నూతన విశేషాలు:
latest

728x90

header-ad

Latest Posts

మార్గశిర మాసంలో అమ్మవారి అనుగ్రహం - Margasira Masamlo Ammavaru

margasira-masam
ఈ మార్గశిర మాసం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది.. విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల అమ్మ అనుగ్రహం తొందరగా  లభిస్తుంది..ఈ మాసమంతా విష్ణుసహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి... అదీ చేయలేనివారు..ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠించండి..

అష్టాక్షరీ మహామంత్ర ..అర్థం..!!

“ఓం నమో నారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రంలో “ఓం” – ఆత్మ స్వరూపాన్ని, “నమః” – అనే అక్షరాలు – బుద్ధిని, మనస్సుని, “నారాయణాయ” – అనే అక్షరాలు పంచేంద్రియాలను “జీవుని” తెలియజేస్తున్నాయి.

అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’. ఆకాశతత్త్వంపై ఆధారపడి ఉంది. ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేతప్పుడు, ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది.

జలాలకు నారములని పేరు. పరమాత్మ ఆ ‘అనంతజలరాశి’లో శయనిస్తాడు కనుక ఆయనకు ‘నారాయణ’ అనే నామం వచ్చింది. 
ఇంకా,
“న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే
“ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే
“య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే
“ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే
“న” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి.
“ర” అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలోనున్న భోగాలు లభిస్తాయి.
“య” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు.
“ణ” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కల్గి, దైవచింతన పట్ల ఆసక్తి కల్గి, మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది. ఇంతటి శక్తివంతమైన “నారాయణ” అను శబ్దానికి ‘ఓం నమో నారాయణాయ’ (అష్టాక్షరీ మహా మంత్రం)ను జపించాతంచే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఈ మహా మంత్రంలో, మహోన్నతమైన శక్తి ఉంది.
ధ్యాయేన్నారాయణందేవం
స్నానాదిఘ చ కర్మసు,
ప్రాయశ్చిత్తం హి సర్వస్వ
దుష్కృత….
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »

భక్తి