర సౌభాగ్యం,
 • ఉషః కాలం..సౌభాగ్యలోపం,
 • పూర్వాహ్నం..పుణ్య క్షేత్ర దర్శనం,
 • మధ్యాహ్నం..ధనవతి, పుత్రవతి,
 • సాయంత్రం..జారగుణం,
 • సంధ్యలందు..చెడుప్రవర్తన కలది,
 • అర్ధరాత్రి..బాల వైధవ్యం కలుగును.
రాత్రి వేళ నిర్ణయం:
రాత్రి రజస్వల అయినచో రాత్రిని మూడు భాగాలుగా చేసి రెండు భాగముల కాలము పూర్వదినము, మూడవ భాగకాలమున తదుపరి దినమునకు చెందుతుంది.

వస్త్రఫలము:
 • తెల్లబట్ట కట్టుకొని రజస్వల అయిన సౌభాగ్యవతి,
 • గట్టి బట్ట కట్టుకొని రజస్వల అయిన పతివ్రతయు, దుకూల వస్త్ర దారియైన పట్టపురాణి యగును,
 • నూతన వస్త్రము ధరించగానే శుభ సంపన్నురాలగును, చిరిగిన బట్ట కట్టుకొనిన దౌర్భాగ్య రాలగును,
 • యెర్రని బట్టకట్టుకోనిన వ్యాధి గ్రస్తురాలగును,
 • నల్లని వస్త్రము ధరించినదైన దరిద్రురాలగును.
రజస్వలా శుద్ధి:
రజోవతి అయిన స్త్రీ..
మొదటి దినమునందు చండాల స్త్రీ సమానురాలు, రెండవ దినమందు పతితురాలితో సమానురాలు, మూడవ దినమునందు చాకలి స్త్రీతో సమానము, నాలుగవ దినమున కూడా శూద్ర స్త్రీ సమానురాలు, అయిదవ దినమందు దేవ పితృ కార్యములందు పరిశుద్దురాలూ అన్నారు.

నాలుగవ దినమందు స్నాముచేత శుచి కాగలదు. బహిష్టు అయిన స్త్రీ మూడు రోజుల తరువాత శుద్ధి అవుతుంది. తిరిగి మళ్ళీ పంతొమ్మిది రోజులలో బహిష్టు అయిన ఒక దినముతో శుద్ధి అట్లుగాక ఇరవై రోజుల అనంతరము ఎప్పుడైనా బహిష్టు అయిన మూడు రోజుల తరువాత శుద్ధి అగును.

ప్రధమ రజస్వల అయిన కన్యకు అక్షతలు తలపై వేసి ఆసనమేసి కూర్చుండ బెట్టాలి. దీపమున్న గదిలోనే కన్యను ఉంచాలి. సువాసినులకు శ్రీ గంధము, పుష్పములను,తాంబూలములను లవణము, పెసలు మొదలగునవి ఇవ్వాలి.

ప్రధమ రజస్వల అయిన వస్త్రముతోనే మూడు రోజులు ఉంచాలి. ఎవరిని తాకకుండా జాగ్రత్త గా, ప్రశాంతముగా, ఉండునట్లు చూడాలి. భోజన విషయంలో పులగము, నెయ్యి, పాలు వంటి సాత్విక ఆహారము ఉప్పు, పులుపు, కారము లేకుండా ఇచ్చుట మంచిది, నాలుగవ రోజు స్నానము చేయించి నూతన వస్త్రములు కట్టించాలి.

సర్వ ఋతువులకు సాధారణ నియమములు:.💐
మూడు దినములు ఎవరిని తాకకూడదు. అభ్యంగనము, కాటుక, స్నానము, పగలు నిద్రించుట , అగ్ని ముట్టుట, ప్రాసనము, సూర్యావలోకనము, భూమిపై గీతాలు గీయుట చేయుట చేయకూడదు. క్రింద పడుకోవాలి, ఆవుపాలు, పెరుగు, మజ్జిగ, తాంబూలము, గంధమాల్యములు ఉపయోగించరాదు. ఇవన్నీ ఆరోగ్యము కొరకు పాటించే నియమములు..

సర్వే జనా సుఖినో భవంతు..!!


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


10, జనవరి 2018, బుధవారం

హిందూ వివాహ వేడుక, అర్ధం, పరమార్ధం - Hindu wedding ceremony, meaning, connotation

హిందూ వివాహం
మలయపుగాలి రేలు వనమాలి విమానపతాక ఘల్లుమం
చులియ బసిండి మువ్వగమి నొక్కొకమాటు గదల్ప, నుల్కి మి
న్నలము తదీయ హేమవరణాంచల చంపకశాఖలందు బ
క్షులు రొదసేయ, వేగెనని కూడుదురల్కలు దీఱి దంపతుల్!!
ఆముక్తమాల్యద పై ప్రసంగాలలో. ఈ పద్యంలో రాత్రిపూట వీచే మలయపు గాలి, అంటే దక్షిణపు గాలిని వర్ణించాడు రాయలు. ఇది మెల్లిగా వీచి, మన్నారుస్వామి దేవాలయం ముందున్న విమానపతాకని (ధ్వజస్తంభానికి ఉన్న జెండా) తాకింది. ఆ తాకిడికి దానికి కట్టిన బంగారు మువ్వలు కదిలి ఘల్లుఘల్లు అన్న శబ్దం వచ్చింది. పక్కనే ఉన్న సంపెంగ చెట్ట్ల కొమ్మల గూళ్ళల్లో పడుకొని ఉన్న పక్షులు, ఆ శబ్దానికి ఉలికిపడి లేచి రొద చెయ్యడం మొదలుపెట్టాయి. పక్షులు చేసే ఆ కిలకిలలకు ఊళ్ళో పడుకొని ఉన్న దంపతులు అప్పుడే తెల్లవారిపోతోంది అనుకున్నారు. తెల్లవారుఝామునే కదా పక్షులు నిద్రలేచి గూళ్ళను విడిచి బయలుదేరతాయి! ఇంతకీ దంపతులేమో ఎందుకో చిన్న ప్రణయకలహం వచ్చి, అలకలతో విడిగా పడుకొని ఉన్నారు. ఈ పిట్టల రొదకి తెల్లవారిపోతోందనుకొని, తెల్లవారితే ఎవరికి వాళ్ళు తమతమ పనుల్లో మునిగిపోయి దూరమవుతారన్న సంగతి గుర్తుకువచ్చి, ఇప్పుడున్న సమయాన్ని హాయిగా గడపాలన్న దృష్టివచ్చి, ఇద్దరూ దగ్గరయ్యారట! అదీ పద్యం! ఇందులో మధురమైన శృంగారం ఉంది. భార్యాభర్తలు ప్రణయకలహంతో దూరమైతే వాళ్ళని ఒక తెమ్మెర ఎలా దగ్గరకు చేసిందో ఆ వర్ణన ఉంది. అయితే దానికి ముఖ్యంగా తోడ్పడింది ఎవరంటే స్వామివారి ఆలయ ధ్వజస్తంభం మీద ఉన్న చిరుగంటలు! అది ఇందులో గొప్పదనం. భారతీయ సంస్కృతిలో శృంగారానికి ఎంత పవిత్రత ఉందో ప్రాధాన్యం ఉందో ఈ పద్యం చెపుతుంది. స్వామివారి చిరుగంటల మ్రోత భక్తికీ మోక్షానికి ప్రతీక. దానికే ఎక్కువ ప్రాధాన్యం. అందుకే దాని వర్ణన పద్యంలో రెండు పాదాలకు పైగా ఆక్రమించుకొంది. దాన్ని అనుసరించే దంపతుల కలయిక శృంగారరస వ్యంజకం. భక్తి శృంగారాలు ఇలా ముడిపడ్డాయి!

