మృత్యువు అంటే ఏమిటి అది ఎక్కడ ఉంది - What is death?

0

మృత్యువు ఎక్కడ ఉంది?

సర్వకాల సర్వావస్థలయందు ముక్కు చివరన ఉంటుంది. ఎలాగంటే శ్వాస తీసిన తరువాత విడవక పోతే మృత్యువు. విడిచిన శ్వాస తీయక పోయినా మృత్యువు.

1. శరీరము ఎక్కడనుండి వచ్చినది?
ఈ శరీరము పంచ భూతముల నుండి వచ్చినది. మరలా పంచ భూతములలో కలిసిపోతుంది. మనలోని పంచ భూతములు తిరిగి పంచ భూతములలో కలిసిపోతాయి.
“పురత్రయే క్రీడతి జీవయo తః” కైవల్యోపనిషత్తు.
త్రికూటములు:

1. స్థూల,
2. సూక్ష్మ
3. కారణ

1. స్థూల శరీరము:- జాగృత్- నిద్రలలో స్థూల శరీరముఉండును.
2. సూక్ష్మ శరీరము:- నిద్ర, నిద్రలోని స్వప్నము లో ఉంటుంది.
3. కారణ శరీరము :- సుఘప్తి, నిద్రలో ఉంటుంది.

ఈ ఉపాదిలోని జీవుడు జీవితకాలమంతా ఇందులో ఈ మూడింటిలో తిరుగుచుంటాడు.

సాక్షి చిత్రగుప్తుడు ఎవరు?
ఈ ఉపాదిలో గుప్తంగా కూర్చొని చిత్రంగా లెక్కలు వ్రాయువాడు పంచేంద్రియములు తమ పని తాము చేస్తున్నా,చేయలేక పోయినా అవి పనిచేస్తాయి, పని చేయలేవు అని చూచే ఆత్మ సాక్షి, లోపల నున్న జీవుడు.

1. అనుభవములు రెండు.
1.సుఖము 2. దుఃఖము మరొకటిలేదు.

మనకు ఇష్టపడినది, నచ్చినది సుఖము, మనకు నచ్చనిది బాధకలిగించేది దుఃఖము మరొకటిలేదు.

గుణములు మూడు.
1. సత్యము
2. రజస్సు
3. తమస్సు

చతుర్విద పురుషార్థములు.
1. ధర్మము
2. అర్థము
3. కామము
4.మోక్షము

తన్మాత్రులు ఏవి?
1. శబ్దము
2.స్పర్శ
3. రసము
4.రూపము
5. గంథము

ఉపాధి (శరీరము)
పంచేంద్రియములు + ఒక మనస్సు =మానవ ఉపాధి
(పంచేంద్రియములు + మనస్సు ఈ ఆరింటి సంఘతామే ఉపాధి)

సప్తధాతువులు
1) చర్మము
2) రక్తము
3) మాంసము
4) క్రొవ్వు
5) అస్థి
6) శుక్ల
7) మేధ

తొమ్మిదిరంధ్రములు
1) రెండు కళ్ళు ........................2
2) రెండు చెవులు ...................2
3) ముక్కుకు రెండు రంధ్రాలు......2
4) నోరు .................................1
5) మలద్వారము......................1
6) మూత్రద్వారము....................1 = మొత్తము 9

పది వాయువులు
1) ప్రాణ
2) అపాన
3) వ్యాన
4) ఉదాన
5) సమాన
6) నాగ
7) కూర్మ
8) కృకర
9) ధనంజయ
10) దేవదత్త

ఇందులో ఈ వ్యాన వాయువు మాత్రం వెళ్ళదు. మరణించిన తర్వాత ఈ వ్యాన వాయువు శరీరమును పట్టుకొని ఉంటుంది. అపుడు తనూభవుడు (కుమారుడు) అంత్యేష్టి సంస్కారముతో మంత్ర బద్ధముగా ఈ వాయువును మరణించిన శరీరం నుండి విడగొట్టుతాడు.
భగవంతుని పూజ విషయంలో మనస్సుతో కలువని పంచేంద్రియము+కర్మేంద్రియములు చేయు పనులు నిష్ప్రయోజనం.

దేహాభిమానము, అహము తగ్గనిదే భగవంతుని చూడలేవు. మానవ జాతికి ధర్మ పథాన్ని నిర్దేశించడానికి యోగ్యమైన రీతిలో మహాభారతమును అనుగ్రహించిన వ్యాసుల వారి ధర్మ విషయములు.

ధర్మనిరతుడు:-
  • ఉదయ సమయంలో దాన ధర్మాలు చేయువాడు.
  • మధ్యాహ్న సమయంలో డబ్బు సంపాదించే మార్గములు అన్వేషించువాడు.
  • రాత్రి వేళలో సాంసారిక జీవితము సాగించేవాడు.
  • కేవలం ఇంద్రియ సుఖాల ఆలోచన వలననే విచారం ఆరంభమవుతుంది.
  • ఇంద్రియ వాంఛలు తీర్చుకొనడానికి శ్రమించే వారికి దుఃఖమే ప్రాప్తిస్తుంది. పాపాలకు అవకాశం కల్పిస్తుంది. నరకానికి పీటలు వేసి సర్వ నాశనానికి దారి తీస్తుంది.
ఈ భూమండలం అంతా మనకు స్వాధీనమైనా జనన మరణాలు నుండి తప్పించుకోగలమా?
కోటీశ్వరులు, బిలీనియర్స్ ICU లో ఉంటే మనమంతా ఎంత వారుగాని చివరకు ప్రసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రసిడెంట్ ఆఫ్ చైనా, ప్రసిడెంట్ ఆఫ్ USA ఐనా ఎవరినైనా సరే ICU లో ఉంచితే మనము బయట(అద్దాలు బయట)నిలబడి I See You అంటూ చూస్తూ ఉండాలే కానీ ఏమి చేయలేము.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top