శివషడక్షరస్తోత్రం - తాత్పర్యము - Shiva Shadakshara stotram

shiva-shadakshara-stotram
శివషడక్షరస్తోత్రం
ఓంకారం బిందు సమ్యుక్తం, నిత్యం ధ్యాయంతి యోగినః !
కామదం, మోక్షదం చైవ, ఓంకారాయ నమోనమః !!
నమంతి ఋషయో దేవా, నమంత్యప్సరసం గణాః !
నరా నమంతి దేవేషాం, నకారాయ నమోనమః !!
మహాదేవం, మహాత్మానం, మహాధ్యానం పరాయణం !
మహాపాపహరం దేవం, మకారాయ నమోనమః !!
శివం శాంతం జగన్నాథం, లోకానుగ్రహ కారకం !
శివమేకపదం నిత్యం, శికారాయ నమోనమః !!
వాహనం వృషభో యస్య, వాసుకీ కంఠభూషణం !
వామే శక్తి ధరం వేదం, వకారాయ నమోనమః !!
యత్ర తత్ర స్థితో దేవః, సర్వవ్యాపి మహేశ్వరః !
యో గురుః సర్వ దేవానాం, యకారాయ నమోనమః !!
షడక్షర మిదం స్తోత్రమ్యః పఠేత్ శివ సన్నిధౌ !
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే !!
శ్లోll 1)  ఓంకారం బిందు సంయుక్తంనిత్యం ధ్యాయన్తి యోగినః I
            కామదం మోక్షదం చైవఓంకారాయ నమోనమః II 
  • యోగినః  =  యోగులు                          
  • నిత్యం  =  ఎల్లప్పుడూ
  • బిందు సంయుక్తం  = బిందువుతోకూడినదియు
  • కామదం  =  కోరికలనుతీర్చునదియును
  •   = మరియు
  • మోక్షదం ఏవ = మోక్షమునుప్రసాదించునదియును అగు
  • ఓంకారం  = ఓంకారమును
  • ధ్యాయన్తి  = ధ్యానించుచుందురో
  • ఓంకారయ  = అటువంటిఓంకారమునకు
  • నమః నమః  = నమస్కారము,నమస్కారము ( మరలా   మరలా  నమస్కారము )
తాత్పర్యము :-
యోగులు ఎల్లప్పుడూ బిందువుతోకూడినదియును, కోరికలనుతీర్చునదియును, మరియుమోక్షమును ప్రసాదించునదియునుఅగు ఓంకారమునుధ్యానించుచుందురో అటువంటిఓంకారమునకు నమస్కారము.

వివరణ:-
బిందు సంయుక్తం      =   బిందువుతోకూడినదియు ……
ఓంకారము జపించే విధానంలోమనకు వినబడేదే  ‘బిందు సంయుక్తం’,దీనినే అనుస్వరముఅంటారు. పెదవులు తెరిచిఓంకారము ప్రారంభించి పెదవులుమూసిన తర్వాత కూడా కొనసాగించేస్వరమే ఈ అనుస్వరము.బిందువుతో కూడిన ఓంకారము జపించడం అంటే ఇదే .

ఇక్కడ 'బిందువుతో కూడినదియు 'అనగా సున్నతో కూడినదియునుఅను ఒక అర్థము కలదు.అనగా ఈశ్లోకములో ఓంకారమునకుచెప్పబడిన లక్షణ,విశేషణములలోభాగముగా అది కూడాచెప్పియున్నారు.

మరింత స్పష్టముగా చెప్పవలెనన్నాఈ సృష్టికి ఆధార భూతమైన ఆదిబిందువు ఏదైతే ఉన్నదో దానితోకూడిన అని అర్థము.

సృష్టి శూన్యము నుండిసృజింపబడినదని మనకు వేదములుతెలియజేస్తున్నాయి.అనగా శూన్యమునుండి ఒక కేంద్రము ద్వారా  (బిందువు,మూలము ) శబ్దము నుండిచరాచర సృష్టి అంతయును పరమాత్మసృష్టించెను.అందుకనే ఓంకారమునుఆది శబ్దము అని అన్నారు.
కనుక ఈ ఓంకారమును సృష్టిమూలమును కలిగినదిగా మనముచెప్పుకోవచును.

బిందువు = POINT, SPOT (THE MYSTICAL SOURCE OF CREATION) గా మనముచెప్పుకోవాలి.
సృష్టి,స్థితి,లయ కారకులగు బ్రహ్మ,విష్ణు, మహేశ్వర శబ్దములు కూడా ఈఓంకారమునుండే ఉద్భవించినవి.

ఓం = అ + ఉ + మ > 'అ' బ్రహ్మశబ్దమునకు, 'ఉ' విష్ణు శబ్దమునకు, 'మ' మహేశ్వర శబ్దమునకుప్రతీకలు. బ్రహ్మ,విష్ణు, మహేశ్వర ఉనికిని ధ్వనింప చేయు శబ్దము.
దీనినే 'ఆది మంత్రము' అని అన్నారు.అందుకనే 'ఓం' అను మంత్రము ప్రతీమంత్రమునకు ముందు ఉండును.ఓంకారముతో కూడిన మంత్రముమాత్రమే సంపూర్ణముఅగును.గాయత్రి మంత్రమందు 24అక్షరములు గలవు.అందునప్రారంభమున చెప్పు ఓం 24 లో  ఒకఅక్షరము.
మాండుక్యోపనిషత్ లో ఈఓంకారము గురించి చాలావివరముగా తెలుపబడింది.

స్తోత్రం... అంటే...?రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top