వివాహ శుభకార్యంలో జీలకర్ర, బెల్లం పెట్టే వేళ, మాంగల్యధారణ వేళ, వధూవరులపై ఆహుతులు అక్షతలు చల్లి ఆశీర్వదించడం మన హిందూ సంప్రదాయం. వివాహ శుభకార్యాల్లోనే కాదు, ప్రతి శుభకార్యంలోనూ పెద్దలు, పిన్నలకు అక్షతలు వేసి ‘దీర్ఘాయుష్మాన్‌ భవ, చిరంజీవి భవ, సంతాన ప్రాప్తిరస్తు, ఆరోగ్య ప్రాప్తిరస్తు, సుఖజీవన ప్రాప్తిరస్తు’ అంటూ ఆశీర్వదిస్తారు. ఇక దైవసన్నిధిలో సరే సరి, పూజారైతే మంత్రాక్షతలతో అందరినీ దీవిస్తారు.
‘అక్షతలు’ అనే మాట నుంచి వచ్చిందే ‘అక్షింతలు’.క్షతం కానివి అక్షతలు. అంటే రోకలి పోటుకు విరగని, శ్రేష్ఠమైన బియ్యం అన్నమాట. అలాంటి బియ్యాన్ని పసుపు లేక కుంకుమతో, నేతితో కలిపి అక్షతలు తయారు చేస్తారు. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దానవస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతి కరమైన దానవస్తువు బియ్యం. జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధినాయకుడు.
మనిషి మనసు, బుద్ధి, గుణము, తల్లి, వ్యసనము ఇత్యాదులన్నీ చంద్ర కారకాలే అని అన్నారు పెద్దలు. అందుకే మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కు వగా ఉంటుంది. ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మన స్సుపై ప్రభావం చూపుతుంది. మనోధర్మాన్ని నియంత్రిస్తాయి.
శాస్ర్తీయంగా చూస్తే, మనిషి దేహం ఓ విద్యుత్‌ కేంద్రం. విద్యుత్‌ సరఫరాల్లో హెచ్చుతగ్గులు సాధారణం. ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. మనుషుల్లో తమో, రజో, సాత్త్యికాలనే త్రిగుణాలకూ కారకము.

పెద్దలు వధూవరులపై అక్షతలు చల్లి ఆశీర్వదించే సమయంలో, దేహం లోని విద్యుత్తులో కొంత బాగం ఈ అక్షతలను తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ల నుంచి, పుచ్చుకొనే వాళ్ల కొంత విద్యుత్‌ బదిలీ అవుతుంది. ఈ కారణంగా అక్షతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిన్నలకు లభిస్తుందనేది మన నమ్మకం. పెద్దలు, విద్వాంసులు, గురువులు, తల్లి దండ్రులు, అత్తమామలు వివాహ సమయంలో, శుభకార్యాలలో మనకు అక్షతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం, పర మార్థం ఇదే!

మరో సిద్ధాంతం ప్రకారం చూస్తే మనిషి దేహంలో విద్యుత్‌ కేంద్రాలు ఇరవై నాలుగు ఉంటాయట. వాటిలో ప్రధానమైనది శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు. విద్యుత్‌ ప్రసార కేంద్రం కూడా. తలపై అక్షింతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్‌ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుం ది శిరస్సు.అది సరే కాని! అక్షతలుగా ఉపయోగించే బియ్యానికి పసుపు కుంకుమలు కలపడం ఎందుకు? ఆయుర్వేదం ప్రకారం, చర్మ సంబంధ రోగాల్ని అడ్డుకునే శక్తి పసుపుకు ఉంది. పసుపు నుంచి తయారయ్యే కుంకుమకూ ఈ శక్తి ఉంది. అక్షతలు వేసే వారికి ఎలాంటి రోగ సమస్యలున్నా, పుచ్చు కొనే వాళ్ళకి అవి సోకకుండా ఈ పసుపు కుంకుమలు నివారిస్తాయట. అంతేకాక పసుపు కుంకుమలు శుభానికి సంకేతాలు కూడా. ఆధ్యాత్మి కంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యం.

హిందూ వివాహ వేడుక, అర్ధం, పరమార్ధం - Hindu wedding ceremony, meaning, connotation
భగవద్గీత
భగవద్గీతలో
‘అన్నాద్భవన్తి భూతాని’ అని మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. జీవులు అన్నం చేత పుడతారట. ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరిం చడం అంటే, జీవుడు ఈ అన్నంలో పుట్టీ, తిరగి ఈ జీవుడిని భగవంతుడి లోకి చేర్చడమే. అక్షతలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది.
తెలుగులో ఈ అక్షతలని తలంబ్రాలు లేదా తలబ్రాలు అని కూడా అంటారు.
తలను = తల యందు పోయబడే, ప్రాలు = బియ్యం అని అర్థం.

