నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Friday, January 19, 2018

శృంగారంలో అంగ స్తంబన సమస్యకు కారణమేంటి - sex lo anga stambana - sexual tiredness

శృంగారంలో అంగ స్తంబన సమస్యకు కారణమేంటి - sex lo anga stambana - sexual tiredness
రతి క్రీడా సమయంలో, హస్తప్రయోగానికి పాల్పడినప్పుడు, అంగ చూషణ ఘట్టంలో సంతృప్తికరమైన రీతిలో అంగం స్థంభించకపోవడాన్ని అంగస్థంభనగా భావించవచ్చు. అరుదుగా ఇలాంటి ఇబ్బంది తలెత్తిన పక్షంలో దీనిని ఒక సమస్యగా పరిగణించవలసిన అవసరం లేదని లైంగిక సమస్యలను పరిష్కరించే వైద్యులు పేర్కొంటున్నారు.

మగవారిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అంగ స్థంభన సమస్యను చవిచూడటం సర్వసాధారణమైన అంశం. మానసిక ఒత్తిడి, అధిక మోతాదులో మద్యాన్ని స్వీకరించడం ఇంకా
చెప్పాలంటే శృంగార భావనలు సంప్రాప్తించకపోవడం కూడా అంగస్థంభన సమస్యకు దారి
తీస్తుంది. దీనికి, వయస్సుకు పెద్దగా సంబంధం లేకపోయినప్పటికీ 18 నుంచి 29
సంవత్సరాల వయస్సు గల వారిలో ఏడు శాతం మందికి ఈ సమస్య  తలెత్తే అవకాశం ఉండగా, అదే 50 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వారిలో 18 శాతం మందికి ఈ సమస్య చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

అంగస్థంభన సమస్యకు దారితీసే రెండు కారణాలను ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. ఒకటి
శారీరకమైంది కాగా మరొకటి మానసికమైంది.

అత్యధిక శాతం కేసులు శారీరకమైన కారణాలతోనే తమ పరిశీలనకు వచ్చినట్లు వైద్యులు తెలియజేస్తున్నారు. కానీ అంగస్థంభన సమస్యతో సతమతమయ్యే పురుషులు రతి క్రీడలో సుఖాల అంచును త్వరగా చేరుకోవాలని ఆదుర్దా చెందడంలో ఒత్తిడి లేదా ఆత్మన్యూనతా భావానికి లోనవుతారు. దీంతో సమస్య జటిలమవుతుంది. ఆరోగ్యకరమైన జీవన శైలిని ఆపాదించుకోవడం ద్వారా అంగస్థంభన సమస్యకు దూరంగా ఉండవచ్చు.

ధూమపానం, మధ్యపానాలకు స్వస్తి చెప్పడం, ప్రతిరోజు వ్యాయామం, కొవ్వు శాతం
తక్కువగా ఉండే ఆహారాన్ని స్వీకరించడం ద్వారా సమస్యను కొని తెచ్చుకుకోండా
జాగ్రత్త పడవచ్చు. మధుమేహ వ్యాధి ఉన్నవారు వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడం
మంచిది.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


« PREV
NEXT »