రధ సప్తమికి పాలు పొంగించట ఎలా - Ratha saptami lo paalu ponginchuta yela

0
Ratha-saptamilo-paalu-poninchuta-ratha-saptami

రధ సప్తమికి పాలు పొంగించటము:
మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజు ఉదయమే లేచి జిల్లేడు ఆకులు లేక చిక్కుడు ఆకులు, రేగిపండ్లు తలమీద రెండు భుజాలమీద పెట్టుకుని తలస్నానము చేయాలి. ఓపెన్‌ స్థలములో ముగ్గువేసి ఆవు పిడకలతో దాళ్ళు పెట్టవలెను. 6 పిడకలు 5 వరసలు రౌండుగా పెట్టవలెను. పొంగలి గిన్నెకు పసుపురాసి, బొట్టుపెట్టి ఆవుపాలు పోసి, పిడకలమీద పెట్టవలెను. పిడకల మీద ముగ్గు వేయవలెను. కర్పూరముతో వెలిగించవలెను. పొంగలి చేయాలి. లేనిచో గ్యాస్‌పొయ్యి మీద 3 పిడకలు పెట్టి చేసుకొనవచ్చును. చీపురు పుల్లలకు చిక్కుడు గింజలు గుచ్చి రధము ఆకారంతో చేసి మధ్యలో వినాయకుని, గౌరిదేవిని పెట్టి సూర్యునకు ఎరుపు పూలతో పూజచేసి నైవేద్య ము పెట్టవలెను.

నైవేద్యము:
11 చిక్కుడు ఆకులు లేక 11 తమలపాకులలో పొంగలి, పండు, చలిమిడి, వడపప్పు, చలిమిడితో చేసిన చిన్న బూరెలు (నేతితో చేయాలి).
  5 రకాల ఆకులు 11 తీసుకుని నైవేద్యము పెట్టవలెను.ఆ దాళ్ళులో 3 ఆకులు వేయవలెను. ఇంట్లో మిగిలిన పొంగలి నైవేద్యము పెట్టి గౌరి పూజచేయాలి. రధసప్తమి రోజున ఇది అంతా చేయనివారు, ఆవుపాలతో పొంగలిచేసి, ఎరుపు పూలతో సూర్యుని పూజచేసి, నైవేద్యము పెట్టవలెను. నోములు పట్టదలచినవారు నోముల కధలు పుస్తకములో ఏ నోము నోచుకొనవలెనో నిర్ణయించుకుని ఆ కధ చదువుకొనవలెను. అక్షింతలు చేతితో పట్టుకుని కథ చదివినాక ఆ అక్షింతలు తలమీద వేసుకొనవలెను. నోము చెల్లించుకొనువిధానము ఆపుస్తకము ప్రకారము చేసుకొనవచ్చును. నోములు పట్టుకొన తలచినవారు రధసప్తమి రోజు కుదరనిచో, మాఘమాసము ఆదివారము నోములు పట్టుకొనవచ్చును.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top