పూర్వం వధువు ధాన్యలక్ష్మిగా చెప్పబడింది. ఈ తలంబ్రాల కార్యక్రమంలో బియ్యానికి ఒక ప్రత్యేకత ఉంది. ‘ఓ వధువా! నీవు మా ఇంటికి వచ్చాక, మన ఇంట ధాన్యం ఇలా కుప్పతెప్పలుగా విరివిగా ఉండి, మన జీవనానికి’ ఆధారభూతమైన ధాన్యంతో మనం నిత్య సంపదల వాళ్ళమై తులతూగు తూ ఉండాలి’ అనే భావానికి అనుగుణంగా ఈ తలంబ్రాల కార్యక్రమం సాగుతుంది. వరుడు, వధువు శిరస్సులపై తలంబ్రాలు పోసుకొనే దానికి ముందు, వరు డు ముందుగా వధువు చేతిని దర్భతో తుడిచి, దోసిలిలో రెండు మార్లుగా బియ్యాన్ని వేసి, ఆ మీదట పాలని కొద్దిగా చల్లి తలంబ్రాలకి సిద్ధం చేస్తాడు. తలంబ్రాలు వేసాక వధువు ఇలా చెయ్యాలని ఒక పద్ధతి చెప్తుంది. ఈ కాలంలో పురోహితులే చేయించి పోయిస్తున్నారు.
‘ఈ కన్య వంశాన్ని తరింపజేయుగాక పుణ్యం వృద్ధి చెందుగాక. శాంతి, పుష్టి, సంతోషం, అభివృద్ధి, విఘ్నాలు లేకపోవడం, ఆయురారోగ్యాలు అన్నీ వీరికి కల్గుగాక!’ అని చదువుతూ అక్షతారోపణం (తలంబ్రాలు పోయించడం) చేయిస్తారు. ఈ చేసిన వివాహకర్మ మొత్తం అక్షతము (నాశనము లేనిది) అగుగాక! అని దీని భావం.

అక్షతలలో, తలంబ్రాలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది. మన పూర్వీకులు ఈ వివాహ శుభకార్యాలలో, ఇతర శుభకార్యాలలో ఏర్పాటు చేసిన సంప్రదాయాల్లో, ఆచారాల్లో ఇంత గూఢార్థం ఉంది. వివాహ సమయంలో నవదంపతులు కలిసి జీవించి ఉండాలనీ, ఆదర్శ దంపతు లుగా మెలగాలనీ, వధూవరులపై ఆహుతులు అక్షంతలు చల్లి ఆశీర్వదిం చడమే అక్షతల కార్యక్రమంలోని అర్థం, పరమార్థం. దాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా మెలగాలి.

క్రింద నివ్వబడిన సమాచారము విశ్వ ధర్మ పరిషత్ వారు ప్రచురించిన 'పాణిగ్రహణము' అను పుస్తకము నుండి సేకరించబడినది.

హిందూ ధర్మం:

సంస్కృతి - హిందూ వివాహం
మన ధర్మం సనాతనము, సార్వ దేశికము, సార్వ కాలికము, సార్వ జనీనము, మహిమాన్వితము, సర్వోత్తమము, ఆచరణలో నిగ్గు తేలినది. ఈనాటికీ మనదేశం సంస్కృతి,ధర్మం, ఆధ్యాత్మికత, నీతి మొదలగు విషయాలలో ప్రపంచానికి గురు స్థానం లోనే ఉన్నది. శాంతి, సౌభ్రాతృత్వముల కొరకు ప్రపంచం భారత దేశం వైపు చూస్తున్నది. విజ్ఞానంలో కూడా గొప్పదే. అనేక మంది విదేశీయులు మన ప్రాచీన విశ్వ విద్యాలయాలలో శిక్షణ పొందారు. కానీ నేటి మన స్థితి ఏమిటి ? పరాయి పాలనలో మన జాతి ఆత్మ విస్మృతి చెందినaది. తన గొప్పతనాన్ని, తన వారసత్వాన్ని మరచి పోయింది. పరాయి వాళ్లు రాసిన రాతలను నమ్మి తన అస్థిత్వాన్నే కోల్పోవు చున్నది. మన ఆచారాలు మూఢాచారాలని, మనవి గుడ్డి నమ్మకాలనీ, మనము అనాగరికులమనీ విదేశీయులు మనకు అన్నీ నేర్పారని పాఠ్య పుస్తకాలలో రాసి మన పిల్లల చేత చదివించుచున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా మనలో చైతన్యం కనిపించుట లేదు.
విదేశీయులు మన ఆచారాలను అధ్యయనం చేసి వాటి లోని గొప్పదనాన్ని వారు మనకు చెపితే గాని నమ్మలేని స్థితిలో ఉన్నాము. వారు చెపితే అది మనకు వేదం. ఆత్మవిస్మృతి లో నున్న జాతిని జాగృతం చేయాలి. ఆత్మ ప్రబోధం కలిగించాలి. మన ఆచారాలలోని అంతరార్ధాన్ని తెలియజేయాలి. 
మనం పెళ్ళిళ్లు చేస్తున్నాం ఆడంబరంగా. డబ్బు ఖర్చు పెడుతున్నాం విరివిగా. అప్పుల పాలవుతున్నాం తరచుగా. కట్నాలు, మర్యాదలు, లాంఛనాలు కావాలంటున్నాం అధికంగా. వాటి కొరకు అలకలు, తగాదాలు, వేధింపులు చూస్తున్నాం ఎక్కువగా. ఎందుకీ మంత్రాలు ? ఏమిటి వీటి అర్ధాలు ? అని తెలుసు కుందామనే కోరిక ఉంది తక్కువగా. ప్రయత్నం, కృషి జరగటల్లేదు బొత్తిగా. అందుకే మన ఆవేదన ఇంతగా. వివాహ మహోత్సవ ఆహ్వానం అని అందరికీ పంపుతాం. కానీ వివాహం ఉత్సవం కాదు. అది మానవుని వికాసానికి ఏర్పరచిన షోడశ సంస్కారాలలో ప్రధాన మైనదని మనకు తెలియదు.సాన పెట్టుట వలన వజ్రం ప్రకాశించి నట్లు సంస్కారాల వల్ల ఆత్మ ప్రకాశిస్తుంది. జీవితం సార్థకం, సుఖవంతం, ఆనందమయం అవుతుంది. వివాహం లోని మంత్రాల అర్థం పరమార్థం తెలియక, ఏదో విధంగా త్వరగా పూర్తి చేయండని పురోహితుని తొందర పెడుతూ ఉంటాం. దాని వల్ల మనమే నష్ట పోతామని గ్రహించం. ఫోటోలు, వీడియోలు, విందులకు ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమైన సంస్కారాన్ని విడిచిపెడుతున్నాం. ఫలితం బాగా లేదని బాధపదుతున్నాం.

