తులసిమాల - అర్ధం పరమార్ధం - Tulasi Mala

0
tulasi-mala-tulasimala-yenduku-dhristaru
తులసిమాల 
తులసి రెండు రకాల వర్ణాలు కలగి ఉంటుంది. తెల్లగా ఉండే తులసిని ‘రామ తులసి’ అని అంటారు. నలుపు వర్ణం కలిగిన తులసిని ‘కృష్ణ తులసి’ అని అంటారు. జాతక చక్రంలో శుక్రగ్రహ దోషాల ద్వారా వచ్చే వివాహా, వైవాహిక సమస్యలను రామ తులసి ధరించటం వలన దోషాలు తొలగించుకో వచ్చును.

tulasi-mala-tulasimala-yenduku-dhristaru

శనిగ్రహ దోషాలైన ఆయుర్దాయ సమస్యలు, అనారోగ్యాలు, ఎల్నాటి శని బాధలు కృష్ణతులసి ధరించటం వలన తొలగించుకోవచ్చును. తులసి మాలలో అత్యంత శ్రేష్టమైనవి వ్రిందావన్ (బృందావన్) తులసి. ఈ తులసి శ్రీ కృష్ణునిజన్మస్థానమైన మధుర పట్టణంలోని నిదివన్ మరియు సేవాకుంజ్ అను రెండు వనములందు లభించును. బృందావనంలో ఆవిర్భవించిన కారణమున బృందావని అని కూడా సౌబాగ్యవతి యగు తులసిని కీర్తించెదరు.

తులసి సాక్షాత్ మహాలక్ష్మీయే. సూర్యోదయ కాలమందు తులసి మాలను ధరించిన పూజించిన విష్ణువును దర్శించినంత పుణ్య ఫలములు లభించును. మృత్యువాసన్నమైనప్పుడు తులసిమాలను ధరించిన సర్వ పాపములు నశించి వైకుంఠం నందు కల విష్ణు సన్నిధానమును పొందుదురు.
“తులసీ స్మరణేరైవ సర్వపాపం వినశ్యతితులసీ స్పర్శనేరైవ సశ్యంతి వ్యాదయో నృణామ్”
తులసీ స్మరణ మాత్రము చేతనే సర్వపాపములు నశించును. తులసిమాలని స్పర్శించినంత మాత్రము చేతనే సర్వవ్యాధులు నశించును.

తులసిమాల శ్రీమన్నారయణునకు సమర్పించుకుని, పూజదికాలు చేయించుకుని లేదా ఇంట్లోనే చేసుకుని ఆ మాలను “ప్రసీద దేవదేవేశి ప్రసీద హరివల్లభే / క్షీరోదమాధనోద్భూతే తులసి త్వాం నమామ్యహమ్” అను మంత్రో చ్ఛారణతో ధరించేవారు పరమభాగవోత్తములు అవుతారట. ఈ మాల ధరించిన వారికి దుశ్శకునములు, దుస్వప్నాల దుష్ఫలితాలు దరికి చేరవు. ఇంకా ఈ జన్మలో చేసిన పాపాలే గాక గత జన్మలో చేసిన పాపాలు కూడా పూర్తిగా నశిస్తాయి. శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మీ అను గ్రహంతో విష్ణుసాయుజ్యం కలుగుతుంది
ప్రతిరోజూ సూర్యునికి నమస్కరించడం వల్ల మీ జీవితంలోని చీకట్లు తొలగుతాయి.

ప్రతి పౌర్ణమి రాత్రి 11 గంటల సమయంలో ఒక పాత్రలో ఆవుపాలు తీసుకొని చంద్రకిరణాలకు 20 నిమిషాలు చూపించి త్రాగడం వల్ల మీ శరీరంలో ఓజోశక్తి అభివృద్ది చెందుతుంది.
ప్రతి చంద్ర సూర్య గ్రహణాల్లో మీకు సంభదించిన తెలిసిన మాంత్రాల్ని శుద్ధి చేయడం వల్ల అదనపు శక్తి చేకూరుతుంది.

పన్నెండు సంవత్సరాల వరకు పిల్లలకు బాలారిష్ట దోషాల కారణంగా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడండి.పుట్టినపుడుతప్ప వారి జాతకాలను 12 సంవత్సరాల వరకూ ఎవరికీ చూపించకండి.

శనికి సంభందించిన పరిహారాలతొపాటు ప్రతిరోజూ ధ్యానం చేయండి.శనికి ధ్యానం ప్రీతికరమైనది.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top