ప్రపంచానికి రాబోతున్న ముఖ్య ఆపదలు - The main threats to the world

0
ప్రపంచానికి రాబోతున్న ముఖ్య ఆపదలు - The main threats to the world
మనము ఎదుర్కోబోయే 2 ముఖ్య ఆపదలను తెలుసుకోండి.

పెరుగుతున్న సముద్ర నీటి మట్టము భరతదేశానికి పెద్ద ముప్పు తెస్తుంది

రాబోవు సునామీలు, తరచుగా వచ్హే తుఫానలు మరియూ అకస్మాత్తుగా వచ్హే వరదలు లాంటి ప్రక్రుతి వైపరీత్యాలు మానవుల వలన పెరిగిపోయిన వాతావర్ణ కాలుష్యం వలనేనని మనం తెలుసుకోవటానికి సూచనలని చెన్నై ఐ.ఐ.టి లో "వాతావర్ణ కాలుష్యం వలన రాబోవు పరినామాలు మరియూ మంచినీటి కోరత" అనె అంశం మీద జరిగే సమావేశంలో పాల్గోన్న శాస్త్రవేత్తలు తేలిపేరు.

అన్నిటి కంటే ముఖ్యమైన ఆపద సముద్రములో పెరుగుతున్న నీటి మట్టమేనని చెబుతున్నారు. భూమిలో నుండి తీయబడు ఇంధనాన్ని తగ్గించక పోతే రాబోవు 10 సంవత్స రాలలో భూమి మీద ఉష్నోగ్రత ఇప్పుడున్న ఉష్నోగ్రత కంటే 4 డిగ్రీలు (సెలిసీస్ లో) ఎక్కువ అవుతుందని, ఇప్పడికే వాతావర్ణంలో కార్బండ ఆక్సైడు సంవత్స రానికి 2 పిపిఎం చొప్పున పేరుగుతోందని కెనడాకు చెందిన శాస్త్రవేత్త తెలిపేరు.

అమేరికాకు చెందిన శాస్త్రవేత్త మాట్లాడుతూ వాతావర్ణ కాలుష్యం వలన ఉష్నోగ్రత పెరిగి మంచు కొండలని కరిగించి ప్రపంచాన్ని చుట్టూ ఉన్న సముద్రపు నీటి మట్టాన్ని పెంచుతోంది. ముఖ్యముగా భారతదేశం చుట్టూ ఉన్న సముద్రపు నీటి మట్టం అధిఖముగా పెరుగుతోంది, దీనికి కారణం పోలార్ లోని మంచుకొండల కంటే హిమాలయా పర్వతాలలో ఉన్న మంచు కొండలు త్వరగా కరుగుతూండటమే. కనుక భారత దేశపు సముద్ర తీర ప్రాంతాలకు ఎక్కువ ముప్పు వాటిల్లుతుందని, ఆ ముప్పు చాలా విపరీతంగా వుంటుందని చెప్పేరు.
  • ఎంత మంచు కరుగుతోందో .....ఎంత నీరు పెరుగుతోందో తెలుసుకునే పరికరాలు లేవు కాబట్టి ముప్పు ఎంత విపరీతముగా వుంటుందో అంచనా వేయలేక పోతున్నామని చెప్పేరు.
  • భారత దేశములో మంచి నీటి వణరులు ఎక్కువగా వున్నాయని, కాని వాటిని మనం సక్రమంగా ఉపయోగించుకోవటం లేదని చెన్నై ఐ.ఐ.టి డైరెక్టర్ తెలిపేరు. 
  • ఈ నక్షత్రము పేలితే....భూమికి చాల ప్రమదామున్నదట
  • అతి తొందరలో భూమి తుడిచిపెట్టుకుపోయే ప్రమాదము ఉన్నదని అమెరికాలోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదీ ఒక నక్షత్రం మూలముగానట.
  • భూమికి అతి దగ్గరగా ఉన్న టి.పైక్సిడిక్స్ అనే నక్షత్రం పేలిపోయే అవకాసం వుందట. ఈ పేలుడుని "సూపర్నోవా" అంటారుట. ఇది పేలితే దాని ముక్కలు 20 బిల్లియన్,బిల్లియన్,బిల్లియన్ల మెగా టన్నుల శక్తి కలిగినవిగా వుంటాయట. ఆ పేలుడు వల్ల ఏర్పడే ఉష్ణ రసాయణములు భూమిని కాపాడుతున్న ఒజోన్ పొరను వూడదీసుకుని పోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
  • ట్.పైక్సిడిక్స్ అనే ఈ నక్షత్రం రసాయనాలని పీలుస్తూ పెద్దదవుతోందట. అలా పెద్దదైన నక్షత్రం ఒక బలూను లాగా తయారై పేలిపోతుందట.
  • ఫిలిడాల్ఫియాలో వున్న విల్లినోవా కలాశాలలోని శాస్త్రవేత్తలు అంతర్ జాతీయ ద్రుశ్య కిరణములను అన్వేషించు ఉపగ్రహము అందించిన సమాచారముతో ఈ విషయాన్ని తెలుసోకోగలిగేరుట.
1890 నుండి ఆ నక్షత్రములో చిన్న చిన్న పేలుళ్ళు ఏర్పడినాయట. ఆ పేలుడులో ఏర్పడ్డ రసాయణాలు ప్రతి 20 సంవష్తారలకు ఒక సారి చిన్న చిన్న శక్తితో వెలువడేవిట.....1967 తరువాత అ నక్షత్రములో పేలుడులు ఆగిపోయినై......అందువలన ఆ నక్షత్రం అతి వేగముగా ఉబ్బుతోందని, ఈ నలబై సంవత్షారాల రసాయిణాన్ని ఒక్క సారిగా ఒక పెద్ద పేలుడుతో వెలువడిస్తుందని భావిస్తూ, అది అతి త్వరలోనే జరగవచునని చెబుతున్నారు.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top