మన ప్రాచీనమైన ఆచారాలలోని అంతరార్థాన్ని తెలియజెప్పి, అధునాతన శాస్త్ర విజ్ఞానంతో సమన్వయించి, వాటిని సరియైన పద్ధతిలో చక్కగా ఆచరింప జేయాలనే మా తపన.

II. వివాహ శబ్దార్ధం
శ్లో|| ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తన!వ్రతీచ్చ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా||
శ్రీమద్రామాయణంలో జనక మహారాజు అంటారు. ఓ రామచంద్రా! ఈ సీత నా కుమార్తె. నీకు సహధర్మ చారిణిగా ఈమెను అర్పించుచున్నాను. ఈమె చేతిని పట్టుకొని ఈమెను స్వీకరింపుము. నీకు శుభమగు గాక!
పరస్పర తపస్సంప త్ఫలాయిత పరస్పరౌ |
ప్రపంచ మాతాపితరౌ ప్రాంచౌ జాయావతీ స్తుమః ||
పార్వతీ పరమేశ్వరులు సనాతన దంపతులు. వారి దాంపత్యము తపస్సంపద యొక్క ఫలితము. ప్రపంచానికి తల్లితండ్రులైన ఆ దంపతులకు నమస్కారములు.

వివాహ శబ్దార్ధం:
సంస్కృతంలో 'వహ్' అనే ధాతువుకు 'వి' అనే ఉపసర్గను 'ఘఞ్' అనే ప్రత్యయాన్ని చేరిస్తే వి+వహ్+ఘఞ్ = వివాహః అనే పదం ఏర్పడింది. దీనికి అర్ధం విశేష ప్రావణం అనగా విశేషమైన (ప్రత్యేకమైన) సమర్పణం. ఈ పదానికి అనేక పర్యాయ పదాలున్నాయి. పరిణయం, ఉద్వాహం, కల్యాణం, పాణిగ్రహణం, పాణిపీడనం, పాణిబంభం, దారోప సంగ్రహణం, దార పరిగ్రాహం, దారకర్మ, దారక్రియ మొదలైనవి.

వివాహ భేదములు:
మనువు వివాహ పద్ధతులను 8గా విభజించాడు.
బ్రాహ్మోదైవ స్తధైవార్షః ప్రాజాపత్యస్తధాసురః |
గాంధర్వో రాక్షసశ్చైవ పైశాచ శ్చాష్టమోథమః ||
1. బ్రాహ్మం, 2. దైవం, 3. ఆర్షం, 4. ప్రాజాపత్యం, 5. అసురం, 6. గాంధర్వం, 7. రాక్షసం, 8. పైశాచం అని వివాహాలు ఎనిమిది రకాలు.
1. బ్రాహ్మం: అలంకరించిన కన్యను పండితుడు, శీలవంతుడు అయిన వరుని ఆహ్వానించి దానం చేస్తే బ్రాహ్మ వివాహమౌతుంది. (ఉదా: శాంతా ఋష్యశృంగుల వివాహం)
2. దైవం: యజ్ఞంలో ఋత్విక్కుగా వున్న వారికి - దక్షిణగా కన్యను ఇచ్చి వివాహం చేస్తే అది దైవ వివాహమౌతుంది.
3. ఆర్షం: వరుని నుండి గోవుల జంటను తీసుకొని కన్యను ఇవ్వటం ఆర్ష వివాహం. ఇది ఋషులలో ఎక్కువగా వుండేది గనుక ఆర్షం అయింది.
4. ప్రాజాపత్యం: వధూవరులిద్దరు కలిసి ధర్మాన్ని ఆచరించండి అని చెప్పి కన్యాదానం చేయటం ప్రాజాపత్యం అవుతుంది. (సీతారాములు)
5. అసురం: వరుని వద్ద డబ్బు తీసుకుని కన్యను యిస్తే అది అసుర వివాహం. (ఉదా: కైకేయీ దశరథులు)
6. గాంధర్వం: పరస్పరం అనురాగంతో (మంత్ర విధానం లేకుండా) చేసుకునేది గాంధర్వ వివాహం. (ఉదా: శకుంతలా దుష్యంతులు)
7. రాక్షసం: యుద్ధం చేసి, కన్యను అపహరించి, ఎక్కడికో తీసుకువెళ్ళి చేసుకొనే వివాహం రాక్షసం అంటారు. (ఉదా: మండోదరి రావణులు)
8. పైశాచం: కన్యను నిద్రావస్థలో అపహరించి చేసుకున్నది పైశాచం. వీటిలో బ్రాహ్మం శ్రేష్ఠం, ప్రాజాపత్యం ధర్మబద్ధం, రాక్షసం, పైశాచం నిషిద్దం.

వివాహమెందుకు?:
ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. దీనికి సమాధానం ప్రతివారూ తెలుసుకోవాలి. ప్రతీ మనిషీ మూడు ఋణాలతో పుడతాడు.

1. ఋషిఋణం, 2. దేవఋణం, 3. పితౄణం.
ఈ ఋణాలను తీర్చడం ప్రతి వ్యక్తి యొక్క విధి. ఈ ఋణాలు తీర్చకపోతే మరల జన్మ ఎత్తవలసి వస్తంది. మానవజన్మకు సార్థకత జన్మరాహిత్యం. కావున ప్రతివాడు ఋణ విముక్తుడు కావాలి. దానికి ఏంటి మార్గం? మన పెద్దలు చెప్పారు - "బ్రహ్మచర్యేణ ఋషిభ్యః" " యజ్ఞేన దేవేభ్యః" "ప్రజయా పితృభ్యః" అని.

