నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

20, ఏప్రిల్ 2018, శుక్రవారం

గుంటూరు జిల్లా ఆలయాల సమాచార వేదిక - Gunturu jilla temples information

గుంటూరు జిల్లా ఆలయాల సమాచార వేదిక - Gunturu jilla temples informa
శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి దర్శన వేళలు
మంగళగిరి  పట్ట ణంలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉదయం 6 గంటల నుంచి 12 వరకు ప్రత్యేక పూజలతో కూడిన దర్శనం వసతి ఉంటుంది. 12 గంటల నుంచి 1 గంట వరకు సాధారణ దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తారు. 1 గంట కు దర్శనాన్ని నిలిపివేస్తారు. తిరిగి దర్శనాన్ని నాలుగు గంటలకు పునరుద్దరించి రాత్రి 8 గంటల వరకు భక్తులకు దర్శన వసతి కల్పిస్తారు. అదేవిధంగా ఎగువ సన్నిది శ్రీ పానకాల స్వామి ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. 4 గంటల తరువాత దర్శనాన్ని నిలిపివేస్తారు. ఇక్కడ స్వామివారికి అతి ఇష్టమైన పానకాన్ని భక్తులు స్వామికి ప్రసాదంగా సమర్పిస్తారు. ఉదయం 6 గంటలనుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు దిగువ సన్నిధిలలోని లక్ష్మీనర్సింహ్మ స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. తిరిగి సాయంత్రం 4.00 నుండి 8.00 గంటల వరకు దిగువసన్నిధిలోని ఆలయంలో దర్శన సౌకర్యం కల్పించారు. ఎగువ సన్నిధి పానకాల స్వామి ఆలయంలో ఉదయం 6.00 గంటలనుండి సాయంత్రం 6.00 గంటలవరకు మాత్రమే స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. స్వామి వారికి భక్తులు ప్రసాదంగా ఇచ్చే పానకాన్ని రూ.50లకు విక్రయిస్తున్నారు.

ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు

అమరావతి : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పవిత్ర కృష్ణానది తీరాన వేంచేసియున్న శ్రీ ప్రసన్నాంజనేయస్వామి వారి దేవస్ధానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం విచ్చేసిన భక్తులకు స్వామివారి తీర్ధ ప్రసాదాలను పంపిణీ చేశారు. అలాగే మండల పరిధిలోని మల్లాది గ్రామంలో వేంచేసియున్న శ్రీ అభయాంజనేయస్వామివారి దేవస్ధానంలో ఆలయ అర్చకులు బి.శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల పరిధిలోని పలు గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.

అమరేశ్వరాలయ సమాచారం
అమరావత : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అమరావతిలో వేంచేసియున్న శ్రీ బాల చాముండిక సమేత అమరేశ్వరస్వామి వారి దేవస్ధానంలో ఉదయం ఆలయ స్నానాచార్యులు వెంకటేశ్వరశాస్త్రీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు అమరేశ్వరునికి అభిషేక పూజలు, బాల చాముండిక అమ్మవారికి కుంకుమ పూజలను భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

షిర్డిసాయి ఆలయంలో ప్రత్యేక పూజలు
అమరావతి : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అమరావతిలో వేంచేసియున్న శ్రీషిర్డిసాయి, భక్తిసాయి కపోతేశ్వర ధ్యాన మందిరంలో సాయినాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్ధానిక శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు తెల్లవారుజామున నగర పురవీధుల్లో నగర సంకీర్తన గావించి అనంతరం పవిత్ర కృష్ణానది జలాలలో స్వామివారిని అభిషేకించి అనంతరం విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్ధ ప్రసాదాలను పంపిణీ చేశారు.

చెన్నకేశవుని కళ్యాణం
మాచర్లః శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి నిత్యకళ్యాణంలో భాగంగా స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో కృష్ణంరాజు తెలిపారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు.

తెనాలి వైకుంఠపురం..
తెనాలి పట్టణ వైకుంఠపురం శ్రీలక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్దానంలో నేటి ఉదయం స్వామివార్లకు బిందె తీర్దం, బాలబోగం నిర్వహించారు. సాయంత్రం శాంతి కళ్యాణం, నివేదన .

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
« PREV
NEXT »