నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

15, ఏప్రిల్ 2018, ఆదివారం

అనారోగ్యాలు తొలగించే ఆంజనేయుడు వీరాంజనేయస్వామి - Veeranjaneya, Anjaneya

anarogyanni-tholaginche-viranjaneya-swamy
అనారోగ్యాలు తొలగించే ఆంజనేయుడు వీరాంజనేయ'స్వామి అనుగ్రహాప్రాప్తిరస్తూ
లోక కల్యాణం కోసం శ్రీమహావిష్ణువు రామావతారాన్ని ధరిస్తాడు. రామావతార కార్యం ఏమిటనేది శివుడికి తెలుసు. త్రిపురాసుర సంహార సమయంలో విష్ణువు తనకి సహకరించినందుకుగాను, రామావతార కార్యంలో ఆయనకి సహాయపడాలని శివుడు నిర్ణయించుకుంటాడు. అలా శివాంశ సంభూతుడిగా శ్రీరాముడికి అండగా నిలిచినవాడే హనుమంతుడు. అందుకే విష్ణు స్వరూపుడైన రాముడంటే హనుమంతుడికి ప్రాణమని చెబుతారు.

హనుమంతుడికి సాక్షాత్తు సూర్యభగవానుడే గురువు. ఇక సమస్త దేవతల ఆశీస్సులు ఆయనకి బాల్యంలోనే లభించాయి. చిరంజీవిగా వరాన్ని పొందిన ఆయన ఇప్పటికీ తన భక్తులను ప్రత్యక్షంగా అనుగ్రహిస్తూనే ఉంటాడు.

చాలాకాలంగా అనారోగ్యాలతో బాధలు పడుతోన్నవాళ్లు ... పీడకలలతో నిద్రకు దూరమై మానసికంగా కుంగిపోతోన్నవాళ్లు మారుతి ని దర్శించుకోవడం వలన మంచి ఫలితం కనిపిస్తుందని అంటారు. ఇలా వివిధ రకాల సమస్యలతో స్వామి పాదాలను ఆశ్రయించిన భక్తులు అనతికాలంలోనే వాటి బారి నుంచి విముక్తిని పొందుతూ ఉండటం విశేషం. అందుకే భక్తులు హనుమంతుడికి సిందూర అభిషేకాలు జరిపిస్తుంటారు. ఆయనకి ఎంతో ప్రీతికరమైన వడ మాలలు సమర్పిస్తూ ఉంటారు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


« PREV
NEXT »