 • 1. ఋషి ఋణం: బ్రహ్మచర్యం ద్వారా ఋషి ఋణం తీర్చాలి. అంటే బ్రహ్మచర్యంలో చేయవలసిన వేదాధ్యయనం చేయాలి. అలాగే పురాణాలు మొదలైన వాగ్మయాన్ని అధ్యయనం చేసి తరువాత తరం వారికి వాటిని అందించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి.
 • 2. దేవఋణం: యజ్ఞ యాగాది క్రతువులు చేయడం, చేయించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. యజ్ఞం అంటే త్యాగం. యజ్ఞాలవల్ల దేవతలు తృప్తి చెందుతారు. సకాలంలో వర్షాలు కురుస్తాయి. పాడిపంటలు వృద్ధి చెందుతాయి. కరువు కాటకాలు తొలగిపోతాయి. నీరు, గాలి, వెలుతురు, ఆహారాన్ని ప్రసాదిస్తున్న వారందరికి మనమెంతో ఋణపడివున్నాం. కనుక ఆ ఋణాన్ని తీర్చకపోతే మనం కృతఘ్నలం అవుతాం.
 • 3. పితౄణం: సత్సంతానాన్ని కనడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, మనకు జన్మనిచ్చి పెంచి పోషించినవారు. వంశాన్ని అవిచ్చిన్నంగా కొనసాగించడం ద్వారా, పితృ దేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితౄణం తీర్చుకోవాలి. సంతానం కనాలంటే వివాహం చేసుకోవాలి గదా! "ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః" అంటుంది వేదం. అంటే వంశపరంపరను త్రెంచవద్దు. వేదాధ్యయనం, యజ్ఞం చేయడం, సంతానము కనడం ఇవి మానవుడు తప్పని సరిగా చేయవలసిన విధులుగా వేదం చెపుతున్నది. యజ్ఞాలలో పంచ యజ్ఞాలు విధిగా ప్రతి మనిషీ చేయాలి. అవి దేవ, మనుష్య, భూత, పితృ, బ్రహ్మ యజ్ఞాలు

తలంబ్రాలు:
ప్రస్తుత కాలంలో ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా సరైన సంబంధాలు ఉండటంలేదు.

మనం పూజలో చేసే ఏమైనా దోషాలు ఇందుకు కారణమా ?

పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉంటాయా?

ప్రశ్న అడిగినవారు : రామసుధ, కాన్బెర్రా, ఆస్ట్రేలియా.

మనుష్యుల మధ్య అవగాహన లోపించటానికి అనేక విషయాలు కారణాలుగా వుంటాయి.
ప్రధానంగా పూజా విధానముల యందు జరిగే దోషములు, వాటి ఫలితములు గురించి మాట్లాడుకుందాం.

1 మనం వివాహాలు చేసేటప్పుడు తలమ్బ్రాలకు వాడే అక్షతలని ప్రత్యేకంగా నూకలు లేకుండా ఏరి, వాటిని ఉపయోగిస్తాము. (అక్షతలు అంటే క్షతము కానటువంటివి అని అర్థము.)
ఈ మధ్య తలంబ్రాల విషయంలో ఆ జాగ్రత్త తీసుకోవటం తగ్గిపోయింది.
కొన్ని సందర్భాలలో పెళ్ళిలకు తలమ్బ్రాలతో పాటు కత్తిరించిన రంగు రంగుల తర్మకోల్ పదార్థాలు వాడుతున్నారు.

అట్లాగే పూల రేకులన్నీ విడదీసి తలమ్బ్రాలలో కలపుతున్నారు.

తలంబ్రాల బియ్యము ఒకరి శిరస్సున ఇంకొకరు పోయటాన్ని అక్షతారోపణము అని అంటాము.
మరి వీటిని (కత్తిరించిన తర్మకోల్ లేక విడదీసిన పూలని) తలంబ్రాలు (అక్షతారోపణం) అని ఎలా అంటాము.

విరిగిన, విడదీసిన పదార్థములు వాడుతూ వాటినే తలంబ్రాలు (అక్షతలు) అంటున్నాము.
ఇది ఒక దోషము.

2 అట్లాగే నిత్య పూజకు, విరిగిన బియ్యము లేదా నూకలు కూడా అక్షతలుగా ఉపయోగిస్తుంటారు.
లేదా పూల రేకులను విడదీసి అర్చనకు వాడటం చేస్తున్నారు.
ఎప్పుడూ కూడా పూలను విడదీయకుండా, పూర్తిగా స్వామివారి పాదాల దగ్గర ఉంచాలి.
పూలు తక్కువగా వుంటే అక్షతలు, కుంకుమ, గంధము, విభూది .... ఇటువంటి ద్రవ్యములతో పూజ చేయవచ్చు.

విరిగిన బియ్యాన్ని అక్షతలు అని అనలేము,
అట్లాగే విడదీసిన పూ రేకులను దేవునికి ఇచ్చి పూర్ణ ఫలం పొందలేము కదా ........
వాటికి సంబంధించి చేసే దోషముల వలన, కూడా గృహఛిద్రం ఏర్పడుతుంది.
ఇది మరొక దోషము.

3 ఈ అంశము గురించి పైన చెప్పిన విషయం చాలా తక్కువ.
"పూర్ణ ఫలం జాయతే ఇతి పూజా" - పరిపూర్ణమైన ఫలము చేకూర్చే విధానమే పూజా విధానము. ఈ పూజా విధానములో ప్రతి చిన్న విషయమునకూ ప్రత్యేకమైన కారణం వుంటుంది.
తెలిసీ, తెలియక చేసే దోషముల వలన దానికి సంబంధిచిన ఫలితములు అనుభవించవలసి వుంటుంది.

అందుకని, సరియగు అవగాహన కలిగిన సద్బ్రాహ్మణులను గురు స్థానములో వుంచుకొని పూజా క్రతువులు చేయుట మంచిది.

లేదా గురువులను ఆశ్రయించి నిత్య పూజలకు అవసరమగు విషయముల గురించి తెలుసుకొనుట మంచిది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

19, నవంబర్ 2017, ఆదివారం

అమ్మాయి పుష్పావతి అయిన సమయములో చేయవలసిన కార్యక్రమాలు ! - Pushpavathi aina Ammayi

ammayi-pushpavat

అమ్మాయి పుష్పావతి అయిన సమయములో చేయవలసినవి:

తూర్పు ముఖం వచ్చునట్లుగా నేలమీద గడ్డిపరచి దానిమీద తెలుపు డిజైను దుప్పటి లేక చీర ఐదుగురు ముత్తైదువులు పట్టుకుని వేయవలెను.
 • కొందరి ఇంట తెలుపు డిజైను కొత్త చీర సమర్త పెండ్లికూతురుకు కట్టి మొదటి రోజు కూర్చొనపెట్టుదురు. 
 • ఆ ఐదుగురు అక్షింతలు నాలుగు వైపులా, మధ్యలో ఐదుచోట్ల శనగలు, పండ్లు, తాంబూలము, ఎండుకొబ్బరి చిప్ప, చిమ్మిరి ముద్ద పెట్టాలి. 
 • పక్కన ఒక చెక్కబొమ్మ పెట్టవలెను.
 •  ఆ బొమ్మకు గుడ్డ చుట్టవలెను. 
 • అమ్మాయి కాళ్ళకు పసుపు రాసి పారాణి పెట్టాలి. 
 • అమ్మాయికి ఓణీ వేయవలెను. 
 • 5పోగుల దారానికి పసుపు రాసి తమలపాకు కట్టి ఒకటి రోలుకి, రోకలికి కటాలి. అమ్మాయికి తాంబూలము ఇవ్వవలెను. 
 • అమ్మయిని కూర్చోబెట్టి రోలులో 5 చిమ్మిరి ముద్దలు వేసి చిమ్మిరితొక్కి హారతి పట్టవలెను. సమర్తపాట, మంగళ హారతి పాటలు పాడవలెను. 
 • రోలులోని చిమ్మిరి, ముందుగ 3 సార్లు అమ్మాయి చేతిలో పెట్టి మిగిలినది సమర్తకాని పిల్లలకు పెట్టుదురు. 
 • బొట్టు, గంధము ముందుగా సమర్త పెండ్లికూతురునకు ఇచ్చి, తరువాత ముత్తైదువులకు ఇచ్చెదరు.
మొదట 3రోజులు పులగము అన్నము (బియ్యములో పెసరపప్పు కలిపి వండవలెను), ఒక మూకుడులో విస్తరాకు లేక వెండి గిన్నె వుంచి సమర్త పెండ్లికూతురునకు, ఆ అన్నము పెట్టెదరు. అన్నములోకి బెల్లము ముక్క లేక పంచదారతో తినవలెను. తరిగినవి తినరాదు. పుల్లలు తుంచుట చేయకూడదు. అరటిపండు ఎవరైనా వలిచి ఇచ్చిన తినవలెను. ఉపనయనము సమయములో వాడిన మూకుడులో అన్నము పెట్టిన ఏదైనా దోషము ఉన్న పోవును. వరుస స్నానము 4, 7, 9, 11 రోజులలో చేయించెదరు. 4వ రోజు భోజనములో అట్లు వడ్డించాలి, పాలరసము చేయాలి. వరస స్నానము 4సార్లు, మాములుగా బంతిలో భోజనము చేయవచ్చును. 4 రోజుల తరువాత కొబ్బరి పొడుము, అప్పడము, వడియముతోనే భోజనము పెట్టవలెను. తినలేనిచో పాలు, మజ్జిగ పలుచగ చేసి అన్నములో పోయవలెను.

పత్యము:
వంకాయ, గోంగూర, తరిగినవి. అరిశె, జున్ను, అట్టు తినకూడదు. చిమ్మిరి ముద్దలు, వేరే ఏ స్వీటు అయినా తినవచ్చును. సమర్త సమయమున చిమ్మిరి ఎంత పంచిన అంత మంచిది. ఏదైనా గుడి ముందు వాళ్ళకు చిమ్మిరి ముద్దలు పంచవచ్చును.

చిమ్మిరి తొక్కుటకు కావలసినవి:
 • నువ్వులు - ఒకటిన్నర కేజి (100 ముద్దలు వచ్చును)
 • బెల్లము - ఒకటిన్నర కేజి
 • ఎండు కొబ్బరి తురుము - అర కేజి
నువ్వులు వేయించి, రోలులో తొక్కి దానికి బెల్లము, ఎండుకొబ్బరి కలిపి బాగా తొక్కి ముద్దలు చేయాలి.

11వ రోజు అమ్మాయికి గాజులు తొడిగించెదరు. ఆ రోజు బంధువులను పిలిచి భోజనములు పెట్టెదరు. అందరికి 2 గాజులు కూడా పంచిపెట్టెదరు. 4సమర్తలు, కన్నెముట్లు 3, అయిన దాక ఊరు పొలిమేర దాటరాదు.

సమర్త స్నానము:
3వ రోజు రాత్రి 3గం||కి స్నానము చేయించవలెను. నువ్వుల నూనె వంటికి రాసి నలుగు పెట్టి తలస్నానము చేయించాలి. అయినాక 5ని|| తరువాత మరల తలస్నానము చేయించవలెను. దీనినే దొంగస్నానము అందురు. 7, 9, 11 రోజులలో ఉదయమే ఇలా నలుగుపెట్టి స్నానము చేయించవలెను. 11వ రోజు పంతులు గారు వచ్చి పుణ్య వచనము చేయించెదరు. 2వ సమర్త 9వ రోజుతో, 3వ సమర్త 7వ రోజుతో, 4వ సమర్త 5వ రోజుతో, మూడుముట్లు కన్నెముట్లు అని 4వ రోజు దూరము గానే వుంచి 5వ రోజు ఇంట్లోకి వచ్చెదరు.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

17, నవంబర్ 2017, శుక్రవారం

పెళ్ళిలో యారనాలు ఎలా చేయాలి? Pellilo Yaranalu yela cheyali

pelli-lo-Yaranalu-yela-cheyali

యారనాలు:

పెండ్లికూతురు తల్లివాళ్ళు, పెండ్లికొడుకు వాళ్ళు నోము నోచుకొనునప్పుడు తీసుకువచ్చెదరు.

తీసుకురావలసినవి:
 • పసుపు - 1 కేజి 
 • కొబ్బరి చిప్పలు - 100
 • కుంకుమ - 1 కేజి 
 • పండ్లు - 100
 • సున్నిపిండి - 1 కేజి 
 • వక్క ప్యాకెట్లు - 2
 • ఆకులు - 5కట్టలు 
 • ప్రదానములో వచ్చిన పళ్ళెములు
అందరికి బట్టలు అన్ని కలిపి 11 పళ్ళెములలో తీసుకురావలెను.

ఆడపడుచు సూటుకేసులో, చీర, జాకెటు, పసుపు కుంకుమ, బొట్టు బరిణి, కుంకుమ, కాటుక, దువ్వెన, అద్దము, పౌడరు, ఇవి అన్ని సూటుకేసులో పెట్టి అక్కడ పెట్టెదరు.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

షష్టిపూర్తి అంటే ఏమిటో తెలుసుకోండి : Shastipurti

Shastipurti
 షష్టిపూర్తి:
60 సంవత్సరాలు వచ్చిన రోజున తల్లి చుట్టు ప్రదక్షిణ చేసి కాళ్ళకు నమస్కారము చేసి అక్షింతలతో ఆశీర్వాదములు తీసుకొనవలెను. గుడికి వెళ్ళి పూజ, అభిషేకము చేయించుకొనవలెను. ఇష్టమున్నచో ఆ సంవత్సరము మొత్తము గోత్ర నామములతో పూజ చేయించుకొనుట మంచిది.

Shastipurti
60 సంవత్సరాలు నిండిన రోజు:
ఉదయము పెండ్లికొడుకుకు, పెండ్లికూతురుకి మంగళస్నానము చేయించవలెను. పంతులు గారు అంకురార్పణ చేసి గణపతి హోమము, మృత్యుంజయహోమము చేయుదురు. కొందరు సత్యన్నారాయణ వ్రతము చేసుకొందురు. వివాహవేడుకగా తలంబ్రాలు పోసుకొనుట, బిందెలో ఉంగరము వేయటము, దండలు మార్చుకొనటము, సాయంకాలము ఊరేగింపుగా మండపమునకు వచ్చెదరు. కొడుకులు - కోడళ్ళు, పాద పూజచేసి బట్టలు పెట్టవలెను. అతిధులకు భోజనము పెట్టెదరు. జపము చేయించుకుని దశదానములు బ్రాహ్మణులకు ఇవ్వవలెను.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


1, నవంబర్ 2017, బుధవారం

నమస్కారములు అంటే ఏమిటి ? అవి ఎన్ని?

namaskaram ante yemiti

నమస్కారములు:
నమస్కారములు చాలా విధములు అందులో

1. సాష్టాంగ నమస్కారము:- ఏడు శరీరాంగములు + మనసు కలిపి ఎనిమిది అంగములు. ఈ ఎనిమిది అంగములు భూమికి తగిలేలా బోర్లాపడి నమస్కరించడమే సాష్టాంగ నమస్కారము.
“ఉరసా, శిరసా, దృష్ట్యా, మనసా, వచసా తధా, పద్భ్యాం కరాభ్యామ్, కర్ణాభ్యామ్, ప్రణామోస్థాంగముచ్యతే”
1కాళ్ళు 2 చేతులు 3 ముక్కు 4 చెవులు 5 ఉదరము 6 కళ్ళు 7 నోరు 8 మనస్సు
ముఖ్యగమనిక:- స్త్రీలు మాత్రము ఈ సాష్టాంగ నమస్కారము చేయరాదు అని వేదములు నొక్కి వక్కాణిస్తున్నాయి. స్త్రీలు కేవలం పంచాంగ నమస్కారము మాత్రమే చేయాలి.

2. పంచాంగ నమస్కారము:- పంచాంగములు 1 అరిచేతులు 2 మోకాళ్లు 3 మోచేతులు 4 పాదములు 5 శిరస్సు.

3. అభివాద నమస్కారము:- ప్రవరతోటి చేయు నమస్కారము. అభివాద నమస్కారము నిలబడి చేయరాదు. పూర్తిగా వంగి పాదముల మీద చేతులు ఉంచి మెల్లగా లేచి నమస్కారము చేయాలి. గురువుగార్లలను, ఆచార్యదేవులను, వేదపండితులను,నిత్యాగ్నిహోత్రులను, వయోవృద్దులను, జ్ఞానవృద్దులను దర్శించినపుడు లేదా వారి దగ్గరకు వెళ్ళినపుడు విధిగా అభివాద నమస్కారము చేయాలి.

4. ప్రణిపాతము:- ఆర్తితో చేయు నమస్కారము. నేలమీదపడి నమస్కారము చేయడము.
“మహృదయ క్షేత్రాలలో భక్తి, అనే బీజాలను నాటండి. దీనిని మనస్సుఅనే నీటితో తడపండి. దానికి నాలుగు దిక్కుల సంత్సంగం అనే కంచె వేయండి. దానివలన కామాది, వికృతరూప, పశువులు రాకుండా ఉంటాయి. మీరీ విధంగా వ్యవహరిస్తే ఆ బీజాలు చిగురించి పంట పండి తర్వాతి కాలంలో శాంతి ఆనందం అనే పంట ఫలాలు మన చేతికి వస్తుంది.”


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

28, మే 2017, ఆదివారం

భగినీ హస్తభోజనం అంటే ఏమిటి? Bhagini Hasta bhojanamu

భగినీ హస్తభోజనం అంటే ఏమిటి? Bhagini Hasta bhojanamu
"భగినీ హస్త భోజనము" అంటే ... సోదరి చేతి వంటలతో , సోదరి ఇంట భోజనము చేయడం అని అర్ధము . ఇది ఒక సనాతన , కుటుంబ ఆప్యాయతల్ని పెంచే ఆచారము . ఇటు వంటి మంచి ఆచార అలవాట్లు మన హిందూ పండగల్లో ఎన్నో ఉన్నాయి . ఆ సత్సంప్రదాయాలను మన తరువాత తరము వారికి అందించాలి ... అందించడానికే అన్ని పండుగలూ తప్పనిసరిగా ఆచరించాలి , చేయించాలి .

ప్రాచీన భారతదేసములో ఉమ్మడి కుటుంబాలు , బంధుమిత్ర అనుబంధాలు , ఆప్యాయతలు మెండుగా ఉండేవి . పండుగులకు , పబ్బాలకు , ఉత్సవాలకు , గ్రామ వేడుకలకు , ఒకరినొకరు ఆహ్వానించుకుంటూ స్నేహ .. బంధుత్వాలను నిలబెట్టుకొంటూ విలువలను పాటించేవారు . అది ఎంతో మంచి సంప్రదాయము . నేటి సమాజము లో ఒంటరి కుటుంబాలు ఎక్కువైపోయాయి ... పొరిగింటివారికి కూడ పిలిచే ఓపిక , టైం లేదని వాపోతుంటారు . మన సంస్కృతిలోని పురాణ కథలు , వ్రతాలు , నోములు లలో ఉన్న ఎన్నొ ఈ బంధుత్వాల విలువలను ప్రచారము చేసే కథలు , చరిత్రలు మన తరువాత తరమువారికి అందించే భాద్యత మన అందరిపైనా ఉన్నది .

తోడబుట్టిన స్త్రీ సంతానాన్ని " భగిని" అంటారు . ఆమె హస్తము తో చేసిన (చేతితో వండిన)భోజనాన్ని చేయడాన్ని భగినీహస్త భోజనము అంటారు . కార్తీక మాసము ప్రవేశించిన 2 వ రోజున ఈ బోజనాలు చేయాలన్నది శాస్త్రము . ఇక్కడ రెండు వేరు వేరు కాలలో చెప్పబడిన కదనాలు ఉన్నాయి. ఒక కాలము లో బలిచక్రవర్తిని , ఇంకోకాలము లో యమధర్మరాజుని వారి వారి చెల్లి , లేదా అక్క (ఇక్కడ అన్నా-చెల్లెలు , అక్కా-తమ్ముడు ... అంటే తమ సోదరుల్ని (సమానమైన ఉదరము అంటే ఒకే తల్లి గర్భము నుండి పుట్టిన వాళ్ళని ) తమ ఇంటికి కనీసము ఏడాదికి ఒకసారైనా వచ్చి తమ చేతి భోజనము తిని వెళ్ళవలసిందిగా కోరారట .  కార్తీక శుద్ద విదియ నాడు వస్తామని ఆ ఇద్దరూ ఒకప్పుడు మాటినిచ్చి అలాగే జీవితాంతము చేశారని పురాణం లో చెప్పబడి ఉంది. కాబట్టి ఈ రోజున ఎవరెవరు తమ సోదరి (ల) ఇంటికి వెళ్ళి భోజనము చేసి కానుకలు , వస్త్రాలు పెట్టి -- అక్క ఇంటికెళ్తే ఆమె ఆశీర్వాదాన్ని పొందాలని , చెల్లిలయితే ఆమె ను ఆశీర్వదించి రావాలని ... ఓ నియమము చేసింది శాస్త్రము . ... అదే " భగినీ హస్తభోజనము "

దీపావళి పండుగ తరువాత వచ్చే విదియ యమద్వితీయ , లేక భ్రాతృద్వితీయ . ఆ రోజు ప్రతి పురుషుడు తమ చెల్లెలు ఇంటనో ... చెల్లెలు లేనట్లైతే చెల్లెలు వరస ఇంటనో , అక్క ఇంటనో భోజనము చేయాలి . ఈ పండుగ నియమ నిభందనాలలో ఇదొకటి . సూర్య భగవానుని సంతానమైన యమున (కూతురు) యమధర్మరాజు కవలపిల్లలు ... చెల్లెలు తన ఇంటికి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా పని భారముతో యముడు వెళ్ళడం కుదరలేదు . . . చివరకు ఒకరోజు అనగా దీపావళి తరువాత విదియ నాడు వెళ్ళి చెల్లెలి ఆతిద్యం స్వీకరించి భోజనం చేసి ... వస్త్రాభరణాలు , కట్న , కానుకలు ఇచ్చాడంటారు . అలా ప్రతిసంవత్సరమూ చేస్తూఉంటాడని నమ్మకము . కార్తీక శుద్ధవిదియనాడు భ్రాతృపూజ అని ఈ ఆచారానిని అంటారు .

భగినీ హస్తభోజనం అంటే ఏమిటి? Bhagini Hasta bhojanamu
జీవితాన్నీ , ఈ జన్మనీ పొందింది అక్కడెక్కడో శరీర -ఇంద్రియ -ప్రాణాలని ఫణము గా పెట్టి  ఉద్యోగము చేస్తూ గడిపేయడానికేనా?.. కాదు . ఒక అన్నా లేదా తమ్ముడూ ఓ సోదరి ఇంటికి వెళ్తే ఆమె ఇంటి పరిస్థితి ఎలాఉందో , మేనళ్ళుడూ ,మేనకోడలూ ఎలా ఉన్నారో, తమ సోదరి పట్ల బావగారు లేదా బావమరిది  ప్రవర్తన ఎలా ఉందో , ఇలా అన్నివిషయాలు ప్రత్యక్షము గా తెలుస్తోంది. మరి అన్న లేదా తమ్ముడే ఎందుకు వెళ్ళాలి అంటే తమని కన్న అమ్మకుడా ఓ సోదరుడుకి సోదరే కాబట్టి .. ఆయన రావలసిన రోజున అమ్మ తన కూతురు సంసారము చూడానికి వెళ్తే ఎలా?  .

ఇంట్లో ఉండే పెద్దన్న తండ్రి తరువాత తండ్రంతటివాడు .అలాగే ఇంట్లో ఉండే తోబుట్టువు అమ్మ తరువాత అమ్మంతటిది . అంటే దీనర్ధము భగినీ హస్తభోజనానికి తల్లిదండ్రులు గతించిన వాళ్ళే వెళ్ళాలని కాదు . అంతేకాదు ఇలా సోదరినుండి తన సంసార పరిస్థితిని గమనించిన సోదరుడు ఆ సంసార పరిస్థితి మొత్తాన్ని తమ తండ్రికి చెప్పలన్నదే దీనిలోని నేపధ్యము . కుటుంబాలు విడిపోకుండా ఉండేందుకు ఇదో సాంప్రదాకమైన పద్దతి.

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి